
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ హయాంలోనే హంద్రీ-నీవా పుంగనూరు వరకు పూర్తయ్యాయని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ భరత్. హంద్రీ-నీవా పేరుతో కుప్పం ప్రజల్ని చంద్రబాబు మభ్యపెట్టారని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
కుప్పానికి కృష్ణా నీళ్లు తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. జగన్ ప్రారంభించిన ప్రాజెక్టును చంద్రబాబు మళ్ళీ ప్రారంభించి తన ఖాతాలో వేసుకుంటున్నారు. కుప్పానికి నీరు రావటానికి కారణమైన హంద్రీనీవా ప్రాజెక్టును ప్రారంభించిన నేత వైఎస్సార్.ఆ తర్వాత కాలువల నిర్మాణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.రూ.293 కోట్ల కాంట్రాక్టును రూ.576 కోట్లకు పెంచి అవినీతి చేశారు.
అయినా పూర్తి స్థాయిలో పనులు కూడా చేయలేదు.జగన్ సీఎం అయ్యాక మిగతా పనులు పూర్తి చేశారు.రామకుప్పం దగ్గర ఈ ప్రాజెక్టును జగన్ ప్రారంభించారు. జగన్ ప్రారంభించిన ప్రాజెక్టును చంద్రబాబు మళ్ళీ ప్రారంభించి ప్రచారం చేసుకుంటున్నారు.చంద్రబాబులాగ జగన్‌కు ప్రచార పిచ్చి లేదు. ఇచ్చిన మాట ప్రకారం కుప్పానికి నీరిచ్చిన ఘనత జగన్‌దేనని స్పష్టం చేశారు.