ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి | YSR Jayanthi 2025 Celebrations In Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి

Jul 6 2025 1:04 PM | Updated on Jul 6 2025 1:18 PM

YSR Jayanthi 2025 Celebrations In Australia

ఆస్ట్రేలియాలో అన్ని ప్రధాన నగరాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైయస్సార్ ఒక మరణం లేని మహనీయుడని తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. తమలో చాలామంది వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామని తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు వైఎస్సార్ అని కొనియాడారు.

ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కటింగ్, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బ్రిస్ బేన్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ తెలుగు ప్రజలకు అందించిన సేవలు ఎన్నటికీ మరచిపోమని అలాగే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వైఎస్‌ జగన్‌ బాటను విడవబోమని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమాలలో పాల్గొన్న వారికి  జూమ్ కాల్ ద్వారా వైఎస్సార్‌సీపీ నాయకులు, ఆలూరు సాంబశివారెడ్డి , సోషల్ మీడియా ఇన్ఛార్జి యశ్వంత్, చల్లా మధుసూదన్ రెడ్డి, అబ్బయ్య చౌదరి, అరే శ్యామల, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కారుమూరి వెంకట్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ, బియ్యపు మధుసూదన్ రెడ్డి, అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement