
సింహాద్రిపురం/కడప కార్పొరేషన్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా యూఏఈలోని షార్జాలో మహమ్మద్ జిలాన్ బాషా ఆధ్వర్యంలో ప్రసన్న సోమిరెడ్డి, కోటేశ్వరరెడ్డి నేతృత్వంలో తెలుగు ప్రజలు మంగళవారం వైఎస్సార్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.
అనంతరం వైఎస్సార్ అభిమాని జిలాన్ బాషా మాట్లాడుతూ వైఎస్సార్ (YSR) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఆయన చూపిన దారి ఎప్పటికీ తమకు ప్రేరణ అని పేర్కొన్నారు. అనంతరం అభిమానులు వైఎస్సార్ స్మృతులను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు శ్రీనివాస్ చౌదరి, అక్రమ్ బాషా, బ్రహ్మానంద రెడ్డి, నాగ ప్రతాప్ రెడ్డి, కర్ణ, పవన్, గంగిరెడ్డి, క్రాంతికుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివలింగా రెడ్డి, హనుమంత్ రెడ్డి, తాజుద్దీన్, సత్య, అంజాద్, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సౌదీ అరేబియాలో...
డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతిని సౌదీ అరేబియాలో ఘనంగా నిర్వహించారు. జుబైల్ ప్రాంతంలో అనుయాకినో కంపెనీ క్యాంపులో కడప పట్టణానికి చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనుయాకినో కంపెనీలో పని చేసే సుమారు 50 మంది కార్మికులకు అన్నదానం చేశారు.
చదవండి: విదేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళులు
ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు తాజుద్దీన్, అబ్రార్, ఖ్వాజా, బాషా, సలాం బాషా, మతివ్, అఫ్జల్, ఆతిఫ్, ముహమ్మద్, జాఫర్, ఫర్ ఖాన్, ఫైరోజ్, అసిమ్, ఫైసల్ తదితరులతో పాటు కిషోర్, సంతోష్, శ్రీను పాల్గొన్నారు.