
సౌత్ ఆఫ్రికాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్థంతిని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. పలువురు ఎన్నారైలు డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. తెలుగు జాతి వైఎస్సార్‌కి రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్‌సీపీ విక్టోరియా కన్వీనర్ కృష్ణారెడ్డి, సహ కన్వీనర్ భరత్, కోర్ టీమ్ సభ్యులు బ్రహ్మరెడ్డి, రామాంజి, సురేష్ రెడ్డి, సతీశ్, పవన్, బాషా, తేరా జయవర్ధన్ రెడ్డి, దశరథ్ రెడ్డి, డి.శ్రీధర్ పాల్గొన్నారు.
సౌత్ ఆఫ్రికాలో...
సౌత్ ఆఫ్రికాలోని వైఎస్సార్‌సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జోహనెస్‌బర్గ్‌లో సోమవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 2 వర్ధంతి సందర్భంగా ముందురోజు సోమవారం జోహనెస్‌బర్గ్‌లోని కమ్యూనిటీ సెంటర్ బేకరీ అనాథాశ్రమంలో చిన్నారులకు ఆహారంతోపాటు రూ.5 లక్షల విలువచేసే వ్రస్తాలను దానం చేశారు. తమలో చాలామంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారానే ఉన్నత చదువులు చదువుకుని ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు కల్లా నరసింహారెడ్డి, సూర్య రామిరెడ్డి, విజయ శ్రీనివాసు, శ్రీకృష్ణారెడ్డి, వాసు సింగారెడ్డి, పెట్లూరు విక్రం, మాగంటి వెంకట్, సానికొమ్మ అంజిరెడ్డి, అవనిగడ్డ పుష్పాంజలి, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఆత్మకూరు హరి, బుద్ధ సురేంద్ర, అనిపి రెడ్డి నవీన్ రెడ్డి, బాల భాస్కర్, రాజారపు శివ, పల్లె మధు పాల్గొన్నారు.
ఐర్లాండ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌కు వెలుగు నింపిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఐర్లాండ్‌లోని వైఎస్సార్‌సీపీ అభిమానులు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆలోచనలు, ప్రజల కోసం చేసిన కృషి ఎప్పటికీ మరవలేనివని అన్నారు. దివంగత మహానేత వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన జీవన విధానం, ప్రజాసేవా పథకాలను స్మరించుకుంటూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థించారు.

పేదల కోసం, రైతుల కోసం, సాధారణ కుటుంబాల కోసం వైఎస్సార్ చేసిన సేవలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే మహానేత డాక్టర్ వైఎస్సార్ అంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ ఆకేపాటి, గోపిరెడ్డి కోటి, వీర రెడ్డి, శ్రీను డేగ, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఫీనిక్స్ ఎన్‌ఆర్‌ఐ కమిటీ రక్తదానం
డాక్టర్ వైఎస్సార్ 16వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ ఫీనిక్స్ ఎన్‌ఆర్‌ఐ కమిటీ రక్తదాన డ్రైవ్ నిర్వహించింది. ఈ సందర్భంగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్‌రెడ్డి యర్రపురెడ్డి, ఆది, రేఖ మోర్రెడ్డి, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, ధీరజ్‌పోలా, అంజిరెడ్డి, రుక్మాన్, రమేశ్, శ్రీధర్ చెమిడ్తి, బాలమురళీకృష్ణ, ఇంద్రసేనారెడ్డి, నాగేషొ్పర్ల, వేమశేఖర్, విఘ్నేష్, కొండారెడ్డి, జ్ఞానదీప్, నాగి బోనం తదితరులు పాల్గొన్నారు.