TG: అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ను పొగిడిన అక్బరుద్దీన్‌ | Akbaruddin Praises Ysrajashekarareddy In Telangana Assembly | Sakshi
Sakshi News home page

TG: అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ను పొగిడిన అక్బరుద్దీన్‌

Jul 29 2024 3:24 PM | Updated on Jul 29 2024 3:51 PM

Akbaruddin Praises Ysrajashekarareddy In Telangana Assembly

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ పొగిడారు. బడ్జెట్‌లో సోమవారం(జులై 29) బడ్జెట్‌పై మాట్లాడిన సందర్భంగా ఒవైసీ వైఎస్‌ఆర్‌ను గుర్తుచేసుకున్నారు. ముస్లింలకు రిజర్వేషన్ విషయంలో వైఎస్‌ఆర్‌ న్యాయం చేశారని కొనియాడారు.

ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీల మదిలో వైఎస్‌ఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. వైఎస్‌ఆర్‌ లేకపోతే రిజర్వేషన్ల అంశంలో తమకు అన్యాయం జరిగేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ మైనారిటీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ విషయంలో సాయం చేశారని గుర్తుచేశారు. ఎవరు న్యాయం చేసినా వాళ్ల గురించి మొహమాటం లేకుండా చెప్తానన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement