నేడు వైఎస్సార్‌ జయంతి | YS Rajasekhara Reddy Jayanthi Celebrations in Hyderabad | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ జయంతి

Jul 8 2025 5:21 AM | Updated on Jul 8 2025 5:21 AM

YS Rajasekhara Reddy Jayanthi Celebrations in Hyderabad

వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా సోమవారం అర్ధరాత్రి దాటాక బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌ చౌరస్తాలో వైఎస్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న అభిమానులు

ఉదయం 11 గంటలకు గాందీభవన్‌లో వేడుకలు

సాక్షి, హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు పంజాగుట్టలోని వైఎస్సార్‌ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ నివాళులర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.

కార్యక్రమంలో పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులు, కాంగ్రెస్‌ అభిమానులు, కార్యకర్తలు పాల్గొంటారని టీపీసీసీ తెలిపింది. కాగా, వైఎస్సార్‌ జయంతి సందర్భంగా పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ వైఎస్సార్‌ సేవలను స్మరించుకున్నారు. డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కలలు కన్న సమాజాన్ని సాధించుకుందామని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement