andarapradesh
-
ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 59,671 కరోనా పరీక్షలు నిర్వహించగా, 319 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 884490కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: కోవిడ్ భయం: విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు) కోవిడ్ బారిన పడి గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7127కి చేరింది. గడచిన 24 గంటల్లో 308 మంది కోవిడ్ కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,74,531 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 2,832 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలు కోటి 22 లక్షలు దాటాయి. రికార్డు స్థాయిలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,22,24,202 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: మా వ్యాక్సిన్ చాలా డేంజర్: చైనా ఎక్స్పర్ట్) -
ఏపీ: కరోనా కేసులు భారీగా తగ్గుముఖం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 29,714 కరోనా పరీక్షలు నిర్వహించగా, 128 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 883210కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.(చదవండి: కోవాగ్జిన్ : భారత్ బయెటెక్ క్లారిటీ) కరోనా బారినపడి గత 24 గంటల్లో చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, ఇప్పటివరకు 7118 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 252 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 8,73,149 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నారు. నేటివరకు రాష్ట్రంలో 1,20,02,494 శాంపిల్స్‌ను పరీక్షించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 2,943 యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 40,177 కరోనా పరీక్షలు నిర్వహించగా, 232 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఏపీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 88,3082కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. (చదవండి: కరోనా టీకా: డీసీజీఐ కీలక ప్రకటన) కోవిడ్ బారినపడి గడచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు మృతిచెందగా, ఇప్పటివరకు 7115 మంది మరణించారు. గత 24 గంటల్లో 352 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 8,72,897 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,19,72,780 శాంపిల్స్‌ను పరీక్షించారు.(చదవండి: కరోనా వల్ల మేలెంత? కీడెంత?) -
సంక్రాంతికి 4,981 స్పెషల్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ బి.వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 4,981 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ బస్సులను మహాత్మా గాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్, సీబీఎస్, ఉప్పల్, లింగంపల్లి, ఎల్బీనగర్, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, టెలిఫోన్ భవన్ తదితర ప్రాంతాల నుంచి నడపనున్నట్లు తెలిపారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుడివాడ, ఏలూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి, వరంగల్ వైపు వెళ్లే వాటిని ఉప్పల్ నుంచి నడపనున్నారు. విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీ నగర్ నుంచి, కర్నూల్, మహబూబ్‌నగర్ వైపు వెళ్లే బస్సులు గౌలిగూడ సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ వైపు వెళ్లే వాటిని దిల్సుఖ్నగర్ నుంచి నడుపుతారు. ఎంజీబీఎస్‌లోని 35, 36 ప్లాట్‌ఫామ్‌ల నుంచి విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రాకపోకలు సాగిస్తాయి. టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి సీట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. వివరాలకు 9959226245, 9959224910 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఏపీ: విజయవంతంగా ముగిసిన వ్యాక్సిన్ డ్రై రన్
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ‘కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్’ విజయవంతంగా ముగిసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 13 జిల్లాల్లో జిల్లాకు మూడు చోట్ల చొప్పున 39 చోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించారు. మొత్తం 956 మంది పాల్గొన్నారు. ఈ డ్రై రన్ ప్రక్రియ వీడియో ద్వారా చిత్రీకరించారు. కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు అందించనున్నారు. (చదవండి: కొత్త కరోనా టెన్షన్: ఈ మార్గదర్శకాలు తప్పనిసరి) కోవిడ్–19 వ్యాక్సినేషన్‌కు సన్నద్ధతలో లోటుపాట్లు పరిశీలించి సరిదిద్దుకోవడానికి డ్రై రన్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రై రన్లో భాగంగా డిసెంబర్ 28న విజయవాడలోని ఐదు కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. శనివారం కూడా ఏపీ వ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించారు. -
రేపు ఏపీవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపు (శనివారం) 13 జిల్లాల్లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. ప్రతి జిల్లాలోని మూడు ఆస్పత్రుల్లో డ్రై రన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వాస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రి, అర్బన్/రూరల్ పీహెచ్సీలో డ్రై రన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే గత నెల 28న కృష్ణా జిల్లాలోని ఐదు ఆస్పత్రుల్లో డ్రై రన్ విజయవంతం అయిన సంగతి తెలిసిందే. (చదవండి: కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్) డ్రై రన్ అంటే? నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు.(చదవండి: కరోనా వైరస్ : చైనా గుడ్‌న్యూస్) -
‘ఆ వాహనాలు.. ముంబై తర్వాత ఏపీలోనే..’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిబద్దతతో పనిచేస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ, అత్యంత సాంకేతికతతో కూడిన సామర్థ్యం ఎస్‌పీఎస్‌డీఆర్‌ఎఫ్ వాహనాల్లో ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. పడవ, రోడ్డు ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్లు, భవనాలు కూలినప్పుడు రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టాన్ని నియంత్రించవచ్చని చెప్పారు. ముంబాయి తర్వాత దేశంలో మన రాష్ట్రంలోనే ఈ వాహనాలు వచ్చాయని పేర్కొన్నారు. (చదవండి: తగ్గిన నేరాలు.. పెరిగిన కేసులు) 2020లో కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని, పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. టెక్నాలజీ వినియోగాన్ని విస్తృత పరిచి 2021లో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో కేంద్రం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఇంటివద్దే వేడుకలు జరుపుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.(చదవండి: అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్) -
ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు...
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 50,794 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 881599కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.(చదవండి: కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ఏపీ అప్రమత్తం) గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురం, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 7100 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 364 డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 871116 డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,17,08,678 శాంపిల్స్‌ను పరీక్షించారు.(చదవండి: భారత్‌లో కొత్త స్ట్రెయిన్ కేసులు) -
ఏపీ: యూకే నుంచి వచ్చిన 11 మందికి కరోనా
సాక్షి, అమరావతి: యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు వచ్చిన వారి సంఖ్య 1363కి చేరింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారు.. వారి కాంటాక్ట్స్‌లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఇప్పటివరకు 1,346 మందిని అధికారులు ట్రేస్ చేయగా, మరో 17 మంది కోసం ట్రేసింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. యూకే నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 11 మందికి కరోనా నిర్థారణ అయ్యింది.(చదవండి: మరి కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ : సీరం) అనంతపురం, నెల్లూరులో ఒక్కొక్కరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారి కాంటాక్ట్స్‌లో 5,784 మందికి పరీక్షలు నిర్వహించారు. యూకే రిటర్న్స్‌తో కాంటాక్ట్ అయిన 12 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎనిమిది మందికి పాజిటివ్ కాగా, తూ.గో.జిల్లాలో ముగ్గురికి, నెల్లూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. (చదవండి: ఎంత కాలంలో కరోనా ఖతం...?) -
ఏపీలో కొత్తగా 212 కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 37,381 కరోనా పరీక్షలు నిర్వహించగా, 212 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 88,1273కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతిచెందగా, దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7098కి చేరుకుంది. (చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా) గత 24 గంటల్లో 410 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 870752 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 3423 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,16,57,884 నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.(చదవండి: కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా ముగిసిన ‘డ్రై రన్’) -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,911 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 282 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 88,0712కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. (చదవండి: కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’) గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా కడపలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7092కి చేరింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 442 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 86,9920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,15,74,117 శాంపిల్స్‌ను పరీక్షించారు. -
ఆన్లైన్ కాల్‌మనీపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చిన వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీలకు, సీఐడీ, సైబర్ క్రైమ్ విభాగానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. కాల్ మనీ వేధింపులకు పాల్పడితే ఉపేక్షించమని డీజీపీ హెచ్చరించారు. ఆన్లైన్ కాల్‌మనీ బాధితులకు పోలీస్‌శాఖ అండగా ఉంటుందని పేర్కొన్నారు. చట్టబద్ధత లేని యాప్‌ల ద్వారా రుణాలు స్వీకరించొద్దని సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్‌లపై డయల్ 100, 112లకు ఫిర్యాదు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. -
ఏపీ: వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి
క్రైం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరిలో ఒకరు, విజయనగరంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తిరుపతిలో ఒకరు మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. తూర్పుగోదావరి: ఐ.పోలవరం మండలం కొత్త మురమళ్ల లైన్పేట లాకులు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మురమళ్ల గ్రామానికి చెందిన లంక శ్రీనివాస్ (41)గా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైకులను ఢీకొన్న కారు: ఇద్దరు మృతి విజయనగరం: గరుగుబిల్లి మండలం రావివలస శివారులో రెండు బైకులను కారు ఢీకొన్న ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న రావివలసకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా బైకు దగ్ధమైమైంది. మరో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు కాగా, పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా.. తిరుపతి: స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన తొమ్మిదవ తరగతి విద్యార్థి నీట మునిగి మృత్యువాత పడ్డాడు. రేణిగుంట మండలం గాజులమండ్యం వద్ద స్వర్ణముఖి నదిలో దిగిన అమరనాథ్ (14) ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు ఇద్దరు మృతి.. శ్రీకాకుళం జిల్లా: వీరఘట్టం మండలం కెడకల్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. నలుగురికి గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. సముద్రంలో ఇద్దరు యువకులు గల్లంతు.. నెల్లూరు జిల్లా: వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతయ్యారు. ఆదివారం ఆటవిడుపుగా 8 మంది యువకులు సముద్ర స్నానానికి వెళ్లారు. గల్లంతైన వారిలో నెల్లూరుకు చెందిన గోపీ మృతదేహం లభ్యం కాగా, కడపకు చెందిన హసన్ కోసం మెరైన్ పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిని నాయుడుపేట మేనకురు సెజ్‌లోని అరవిందో ఫార్మసీలో ఉద్యోగులుగా గుర్తించారు. -
ఏపీ: ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తీపి కబురు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయబోతోంది. ఆర్టీసీలో మొత్తం 5 వేల మంది ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరు ప్రతి రోజూ తమ నివాసం నుంచి డిపో/యూనిట్లకు సొంత ఖర్చులతో ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని గత కొద్ది కాలంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. (చదవండి: ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు) ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్ధేశంతో ఈ ఉచిత బస్‌పాస్‌లు మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్ పాస్‌లు చెల్లుబాటవుతాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారు తమ నివాసం నుంచి 25 కి.మీ.లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. (చదవండి: రేపు అర్ధరాత్రి వరకు వెబ్ఆప్షన్లకు గడువు..) -
ఏపీలో కొత్తగా 534 కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా, 534 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడినవారి సంఖ్య 877348కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.(చదవండి: ఈ మాస్క్ వెరీ స్పెషల్..ధర 69వేలకు పైనే..) గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా బారినపడి అనంతపురం, పశ్చిమగోదావరి లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 7069 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 498 మంది కోవిడ్‌నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 865825 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 4454 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,10,65,297 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: ఎల్ఈడీ లైట్లతో కరోనా ఖతం!) -
‘పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు’
సాక్షి, ప్రకాశం జిల్లా: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ కేటగిరీలలో కొన్ని స్థానాలు బ్లాక్ చేయడం గతం నుంచి వస్తున్న విధానమేనని.. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన వివరించారు. (చదవండి: జనవరి 9న జగనన్న అమ్మఒడి సాయం) ‘‘కేటగిరీ 4లో కూడా కొన్ని స్థానాలు బ్లాక్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీలలో బదిలీలకు 48 వేల 897 ఖాళీలను గుర్తించాం. వెబ్ కౌన్సిలింగ్లో సర్వర్ల సమస్యను దృష్టిలో ఉంచుకుని రేపటి వరకూ ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చాం. బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు ట్రాన్స్ ఫర్ పోర్టల్‌లో ఉంచాం. బ్లాక్ చేసిన స్థానాలను డీఎస్సీ నియామకాల సమయంలో భర్తీ చేస్తాం. అప్పుడు మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని’’ మంత్రి పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ పై ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో పూర్తిగా చర్చించామని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలు మాట్లాడటం సబబు కాదని మంత్రి సురేష్ హితవు పలికారు. (చదవండి: ‘జూమ్‌లో చంద్రబాబు.. ట్విట్టర్లో లోకేష్’) -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖంపడుతున్నాయి. గత 24 గంటల్లో 44,935 కరోనా పరీక్షలు నిర్వహించగా, 305 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,5836కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: మనోధైర్యమే మందు: ఓల్డ్ ఈజ్ గోల్డ్!) గడచిన 24 గంటల్లో 541 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 864049 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి నెల్లూరులో ఇద్దరు మరణించగా, ఇప్పటివరకు కరోనా సోకి 7059 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4728 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటివరకు 1,08,75,925 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: నయాసాల్... ‘మాల్’!) -
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 63,873 కరోనా పరీక్షలు నిర్వహించగా, 506 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,5531కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 613 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 863508 మంది డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: వ్యాక్సినేషన్‌కు 4 అంచెల వ్యవస్థ!) గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతిచెందగా, ఇప్పటి వరకు 7057 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4966 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,08,30,990 శాంపిల్స్‌ను పరీక్షించారు.(చదవండి: జనవరి 15 తర్వాత సెకండ్ వేవ్!) -
కేటాయింపులు ఘనం.. వ్యయం అంతంతే
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు సంవత్సరం వ్యవసాయం, సంక్షేమం, నీటిపారుదల తదితర రంగాలకు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసిన చంద్రబాబు సర్కారు ఆ సొమ్మును ఖర్చు చేయడంలో విఫలమైంది. కేటాయింపులు, వ్యయాల మధ్య ఉన్న భారీ తేడాను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక బహిర్గతం చేసింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సహాయం, రోడ్లు భవనాలు, పౌరసరఫరాలు, పరిశ్రమల రంగాలకు భారీగా కేటాయింపులు చేసినా వ్యయం అంతంత మాత్రంగానే చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. కొన్ని రంగాల్లో మిగుళ్లకు నిర్దిష్టమైన కారణాలను ప్రభుత్వం తెలియజేయలేదని కూడా వ్యాఖ్యానించింది. సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ రంగాల కేటాయింపుల్లో సగం కూడా వ్యయం చేయలేదని తెలిపింది. బడ్జెట్లో కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప వాస్తవరూపం దాల్చలేదని కాగ్ స్పష్టం చేసింది. కేటాయింపులు చేసినా ఆ పనులు చేపట్టడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. కేటాయింపులకు వ్యయానికి పొంతన లేకపోవడంతో బడ్జెట్ ప్రక్రియకు అర్థం లేకుండా పోయిందని కాగ్ నివేదిక పేర్కొంది. పౌరసరఫరాల కేటాయింపుల్లో ఏకంగా 81 శాతం మేర వ్యయం చేయలేదు. అలాగే రహదారులు, భవనాలశాఖకు కేటాయించినదాన్లో 75 శాతం మేర ఖర్చుచేయలేదు. మొత్తం 11 రంగాలకు కలిపి రూ.1,05,579.16 కోట్లు కేటాయించగా రూ.57,908.50 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. రూ.47,670.66 కోట్ల రూపాయలను వ్యయం చేయలేదు. 11 రంగాలకు కేటాయింపులు, ఖర్చుచేసిన, చేయని సొమ్ము వివరాలు.. రంగం కేటాయింపు (రూ.కోట్లలో) ఖర్చుచేసిన సొమ్ము(రూ.కోట్లలో) ఖర్చు చేయని మొత్తం 1.రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సహాయం 6,942.26 3886.61 3,055.65 2. పాఠశాల విద్య 23,192.58 17,479.29 5,713.33 3. పురపాలక, పట్టణాభివృద్ధి 8,629.99 5,243.03 3,386.96 4. సాంఘిక సంక్షేమం 4,221.64 2,121.06 2,100.58 5. బీసీ సంక్షేమం 6,278.36 2,804.39 3,473.97 6. వ్యవసాయం 15,569.41 8,020.53 7,548.88 7. పంచాయతీరాజ్ 7,367.03 4,880.90 2,486.13 8. పరిశ్రమలు, వాణిజ్యం 4,696.67 1,010.12 3,686.55 9. పౌరసరఫరాలు 3,673.00 697.69 2,975.31 10. రోడ్లు, భవనాలు 4,369.72 1,087.60 3,282.12 11. నీటిపారుదల 20,638.50 10,677.32 9,961.18 మొత్తం 1,05,579.16 57,908.54 47,670.66 -
భర్త బాధితులకు ‘దిశ’ భరోసా
పోలీసుల స్పందనతో నిలిచిన ప్రాణం.. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహిత అర్ధరాత్రి 1:59 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసు సాయం కోరింది. తన భర్త వేధింపుల కారణంగా తాను నిద్రమాత్రలు మింగినట్టు తెలిపింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఐదు నిమిషాల్లోనే ఆమె వద్దకు చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను, ఆమె భర్తను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటానని భర్త చెప్పడంతో వారి కాపురాన్ని పోలీసులు నిలబెట్టినట్లయింది. బెదిరించిన యువకుడి అరెస్ట్.. కర్నూలు జిల్లాలోని ఆస్పరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు తనతో వివాహేతర సంబంధం పెట్టుకోమని ఒక యువతిని వేధించాడు. అందుకు అంగీకరించని ఆమె పెళ్లి చెడగొట్టేందుకు లెటర్ రాస్తానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బాలికను వేధించినందుకు కేసు.. గుంటూరు జిల్లా వట్టిచెరుకురు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక (12)ను ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పొరుగింటి యువకుడు చొరబడి వేధించాడు. ఇది గమనించిన స్థానికులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి బాలికను కాపాడటంతోపాటు ఆమెను లైంగికంగా వేధించిన యువకుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు... ఇలా భర్త చేతిలో దెబ్బలు తిని కాపాడమని కోరిన గృహిణులతోపాటు ఆకతాయిల వేధింపులకు గురైన విద్యార్థినులు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లలో అపరిచితుల అసభ్య ప్రవర్తనతో విసిగిపోయిన యువతులకు దిశ యాప్ వరంలా మారింది. సాక్షి, అమరావతి: భర్త బాధితులైన పలువురు గృహిణులు దిశ యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. దిశ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్పందిస్తున్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో కౌన్సెలింగ్ ద్వారా కాపురాలు చక్కదిద్దుతున్నారు. దిశ కాల్ సెంటర్‌కు వచ్చిన కాల్స్‌ను పోలీసులు విశ్లేషించగా.. భర్త బాధితులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లు తెచ్చిన సంగతి తెల్సిందే. దిశ బిల్లులో భాగంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 8న దిశ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ను దాదాపు 12 లక్షలమంది డౌన్లోడ్ చేసుకోగా, ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. దిశ యాప్‌లో వస్తున్న ఫిర్యాదుల్లో భర్త బాధితలు సైతం ఉండటం గమనార్హం. అనేకమంది గృహిణులు ‘భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నాం కాపాడండి’ అంటూ వేడుకుంటున్నారు. గడిచిన పదినెలల కాలంలో 675 మంది మహిళలు, బాలికలు దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ చేశారు. వీరిలో భర్త వేధింపులు తాళలేకపోతున్నామంటూ 267 మంది కాల్ చేశారు. ఈ ఘటనల్లో మద్యం తాగి వచ్చి భార్యను కొట్టిన ప్రబుద్ధులే ఎక్కువగా ఉన్నారు. దీనికితోడు అధిక కట్నం కోసం వేధిస్తున్న వారున్నారు. రాత్రివేళ 10.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్య ఈ తరహా వేధింపులు జరిగినట్టు దిశ కాల్స్‌లో రికార్డయ్యాయి. భర్త కొడుతున్న సమయంలో తమ మొబైల్స్‌లోని దిశ యాప్‌ను ఓపెన్ చేసి ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే అవకాశం లేకపోవడంతో తమ చేతిలోని సెల్ ఫోన్‌ను అటు ఇటు ఊపి (షెక్ చేయడం) ఆపదలో ఉన్నాం ఆదుకోండి.. అని సమాచారం అందించడం విశేషం. దిశ కాల్ సెంటర్‌కు సమాచారం వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేయడంతో భర్త బాధితులను కాపాడుతున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాలు చక్కదిద్దుతున్నారు. పదినెలల్లో దిశ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులు భర్త వేధింపులు: 267 బయటివారి వేధింపులు: 115 గుర్తుతెలియనివారి వేధింపులు: 69 పనిచోసేచోట వేధింపులు: 67 బంధువుల వేధింపులు: 68 తప్పుడు ఫిర్యాదులు: 22 అసభ్య ప్రవర్తన: 19 మహిళ అదృశ్యం: 13 బాలికలపై అకృత్యాలు: 9 సివిల్ వివాదాలు: 8 బాలికల అదృశ్యం: 8 ప్రమాదాలు: 6 పురుషుల అదృశ్యం: 3 వెంటపడి వేధింపులు: 1 మొత్తం: 675 తక్షణం స్పందిస్తున్నాం దిశ యాప్ ద్వారా కాల్ సెంటర్‌కు వస్తున్న సమాచారంపై తక్షణం స్పందించి సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తున్నాం. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు, యువతులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్న పోలీసులు 5 నుంచి 12 నిమిషాల్లోనే ఘటన ప్రాంతానికి చేరుకుని సహాయం అందిస్తున్నారు. చాలావరకు తక్షణ సహాయం, కౌన్సెలింగ్‌లతో సరిపెడుతున్నాం. తీవ్రత ఉన్న వాటిపై గృహహింస, పోక్సో, నిర్భయ కేసులు నమోదు చేస్తున్నాం. భర్తల వేధింపులపై 267 మంది ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ అనంతరం అనేక కాపురాలు చక్కబడ్డాయి. అప్పటికీ మాటవినని 20 మంది పురుషులపై కేసులు నమోదు చేశాం. - దీపికా పాటిల్, దిశ ప్రత్యేక అధికారి -
ఏపీలో కొత్తగా 510 కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,495 కరోనా పరీక్షలు నిర్వహించగా, 510 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 87,5025కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని 665 డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 86,2895 మంది డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: 20 వేల కోట్లతో రెండో విడత వ్యాక్సిన్) గత 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరు, వైఎస్సార్ కడప, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మృతిచెందగా, ఇప్పటివరకు ఏపీలో 7052 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5078 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,07,67,117 పరీక్షలు నిర్వహించారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్లతో సరికొత్త ప్రయోగం) -
ఏపీలో కొత్తగా 520 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 64,425 కరోనా పరీక్షలు నిర్వహించగా, 520 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఏపీలో కరోనా బారినపడివారి సంఖ్య 874515కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 519 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,62,230 మంది డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: నెల రోజుల్లో మనకు వ్యాక్సిన్: సీఎం) గత 24 గంటల్లో కోవిడ్ బారినపడి కృష్ణా, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందగా, ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7049కి చేరుకుంది.ప్రస్తుతం ఏపీలో 5,236 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. నేటి వరకు 1,06,99,622 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: అందుకే భారత్‌లో కరోనా ఉధృతి తగ్గుముఖం) -
ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,354 కరోనా పరీక్షలు నిర్వహించగా, 538 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 87,3995కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 558 మంది కోవిడ్ నుంచి క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 86,1711 డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: కాచుకున్న కరోనా!) గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరు,కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7047కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5237 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరుకు 1,06,35,197 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: అలర్జీ ఉంటే వ్యాక్సిన్ వద్దు) -
నేటి ప్రధానాంశాలు..
ఏలూరులో సీఎం వైఎస్ జగన్ అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో అస్వస్థతకు గురైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీయిచ్చారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు... భారత్ బంద్‌కు విపక్షాల మద్దతు ఢిల్లీ: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు ప్రకటించిన ‘భారత్ బంద్’కు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ దేశవ్యాప్త బంద్‌కు కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10 కార్మిక సంఘాల ఐక్య కమిటీ తమ మద్దతు తెలిపాయి. పూర్తి వివరాలు... పెట్రోల్, డీజిల్ ధరల మంట పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి రెక్కలొచ్చాయి. సగటున లీటర్ పెట్రోల్‌పై 30-33 పైసలు, డీజిల్ లీటర్‌పై రూ. 25-31 పైసల చొప్పున పెరిగాయి. పూర్తి వివరాలు.. తెలుగు మహిళ ఘనత పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు.. సునీత నిశ్చితార్థం ప్రముఖ సినీ నేపథ్య గాయనీ సునీత నిశ్చితార్థం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో నిరాబండరంగా జరిగింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వస్తున్న వదంతులకు ఫుల్స్టాప్ పడింది. పూర్తి వివరాలు.. వరంగల్ జిల్లాలో దారుణం వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గొండి మండలం రేపల్లెలో అత్యాచార ఘటన కలకలం రేపింది. తీవ్ర రక్తస్రావం జరిగి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. పూర్తి వివరాలు.. కరోనాతో బాలీవుడ్ టీవీ కరోనా వైరస్ బారిన పడి బాలీవుడ్ టీవీ నటి దివ్య భట్నాగర్(34) సోమవారం మృతి చెందారు. అధిక రక్తపోటుతో పాటు కరోనా మహమ్మారితో పోరాడి ఈ రోజు తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాలు.. నోకియా లేటెస్ట్ స్మార్ ఫోన్ ఈ నెల రెండు లేదా మూడో వారంలో నోకియా లేటెస్ట్ స్మార్ ఫోన్ 3.4 దేశీ మార్కెట్లో విడుదల కానుంది. దేశీయంగా దీని ధర సుమారు రూ. 12,000- 12,800 స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. పూర్తి వివరాలు.. 58 అంతస్థులు చేతులతోనే ఎక్కేశాడు! వైరల్: పారిస్ మోంట్‌పార్నాస్సేలోని ఓ యూట్యూబర్ 58 అంతస్తుల భవంతిని చకాచకా చేతులతోనే ఎక్కేశాడు. ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పూర్తి వివరాలు.. మా రాష్ట్రంలో బంద్ పాటించం: విజయ్ రూపాని నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు డిసెంబర్ 8న తలపెట్టిన భారత్ బంద్‌ను తమ రాష్ట్రం పాటించదని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. ఈ చట్టాల విషయంలో రైతులలో అసంతృప్తి లేదని భావిస్తున్నానన్నారు. పూర్తి వివరాలు.. -
ఏపీలో కొత్తగా 667 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 60,329 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 667 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,1972కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి క్షేమంగా కోలుకుని 914 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,59,029 మంది డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: దేశంలో తగ్గుతున్న కరోనా కొత్త కేసులు) గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది మరణించగా, ఇప్పటి రాష్ట్రంలో 7,033 మంది మృతిచెందారు. ఏపీలో ప్రస్తుతం 5,910 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,04,10,612 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. (చదవండి: కోటిన్నర మంది చనిపోయినా... ఒక్క టీకా పడలేదు) -
ఏపీలో రేపు, ఎల్లుండి వర్షాలు
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రేపు(సోమవారం) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి (మంగళవారం) నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు.. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు తెలిపారు. -
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 57,132 కరోనా పరీక్షలు నిర్వహించగా, 630 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 871305కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 882 మంది కరోనా నుంచి క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటివరకు 8,58,115 మంది డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా..) గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఇద్దరు.. చిత్తూరు, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు మరణించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 7024 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 6,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు ఏపీలో 1,03,50,283 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. (చదవండి: కరోనా వైరస్‌కు రుణపడి ఉన్నా: వర్మ) -
హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదంటూ పిటిషన్లో పేర్కొంది. ఎస్ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. పిటిషన్లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని ప్రభుత్వం చేర్చింది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనాతో 6వేల మంది మరణించారని, ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై పిటిషన్లో ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. (చదవండి: సీఎం జగన్‌పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత..) -
ఏపీలో కోటి దాటిన కరోనా పరీక్షలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటింది. నేటి వరకు రాష్ట్రంలో 1,00,57,854 మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 40,728 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 381 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 868064కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: కరోనా : మోడర్నా మరో గుడ్ న్యూస్ చెప్పింది) గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని 934 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,53,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి అనంతపురం,చిత్తూరు, కృష్ణా,విశాఖపట్నంలో ఒక్కరి చొప్పున మొత్తం నలుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6992కి చేరుకుంది. ప్రస్తుతంలో ఏపీలో 7,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి: ఇక రూ.800కే కరోనా టెస్ట్..!)| -
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న సమావేశాల్లో ప్రభుత్వం పలువురి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనుంది. శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలో బీఏసీ నిర్ణయించనుంది. తొలిరోజు వ్యవసాయ రంగంపై చర్చించనున్నారు. నివర్ తుపాను ప్రభావంపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది. నివర్ తుపాను ప్రభావంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. 19 బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. (చదవండి: ఆ ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: కొడాలి నాని) ఎకానిమల్ ఫీడ్, ఫిష్ ఫీడ్ యాక్ట్, ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్, ఏపీ ఫిషరీష్ వర్సిటి బిల్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసైన్డ్ భూముల చట్ట సవరణ, అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్, ఏపీ వ్యాట్ బిల్, ఏపీ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్ ట్రేడ్స్ సవరణ బిల్, ఏపీ స్పెషల్ కోర్ట్స్ ఫర్ ఉమెన్, మోటార్ వెహికల్ చట్టం, ఆన్లైన్ గేమింగ్ నిషేధితచట్టం, స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఏపీ ఎఫ్ఆర్బిఎం సవరణ బిల్లు, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు, మున్సిపల్ లా సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 20 ప్రధాన అంశాలను ప్రభుత్వం చర్చించనుంది. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతీ అంశాన్ని చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. (చదవండి: పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..) -
ఆ ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: కొడాలి నాని
సాక్షి, విజయవాడ: రేషన్ డీలర్లను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలు తినే రేషన్‌లో మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చే వాటికన్నా..క్వాలిటీతో ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వంపై 350 కోట్ల భారం పడ్డా నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలపై భారం పడకుండా డీలర్లకు 22 కోట్లు కమీషన్ రూపంలో ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. ఉచిత రేషన్ రూపంలో డీలర్లు ఇచ్చే కమీషన్ 270 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించిందని, రేషన్ డీలర్లకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని కొడాలి నాని తెలిపారు. (చదవండి: ‘అది తెలిసే మొహం చాటేశారు’) -
ఏపీ: రాగల మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 3 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
ఏపీ: కరోనా కేసులు తగ్గుముఖం
సాక్షి, అమరావతి: ఆంధ్రపదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 867063కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: కరోనాకు వ్యాక్సిన్లు రావడం ఓ భ్రమేనా!?) గడచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు.. మొత్తం ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 6981కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి క్షేమంగా కోలుకుని 1,186 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు మొత్తం 848511 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుత్తం 11571 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 99,62,416 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: కరోనా ఎఫెక్ట్: నల్లకోడికి ఫుల్లు డిమాండ్) -
ఏపీ వైపు విదేశీ వర్సిటీల చూపు
సాక్షి, అమరావతి: పలు అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలు రాష్ట్రం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో ముఖ్యంగా ఉన్నత విద్యా రంగంలో తెస్తున్న విప్లవాత్మక మార్పులు, విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం ఆయా వర్సిటీలను ఆకట్టుకుంటోంది. దీంతో రాష్ట్రంలో తమ వర్సిటీల క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని అవి భావిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలోని ప్రతిష్టాత్మక జార్జియాటెక్ యూనివర్సిటీ, అలబామా స్టేట్ యూనివర్సిటీ, క్లెమ్సన్ యూనివర్సిటీ, అస్ట్రేలియాకు చెందిన మరో ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయం ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చాయి. ఆయా వర్సిటీల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఇవి ఒక కొలిక్కి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు రాష్ట్ర విద్యార్థులు విదేశీ విద్య సులభంగా పొందడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా విదేశీ విద్యా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర విద్యార్థికి సులభంగా విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించడం, అక్కడి విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు, అధ్యాపకులతో పాటు పరిశోధనల్లో బాగస్వాముల్ని చేయడానికి వారధిగా పనిచేసేలా విదేశీ విద్యా విభాగాన్ని రూపొందించారు. విదేశీ విశ్వ విద్యాలయాలతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం ద్వారా మన రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలకు విదేశీ నిధులు తెప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు పరిశోధన, విద్యా బోధన తదితర రంగాల్లో విదేశీ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని 36 ప్రతిష్టాత్మక వర్సిటీలు ఏపీతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో కాకినాడలోని జేఎన్టీయూ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి మధ్య కుదిరిన ఎంవోయూతో పరిశోధన కార్యక్రమాల కోసం 44 వేల అమెరికా డాలర్ల (రూ.32.80 లక్షలు) నిధులు మంజూరు అయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యకు చర్యలు అలాగే విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలను కల్పించడానికి వీలున్న ఏరోస్పెస్, సౌర, ఇంధన, వ్యవసాయం, ఆతిథ్య రంగం, బయోకెమిస్ట్రీ విభాగాల్లో విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయా రంగాల్లో రాష్ట్ర విద్యార్థులకు సహకారం అందించడానికి జార్జియాటెక్, క్లెమ్సన్ వర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, ఎ అండ్ ఎం కాలేజ్ స్టేషన్, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, లామర్ , డ్యూక్ వర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, ఎమ్రార్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కార్పస్క్రిస్టీ తదితర విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చాయి. మరోవైపు రాష్ట్ర విదేశీ ఉన్నత విద్యా విభాగం రాష్ట్రంలోని 1,000 మంది విద్యార్థులకు ఉచిత విదేశీ ఆన్లైన్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సులు పూర్తి చేసినవారికి సర్టిఫికెట్లు ఇవ్వనుంది. -
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 57,752 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 733 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 866438కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరంలో ఒక్కరి చొప్పున మొత్తం ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 6976కి చేరుకుంది. (చదవండి: హెటెరో కీలక డీల్..మరో రెండు నెలల్లో వ్యాక్సిన్!) గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1205 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8లక్షల 47వేల 325 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 12,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 99,13,068 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం) -
సీఎం సహాయనిధికి రూ.51 లక్షల విరాళం
సాక్షి, అమరావతి: సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను పలువురు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం వ్యాపారవేత్తలు, సొసైటీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తరపున రూ.51 లక్షల 86 వేల రూపాయల విరాళాన్ని అందించారు. విరాళం చెక్కును సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు అందజేశారు. (చదవండి: కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం) -
కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు కీలక భాగస్వామ్యం నెలకొల్పాయి. కొత్త వైరస్ కావడానికి తోడు, వ్యాప్తి అత్యంత వేగంగా ఉండటం వల్ల అపార నష్టం సంభవించింది. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ నుంచి తక్షణమే బయట పడేందుకు ర్యాపిడ్ కిట్లు ఉపయోగపడిన తీరు అమోఘమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు డెంగీ జ్వరాలకు మాత్రమే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడారు. ఇది పూర్తిగా దోమకాటు జ్వరాలకు వాడేది. కోవిడ్ సోకిన తొలి రోజుల్లో ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేవు. ఇవి బాగా అందుబాటులోకి వచ్చింది 2020 ఆగస్ట్ నుంచే. ఆ తర్వాతే కరోనా వ్యాప్తి తగ్గినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్) తక్కువ సమయంలో ఫలితం ♦కోవిడ్ వైరస్‌ను కనుగొనడంలో ఆర్టీపీసీఆర్ టెస్టును గోల్డెన్ స్టాండర్డ్ అని చెబుతారు. అయితే ఈ టెస్టు ఫలితం కనీసం 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లోకి వచ్చిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లు 10 నిమిషాల్లో అక్కడికక్కడే ఫలితం ఇచ్చాయి. పైగా సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపాల్సిన అవసరం ఉండదు. పెద్దగా నైపుణ్యం కూడా అక్కర్లేదు. ♦ఇంటి వద్దకే వెళ్లి పరీక్ష చేసే అవకాశం ఉండటం వల్ల మొత్తం టెస్టుల్లో 38 శాతం ర్యాపిడ్ టెస్టులే ఉన్నాయి. ఇంటివద్దకే వెళ్లి టెస్టులు చేయడంలో ఏపీలో అద్భుత ఫలితాలు వచ్చాయి. (చదవండి: విజృంభిస్తున్న కరోనా : రికార్డు పెళ్ళిళ్లు) వీలైనంత త్వరగా అప్రమత్తం ♦ఫలితం వెంటనే తేలడంతో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడే వీలు కలిగింది. సత్వరమే హోం ఐసొలేషన్, లేదా ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించడానికి సాధ్యమైంది. ♦హై రిస్క్ ప్రాంతాలు లేదా హైరిస్క్ గ్రూపులో ఉన్న వారిని గుర్తించడంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కీలక పాత్ర వహించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో తక్షణమే టెస్టులు చేసి పాజిటివ్ వ్యక్తులను గుర్తించే వీలు కలిగింది. ♦వాస్తవానికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంటే ర్యాపిడ్ యాంటీజెన్ ఎక్కువ ఖరీదు అయినప్పటికీ, సత్వర ఫలితం వస్తుండటంతో దీనికి ప్రాధాన్యమిస్తున్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో సత్ఫలితాలు ఓవైపు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తూనే మరో వైపు ర్యాపిడ్ టెస్ట్ కిట్లతోనూ పరీక్షలు చేస్తూ వచ్చాం. ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో సత్వర ఫలితాలు రావడం వల్ల బాధితులను వెంటనే ఐసొలేషన్ (ఇంట్లో లేదా ఆస్పత్రిలో) చేయగలిగాం. దీనివల్ల వైరస్ వ్యాప్తి పెరగకుండా చూశాం. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్ష చేయగలగడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలిగాం. - కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నెల 22 నాటికి మొత్తం టెస్టులు 96,62,220 మొత్తం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు 35,66,496 వీటిలో పాజిటివ్‌గా వచ్చినవి 4,08,668 నెగిటివ్‌గా వచ్చినవి 31,55,092 వెయిటింగ్లో ఉన్నవి 472 ఆగస్ట్‌లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ధర రూ.410 నవంబర్‌లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ధర రూ.272 -
30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాలపై నోటిఫికేషన్ గురువారం విడుదలయ్యింది. డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే నిర్ణయంపై స్పష్టత రానుంది. (చదవండి: వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్) ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం, డ్రగ్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు కేవలం అక్రమ ఇసుక, మద్యం అమ్మకాలకు మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిమితమైంది. ఇకపై గ్యాంబ్లింగ్, ఆన్ లైన్ బెట్టింగ్, డ్రగ్స్, ఎర్రచందనం, ఇతర నిషేధిత పదార్ధాలు ఏస్ఈబి పరిధిలోకి తీసుకువచ్చింది.(చదవండి: పన్నులపై రెండు పత్రికల దుష్ప్రచారం) -
మైనార్టీలకు సంక్షేమ నజరానా
సాక్షి, అమరావతి: ముస్లిం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా రూ.3,428 కోట్ల మేర లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే మైనార్టీలకు పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. ఇంత భారీ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వాలు చేయూత అందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల మైనార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. నేరుగా నగదు బదిలీ... అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, సున్నా వడ్డీ, పెన్షన్ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, చేదోడు, వైఎస్సార్ ఆసరా, నేతన్న నేస్తం, లా నేస్తం తదితర పథకాల ద్వారా గత నెల వరకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.2,585 కోట్లు ప్రభుత్వం అందించింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ పథకాల ద్వారా కూడా ఆదుకుంటోంది. త్వరలో ఇవ్వనున్న ఇళ్ల స్థలాల పట్టాలు, మరికొన్ని పథకాల ద్వారా రూ.843 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. తద్వారా 17 నెలల వ్యవధిలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ముస్లిం మైనారిటీలకు రూ.3,428 కోట్ల మేర లబ్ధి కలగనుంది. మదర్సాల్లోనూ మధ్యాహ్న భోజనం రాష్ట్రంలోని 900 మదర్సాలలో చదువుతున్న 33 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేసింది. మదర్సాలకు కూడా అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలు అమలవుతున్నాయి. వక్ఫ్ ఆస్తులపై రీ సర్వేలు వక్ఫ్‌బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర, చర ఆస్తులను రీసర్వే చేసి ఆస్తులు కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో విడత సర్వే ద్వారా ఇప్పటికే దాదాపుగా ఆస్తుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చింది. ప్రత్యేకించి సర్వే కమిషనరేట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రీ సర్వే జరుగుతోంది. హజ్ యాత్రికులకు సాయం పెంపు హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయాన్ని రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.60 వేలు, అంతకు మించి ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.3 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తోంది. ఇటీవలే వారికి బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించింది. మరోవైపు ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ పెంచిన మొత్తం త్వరలోనే అమలులోకి రానుంది. టీడీపీ పాలనలో.... టీడీపీ ఐదేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీలకు అందించిన సాయం వేళ్ల మీద లెక్కించవచ్చు. మొత్తం 5 ఏళ్లలో కలిపి ఇచ్చింది కేవలం రూ.2,661 కోట్లు మాత్రమే. ఇవి అప్పటి ప్రభుత్వ లెక్కలు కాగా సాయం లబ్ధిదారుల చేతికందేలోపు జన్మభూమి కమిటీలు, దళారులు కాజేసింది పోగా లబ్ధిదారులకు అందింది చాలా స్వల్పమే. ఒక కుటుంబంలో మూడు పథకాలు.. ‘నా భర్తకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా సాయం అందుతోంది. నా మనవరాలికి జగనన్న అమ్మ ఒడి పథకం వర్తిస్తోంది. నాకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 అందాయి. గతంలో మాకు ఎప్పుడూ ఇలా సాయం అందలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా’ - షేక్ హసన్బీ, బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్ల మండలం, గుంటూరు జిల్లా. చదివిస్తూ డబ్బులివ్వడం గొప్ప పని... ‘చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చదువులకు డబ్బులు ఇవ్వడం గొప్ప పని. ఇంతవరకు ఇలా ఎవరూ చేయలేదు. ప్రభుత్వం 1వ తరగతి నుంచే పిల్లల చదువుల కోసం డబ్బులు ఇవ్వడమే కాకుండా పుస్తకాలు, బట్టలు, చెప్పులు కూడా సమకూరుస్తోంది. మూడో తరగతి చదువుతున్న నా కూతురు పేరుతో అమ్మ ఒడి డబ్బులు అందాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా మా అప్పులను కూడా ప్రభుత్వం తీరుస్తోంది’ - ఎస్కే సబియా, వన్‌టౌన్, విజయవాడ చెప్పినట్లుగా సాయం చేస్తున్నారు.. ‘వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 అందాయి. వైఎస్సార్ ఆసరా తొలి విడత సాయాన్ని సెప్టెంబరులో అందించారు. నాలుగు విడతల్లో మొత్తం రుణం తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇంతకంటే ఏం కావాలి? చెప్పినట్లు సాయం చేసిన ముఖ్యమంత్రి జగనన్న ఒక్కరే’ - షేక్ కరీమున్నీసా, వన్‌టౌన్, విజయవాడ -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 47,130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 545 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 86,2758కి చేరింది. గత 24 గంటల్లో 1,390 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,42,416 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: కరోనా విజృంభణ: సుప్రీం కీలక ఆదేశాలు) గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరిలో ఒక్కరి చొప్పున మొత్తం 10 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 6948కి చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 13,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 96,62,220 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. (చదవండి: భారత్ బయోటెక్ మరో గుడ్‌న్యూస్) -
ఏపీలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి.. ఏపీ టవర్స్ లిమిటెడ్ సీఈవోగా ఎం.రమణారెడ్డి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా ఎస్బిఆర్.కుమార్‌లకు బాధ్యతలు అప్పగించారు. -
సీట్ల కొరత లేదు: ఇంటర్ బోర్డు
సాక్షి, విజయవాడ: ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియలో ఎటువంటి గందరగోళం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ అడ్మిషన్లపై మార్చి నెలలోనే సర్క్యులర్ ఇచ్చామని పేర్కొన్నారు. సీట్ల కొరత ఉందని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇంటర్లో చేరడానికి ఎక్కడా సీట్ల కొరత లేదని తెలిపారు. కొత్తగా మంజూరైన 208 కళాశాలలతో కలిపి మొత్తం 7,42,780 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. (చదవండి: విదేశాల్లోనూ యువతకు ఉపాధి కల్పన) పదవ తరగతి పాసైన ప్రతీ ఒక్కరికి సీటు లభిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో అగ్నిమాపకశాఖ ఎన్ఓసి లేని కళాశాలలకు కూడా 60 రోజుల గడువుతో అనుమతులిచ్చామని చెప్పారు. కోర్టు ఉత్తర్వులకి లోబడి ఇంటర్ అడ్మిషన్లు కొనసాగింపు, సీట్ల సంఖ్య ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామకృష్ణ పేర్కొన్నారు. (చదవండి: ప్రణయ్ ఆత్మహత్య.. సంచలన విషయాలు) -
ఏపీ: భారీగా కరోనా కేసులు తగ్గుముఖం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,044 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 854764కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో ఇద్దరు.. కృష్ణాలో ఇద్దరు.. విశాఖపట్నంలో ఇద్దరు.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి ఒక్కరు చొప్పున మొత్తం 13 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 6881కు చేరింది. (చదవండి: సంచలన వ్యాఖ్యలు చేసిన సత్యేంద్ర జైన్) గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని 1507 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 829991 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17892 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 91,97,307 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.(చదవండి: వ్యాక్సిన్‌పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు) -
ఆ విషయంలో పునరాలోచన చేయాలి
సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు పోలాకి శ్రీనివాస్ కోరారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తగదని, కరోనా తగ్గిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు. రోజుకి మూడు, నాలుగు వేలు కరోనా కేసుల నేపథ్యంలో ఎన్నికల వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో ఉద్యోగులను బలి చేయొద్దని కోరారు. -
ఏపీ: రేపటి నుంచి మోగనున్న బడి గంటలు
సాక్షి, ప్రకాశం: రేపటి నుంచి రాష్ట్రంలో బడి గంటలు మోగబోతున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటగా 9,10 విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 23 నుంచి 6, 7, 8 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దశలవారీగా అన్ని తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం స్కూల్స్ నిర్వహించనున్నామని చెప్పారు. తగ్గించిన సిలబస్‌తో విద్యా సంవత్సరం పూర్తిచేస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తామని, మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు ఇళ్లకు పంపిస్తామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. -
ఏపీలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘పోస్కో’ తెలిపింది. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో తమ సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వారు ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం జగన్ ఈ సందర్భంగా వారికి బదులిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమల అభివృద్ధికి తగిన తోడ్పాటునం దిస్తాయన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంగ్ లై చున్, చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ గూ యంగ్ అన్, సీనియర్ జనరల్ మేనేజర్ జంగ్ లే పార్క్ తదితరులున్నారు. -
దసరా టూర్‌కు ‘ఆర్టీసీల’ బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి తర్వాత ఘనంగా జరుపుకొనే వేడుక. ఈ పండుగ వేళ హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు ఏడెనిమిది లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారు. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి వారి ప్రయాణాలు మొదలవుతాయి. ఆర్టీసీకి కూడా దసరా సీజన్ కలెక్షన్లు కురిపిస్తుంది. పెద్దెత్తున ఆదాయం వస్తుంది. ఈ సమయంలో చార్జీలు అధికారికంగా 50 శాతం పెంచినా ప్రజలు దాన్ని అంతగా పట్టించుకోరు. అయితే.. ఈసారి తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలకు పెద్ద సమస్యే వచ్చిపడింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదరకపోవడంతో బస్సులు సరిహద్దులు దాటడం లేదు. రెండు నెలలుగా అధికారులు కుస్తీ పడుతున్నా సయోధ్య కుదరలేదు. పండుగలోపు కుదురుతుందో.. లేదో.. తెలియని పరిస్థితి. దీంతో ఈసారి ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ప్రయాణం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్ నిబంధనలతో రైళ్లు కూడా తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. వాటిల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. దీంతో విధిలేక ప్రజలు ప్రైవేటు బస్సుల కోసం పరుగుపెట్టాల్సి వస్తోంది. దొరికిందే అదునుగా వారు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ చార్జీ రూ.290 ఉంటే.. ప్రైవేట్‌లో రూ.500కుపైగా వసూలు చేస్తున్నారు. ఆదాయ నష్టం ఐదారు కోట్లు.. ప్రతీ సంవత్సరం పండుగ వేళ తిరిగే అదనపు బస్సుల్లో 50 శాతం చార్జి ఎక్కువ ఉంటుంది. దసరా సమయంలో తెలంగాణ ఆర్టీసీకి ఏపీకి తిప్పే స్పెషల్ బస్సుల ద్వారా రోజుకు అదనంగా రూ.70 లక్షల ఆదాయం వస్తుంది. ఒప్పందం కుదరక ఈ సారి బస్సులు తిరిగే అవకాశం లేకపోవడంతో దాదాపు రూ.ఐదారు కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఈ సంవత్సరం ఇలా ఉంటే.. గతేడాది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దసరా వేళ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో టీఎస్ఆర్టీసీ బస్సులు సరిగాలేక ప్రజలు అప్పుడు కూడా ఇబ్బందులు పడ్డారు. లాక్‌డౌన్‌కు ముందు.. ►తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సులు తిరిగే కి.మీ.: 2.64 లక్షలు ►తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏపీ భూభాగంలో తిరిగే కి.మీ.: 1.61 లక్షలు తెలంగాణ వాదన: తెలంగాణ పరిధిలో ఏపీ బస్సు లు.. ఏపీలో తిరిగే తెలంగాణ బస్సుల పరిధి కంటే 1.03 లక్షల కి.మీ. ఎక్కువ తిరుగుతున్నాయి. దాన్ని తగ్గించుకోవాలి. ఏపీ వాదన: తెలంగాణతో పోలిస్తే ఏపీ బస్సులు ఎక్కువ తిరుగుతున్న మాట వాస్తవమే. కాలం గడిచేకొద్దీ సర్వీసుల సంఖ్య పెంచుకోవాలి కాబట్టి.. టీఎస్ ఆర్టీసీ కూడా ఏపీలో అంతమేర పెంచుకుంటే సరిపోతుంది. కాదంటే మేం 50 వేల కి.మీ. తగ్గించుకుంటాం.. తెలంగాణ అంతమేర పెంచుకున్నా చాలు. పెంచుకోవడం సాధ్యం కాదు.. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది. బస్సులు పెంచుకోవడం సాధ్యం కాదు. ఇక లాభదా యకంగా ఉండే విజయవాడ–హైదరాబాద్, కర్నూలు–హైదరాబాద్, గుంటూరు–హైదరాబాద్, ఒంగోలు–హైదరాబాద్ తదితర ప్రాంతాల మధ్య ఏపీ బస్సులను తగ్గించుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఆదాయం కోల్పోవడమే సమస్య... తెలంగాణకు పెద్ద సంఖ్యలో బస్సులు తిప్పడం ద్వారా ఏపీ ఆర్టీసీ సాలీనా రూ.575 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. తెలంగాణ వాదన మేరకు సంఖ్య తగ్గించుకుంటే దాదాపు రూ.260 కోట్ల ఆదాయం తగ్గుతుంది. అసలే నష్టాల్లో ఉండే ఆర్టీసీలు ఇంత ఆదాయం కోల్పోవటం పెద్ద సమస్యనే. కానీ ఏపీ బస్సులు ఎక్కువ తిరగటం వల్ల టీఎస్ ఆర్టీసీకి 250 కోట్ల కంటే ఎక్కువ నష్టమొస్తోందని తెలంగాణ వాపోతోంది. ఇద్దరికి రూ.1,100... దసరా వేళ హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్లాలంటే ప్రైవేట్ బస్సులో ఇద్దరికి కలిపి టికెట్ ధర రూ.1,100 అడిగారు. రైళ్లు ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లేవు. దీంతో మాలాంటోళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. – సీతారామ్, యశ్వంత్, గుడివాడ మేం సిద్ధమే.. కానీ.. దసరాకి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా బస్సులు తిప్పేందుకు మేం సిద్ధం. కానీ.. ఏపీఎస్ ఆర్టీసీ మా ప్రతిపాదనకు అంగీకరించాలి. మా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రతిపాదన చేశారు. బస్సులు, కిలోమీటర్లు, రూట్లు.. ఈమూడింటిలో రెండు ఆర్టీసీలు సమంగా అనుసరించాలన్నారు. దాని ప్రకారమే మేం ప్రతిపాదించాం. మా ప్రతిపాదనతో రెండు ఆర్టీసీలు సమంగా లాభపడతాయి. – పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి -
నేటి ముఖ్యాంశాలు
ఏపీ/తెలంగాణ: ►నేటి నుంచి ఏపీ, తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ►ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ►ఏపీ వ్యాప్తంగా 1411 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ►తెలంగాణ వ్యాప్తంగా 1339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ►ఏపీలో పరీక్షకు హాజరుకానున్న 5 లక్షల 18 వేల 788 మంది విద్యార్థులు ►ఏపీ: నేటి ఇంటర్ సెకండియర్ పరీక్షకు సెట్ నంబర్-2 ఎంపిక తిరుపతి: తిరుమలలో నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ►ఈనెల 9 వరకు కొనసాగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జాతీయం: ఢిల్లీ: నిర్భయ దోషుల డెత్‌వారెంట్‌పై నేడు పటియాల హౌస్ కోర్టులో విచారణ స్పోర్ట్స్: ►నేడు మహిళల టీ-20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లు ►ఇంగ్లండ్ Vs భారత్ (ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ►ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా (మ.1:30 గంటలకు మ్యాచ్ నగరంలో నేడు ►కల్చరల్ ప్రోగ్రామ్స్, అవార్డ్స్ ఫంక్షన్ బై మమత రఘువీర్ వేదిక: రవీంద్ర భారతి సమయం: ఉదయం 10 గంటలకు ►కిసి ఔర్ క సప్న : హిందీ ప్లే సుత్రదార్ వేదిక: లమాకాన్, బంజారాహిల్స్ సమయం: రాత్రి 8 గంటలకు ►తెలుగు , హిందీ ఫిల్మ్ సాంగ్స్ బై డీఏ మిత్ర , వి శశికళ స్వామి, డి. సురేఖ మూర్తి తదితరులు వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్ పల్లి సమయం: సాయంత్రం 4:30 గంటలకు ►నట సామ్రాట్ : డ్యాన్స్ కాన్సర్ట్ బై ప్రతిభ రాజ్ గౌడ్ వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్ పల్లి సమయం: సాయంత్రం 6 గంటలకు ►మాథ్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్ , సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 5 గంటలకు ►లేబల్ లవ్ : ఎగ్జిబిషన్ , సేల్ బై శశి నహత వేదిక: హయత్ ప్లేస్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►హిందీ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►వర్క్ షాప్ ఆన్ ఐఎల్ఇఏ వేదిక: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బాచుపల్లి సమయం: ఉదయం 9 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై జొగెన్ చౌదరి, రాంకుమార్ వేదిక: కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నరసింహ గౌడ వేదిక: సాలార్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10 గంటలకు ►ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్ డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►ఛాంపియన్ బ్రంచ్ వేదిక: రడిషన్ హైదరాబాద్ , హైటెక్ సిటీ సమయం: మధ్యామ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్‌షాప్ వేదిక: కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ , మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు -
ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ
సాక్షి, తాడేపల్లి: చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుకున్న 35 మంది ఏపీ యువకులను తిరిగి రప్పించేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ఆప్టో డిస్ల్పే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎంపికయిన 35 మంది యువకులను శిక్షణ కోసం సంస్థ.. చైనా పంపించింది. యువకులు శిక్షణ పొందుతున్న వూహాన్ సిటీలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని.. వారిని వెనక్కి పిలిపించాలని సీఎం వైఎస్ జగన్ లేఖలో కోరారు. వీలైనంత త్వరగా వారిని భారత్‌కు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. -
మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను ఆశిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని కీలక శాఖలను ఒకే మంత్రిత్వశాఖ కిందకు తీసుకువచ్చింది. దీంట్లో భాగంగానే మంత్రి మోపిదేవి వద్దనున్న మార్కెటింగ్‌శాఖను, అలాగే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వద్దనున్న ఫుడ్ ప్రాససింగ్ శాఖను.. వ్యవసాయ, సహకార శాఖలను చూస్తున్న మంత్రి కె.కన్నబాబుకు అప్పగించారు. పరిపాలనా పరమైన సౌలభ్యంతో పాటు మరింత మేలు జరిగే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మంత్రి మోపిదేవి వద్ద ప్రస్తుతం పశుసంవర్థక, మత్స్యశాఖలు ఉన్నాయి. మరో శాఖను మోపిదేవికి అప్పగించాలని సీఎం యోచిస్తున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. అలాగే బదలాయించిన ఫుడ్ ప్రాసెసింగ్ పోనూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వద్ద పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖలున్నాయి. కొద్దిరోజుల కిందటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖను మంత్రి గౌతంరెడ్డికి అప్పగించారు. -
కౌన్సిల్ అవసరమా?
మన రాష్ట్రంలో విధాన పరిషత్తు (లెజిస్లేటివ్ కౌన్సిల్) భవితవ్యంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్నది. విధాన పరి షత్తు స్వభావ స్వరూపాలను ఈ సందర్భంలో చర్చించుకొనడం అవసరం. విధాన పరిషత్తుల చట్టం ద్వారా 1958 జూలై మొదటి తేదీ నుండి మన రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు చేయబడింది. మనకు జూలై 1958లో కౌన్సిల్ ఏర్పడింది. అంతకు ముందు లేదు. కర్నూలు రాజధానిగా అవతరించిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో కూడా లేదు. శాసనమండలికి వాస్తవంలో ఏవిధమైన అధికారాలు లేవు. శాసనసభ అంగీకరించిన బిల్లుకు శాసనమండలి సవరణలు చేసినా, తిరస్కరించినా, లేక పరిషత్తుకు సమర్పిం చబడిన తేదీ నుండి ఆ బిల్లు ఆమోదింపబడకనే మూడు మాసాలు దాటిపోయినా తిరిగి శాసనసభ దానిని పరిశీలించి మార్పులు చేర్పులతో లేదా యధాతధంగా తిరిగి ఆ బిల్లును రెండవసారి పాస్ చేసి మళ్ళీ పరిషత్తుకు పంపడం జరుగుతుంది. అప్పుడు ఆ బిల్లును పరిషత్తు త్రోసిపుచ్చినా, లేక ఆ బిల్లు పాస్ చేయకుండా ఒక మాసం పాటు అలాగే మిగిలిపోయినా శాసనసభ అంగీకరించని సవరణలతో పరిషత్తు దానిని పాస్ చేసినా శాసనసభ రెండవమారు బిల్లును ఏ రూపంలో పాస్ చేసిందో అదే రూపంలో శాసనమండలిలో కూడా పాస్ చేయబడినట్లు భావించబడుతుందని రాజ్యాంగంలోని 197వ అనుచ్ఛేదము చెబుతున్నది. అయితే ద్రవ్య సంబంధమైన బిల్లుల విషయంలో ఇంతమాత్రం ప్రాముఖ్యత కూడా శాసనమండలికి లేదు. విధాన పరిషత్తు సభ్యుల జీతభత్యాలకు అమితమైన వ్యయం తప్పదు. నెల జీతం రూ. 600, నియోజకవర్గం అలవెన్సు 300, ఫోనుకు వంద రూపాయలు. సభ్యుల దంపతులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మొదటి తరగతికి ఒకటిన్నర రెట్లు ప్రయాణ భత్యం. రోజుకు రూ.45 దినభత్యం. సంవత్సరానికి మూడువేల రూపాయలు కిమ్మత్తు చేసే రైల్వే కూపనులు, వైద్య సౌకర్యం, ప్రభుత్వ అతిథి గృహాలలో వసతుల వంటి సౌకర్యాలనేకం. ఎం.ఎల్.ఎ. హాస్టళ్ళలో వీరికి జాగా చూపవలసిందే. రైల్వే కూపనులకు మారుగా నెలకు రూ.300 రొక్కంగా ఇవ్వమంటున్నారీ మధ్య. ఇవికాక, శాసనమండలి సమావేశాల ఏర్పాటుకు, ప్రసంగాలను అచ్చు వేయడానికి, సిబ్బందికి, ఇతరత్రా మరింత వ్యయం. ఇంకా శాసనమండలికొక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉంటారు. వారికి కారు, ఫోను, సిబ్బంది వంటి సదుపాయాల కోసం మరొక మోపెడు ఖర్చులు. రాష్ట్ర ప్రజానీకం అసలు ఆశయాలు, అభీ ష్టాలు నెరవేర్చాలనే మహదాశయంతో నందమూరి నాయకత్వాన ‘తెలుగుదేశం’ విశేష జనాదరణతో అధికారంలోనికొచ్చింది. అయితే ప్రస్తుతం శాసనమండలిలో ప్రభుత్వ పక్షానికి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టే సభ్యుడు కూడా లేడు. ఉమా వెంకట్రామిరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి జి. జగన్నాథరావు ఖాళీ చేసే స్ధానాలు త్వరలో అధికార పక్షానికి రాగలవు. పెద్దఎత్తున పార్టీ మార్పిడులు జరగకపోతే ప్రస్తుత ప్రభుత్వం చేపట్టనున్న అభ్యుదయ పథకాలన్నిం టికి శాసనమండలి పెద్ద ప్రతిబంధకంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు. పార్టీ మార్పిడులను ఎంతమాత్రం ప్రోత్సహించని వజ్రసంకల్పుడు ముఖ్యమంత్రి నందమూరి. అటువంటప్పుడు ఈ యిబ్బందిని అధిగమించడానికి శాసనమండలిని రద్దు గావించడం వినా మార్గాంతరం లేదు. కొత్త మంత్రివర్గంలో అధిక శాతం యువకులు, కొత్తవారు, అనుభవం లేనివారు, కల్మశం అంతకన్నా లేనివారు. ఇక శాసనమండలిలో మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డితో సహా పెక్కుమంది మాజీలు ఉన్నారు. వారికి పాలనా రంగంలోని లొసుగులన్నీ కరతలామలకం. తమ వాగ్ధాటితో, కొంటె ప్రశ్నలతో యువకులైన మంత్రులను వీరు ఇబ్బంది పెట్టే అవకాశం లేక పోలేదు.అందువల్ల ఏ కోణం నుండి చూసినా శాసనమండలి రద్దు అనేది అత్యంత అభిలషణీయం. కొత్త ప్రభుత్వానికి దీనివల్ల వెసులుబాటు ఎక్కువవడమే కాక ప్రజాధనం పన్ను చెల్లించే పేదవాని ధనం దుబారా కాకుండా కొంతవరకైనా నివారణకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ చర్యకు జనాదరణ మిక్కుటంగా లభిస్తుందనడంలో సందేహం లేదు. (నాటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయ డంపై అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేసిన విస్పష్ట ప్రకటనపై స్పందిస్తూ వ్యాసకర్త 19–01–1983న ఒక పత్రికలో రాసిన వ్యాసానికి సంక్షిప్త రూపం) డా. యలమంచిలి శివాజి వ్యాసకర్త రాజ్యసభ మాజీ ఎంపీ మొబైల్ : 98663 76735 -
సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ది ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని పేర్కొన్నారు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అభివృద్ది అంతా ఒకే చోట జరిగితే ఏం జరుగుతుందో హైదరాబాద్ విషయంలో ప్రత్యక్షంగా చూశామని.. మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదని తెలిపారు. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చిన పరిశ్రమల రాయితీ వల్ల రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని.. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పరిశ్రమల రాయితీలను నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన 8 నెలల లోపే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని..అందుకే ఆయనపై నమ్మకం ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు. -
26 నుంచి సచివాలయ సేవలు..
సాక్షి, విజయవాడ: ఈ నెల 26 నుంచి వార్డు సచివాలయాల్లో సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పౌర సేవలు సచివాలయాలు ద్వారా అందిస్తామని.. దేశంలో ఇన్ని సేవలు.. గ్రామాలు, వార్డుల్లో అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. సచివాలయాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించామని.. వచ్చే నెల నుంచి వార్డు సచివాలయాలు,వాలంటీర్ల ద్వారా పింఛన్ల చెల్లింపులు చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో మొత్తం సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 24 గంటల్లో కొన్ని, 72 గంటల్లో కొన్ని సేవలను అందిస్తామని వివరించారు. ప్రతి రోజు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తులు సచివాలయంలోనే చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు ఈ సచివాలయాలు ద్వారా తక్షణ సేవలు అందుతాయని కమిషనర్ పేర్కొన్నారు. -
ఏపీ: అవినీతిపరుల భరతం పడుతున్న ఏసీబీ
సాక్షి, విజయవాడ: సీఎం ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ప్రక్షాళనకు ఏసీబీ నడుంబిగించింది. అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లంచావతారాల భరతం పట్టేందుకు ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చిత్తూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేపట్టింది. 14400 స్పందన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు స్పందించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో బీరువాలు, సిబ్బంది బ్యాగులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. రికార్డులు పరిశీలించి సిబ్బందిని ఆరా తీస్తున్నారు. కార్యాలయాలకు పనులపై వచ్చిన ప్రజలను విచారించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. చిత్తూరు: జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. వివిధ సమస్యల మీద వచ్చిన ఫిర్యాదులు ఎంత వరుకు పరిష్కారం అయ్యాయి. పెండింగ్ ఉన్న ఫిర్యాదులు, పరిష్కారం చేయకపోవడానికి కారణాలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి: జిల్లాలోని చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో పలు దస్ర్తాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. కృష్ణా: జిల్లాలోని అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించడంతో పాటు, అధికారులు, సిబ్బంది బ్యాగులను కూడా తనిఖీ చేస్తున్నారు. కార్యాలయాలకు పనుల మీద వచ్చిన ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తూర్పుగోదావరి: జిల్లాలోని పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు,సిబ్బందిని విచారిస్తున్నారు. రికార్డులను పరిశీలించడంతో పాటు, తహసీల్ధార్ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా దాడుల్లో భాగంగా ఏసీబీ అధికారులు జిల్లాలోని ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎచ్చెర్ల తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రకాశం జిల్లా: పొన్నలూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా కార్యాలయంలో ఏసీబీ అధికారులు అపర్ణ, వెంకటేశ్వర్లు, రాఘవరావు, ప్రసాద్ రికార్డులను పరిశీలించారు. పాసు పుస్తకాలు జారీ అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం: జిల్లాలోని కొత్తూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్ధార్ కార్యాలయంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రికార్డులను పరిశీలించారు. విజయనగరం జిల్లా: జిల్లాలో వేపాడ తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కార్యాలయంలోని అధికారులు,సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రికార్డులు పరిశీలించి ఆరా తీస్తున్నారు.ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరుజిల్లా: సూళ్లూరుపేట తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించాయి. అవినీతిపై ఆరోపణలపై అధికారులను, సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు కార్యాలయాలకు వచ్చిన ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
మధ్యాహ్న భోజనంలో.. కొత్త రుచులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూ కొత్త రుచులు సందడి చేయనున్నాయి. మారిన ఈ కొత్త మెనూ మంగళవారం నుంచి అమల్లోకి రానుండడంతో విద్యార్థిలోకం సంతోషం వ్యక్తం చేస్తోంది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారంతోపాటు శుచి, శుభ్రతతో ఉండాలన్న లక్ష్యంతో ఆçహార పట్టికలో పలు మార్పులు చేశారని అధికారులు చెబుతున్నారు. ఐదు రోజులు గుడ్డుతోపాటు మూడు రోజులు బెల్లం, వేరుసెనగ, చక్కీలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటితోపాటు రోజూ ఒక్కోరకం రుచులు వడ్డించేలా ఆహార పట్టిక రూపొందించారు. జిల్లా, మండల స్ధాయిలో కొత్త మెనూపై అధికారులు ఇప్పటికే వర్క్‌షాపు నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 2,961, ప్రాథమికోన్నత 376, ఉన్నత పాఠశాలలు 581 వరకూ ఉన్నాయి. వీటిలో 3,89,565 వేల మంది విద్యార్థుల వరకూ విద్యను అభ్యసిస్తున్నారు. కొత్తగా అందించే చిక్కీకి కిలోకు రూ.135 చొప్పున నిర్వహకులకు చెల్లించనున్నారు. ప్రతి విద్యార్థికీ 25 గ్రాముల చొప్పున చక్కీ ఇవ్వనున్నారు. దశల వారీగా మార్పులు... ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం 2003–04వ సంవత్సరంలో ఆరంభమైంది. మొదట్లో అన్నంతోపాటు సాంబారు లేదా పప్పు వడ్డించేవారు. తర్వాత చట్నీ మరి కొన్ని రోజులు కూర జత చేశారు. క్రమేణా పప్పు, సాంబారుతో పాటు కూర, వారానికో గుడ్డు, తరువాత రెండు ఇలా మార్పులు చేస్తూ వచ్చారు. తాజాగా వారానికి ఐదు గుడ్లు ఇవ్వాలన్నది జగన్ ప్రభుత్వ నిర్ణయం. అంతేగాక వంట తయారీ చేసే ఏజెన్సీ వాళ్లకు గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచి వారి డిమాండ్ నేరవేర్చారు. ప్రతి విద్యార్థీ తినాలి... ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోవడానికి సమయం లేక బాక్సు తెచ్చుకుంటున్నారు. ఆ పద్ధతికి స్వస్తి పలికి ప్రస్తుత ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి విద్యార్థీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎస్.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ►విజయవాడ: అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా నేడు వైఎస్సార్సీపీ ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి మధురానగర్ వరకు శాంతి ర్యాలీ హాజరుకానున్న మంత్రి వెల్లంపల్లి,ఎమ్మెల్యే విష్ణు, వైఎస్సార్సీపీ నేతలు ►నేడు తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం తెలంగాణ హైదరాబాద్: నేడు ప్రొఫెసర్ కాశింను సీజే ముందు హాజరుపర్చనున్న పోలీసులు కాశిం అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు జాతీయం ►మహారాష్ట్ర: నేడు షిర్డీ బంద్ ►బాబా ఆలయం తెరిచే ఉంటుందన్న సాయి ట్రస్ట్ ►దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ట్రస్ట్ ►భక్తులకు ఇబ్బందిలేకుండా షిర్డీ బంద్‌కు స్థానికుల పిలుపు ►మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు షిర్డీలో స్థానికుల నిరసనలు స్పోర్ట్స్ ►నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే ►బెంగుళూరు వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ►మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు ►ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి వన్డే ►నేడు కివీస్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌కు భారత్ జట్టు ఎంపిక ►టెస్టు జట్టులోకి కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసే అవకాశం నగరంలో నేడు ►మ్యూజిక్ ప్రోగ్రాం బై శృతిలయ ఆర్ట్ అకాడమీ వేదిక : రవీంద్ర భారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ►ఎస్టీ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్లే ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ వేదిక: రవీంద్ర భారతి సమయం: ఉదయం 10 గంటలకు ►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ మెకానికల్ రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వేదిక: బెస్ట్ వెస్టర్న్ అశోక, లక్డీకాపూల్ సమయం: ఉదయం 9 గంటలకు ►శ్రీ త్యాగరాజ ఆరాధన క్లాసికల్ మ్యూజిక్ బై శివపార్వతి టీం వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి సమయం: సాయంత్రం 6 గంటలకు ►చిత్రహార్ సండేస్ విత్ డీజే ప్రీత్ వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్ సమయం: రాత్రి 8 గంటలకు అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ఫ్లూట్ క్లాసెస్ బై షషాంక్ రమేష్ సమయం: ఉదయం 11 గంటలకు ►క్రొచెట్, ఎంబ్రాయిడరీ రెగ్యులర్ క్లాసెస్ సమయం: ఉదయం 10 గంటలకు ►ఫ్రీ యోగా క్లాసెస్ సమయం: ఉదయం 11 గంటలకు ►పెయింటింగ్ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 1 గంటలకు ►వీకెండ్ చెస్ క్లాసెస్ సమయం: ఉదయం 10 గంటలకు ►జ్యువెలరీ మేకింగ్ వర్క్‌షాప్ సమయం: ఉదయం 11 గంటలకు ►లాటిన్ డ్యాన్స్ క్లాసెస్ సమయం: సాయంత్రం 6 గంటలకు ►వీణ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►పోయెట్రీ క్లాసెస్ సమయం: ఉదయం 10:30 గంటలకు ►డ్రాయింగ్ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►లైఫ్ స్కిల్స్ వర్క్‌షాప్ సమయం: ఉదయం 10 గంటలకు ►భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్ ఫర్ఫామెన్స్ వేదిక: శిల్పారామం సమయం: సాయంత్రం 5–30 గంటలకు ►తెలుగు కల్చర్ సంక్రాంతి సమ్మేళనం విత్ తెలంగాణ గవర్నర్ వేదిక: ఓం కన్వెన్షన్, నార్సింగి సమయం: ఉదయం 11 గంటలకు ►సాక్షం సైకిల్ డే –2020 వేదిక: అథ్లెటిక్ స్టేడియం, గచ్చిబౌలి సమయం: ఉదయం 7 గంటలకు ►దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో వేదిక: తాజ్‌కృష్ణ , బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►తెలుగు ఫుడ్ ఫెస్టివల్ వేదిక: బంజారా ఫంక్షన్‌హాల్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11–30 గంటలకు ►క్లాసికల్ ఒడిస్సీ డ్యాన్స్ వర్క్‌షాప్ వేదిక:అనాహతయోగా జోన్,సికింద్రాబాద్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బై సూత్ర వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ సమయం: ఉదయం 10 గంటలకు ►భరతనాట్యం వర్క్‌షాప్ వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ సమయం: రాత్రి 8 గంటలకు ►ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ బై గో స్వదేశీ వేదిక: శ్రీ రాజ రాజేశ్వరీ రూఫ్ గార్డెన్స్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఇండియా ఇంటర్నేషనల్ హలాల్ ఎక్స్ ఫో వేదిక: హైటెక్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ వేదిక: కార్వీ కన్సల్టెన్సీ లిమిటెడ్, రోడ్ నం.1, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►మిస్టర్ అండ్ మిస్ ఫర్ఫెక్ట్ హైదరాబాద్ 2020 వేదిక: సీఎంఓఎఫ్ గ్లోబల్, మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ►పెయింటింగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ డా, అవనీ రావ్ ఆర్టిస్ట్ స్టూడియో, సమయం: ఉదయం 11 గంటలకు ►ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి సమయం: ఉదయం 10 గంటలకు. -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ ► హైదరాబాద్: బైంసా మున్సిపల్ ఎన్నికలపై నేడు నిర్ణయం ►రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందిన పరిశీలకుడి నివేదిక ►నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన ►మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ►చిత్తూరు: నేటి నుంచి హార్సిలీహిల్స్‌పై అడ్వెంచర్ ఫెస్టివల్ ►రెండు రోజుల పాటు సాహస క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలు ►అమరావతి: నేటి నుంచి ప్రారంభం కానున్న రహదారి భద్రతా వారోత్సవాలు ►ఈ నెల 25 వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జాతీయం ►న్యూఢిల్లీ: నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ►ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్ ►న్యూఢిల్లీ: ఢిల్లీలో చిన్నారిపై లైంగిక దాడి కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది ►2013లో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు దుండగులు పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు స్పోర్ట్స్ ►నేడు హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల టెన్నిస్ ఫైనల్ ►షువై పెంగ్-షువై ఝంగ్‌తో సానియా మీర్జా-నదియా జోడీ ఢీ భాగ్యనగరంలో నేడు.. ►త్యాగరాయ ఆరాధనోత్సవం వేదిక: రవీంద్ర భారతి సమయం: ఉదయం 10 గంటలకు ►యాక్షన్ నెట్వర్క్ వర్క్‌షాప్ వేదిక: ట్రిబుల్ఐటీ హైదరాబాద్ క్యాంపస్, గచ్చిబౌలి సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ లలిత కళా ప్రదానోత్సవం వేదిక: రవీంద్ర భారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ►ఎంటీఆర్ ఫుడ్స్ తెలుగు రుచులు వేదిక: బంజారా ఫంక్షన్‌హాల్, రోడ్ నం.1, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►శ్రీ త్యాగరాజ ఆరాధన క్లాసికల్ మ్యూజిక్ బై వై రామప్ప వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్పల్లి సమయం: సాయంత్రం 6 గంటలకు ►కామెడీ నైట్ వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్ సమయం: రాత్రి 8 గంటలకు ►ఫ్రెంచ్ క్లాసెస్ విత్ సుపర్ణ గుహ వేదిక: బుక్స్ ఆండ్‌మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 5 గంటలకు వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ►వీణ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►పోయెట్రీ క్లాసెస్ సమయం: ఉదయం 10:30 గంటలకు ►ల్యాంప్ షేడ్ మేకింగ్ వర్క్‌షాప్ సమయం: ఉదయం 11 గంటలకు ►డ్రాయింగ్ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►లైఫ్ స్కిల్స్ వర్క్‌షాప్ సమయం: ఉదయం 10 గంటలకు ►క్లాసికల్ ఒడిస్సీ డ్యాన్స్ వర్క్‌షాప్ వేదిక:అనాహతయోగాజోన్,సికింద్రాబాద్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►భరతనాట్యం వర్క్‌షాప్ వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ సమయం: రాత్రి 8 గంటలకు ►ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ బై గో స్వదేశీ వేదిక: శ్రీ రాజ రాజేశ్వరీ రూఫ్ గార్డెన్స్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఇండియా ఇంటర్నేషనల్ హలాల్ఎక్స్ ఫో వేదిక: హైటెక్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ వేదిక: కార్వీ కన్సల్టెన్సీ లిమిటెడ్, రోడ్ నం.1, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►మిస్టర్ అండ్ మిస్ ఫర్ఫెక్ట్ హైదరాబాద్ 2020 వేదిక: సీఎంఓఎఫ్ గ్లోబల్, మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ►పెయింటింగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ డా, అవనీ రావ్ ఆర్టిస్ట్ స్టూడియో, సమయం: ఉదయం 11 గంటలకు ►ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి సమయం: ఉదయం 10 గంటలకు ►ఆస్ట్రేలియా ఫెయిర్ వేదిక: తాజ్ డక్కన్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► నేడు క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ ►ఇప్పటికే జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్ కమిటీ ►అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం జగన్‌కు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న హైపవర్ కమిటీ ►ఇప్పటికే మూడు సార్లు సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపిన హైపవర్ కమిటీ జాతీయం ►ఢిల్లీ: రాత్రి 7 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ ►ఢిల్లీ: నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్ స్పోర్ట్స్ ►నేడు భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ►రాజ్‌కోట్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ►ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో 0-1 ఆధిక్యంలో ఉన్న ఆసీస్ ►కేప్‌టౌన్: నేడు నుంచి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ►19న లంక, 21న జపాన్, 24న కివీస్‌తో తలపడనున్న భారత్ నగరంలో నేడు ►భరత నాట్యం వర్క్‌షాప్ వేదిక : టీఎస్ఐఐసీ, హైటెక్ సిటీ సమయం: ఉదయం 8 గంటలకు ►స్పేస్ట్రిప్ ఫెస్టివల్ వేదిక: ది పార్క్ హోటల్, రాజ్ భవన్ రోడ్ సమయం : రాత్రి 7గంటలకు ►సాక్ష్యం 2020 ప్రారంభోత్సవం వేదిక : రవీంద్ర భారతి సమయం : ఉదయం 11 గంటలకు ►నిర్మల జ్ఞాన ప్రోగ్రామ్ వేదిక : వెస్ట్ రమలానగర్, మేడిపల్లి సమయం : ఉదయం 10 గంటలకు ►ఈ లైవ్ కచేరీకి వెళ్లండి.. తర్వాత మీరే మాకు థ్యాంక్స్ చెబుతారు వేదిక:అలియన్స్ఫ్రాంసెస్ హైదరాబాద్ సమయం : రాత్రి 7.30 గంటలకు ►4వ ఇంటర్నేషనల్ సెమినార్ అండ్ డాన్ గ్రేడింగ్ వేదిక : శ్రీ సాయి నగర్, చింతలకుంట సమయం : ఉదయం 9.00 గంటలకు ►వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ హైదరాబాద్ వేదిక: వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్, రావిరాల సమయం: ఉదయం 5.30 గంటలకు ►స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ ఇనాగ్యురేషన్ వేదిక : సీఏఆర్ ప్రధాన కార్యాలయం, పరేడ్ గ్రౌండ్ సమయం : ఉదయం 9.30 గంటలకు ►మైట్ లిటిల్ భీమ్ వేదిక: గ్రీన్ గోల్డ్ యానిమేషన్ కార్యాలయం, గచ్చిబౌలి సమయం : ఉదయం 10.30 గంటలకు ►ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా వేదిక : శిల్పారామం, మాదాపూర్ సమయం : సాయంత్రం 5 00 గం. ►శ్రీ త్యాగరాజ ఆరాధన శాస్త్రీయ సంగీత కార్యక్రమం. వేదిక : శ్రీ త్యాగరాజ గాన సభ. సమయం: సాయంత్రం 6 00గం ►సూత్రా ఎగ్సిబిషన్ సేల్ వేదిక: నొవాటెల్ హైద్రాబాద్ కన్వెన్షన్ సెంటర్ సమయం :ఉదయం 11 00గం. ►ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ వేదిక: పరేడ్ గ్రౌండ్స్ సమయం : ఉదయం 9 30 గం. ►లిటరరీ ఫెస్టివెల్–లైవ్ కాన్సర్ట్ వేదిక : ఫొనిక్స్ ఎరీనా సమయం: సాయంత్రం 7 30 ►చిత్రకళా ప్రదర్శన వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ సమయం: ఉదయం 11 30 ►అష్టభుజి ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక : గ్యాలరీ78 సమయం: ఉదయం 11 00. -
‘ఫాస్ట్’గా వెళ్లొచ్చు!
సాక్షి, విశాఖపట్నం: వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద కష్టాలు తప్పనున్నాయి. దీనికి కారణం ఫాస్టాగ్ విధానం అమల్లోకి రానుండడమే. సాధారణంగా టోల్ ఫీజు చెల్లించడానికి ఒక్కో వాహనానికి కనీసం ఐదు నిమిషాలు పడుతోంది. ఈ పరిస్థితిల్లో టోల్‌ప్లాజా వద్ద ఆగకుండానే వాహనాలు వెళ్లిపోవడానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఎలక్ట్రానిక్ టోల్ వసూలు చేసేందుకు ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. విశాఖ శివారులోని అగనంపూడి సహా జిల్లాలోని నాలుగు టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక “ఫాస్టాగ్’లైన్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ నగదు రూపేణా టోల్ చెల్లించి వెళ్లడానికి ఉన్న క్యాష్ లైన్లు తగ్గించేశారు. ఉదాహరణకు అగనంపూడి టోల్‌ప్లాజా వద్ద రాక, పోక మార్గాల్లో నాలుగేసి చొప్పున మొత్తం ఎనిమిది మార్గాలు ఉన్నాయి. వాటిలో రాక, పోక మార్గాల్లో ఒక్కొక్కటి మాత్రమే క్యాష్ లైన్ ఉంటుంది. మూడేసి చొప్పున ఆరు లైన్లు ఫాస్టాగ్ ఉన్న వాహనాల కోసం కేటాయించారు. ఇప్పటివరకూ ఈ లైన్లలో ఫాస్టాగ్ ఉన్న వాహనాలే గాక నగదు రూపేణా టోల్ చెల్లించే వాహనాలనూ అనుమతిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి అలా కుదరదు. ఫాస్టాగ్ ఉన్న వాహనాలనే సంబంధిత లైన్లలోకి అనుమతిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాహనాలు ఆ మార్గాల్లో వెళ్తే రెట్టింపు టోల్ (రుసుం) వసూలు చేస్తారు. సంక్రాంతికి వాహనాల తాకిడి.. నక్కపల్లి, విశాఖ నగరంలో అగనంపూడి, పోర్టు అనుసంధాన మార్గంలోని పంచవటి, డాక్‌యార్డు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. నక్కపల్లి టోల్‌ప్లాజా రాజమండ్రి రీజియన్‌లో ఉండగా.. మిగతా మూడు విశాఖ పరిధిలో ఉన్నాయి. జిల్లాలోని టోల్‌ప్లాజాల్లో అగనంపూడి, నక్కపల్లి జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 16)పై ఉండటంతో ఇవెంతో కీలకమైనవి. అక్కడ సగటున రోజుకు 35 వేల నుంచి 40 వేల వాహనాలకు సంబంధించిన టోల్ చెల్లింపులు జరుగుతున్నాయి. రాక, పోక మార్గాల్లోని ఎనిమిది లైన్లలో ప్రయాణించే వాహనాలకు సంబంధించి టోల్ చెల్లించడానికి ఒక్కో వాహనానికి కనిష్టంగా ఐదు నిమిషాల సమయం పడుతోంది. దీంతో సాధారణ రోజుల్లో టోల్‌ప్లాజా దాటడానికి పది నిమిషాల సమయం పడుతోంది. సంక్రాంతి, దసరా వంటి పండుగల సమయాల్లో వాహనాల తాకిడి మూడు రెట్లు పెరుగుతుండాయి. ఇప్పటికే సంక్రాంతి సెలవులు ఇచ్చేయడంతో ఆదివారం నుంచి రోజూ లక్ష వాహనాల వరకూ రాకపోకలు సాగిస్తాయని ఎన్హెచ్ఏఐ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫాస్టాగ్ లేకుంటే ఇబ్బందే... జిల్లాలోని నాలుగు టోల్‌ప్లాజాల వద్ద గత డిసెంబరు ఒకటో తేదీ నుంచే ఫాస్టాగ్ లైన్లను పక్కాగా అమలు చేయడానికి ఎన్హెచ్ఏఐ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. కానీ ప్రజాప్రతినిధులు, వాహనదారుల సంఘాల వినతి మేరకు ఆ గడువు పెంచుకుంటూ వచ్చారు. ఈనెల 15 నుంచి టోల్‌ప్లాజాల వద్ద రాక, పోక మార్గాల్లో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే టోల్ రుసుం చెల్లింపు కౌంటర్లు ఉంటాయి. మిగతావన్నీ ఫాస్టాగ్ లైన్లే. ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల్లో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. లేని వాహనాలకు రాక, పోక మార్గాల్లో క్యాష్ లైను ఒక్కొక్కటి మాత్రమే ఉండటంతో టోల్‌ప్లాజా దాటడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఎంత రద్దీ ఉన్నా ఫాస్టాగ్ లైనులోకి మాత్రం వెళ్లకూడదు. 70 శాతానికి చేరిన ‘ఫాస్టాగ్’ ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారులకు ప్రత్యేక స్టిక్కర్ ఇస్తున్నారు. దీన్ని ఏ వాహనం నంబరుతో కొనుగోలు చేశారో ఆ వాహనం కోసమే వినియోగించాలి. ఈ స్టిక్కర్‌ను వాహనం అద్దంపై కుడివైపు పైభాగంలో అతికించాలి. ఈ స్టిక్కర్పైనున్న చిప్‌ను, బార్ కోడ్‌ను స్కాన్ చేయడానికి శక్తివంతమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ (ఆర్ఎఫ్ఐడీ)లను టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేశారు. వాహనం టోల్‌ప్లాజా సమీపంలోకి వస్తున్నప్పుడే ఇవి స్కాన్ చేస్తాయి. దీంతో ఆ వాహనానికి చెల్లించాలి్సన టోల్ ఫాస్టాగ్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపు క్షణాల్లో జరిగిపోతుంది. ఆ సమాచారం వాహనదారుని సెల్‌ఫోన్‌కు వస్తుంది. ప్రస్తుతం టోల్‌ప్లాజా వద్దకు వస్తున్న వాహనాల్లో ఫాస్టాగ్ ఉన్నవి 70 శాతం వరకూ ఉంటున్నాయి. వీటిని వంద శాతం చేసేలా అధికారులు కృషి చేయాలని ఇటీవల విశాఖలో జరిగిన పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. రిజిస్ట్రేషన్‌కు పలు మార్గాలు... ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్‌కు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటు వాహనదారుడి బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ సమర్పించాలి. ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇందుకోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో రూ.100 స్టిక్కర్ (ట్యాగ్) ఖరీదు కాగా మిగిలిన మొత్తంలో రూ.200 బ్యాంకులో సెక్యూరిటీ డిపాజిట్‌కు, రూ.200 టాప్అప్కు కేటాయిస్తారు. ఈ స్టిక్కర్ జాతీయ రహదారులపైనున్న అన్ని టోల్‌ప్లాజాల్లోనూ పనిచేస్తుంది. టోల్‌ప్లాజాలు, పలు పబ్లిక్ పాయింట్ల వద్ద ఫాస్టాగ్‌ల విక్రయానికి అధీకృత బ్యాంకులు ప్రత్యేక కౌంటర్ల (పాయింట్ ఆఫ్ సేల్ – పీవోఎస్)ను ఏర్పాటు చేశాయి. ఇది కొనుగోలు చేసిన తర్వాత వాహనదారులు ‘మై ఫాస్టాగ్ యాప్’ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. వాహన రిజిస్ట్రేషన్ నంబరుతో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. డీలర్లూ ఫాస్టాగ్ ఇవ్వాలి మోటారు వాహనాల చట్టానికి 2017లో చేసిన సవరణ ప్రకారం కొత్త కార్లు, భారీ వాహనాల కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్ ఇవ్వాలి. ఈ దృష్ట్యా వాహల కొనుగోలుదారులకు ఫాస్టాగ్ స్టిక్కర్ ఇచ్చేందుకు డీలర్లంతా సహకరించాలి. ప్రస్తుతం టోల్‌ప్లాజాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 70 శాతం వాహనాలు ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ ఉన్నవి వస్తున్నాయి. మిగతా వాహనదారులంతా ఈ విధానంలోకి వస్తే జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాల వద్ద ఇబ్బంది ఉండదు. – పి.శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టరు, ఎన్హెచ్ఏఐ విశాఖ రీజియన్ -
ఏపీ సచివాలయానికి సంక్రాంతి సంబరాలు
-
ఏపీ సచివాలయంలో సంక్రాంతి సంబరాలు
సాక్షి, అమరావతి: సంక్రాంతి విశిష్టత తెలిపే రంగుల రంగుల రంగవల్లులు, హరిదాసుల సంకీర్తనలు, డూడూ బసవన్నల నృత్యాలు, కోలాటాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా గురువారం ఏపీ సచివాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంక్రాంతి వేడుకల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు.. సచివాలయానికి మరింత సంక్రాంతి శోభను తెచ్చాయి. ఈ ముగ్గుల పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఘనంగా సంబరాలు జరుపుకున్నామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. కొత్త ప్రభుత్వంలో కొత్త ఉత్సాహంతో ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా ఉద్యోగులంతా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి ముందుగానే వచ్చిందని.. ఉద్యోగులంతా చాలా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. -
ఏపీకి 84.. తెలంగాణకు 140
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కనీస నీటి మట్టాలకు ఎగువన అందుబాటులో ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 84, తెలంగాణకు 140 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. వరద వచ్చిన రోజుల్లో వినియోగించుకున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేసిన ప్రతిపాదనపై మరోసారి చర్చిద్దామని సూచించింది. బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్ (కార్యనిర్వాహక నియమావళి)ని కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని కృష్ణా బోర్డు చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. హైదరాబాద్‌లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా అధ్యక్షతన బోర్డు గురువారం సమావేశమైంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటిదాకా ఏపీ 511, తెలంగాణ 159 టీఎంసీలు వినియోగించుకున్నాయని బోర్డు సభ్య కార్యదర్శి ఎ. పరమేశం వివరించారు.. దీనిపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పందిస్తూ.. ఈ ఏడాది శ్రీశైలానికి కృష్ణా నది నుంచి ఎనిమిది దఫాలుగా భారీగా వరద ప్రవాహం రావడంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది 800 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశామన్నారు. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగించుకున్నామని.. వాటిని లెక్కలోకి తీసుకోవద్దని బోర్డుకు విఙ్ఞప్తి చేశారు. ఈ అంశంపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోలేమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. ఈ నెల 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉండే అవకాశం ఉందని.. అప్పుడు వారిరువురూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. -
ఫలించిన ఎంపీ విజయసాయి ప్రయత్నాలు
సాక్షి, విజయవాడ: పాకిస్తాన్ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్ల విడుదలకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ నెల 6న వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మొత్తం 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్ అప్పగించనుంది. మత్స్యకారుల జాబితాను పాక్ ప్రభుత్వం.. భారత విదేశాంగ శాఖకు పంపించింది. పొట్టకూటి కోసం గుజరాత్ వలస వెళ్ళిన ఆంధ్రా జాలర్లు 2018 డిసెంబర్లో పొరపాటున గుజరాత్ తీరం వద్ద పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ దృష్టికి ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు, బాధితులు తీసుకొచ్చారు. తక్షణమే విడుదలకు కృషి చేయాల్సిందిగా వైఎస్ జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి విదేశాంగ శాఖపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పలుమార్లు ఆయన లేఖలు రాశారు. విజయసాయి రెడ్డి లేఖతో కేంద్ర విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంది. దీంతో ఆంధ్ర జాలర్లను విడిచి పెట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. ►పాకిస్తాన్ విడుదల చేసిన ఆంధ్రా జాలర్ల జాబితా.. ఎస్.కిశోర్ , తండ్రి అప్పారావు నికరందాస్ ధనరాజ్, తండ్రి అప్పన్న గరమత్తి, తండ్రి రాముడు ఎం. రాంబాబు, తండ్రి సన్యాసిరావు ఎస్. అప్పారావు, తండ్రి రాములు జి. రామారావు, తండ్రి అప్పన్న బాడి అప్పన్న, తండ్రి అప్పారావు ఎం. గురువులు, తండ్రి సతియా నక్కా అప్పన్న, తండ్రి లక్ష్మయ్య నక్క నర్సింగ్, తండ్రి లక్ష్మణ్ వి. శామ్యూల్, తండ్రి కన్నాలు కె.ఎర్రయ్య, తండ్రి లక్ష్మణరావు డి. సురాయి నారాయణన్, తండ్రి అప్పలస్వామి కందా మణి, తండ్రి అప్పారావు కోరాడ వెంకటేష్, తండ్రి నరసింహులు శేరాడ కళ్యాణ్, తండ్రి అప్పారావు కేశం రాజు, తండ్రి అమ్మోరు భైరవుడు, తండ్రి కొర్లయ్య సన్యాసిరావు, తండ్రి మీసేను సుమంత్ తండ్రి ప్రదీప్ -
బందరు ఫిషింగ్ హార్బర్‌కు మహర్దశ!
సాక్షి, అమరావతి: బందరు ఫిషింగ్ హార్బర్‌కు మహర్దశ పట్టనుంది. గత కొన్నేళ్లుగా అలంకారప్రాయంగా మారిన హార్బర్ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. హార్బర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి రూ. 280 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. సముద్ర ముఖద్వారం వద్ద తరచూ ఇసుక మేటలు వేస్తుండటంతో అన్ని వేళల్లో మర పడవలు వేటకు వెళ్లే అవకాశాలు ఉండటం లేదు. కేవలం సముద్రానికి పోటు వచ్చిన సమయంలోనే వేటకు వెళ్లే వీలు ఉండటంతో నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకసారి మర పడవ ఒడ్డుకు వస్తే మళ్లీ సముద్రానికి పోటు వచ్చినప్పుడు మాత్రమే వేటకు వెళ్లే అవకాశం ఉంటోంది. ఇలా పోటు వచ్చినప్పుడే సముద్రంలోకి వెళ్లాలంటే కనీసం 12 గంటల పాటు నిర్వాహకులు ఒడ్డున నిరీక్షించాల్సి వస్తోంది. పదేళ్ల క్రితం గిలకలదిండిలో రూ.4.70 కోట్లతో నిర్మించిన హార్బర్‌తో నిర్వాహకులకు పెద్దగా లబ్ధి చేకూరడం లేదు నాడు సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపునకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు. ఇసుక మేటలు ఏర్పడే పరిస్థితులున్న హార్బర్ల వద్ద నిత్యం డ్రెడ్జింగ్ నిర్వహించాలని నిపుణులు సూచించినా.. ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇసుక మేటల సమస్య యథాతథంగానే ఉండటంతో మర పడవల నిర్వాహకులు బందరు ఫిషింగ్ హార్బర్ నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం హార్బర్లకు తరలివెళ్లిపోతున్నారు. హార్బర్లోని సమస్యలను బందరు ఎమ్మెల్యే, మంత్రి పేర్ని నాని, మరో మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాల కల్పన బందరు హార్బర్లో ప్రస్తుత పరిస్థితులు, హార్బర్ విస్తరణకు చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాల అంచనాలపై డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక) రూపొందించే బాధ్యతను వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వ్యాప్కోస్)కి అప్పగించారు. ఈ సంస్థ.. సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపుతోపాటు ఎగుమతి, దిగుమతి సౌకర్యాలు, పరిపాలనా భవనం, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, రేడియో కమ్యూనికేషన్ టవర్, బోట్ బిల్డింగ్, ఐస్ ప్లాంట్లు, దాదాపు 350 మర పడవలు లంగరు వేసుకోవడానికి అనువుగా కీవాల్ విస్తరణ, రక్షిత మంచినీటి సరఫరా, తదితర సౌకర్యాల కల్పనకు అంచనాలు రూపొందిస్తోంది. అన్ని అనుమతులు వచ్చాక హార్బర్ విస్తరణకు టెండర్లు ఆహ్వానించనున్నామని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. -
ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నారు. ఐసెట్‌ను ఏప్రిల్ 27, ఈసెట్ ఏప్రిల్ 30న, పీజీ ఈసెట్ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు. లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్ 9న నిర్వహించనున్నారు. ఏపీబీ ఆర్కిటెక్చర్ కోర్సుల కోసం నేరుగా అడ్మిషన్లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సురేష్ వెల్లడించారు. -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ ►హైదరాబాద్: నేడు బండ్లగూడలో సరస్వతి విద్యాపీఠం.. పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యుల ఆత్మీయ సమ్మేళనం హాజరుకానున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ►హైదరాబాద్: మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ కోర్ కమిటీ సమావేశం మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ ఆంధ్రప్రదేశ్ ►విశాఖపట్నం: నేటితో ముగియనున్న విశాఖ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యే అవకాశం జాతీయం ►నేడు జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం ►రాంచీ మొరాబాదీ గ్రౌండ్లో జేఎంఎం చీఫ్ హేమంత్ ప్రమాణం ►హేమంత్ సోరెన్‌తో పాటు ఇద్దరు మంత్రుల ప్రమాణ స్వీకారం ►హాజరుకానున్న రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, శరద్‌పవార్ ►సీఎంలు కమల్‌నాథ్, కేజ్రీవాల్,భూపేశ్,అశోక్ గెహ్లాట్, ఉద్ధవ్ ఠాక్రే ►జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, అర్జేడీ కూటమి విజయం భాగ్యనగరంలో నేడు ►డా. మర్రి చెన్నా రెడ్డి జయంతి వేడుకలు వేదిక : శిల్పాకళా వేదిక, హైటెక్ సిటీ సమయం : ఉదయం 11 గంటలకు ►అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా వేడుకలు వేదిక : రవీంద్ర భారతి సమయం : మధ్యాహ్నం 3 గంటలకు ►శ్రీ సరస్వతీ విద్యాపీఠం పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం వేదిక: శ్రీ శారదాధామం, బండ్లగూడ జాగీర్ సమయం : ఉదయం 9.30 గంటలకు ►జమాతే ఇస్లామీ హింద్ వేదిక: మీడియా ప్లస్, గన్‌ఫౌండ్రీ, అబిడ్స్ సమయం : మధ్యాహ్నం 1.30 గంటలకు ►ప్రముఖ కార్మిక నాయకులు టీఎస్.రామారావు 85వ పుట్టిన రోజు వేడుక వేదిక : భారతీయ విద్యాభవన్ ఆడిటోరియం, కింగ్‌కోఠి సమయం : సాయంత్రం 3.30 గంటలకు ►పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ వేదిక : లస్నం హౌస్, జూబ్లీహిల్స్ సమయం : ఉదయం 10. 00 గంటలకు ►బంజారా గిరిజన ఆత్మీయ సమ్మేళనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేదిక : శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ హాల్ సమయం : మధ్యాహ్నం 2.30 గంటలకు ►తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ సమావేశం వేదిక : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ! సమయం : ఉదయం 11 గంటలకు ►ఎల్డర్స్ ప్రైడ్ సెలబ్రేషన్స్ వేదిక : సన్‌షైన్ హాస్పిటల్, ప్యారడైజ్ సర్కిల్ సమయం : సాయంత్రం 5 గంటలకు ►సయ్యద్ షేక్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: రైయిన్‌బో ఆర్ట్ గ్యాలరీ, బేగంపేట సమయం : సాయంత్రం 5.30 గంటలకు ►ఆర్గానిక్ ఫెస్ట్ వేదిక : అడ్డగుట్ట సొసైటీ, కూకట్పల్లి సమయం : ఉదయం 10 గంటలకు ►పబ్లిక్ స్పీకింగ్ కమిటీ ఈవెంట్ వేదిక : ఎన్టీఆర్ గార్డెన్స్, సమయం : మధ్యాహ్నం 3.30 గంటలకు ►గోల్కొండ బగ్నాగర్ హైదరాబాద్ పుస్తకావిష్కరణ వేదిక : లామకాన్, బంజారాహిల్స్ సమయం : సాయంత్రం 4 గంటలకు ►బీహెచ్ఈఎల్ కాఫీ రైడ్ వేదిక : హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్, గచ్చిబౌలి, సమయం : ఉదయం 6 గంటలకు ►పెయింట్ ఎన్ ఎంజాయ్ వేదిక : లామకాన్, బంజారాహిల్స్ సమయం : ఉదయం 11 గంటలకు ►మధుబని పెయింటింగ్ వర్క్ షాప్ వేదిక : లామకాన్, బంజారాహిల్స్ సమయం : మధ్యాహ్నం 3 గంటలకు -
టీడీపీ పాలనలో విద్యుత్ రంగం నిర్వీర్యం
సాక్షి, విజయవాడ: గత టీడీపీ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పీపీఏ లు ద్వారా తక్కువ ధరకు సోలార్ పవర్ వస్తున్న అధిక మొత్తం లో కోట్ చేశారన్నారు. విద్యుత్ చార్జీల పెంపు లేదని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించడమే ధ్యేయం అని పేర్కొన్నారు. రైతులకు పగటి పూట 9 గంటలు విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం రూ.1700 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు రంగం 70వేల కోట్లు అప్పుల్లో ఉందని చెప్పారు. ఏపీసీపీడీఎల్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ఇంధన శాఖ సెక్రటరీ శ్రీకాంత్ తెలిపారు. పీపీఏలు తగ్గించుకుంటూ తక్కువ ధరకు విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► నేడు విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ►మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి విశాఖకు బయల్దేరనున్న సీఎం జగన్ ►మధ్యాహ్నం 3.50కి కైలాసగిరి వద్ద అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన ►సాయంత్రం 4.40కి వైఎస్సార్ సెంట్రల్ పార్క్ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన ►సాయంత్రం 5.30కి ఆర్కేబీచ్ వద్ద విశాఖ ఉత్సవ్ ప్రారంభించనున్న సీఎం జగన్ ►రాత్రి 7.40కి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్ తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్న టీటీడీ తెలంగాణ హైదరాబాద్: నేటితో ముగియనున్న రాష్ట్రపతి శీతాకాల విడిది మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ►నేడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గాంధీభవన్‌లో ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష ► ఉదయం 11.30 గంటలకు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ మున్సిపల్ ఎన్నికలపై చర్చించనున్న ఎన్నికల సంఘం జాతీయం ఢిల్లీ: నేడు ప్రభుత్వ బ్యాంకుల సీఈఓలతో నిర్మలా సీతారామన్ భేటీ ప్రభుత్వ బ్యాంకుల పనితీరు,ఆర్థిక స్థితిగతులపై చర్చ ఢిల్లీ: నేడు మేరికోమ్,నిఖత్ జరీన్ మధ్య బాక్సింగ్ ట్రయల్స్ ఫైనల్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించనున్న ఫైనల్ విజేత -
నేటి ముఖ్యాంశాలు..
►తెలంగాణ హైదరాబాద్: నేడు రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి కోవింద్‌కు గవర్నర్ విందు రాత్రి 8 గంటలకు విందు ఇవ్వనున్న గవర్నర్ తమిళిసై ఇండియన్ రెడ్‌క్రాస్ మొబైల్ యాప్ ఆవిష్కరించనున్న రాష్ట్రపతి ►ఆంధ్రప్రదేశ్ కర్నూలు: నేడు కర్నూలు జిల్లాలో గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ పర్యటన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్న గవర్నర్ ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించనున్నగవర్నర్ హరిచందన్ మధ్యాహ్నం కర్నూలులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్ ►జాతీయం న్యూఢిల్లీ: నేడు రాజ్‌ఘాట్ దగ్గర కాంగ్రెస్ సత్యాగ్రహం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా అసోం: డిబ్రూగఢ్‌లో నేడు కర్ఫ్యూ సడలింపు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరుకు కర్ఫ్యూ సడలింపు కటక్: నేడు భారత్-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే కటక్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచిన జట్లు భాగ్యనగరంలో నేడు.. ►ది సండే ఫ్యామిలీ బ్రంచ్ వేదిక– ది గోల్కొండ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు లమాకాన్ , బంజారాహిల్స్ ►పైథాన్ కోడింగ్ వర్క్‌షాప్ సమయం– ఉదయం 10–30 గంటలకు ►ట్రైల్స్ ఆఫ్ డీసెంట్ – బుక్ రిలీజ్ సమయం– సాయంత్రం 4 గంటలకు అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ►స్పానిష్ క్లాసెస్ ఉదయం 9 గంటలకు ►వీణ క్లాసెస్ మధ్యాహ్నం 3 గంటలకు ►పోయెట్రి క్లాసెస్ ఉదయం 10–30 గంటలకు ►క్రొచెట్ , ఎంబ్రాయిడరీ క్లాసెస్ ఉదయం 10 గంటలకు ►ఫ్రీ యోగా క్లాసెస్ ఉదయం 11 గంటలకు ►పెయింటింగ్ క్లాసెస్ మధ్యాహ్నం 1 గంటలకు ►చెస్ క్లాసెస్ ఉదయం 10 గంటలకు ►కార్డ్ మేకింగ్ వర్క్‌షాప్ మధ్యాహ్నం 3 గంటలకు ►మాయాబజార్ నాటక ప్రదర్శన వేదిక– పబ్లిక్ గార్డెన్, సురభి థియేటర్, సమయం–సాయంత్రం 6–30 గంటలకు ►క్రిస్మస్ వర్క్‌షాప్ వేదిక– రంగ్‌మంచ్, హిమాయత్ నగర్ సమయం– మధ్యాహ్నం 1 గంటకు ►సోలో ఆర్ట్ పెయింటింగ్ వర్క్‌షాప్ వేదిక– తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం– ఉదయం 10 గంటలకు ►పెయింటింగ్ వర్క్‌షాప్ వేదిక– ఫోనిక్స్ ఎరినా, హైటెక్‌సిటీ సమయం– సాయంత్రం 4 గంటలకు ►ఫుడ్ ఫెస్టివల్ వేదిక– మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్, కొండాపూర్ సమయం– సాయంత్రం 6 గంటలకు ►షిబొరి వర్క్‌షాప్ వేదిక– క్లోవర్క్, హైటెక్‌సిటీ సమయం– సాయంత్రం 4 గంటలకు ►డిజైనర్ ఎగ్జిబిషన్ వేదిక– తాజ్ కృష్ణ, బంజారాహిల్స్ సమయం– ఉదయం 9 గంటలకు ►బనారస్ శారీ ఎగ్జిబిషన్ వేదిక–సప్తపర్ణి,రోడ్‌నం.8,బంజారాహిల్స్ సమయం– ఉదయం 10 గంటలకు వేదిక– అలయన్స్ ఫ్రాంఛైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్ ►ఆర్ట్ ఎగ్జిబిషన్ సమయం– ఉదయం 9–30 గంటలకు ►లైవ్ ఆర్ట్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ సమయం– సాయంత్రం 4 గంటలకు ►సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక– కళాకృతి, రోడ్ నం.10, బంజారాహిల్స్ సమయం– సాయంత్రం 6–30 గంటలకు ►థాలి – ఫుడ్ ఫెస్ట్ వేదిక– నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, కొండాపూర్ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు ►పెట్ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్ వేదిక– హ్యాత్ హైదరాబాద్, గచ్చిబౌలి సమయం మధ్యాహ్నం 12–30 గంటలకు ►థాయ్‌లాండ్ టు చైనా ఫుడ్ ఫెస్టివల్ వేదిక– వివంట బై తాజ్, బేగంపేట్ సమయం: మధ్యాహ్నం12–30 గంటలకు ►కర్రసాము వర్క్‌షాప్ వేదిక– రవీంద్ర భారతి సమయం– మధ్యాహ్నం 2.30 గంటలకు ►వన్ టైమ్ పేమెంట్ – బుక్ ఎగ్జిబిషన్ వేదిక– మారుతి గార్డెన్స్, లఈక్డ కా పూల్ సమయం– ఉదయం 10 గంటలకు ►డిజైనర్ జ్యువెల్లరీ ఫెస్ట్ వేదిక– జోయాలుకాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పంజాగుట్ట సమయం– ఉదయం 11 గంటలకు ►డైమండ్ కార్నివల్ వేదిక– జోస్ ఆలుక్కాస్, పంజాగుట్ట సమయం– ఉదయం 11 గంటలకు ►వింటర్ షాపింగ్ ఎగ్జిబిషన్ సేల్ వేదిక– ప్రసాద్ మల్టీప్లెక్స్, సమయం– ఉదయం 10 గంటలకు ►ఈవెనింగ్ బఫెట్ వేదిక– లియోన్య హోలిస్టిక్ డెస్టినేషన్, శామిర్పేట్ సమయం– రాత్రి 7–30 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక– అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం– ఉదయం 10 గంటలకు -
రేషన్ అక్రమాలకు సర్కార్ చెక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రేషన్ బియ్యంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థ ద్వారా రేషన్ డిపోల్లో జరుగుతున్న అక్రమాలను చాలావరకు నియంత్రించింది. చనిపోయిన, కార్డుల నుంచి విడిపోయిన వారి బియ్యం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసింది. ఇప్పుడేకంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటోంది. రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా, మిల్లర్ల ద్వారా మళ్లీ ప్రభుత్వం రాకుండా నడుం బిగించింది. గతంలో అటు రేషన్ డిపో డీలర్లు, ఇటు మిల్లర్ల ద్వారా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పక్కదారి పట్టేది. దీనికంతటికీ గతంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు, డీలర్లు, మిల్లర్లు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కవడమే ప్రధాన కారణం. అవినీతికి తావు లేకుండా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. గత సెప్టెంబర్‌లో వలంటీర్ల ద్వారా సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. దీంతో గతంలో జరిగిన అక్రమాలన్నీ వరుసుగా వెలుగు చూస్తున్నాయి. గతంలో జరిగిన అక్రమాలివీ.. జిల్లాలో 18 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు 13,243 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. పచ్చి బియ్యం, దొడ్డు బియ్యం, నూకల శాతం ఎక్కువగా ఉండటం, నాణ్యతలేమి కారణంగా అధిక శాతం మంది లబి్ధదారులు వీటిని తినేందుకు ఇష్టపడలేదు. ఇదే అదునుగా రేషన్ మాఫియా కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి రైస్‌మిల్లుల్లో పాలిష్ పట్టించి అధిక ధరకు అమ్ముకుంటూ కోట్లు దండుకునేవారు. కొందరు డీలర్లు దళారుల అవతారమెత్తి కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొని రైస్‌మిల్లులకు అమ్ముకునేవారు. వాస్తవానికి ప్రభుత్వం ఈ బియ్యాన్ని కిలో రూ.30కిపైగా కొని, కార్డుదారులకు ఒక్క రూపాయికి అందజేసేది. ఈ బియ్యాన్నే తిరిగి రేషన్ డిపో డీలర్లు రూ.9 నుంచి రూ.10లకు కొనుగోలు చేసేవారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యం మిలర్ల వద్దకు కిలో రూ.15 నుంచి రూ.20 ధరతో చేరేవి. పాలిష్ అనంతరం ఇదే బియ్యాన్ని మాఫియా కిలో రూ.50 వరకు అమ్మి సొమ్ము చేసుకునేది. ఇక మిల్లర్లయితే ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి బదులు సీఎంఆర్‌గా ఈ రేషన్ బియ్యాన్నే తిరిగి అప్పగించే సంస్కృతి కొనసాగేది. దీనివల్ల ప్రభుత్వ నిధుల దురి్వనియోగం, డీలర్లు, మిల్లర్లకు సొమ్ము తెచ్చి పెట్టడం తప్ప ప్రయోజనం ఉండేది కాదు. వలంటీర్లతో కొంతమేర కట్టడి.. ఎప్పుడైతే ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్క క్లస్టర్‌కి 50 నుంచి 60 వరకు కుటుంబాలను కేటాయించి, వాటికొక వలంటీర్‌ను నియమించి, వారి ద్వారా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో అప్పటి నుంచి గత అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి. తొలుత బోగస్ కార్డుల బాగోతం గుట్టు రట్టయింది గతంలో 8,32,636 రేషన్‌కార్డులుంటే ఇప్పుడవి 8,16,412కు చేరాయి. అలాగే గతంలో 13,243 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా, ఇప్పుడది 12,335మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ లెక్కన 16,224 కార్డులు తగ్గి 908 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అయింది. దాదాపు 40 వేల యూనిట్లు కూడా తగ్గాయి. ఇవి కాక నవశకం సర్వేలో వేలాది బోగస్ కార్డులను గుర్తించినట్టు సమాచారం. ఫోర్టి ఫైడ్ రైస్‌తో మరింత అడ్డుకట్ట రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మర ఆడేందుకు ప్రభుత్వం మిల్లర్లకు పంపిస్తోంది. ఇలా ఇచ్చిన ధాన్యంలో 67 శాతం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ప్రభుత్వానికి మిల్లర్లు అందించాల్సి ఉంది. ఇక్కడే తేడా జరుగుతున్నది. ప్రభుత్వానికి ఇవ్వవల్సిన సీఎంఆర్‌లో ప్రజల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని మిక్స్ చేసి కొంతమంది మిల్లర్లు తిరిగి ఇచ్చేవారు. రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని మర ఆడించి బహిరంగ మార్కెట్‌కు విక్రయించేవారు. ఇప్పుడా పరిస్థితికి చెక్ పెట్టేందుకు.. మిల్లర్లకు ఏ ధాన్యమైతే ఇస్తున్నారో అదే రకమైన బియ్యాన్ని మళ్లీ సీఎంఆర్ కింద ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం షరతు పెట్టింది. దానికి తోడు ఇకపై పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో ‘బలవర్థకమైన బియ్యంతో పోలి ఉండే గింజలను కలిపిన బియ్యాన్ని’ కలపనుంది. ఇలా చేసి ఫోరి్టఫైడ్ రైస్‌ను ఇకపై వలంటీర్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేయనుండటంతో అవే బియ్యాన్ని ఒకవేళ ప్రజల నుంచి సేకరించి, సీఎంఆర్ కింద మిల్లర్లు ఇస్తే దొరికిపోతారు. ఫోరి్టఫైడ్ రైస్ వలన మిక్సింగ్ చేశారా.. లేదా అన్నది తేలిపోనుంది. నాణ్యమైన బియ్యం ప్యాకింగ్‌కు నరసన్నపేట, పొందూరులలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే రేషన్ బియ్యంలో ఫోరి్టఫైడ్ రైస్ మిక్సింగ్ చేయనున్నారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక చర్యలు రేషన్ బియ్యం ద్వారా జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా, సీఎంఆర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఏ రకం ధాన్యం ఇస్తే ఆ రకం పోలిన బియ్యం మిల్లర్లు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ప్యాకింగ్ యూనిట్లలో రేషన్ బియ్యంలో బలవర్థకమైన బియ్యంతో పోలి ఉండే గింజలను కలిపిన బియ్యాన్ని మిక్సింగ్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది. – కృష్ణారావు, డీఎం, పౌరసరఫరాల సంస్థ -
పంచాయతీలకు నిధులు ఫుల్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను పక్కదారి పట్టించడంతో కేంద్రం కన్నెర్ర చేసింది. మంజూరైన నిధులకు యూసీలు సమర్పించకపోవడంతో తదు పరి నిధుల మంజూరుకు బ్రేక్ వేసింది. దీంతో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులకు కూడా నిధుల కొరత ఏర్పడింది. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులలో 60 శాతం వేతన పనుల కింద, 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనుల కింద ఖర్చు పెట్టాలి. ఈ రకంగా చేయాల్సిన గత ప్రభుత్వం వచ్చిన ఉపాధి నిధులను నిబంధనలకు విరుద్ధంగా వేరే వాటికి వినియోగించడం వలన పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాని దుస్థితి చోటు చేసుకుంది. దీంతో 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనులకు నిధుల సమస్య ఏర్పడింది. దీంతో ఆ పనులు చేపట్టిన కొందరు కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని కొన్ని పనులు నిలిపివేయగా, మరికొందరు ఇష్టారీతిన, నాణ్యత లేకుండా పనులు చేపట్టి మమ అనిపించేశారు. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనులకు దాదాపు రూ.80 కోట్ల బకాయిలున్నట్టు సమాచారం కొత్త ప్రభుత్వంలో కదలిక.. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది, మిగిలిపోయిన మెటీరియల్ కాంపోనెంట్ పనులతో కలిపి కొత్త పనులు చేపట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన రూ.300 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులతోపాటు మరో రూ.700 కోట్ల పనులు (మొత్తం రూ.1000 కోట్ల) పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు, అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం వెలగపూడిలోని సచివాలయం 5వ బ్లాక్‌లో సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మూడు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని టార్గెట్ కూడా ఇచ్చారు. పంచాయతీలకు తగ్గిన భారం.. గతంలో మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టాలంటే నిర్దేశించిన అంచనా వ్యయంలో గ్రామ పంచాయతీలు మ్యాచింగ్ గ్రాంటుగా కొంత చెల్లించాల్సి వచ్చేది. 2 వేల జనాభా ఉన్న పంచాయతీలోనైతే 90 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు, 10 శాతం గ్రామ పంచాయతీలతో పనులు చేపట్టే పరిస్థితి ఉండేది. 2 వేల నుంచి 5 వేల జనాభా గల పంచాయతీల్లోనైతే 70 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు, 30 శాతం గ్రామ పంచాయతీలు భరించాల్సి ఉండేది. 5 వేల జనాభా దాటిన పంచాయతీల్లోనైతే 50 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు, 50 శాతం గ్రామ పంచాయతీలు తమ మ్యాచింగ్ గ్రాంటుగా సమకూర్చాల్సి ఉండేది. అంటే గ్రామ పంచాయతీల్లో మెటీరియల్ కాంపోనెంట్ పనులు జరగాలంటే పంచాయతీలు కొంత భారాన్ని మోయాల్సి ఉండేది. ఈ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండేది. అసలే నిధుల్లేక సతమతమవుతున్న పంచాయతీలకు ఇది అదనపు భారమయ్యేది. తమ వాటాగా ఇస్తేనే మెటీరియల్ కాంపోనెంట్ పనులు ఆయా పంచాయతీలకు దక్కేవి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పంచాయతీలపై భారం మోపకుండా కన్వర్జెన్సీ లేకుండా మొత్తం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతోనే పనులు చేపట్టుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో పంచాయతీలకు ఆర్థిక భారం తొలగినట్టయింది. -
మధ్యాహ్న భోజనం.. వెరీ ‘గుడ్డు’
సాక్షి, విశాఖపట్నం : మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్ల సరఫరాలో పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు మధ్యాహ్న భోజనంతోపాటు నాణ్యమైన కోడిగుడ్డు అందజేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలన్నింటినీ రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్ర వాతావరణంలో రుచిగా అందించడంతోపాటు నాణ్యతని పరిశీలించేందుకు శాస్త్రీయ పద్ధతులు అవలంబించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విమర్శలకు చెక్ చెప్పేందుకు యత్నం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ఇప్పటికీ అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చెయ్యడం లేదనీ, రుచిపచీ లేకుండా పిల్లలకు భోజనం పెడుతున్నారనీ, ఉడకని అన్నం, నీళ్ల చారు అందిస్తున్నారంటూ ఎక్కడో ఒక చోట నిత్యం ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతోపాటు అందించే గుడ్లు కూడా నాణ్యమైనవి కావనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ చెప్పేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించడంతోపాటు నిర్వాహకులకు డ్రెస్ కోడ్ ఉండాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీంతోపాటు నాణ్యతని పరిశీలించేందుకు మైక్రో స్కోప్‌లని వినియోగించాలని సూచించింది. తాజాగా భోజనంలో అందించే గుడ్లు కూడా నాణ్యమైనవి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీలకు మేలు జరిగేలా.. ఇప్పటిదాకా కోడిగుడ్ల టెండర్ల దాఖలు అర్హతలో రకరకాల నిబంధనలు ఉండేవి. బడా వ్యాపార వేత్తలు మాత్రమే టెండర్లలో పాల్గొనేవారు. నిజమైన పౌల్ట్రీ ఫాం నిర్వాహకులు, రైతులు టెండర్లలో పాల్గొనేందుకు వీలుండేది కాదు. ఈ ప్రక్రియలో అనేక లోపాలున్నాయని, రవాణా ఖర్చులు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత విధానంలో కొనుగోలు చేయడం ద్వారా ప్రతి కోడిగుడ్డుకు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. వీటన్నింటినీ పరిశీలించిన ముఖ్యమంత్రి లోపభూయిష్టమైన అంశాలను సవరించి సన్నకారు రైతులు కూడా కోడిగుడ్ల సరఫరాలో పాల్గొనే విధంగా చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో రైతుల నుంచే కోడిగుడ్లు సరఫరా చేస్తున్నామని డీఈవో లింగేశ్వరరెడ్డి తెలిపారు. ప్రభుత్వం తాజాగా కోడిగుడ్ల సరఫరాలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ నుంచి వెలువడే ఉత్తర్వులు మేరకే తదుపరి కార్యచరణ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యా డివిజన్ యూనిట్‌గా టెండర్లు జిల్లాలో 5,397 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1 నుంచి పదో తరగతి వరకూ 6,48,162 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మంచి భోజనం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారానికోసారి స్కూళ్లకు గుడ్లు సరఫరా చేయాలనే నిబంధన దాదాపు ఎక్కడా అమలు కావడం లేదనే విమర్శలు ఎదురవుతున్నాయి. అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. కోడిగుడ్ల సరఫరాపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సైజు, నాణ్యత, సరఫరాపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా యూనిట్‌గా కాకుండా విద్యా డివిజన్ యూనిట్‌గా టెండర్లు అప్పగించేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సరఫరా చేస్తున్న గుడ్డు కనీసం 50 గ్రాముల బరువు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఏజెన్సీల ఎంపికలో రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లా యూనిట్‌గా కాకుండా డివిజన్ యూనిట్‌గా ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో నాలుగు (విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు) విద్యా డివిజన్లు ఉన్నాయి. ఇందుకోసం డివిజన్‌కో టెండర్ ప్రొక్యూర్మెంట్ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీకి జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఐసీడీఎస్ నుంచి ఒకరు, డిప్యూటీ డీఈఓ, ఒక ఎంఈఓ, హెచ్ఎం (ఆయా డివిజన్లలో డీఈఓ నియమిస్తారు), రవాణా శాఖ నుంచి ఒకరు (జేసీ నియమిస్తారు) సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏజెన్సీలను ఖరారు చేయనుంది. అయితే ఏజెన్సీలకు అర్హత, ఇతర విధివిధానాలు రావాల్సి ఉంది. -
చెప్పేటందుకే నీతులు..
వారు మాత్రం తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివిస్తారట... ఎదుటివారికి మాత్రం దానిని అందనివ్వరట... అందుకే సర్కారు బడుల్లో ఆ మీడియం వద్దంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారు. నిరుపేదలకు ఆ మీడియం దూరం చేయాలన్నదే వారి లక్ష్యం. అందుకే తెలుగుపై తమకే వల్లమాలిన ప్రేమ ఉన్నట్టు... సర్కారు దానిని కనుమరుగు చేసేస్తున్నట్టు తెగ బాధపడిపోతున్నారు. ఇదీ తెలుగుదేశం నేతల తీరు. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో దానిపై లేనిపోని అడ్డంకులు సృష్టిస్తున్న టీడీపీ తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు తన ఇద్దరు కుమార్తెలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విద్యావతీదేవిలను ఇంగ్లిష్ మీడియంలోనే హైదరాబాద్‌లోని విద్యారణ్య ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించారు. అదితి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అశోక్ కూ డా ఇంగ్లిష్ మీడియంలోనే గ్యాలియర్‌లో చదివారు. తెలుగు పలకడానికి కూడా వీరు ఇబ్బంది పడుతుంటారు. సాక్షి, ప్రతినిధి విజయనగరం: ప్రతి ఒక్కరికీ తమ పిల్లలపై బోలెడు ఆశలుంటాయి. వారు ఉన్నతంగా ఎదగాలనీ... తమకు ఆసరాగా నిలవాలనీ... జీవితంలో ఏ మాత్రం వారు కష్టపడకూడదని ఆకాంక్షిస్తారు. దీనికి నిరుపేదలేమీ మినహాయింపు లేదు. ముఖ్యంగా వారిలోనే ఎక్కువ ఉబలాటం ఉంటుంది. అందుకోసమే తమ పిల్లలను కాన్వెంట్లలో, కార్పొరేట్ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు చెల్లించి చదివించడానికి అప్పులు చేస్తూ కష్టపడుతున్నారు. ఇంకా నిరుపేదలైతే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు. అలా చదివిన వారు ఆంగ్లం విషయంలో కార్పొరేట్ విద్యార్థులతో పోటీపడలేకపోతున్నారు. మల్టీ నేషన్ కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్లినపుడు, పోటీ పరీక్షలకు హాజరైనప్పుడు ఇంగ్లిష్తో ఇబ్బంది పడుతున్నారు. వారి కష్టాన్ని చూసి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్య మం తీసుకువస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ దీని కి మతాన్ని ముడిపెట్టి ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వారికి మరో పార్టీ నాయకులు వంతపాడుతున్నారు. అసలు వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ఆరా తీస్తే జిల్లాలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేల కుమారులు, కుమార్తెలు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారనే విషయం బయటపడింది. విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లోని కార్పొరేట్ స్కూళ్లలో టీడీపీ నేతల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీల పిల్లలది ఇంగ్లిష్ మీడియమే టీడీపీ మాజీ రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు తన కుమారుడు విశాలకృష్ణ రంగారావు, కుమార్తె కృతీ గోపాల్‌ను విశాఖపట్నంలోని ఓక్రిడ్జ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించారు. సుజయ్ కూడా తెలుగు మీడియంలో చదవలేదు. టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తన కుమార్తె ప్రణతిని, కుమారుడు పృథీ్వని సాలూరులోని లయన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించారు. టీడీపీ సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజ్‌దేవ్ కుమారుడు బ్రీజేష్‌కుమార్ కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు కుమార్తె దీక్షిత, కుమారుడు వంశీ విజయనగరంలోని సెంట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లోనే చదివారు. శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కవల కుమార్తెలు అని్వతానాయుడు, అమితానాయుడు కొత్తవలసలోని జిందాల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివారు. ప్రస్తుతం విశాఖలో చైతన్య కళాశాలలో చదువుతున్నారు. మీసాల గీత కుమారుడు కిరీటి విజయనగరం భాష్యం స్కూల్లో, కుమార్తె సువర్ణ బొబ్బిలి అభ్యుదయ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివారు. చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని తన కుమారుడు కిమిడి నాగార్జునను శ్రీకాకుళంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో విద్యాభ్యాసం చేయించారు. వీరి పోరాటం ఎవరికోసం? తమ పిల్లలను ఎంచక్కా ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్న టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని, మాతృ భాషను మంట గలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు వీరి పోరాటం ఎవరికోసమన్న చర్చకూ దారితీస్తోంది. తమ పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని ఎంబీబీఎస్, పీజీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులకు పంపిస్తూ... సామాన్యుల పిల్లలు చదువుకునే పాఠశాలల్లో మాత్రం ఇంకా తెలుగు మీ డియంనే కొనసాగించాలని కోరుకోవడం ఏమి టన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తోంది. -
నాయకులకేనా ఇంగ్లిష్ చదువులు..
వీధి బడి ఏళ్లుగా తల వంచుకునే బతికేస్తోంది. ప్రైవేటు స్కూళ్ల వేగం అందుకోలేక కన్నీరు పెడుతూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి కూడా అంతే. ఇంటర్వ్యూలలో, గ్రూప్ డిస్కషన్లలో, పోటీ పరీక్షల సమయంలో ‘కార్పొరేట్’ పిల్లలతో పోటీ పడలేక చతికిలపడుతూనే ఉన్నారు. ఎంత మేధస్సు ఉన్నా ఆంగ్లంలో సంభాషించలేక అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇన్నాళ్లకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్ బోధించాలని సర్కారు సంకలి్పంచింది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి ఊహించని ఎదురుదాడి కనిపిస్తోంది. వాస్తవానికి విమర్శించే వారి పిల్లలంతా ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతుండడం గమనార్హం. ఇంటిలో పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ సామాన్యుల పిల్లల విషయంలో మాత్రం కొత్త భాష్యాలు పలుకుతున్నారు. వీరి ద్వంద్వ నీతి రాజకీయాలపై జనంలో అసహనం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటారు. వారు జీవి తంలో స్థిరపడాలని కలలు కంటారు. దాని కోసం కష్టనష్టాలను భరించి పిల్లల్ని చదివిస్తుంటారు. స్థోమత ఉన్నోళ్లు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తుండగా, పేదవారు సర్కారు బడుల్లో చదువుతున్నారు. కాకపోతే మాధ్యమం సమస్యతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెట్టుకురాలేకపోతున్నారు. కంప్యూటర్ యు గంలో ఇంగ్లిష్ రాకపోతే ఉపాధి, ఉన్నతి రెండూ లేవన్నది జగమెరిగిన సత్యం. ఎక్కడకు వెళ్లి రాణించాలన్నా ఇంగ్లిష్ లో ప్రావీణ్యం తప్పనిసరిగా మారుతోంది. ఇంతటి ప్రాధాన్యత గల విద్యను నాణ్యతతో పేదలందరికీ ఉచితంగా అందించేందుకు సర్కార్ సంకల్పిస్తుంటే ప్రతిపక్ష నాయకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అభ్యుదయవాదులు, విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే అపోజిషన్ లీడర్లు మాత్రం అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఓ వైపు వ్యతిరేకిస్తూనే తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. నాయకులు ప్రదర్శిస్తున్న ద్వంద్వ నీతి జనాలకు తెలిసి ఛీ కొడుతున్నారు. నిగ్గుదీయండి.. పోటీ ప్రపంచంలో ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకత ఎక్కువైంది. ఉన్నత అవకాశాలను పొందాలంటే ఆంగ్లం తప్పనిసరి. దాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంలో తమ పిల్లల్ని చదివించుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ స్థోమత లేక ఆలోచన దగ్గరే ఆగిపోతున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల వరకు కాస్తో కూస్తో నెట్టుకొస్తున్నా ఇంటర్వ్యూలకొచ్చే సరికి కమ్యూనికేషన్ స్కిల్స్ లోపంతో విఫలమవుతున్నారు. దగ్గరగా వచ్చి ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పేదవాళ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్కారు ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంలో బోధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెలువడినప్పటి నుంచి టీడీపీ, జనసేన నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కానీ అచ్చె న్న వంటి వారంతా పిల్లలను మాత్రం ఎంచక్కా కార్పొరేట్ స్కూళ్లలో, ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్నారు. దీనిపై ప్రజలే నాయకులను నిగ్గదీసి అడగాలని అభ్యుదయవాదులు చెబుతున్నారు. టీడీపీ నేతల పిల్లలు చదువుతున్నదిక్కడే.. ►ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాల్యం నుంచి బీడీఎస్ పూర్తి అయ్యేవరకు ఇంగ్లిష్ మీడియం లోనే చదువుకున్నారు. ఆయన ఇద్దరు చెల్లెళ్లు కూడా ఆయనతో పాటుగానే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదువులు సాగించారు. ►మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పిల్లలు నీలి మ, రేష్మ శ్రీకాకుళంలోని సెయింట్ జోసఫ్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. ►టీడీపీ నేత కోండ్రు మురళీమోహన్‌కు ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. అక్కడే పిల్లల చదువులు కోసం ఉంటూ రా జాం తాత్కాలికంగా వస్తుంటారు. ఇటీవల ఆయన ఓ కార్పొరేట్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌ను రణస్థలం హైవే పక్కన పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కూడా. ►టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతి కుమారుడు నానిబాబు, కుమార్తె గ్రీష్మాప్రసాద్ విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఇంగ్లీషు మీడియంలో చదివారు. నానిబాబు పిల్లలు కూడా ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నారు. ►మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమార్తె హారిక, కుమారుడు కె.సాగర్, ఇంగ్లిష్ మీడియంలోనే చదివించారు. వారిద్దరూ గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీలో చదివారు. ►టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ కుమారుడు అవినాష్ శ్రీకాకుళంలోని న్యూ సెంట్రల్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. కుమార్తె చైతన్య కూడా అదే స్కూల్లో చదివారు. ►మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఇద్దరు పిల్లలు శివగంగాధర్, విశ్వనాథం ఇంగ్లిష్ మీడియంలోనే చదివారు. ►మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇద్దరు పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువు సాగించారు. ►మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఇద్దరు కుమార్తెలు ఇంగ్లిష్ మీడియంలోనే చదివారు. ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష కూడా ఇంగ్లిష్ మీడియంలోనే విద్యాభ్యాసం చేశారు. వారి ఇద్దరు పిల్లలు విశాఖలో ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. జనసేన నేతల పిల్లలు.. ►మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసిన మెట్ట రామారావు తన ఇద్దరు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించారు. కుమారుడు కళ్యాణ్‌కృష్ణను న్యూఢిల్లీలో ఇంజినీరింగ్ చదివించగా, కుమార్తె వైష్ణవిని ఢిల్లీలోనే ఇంటర్ చదివించారు. ►పలాసలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోత పూర్ణచంద్రరావు కూడా తన కుమార్తెను కాశీబుగ్గ లిటిల్ ఏంజిల్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం చదివించారు. ►శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోరాడ సర్వేశ్వరరావు కూడా తన కుమారుడ్ని హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు. ►ఆమదాలవలసలో పోటీ చేసిన పేడాడ రామమోహన్ తన కుమారుడు చైతన్యస్వా మిని శ్రీకాకుళంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు. ►ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాదాన వెంకట జనార్దనరావు తన ఇద్దరు కుమార్తెలు చాందిని, జాహ్నవిలను శ్రీకాకుళంలోని శ్రీచైతన్యలో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. ►రాజాం నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన మచ్చా శ్రీనివాసరావు తన ఇద్దరు పిల్లల్ని విశాఖపట్నంలో ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. -
ఆ ‘దిశ’గా అతివకు అండగా...
సాక్షి, విశాఖపట్నం, అల్లిపురం(విశాఖ దక్షిణం): మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ఉద్ధేశించిన చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా బిల్లు చట్టంగా మారితే..అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మరణశిక్ష విధిస్తారు. అత్యాచారాన్ని నిర్ధారించే ఆధారాలు లభ్యమైతే కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు తీసుకువస్తున్నారు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, మరో 14 రోజుల్లో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. అత్యాచారం, సామూ హిక అత్యాచారం, యాసిడ్ దాడు లు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి నేరాలకు విచారణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కో ర్టులు ఏర్పాటు చేయా లని మంత్రి వర్గం తీర్మానించింది. మహిళా భద్ర తపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. పోక్సో చట్టం... 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లపై అత్యాచారం, అత్యాచారానికి యత్నించడం, నగ్నంగా చిత్రీకరించడం లాంటి వాటికి పాల్పడితే వారికి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. లైంగిక దాడి చేసినా.. నగ్నంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఖైదు తప్పదు. ఒక్కోసారి జీవితఖైదు కూడా విధించవచ్చు. అక్రమ రవాణా నిరోధక చట్టం.. బాలికలు, యువతులను అక్రమంగా రవాణా చేయడం, మాయమాటలు చెప్పి.. ఆశచూపి వారిని వ్యభిచార గృహాలకు అమ్మేయడం, బలవంతంగా వ్యభిచారం చేయించడం వంటివి నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకు రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టీ ఒక్కోసారి ఏడేళ్ల నుంచి జీవితఖైదు కూడా పడే అవకాశం ఉంది. బాల్య వివాహాల నిషేధ చట్టం... 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేయాలని చూడడం చట్టరీత్యానేరం. బాల్య వివాహాలు చేయాలని ప్రయతి్నంచిన వారికి రెండు ఏళ్ల జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. నిర్భయ చట్టం.. ►మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారికి ఏడేళ్ల పాటు జైలుశిక్ష లేదా.. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. శిక్ష అనుభవించి బయటకు వచ్చిన అనంతరం మరోసారి అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష తప్పదు. ►మహిళలను లైంగికంగా వేధించడం, వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించిన వారికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ►సామూహికంగా లైంగికదాడికి పాల్పడిన వారికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష, మరోసారి అదేపని చేస్తే వారికి ఉరిశిక్ష తప్పదు. ►యాసిడ్ దాడికి పాల్పడిన వారికి పదేళ్ల జైలుశిక్ష, యాసిడ్ దాడికి ప్రయతి్నంచిన, బెదిరించిన వారికి ఐదేళ్ల పాటు ఖైదు తప్పదు. ► పనిచేసే ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా తాకడం, వేధించడం చేస్తే మూడేళ్ల పాటు జైలుశిక్ష, మహిళను వివస్త్రను చేసి వేధిస్తే మూడేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. గృహహింస చట్టం.. భార్యను భౌతికంగా, లైంగికంగా, మానసికంగా, ఆర్థికంగా హింసిస్తే గరిష్టంగా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. మద్యం తాగి భార్యను కొట్టడం, హింసించడం, వరకట్నం కోసం వేధించడం, చిత్రహింసలు పెట్టడం, ఇళ్లలో నిర్భంధించి కొట్టడంతో పాటు, భర్త, అతని తల్లి, తండ్రి, బంధువులు కుటుంబసభ్యులు ఎవరైనా గృహహింసకు పాల్పడితే వారికి ఈ చట్టం కింద 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తారు. సైబర్‌మిత్ర... వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో మహిళలు, యువతులను కొందరు ఆకతాయిలు వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు. వారి ఫొటోలను మారి్ఫంగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ సైబర్ మిత్రను అందుబాటులోకి తీసుకువచ్చింది. తమ సమస్యలను తెలియజేసేందుకు సైబర్ మిత్ర ఫోన్ నంబరు 91212 11100కు వాట్సప్ చేయవచ్చు. లొకేషన్ షేర్ చేయడం ద్వారా తాము ఆపదలో ఉన్నామని పోలీసులకు తెలియజేసి వెంటనే సాయం పొందవచ్చు. ఈ నెంబరు 24 గంటలూ పనిచేస్తుంది. డయల్ 182.. మహిళలు, ఒంటరిగా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా వేధింపులకు గురిచేసినా, ఆపదలో చిక్కుకున్న సందర్భాల్లో 182 నంబర్‌కు ఫోన్ చేయాలి. ఆ కాల్ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే రక్షకదళం(ఆర్పీఎఫ్) కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. బాధితులు అందించిన వివరాల ఆధారంగా ఆ రైల్లో ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే బోగీలోకి చేరుకుని సాయం అందిస్తారు. డయల్ 112 ఆపదలోవున్న మహిళల కోసం కేంద్రహోంశాఖ 112 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బాధితులు దేశంలో ఎక్కడినుంచైనా ఈ నంబర్‌కు కాల్ చేసి సమస్యను తెలియజేస్తే ఏ రాష్ట్రం నుంచి కాల్ వచ్చిందో ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్‌రూమ్‌కు విషయాన్ని తెలియజేస్తారు. అక్కడి సిబ్బంది వెంటనే సంబంధిత పోలీసులను అప్రమత్తం చేసి బాధితులకు సాయం అందిస్తారు. అవసరమైతే గస్తీ వాహనాలను సంఘటనాస్థలానికి పంపుతారు. ఈ ప్రక్రియ అంతా నిమిషాల వ్యవధిలోనే జరుగుతుంది. డయల్ 100 రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా 100 నంబర్‌కు డయల్ చేస్తే అది పోలీసు కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. ఫోన్ చేసిన వారు తామెదుర్కొంటున్న సమస్యను వివరిస్తే చాలు.. సిబ్బంది అప్రమత్తమవుతారు. సంబంధిత ప్రాంతంలోని పోలీసులకు సమాచారం అందిస్తారు. అలాగే గస్తీ వాహనాలను కూడా అప్రమత్తం చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో 4 నుంచి 6 నిమిషాలలోపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుంటారు. జీపీఎస్ లోకేషన్ ఆధారంగా బాధితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కాపాడతారు. అవసరమైతే ఘటనా స్థలానికి చేరుకునేంత వరకు పోలీసులు బాధితులతో ఫోన్లో మాట్లాడుతూ సూచనలు, సలహాలు ఇస్తూ ధైర్యం చెబుతారు. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలి. సంపూర్ణ రక్షణ దిశగా... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీలో మహిళల భద్రతకు చేపడుతున్న చర్యలు దేశ చరిత్రలో ప్రథమంగా నిలుస్తాయి. దిశ చట్టం ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆనందదాయకం. ఈ చట్టం రాష్ట్రంలో మహిళలకు రక్షణ చట్రంగా మారుతుంది. సంపూర్ణ రక్షణకు దోహదపడుతుంది. మన రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం ప్రభుత్వం స్పందించిన తీరు ఆదర్శనీయం. అలాగే సోషల్‌మీడియాలో మహిళలను కించపరిచినా.. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం శుభపరిణామం. – చెట్టి పాల్గుణ, అరకు ఎమ్మెల్యే నిజమైన మహిళా రక్షకుడు... మహిళల రక్షణ కోసం చర్యలు చేపట్టి సీఎం జగన్మోహన్రెడ్డి దేశ చరిత్రలోనే మహిళా రక్షకుడిగా నిలిచారు. అసెంబ్లీలో మహిళా భద్రతకు సంబంధించిన బిల్లుకు∙ కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు, పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయం. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటనతో సీఎం జగన్ తీవ్రంగా కలత చెందారు. ఏపీలో మహిళల రక్షణకు దిశ చట్టంను తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇది శుభ పరిణామం. దిశ చట్టం మహిళలకు కొండంత రక్షణగా నిలుస్తుంది. విచారణ పేరుతో సాగదీత ఉండదు. కేవలం 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చట్టం రూపొందించాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరుగుతుంది. మహిళలు స్వేచ్ఛగా జీవించడం కోసం సీఎం కీలక నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం. చాలా సంతోషంగా ఉంది. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి , పాడేరు ఎమ్మెల్యే చట్టాలు తెలుసుకోండి... ప్రభుత్వం తాజా నిర్ణయం అభినందనీయం. చిన్నారులు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు చేయాలంటే మృగాళ్ల గుండెల్లో వణకు పుట్టాలి. జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు తప్పు చేసిన వారికి త్వరగా శిక్ష పడుతుంది. నేరాలు తగ్గుతాయి. మహిళలందరూ చట్టాలను తెలుసుకోవాలి. మహిళలు క్లిష్ట పరిస్థితుల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ఆపదని తెలిస్తే పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్‌చేయాలి. –ప్రేమ్‌కాజల్, ఏసీపీ, ఉమెన్ పోలీస్ స్టేషన్ -
విద్యుత్ ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత
సాక్షి, అమరావతి: విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. విద్యుత్‌పై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చే పరిస్థితిలో ఉందని, పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిజనిజాలపై పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలుపై గత ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్‌పై ఒక కమిటీ వేసిందని.. ఆ నివేదిక రాగానే అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. పద్ధతి ప్రకారం జరగాలంటే సమయం పడుతుందని వివరించారు. పవన్ విద్యుత్, సౌర విద్యుత్ వాడకం మంచిదేనని.. పెట్రోలు,డీజీల్ నిల్వలు వాడకం మంచిది కాదన్నారు. పీపీఏల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. కేబినెట్ సబ్‌కమిటీ పర్యవేక్షిస్తుంటే.. టీడీపీకి ఆతృత ఎందుకని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఏ దోపిడీ చేసినా మేం ఊరుకుంటే వాళ్లకు సంతోషమని, వాస్తవాలు చెబితే టీడీపీ పట్టించుకోదని విమర్శించారు. 2014-15లో డిస్కమ్‌ల నష్టాలు రూ.9వేల కోట్లు అని, 2018-19లో ఆ నష్టాలు రూ.29 వేల కోట్లకు చేరాయన్నారు. గత ఐదేళ్లలో డిస్కమ్‌లను రూ.20 వేల కోట్ల నష్టాల్లో పడేశారన్నారు. ఎక్కువ రేట్లకు ఇచ్చిన వాటిపై మరోసారి ఆలోచించాలని కోరితే గొడవ చేస్తున్నారన్నారు. అవినీతి జరిగితే చర్యలు తీసుకోమని కేంద్రం కూడా చెప్పిందని వివరించారు. విద్యుత్ కోసం రైతులు ఇబ్బందులు పడకూడదనే సీఎం జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని బుగ్గన పేర్కొన్నారు. -
‘వాటిపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు’
సాక్షి, అమరావతి: ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదని మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారని.. ఈ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చి పుచ్చుకోవడం టీడీపీకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదన్నారు. పార్టీలే కాదు, బీ ఫారాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారన్నారు. 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ ఒక్కరేనని తెలిపారు. ఢిల్లీ, గుంటూరులో దీక్షలు చేశారని, ధర్నాలు, యువభేరీ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. పార్టీ ఎంపీల చేత కూడా వైఎస్ జగన్ రాజీనామాలు కూడా చేయించారన్నారు. వైఎస్సార్సీసీ ఎంపీలు కన్నా.. టీడీపీ ఎంపీలు అప్పట్లో ఎక్కువ మంది ఉన్నారని, కాని చీమ కుట్టినట్టుకూడా వారికి అప్పుడు లేదన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే బెటరని అప్పట్లో బల్ల గుద్దినట్టు చంద్రబాబు చెప్పారన్నారు. అప్పట్లో ఆర్థిక మంత్రికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచుకున్న చరిత్ర వారిదని.. ఇప్పుడు అదే వ్యక్తులు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. అలా చేయకపోతే కేంద్రం ఆలోచించేంది.. ఆరోజు నుంచి నేటి వరకూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా కావాలంటూ మడమ తిప్పకుండా మాట్లాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత రాత్రికి రాత్రి యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసి, ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా సరిపెట్టుకుంటారన్న ఒక మైండ్‌సెట్‌ని క్రియేట్ చేసింది చంద్రబాబేనన్నారు. అలా చేయకపోతే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఉండేదన్నారు. ‘షీలా బీడే కమిటీ ఈ జనవరితో అయిపోయింది. వాళ్లు 89 రికమెండేషన్లు ఇస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక 68 రికమెండేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. మేం అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఏ అభ్యంతరాలు పెట్టకుండా 68 సిఫార్సులకు సానుకూలత తెలిపింది. కాని ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది. రాజకీయం చేసింది. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన తర్వాత పారిపోయి ఈ రాష్ట్రానికి వచ్చేశారు. హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని అయితే... కట్టుబట్టలతో పారిపోయి వచ్చారని’ కన్నబాబు దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు బాధపడే పరిస్థితి ఏర్పడిందని.. చేసిందంతా చేసి ఇవాళ నీతి కథలు, పిట్ట కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు నాడు అలా..నేడు ఇలా... టీడీపీకి ప్రత్యేక హోదాపైన, విభజన హామీలపైన మాట్లాడే హక్కులేదని.. ఐదేళ్ల పాటు ఏమీ చేయకపోగా, ఆరునెలల్లో ఏదో జరిగిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే ఫలితం ఉండేదని, కాని అలా చేయకుండా మోదీ అన్యాయం చేశారని ఎన్నికల ముందు మాట్లాడి, ఇప్పుడు మళ్లీ మోదీతో జతకట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించి మళ్లీ ఇక్కడ మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో వారికే తెలియాలి.. ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి, ఆస్తుల పంపిణీ గురించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ ఇచ్చిన భవనాల్లో ఏదీ కూడా విభజన చట్టంలోని పరిధిలోనిది కాదని.. విభజన చట్టంలో భవనాల్లోని ఒక్క గదిని కూడా అప్పగించలేదని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా... విభజన చట్టంలోని భవనాలను ఆక్రమిస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. అక్కడ సచివాలయంలో భవనాలు ఎందుకు వృథాగా పడి ఉన్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం అభివృద్ది చేసిన దాన్ని కూడా విడిచిపెట్టారని.. ఇప్పుడు అక్కడ ఉండకపోయినా, బూజు పట్టినా.. కరెంటు బిల్లుల రూపేణా కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్లపాటు వాళ్లు చేసిన నిర్వాకానికి మరో ఐదేళ్ల పాటు కష్టపడితే తప్ప తీరని విధంగా సమస్యలు సృష్టించారన్నారు. మనకు కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం ఆక్యుపై చేసినా.. అడగలేకపోయారని.. కారణం ఓటుకు నోటు కేసులో అప్పటి ముఖ్యమంత్రికి ఉన్న బలహీనత అని తెలిపారు. ఢిల్లీతో సంబంధాల విషయంలో ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో టీడీపీ వాళ్లకే తెలియాలని ఎద్దేవా చేశారు. -
శ్రీజకు ప్రభుత్వం అండ
రేగిడి: రేగిడి ఆమదాలవలస మండలం నాయిరాల వలస గ్రామానికి చెందిన తలసేమియా బాధితురాలు కొవ్వాడ శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది. ఈ నెల 6వ తేదీన సాక్షి దిన పత్రికలో ‘చిన్నారి ప్రాణానికి ఆపద’ అనే శీర్షికపై వెలువడిన కథనానికి దాతలతోపాటు ప్రభుత్వం నుంచి కూడా స్పందన లభించింది. సీఎం కార్యాలయం నుంచి శ్రీజ తల్లి జ్యో తితో ఫోన్లో మాట్లాడారు. శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పారని జ్యోతి ఆదివారం ‘సాక్షి’కి వెల్లడించారు. కుమార్తె అనారోగ్య స్థితిని, మెడికల్ సరి్టఫికెట్లను సీఎం కార్యాలయానికి పంపించామని ఆమె తెలిపారు. జిల్లాలోనూ చాలా మంది మానవతావాదులు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, సాయం కూడా చేశారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
పేదల కోసం భూసేకరణ
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉగాది పండగ నాటికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం పెద్ద మొత్తంలో భూ సేకరణ చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఇళ్లు లేని పేదలందరికీ స్థలాలు అందివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకలి్పంచారు. ఈ విషయంపై అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉగాది నాటికి జిల్లాలో మూడు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న లక్ష్యంతో రెవెన్యూ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు భూములు సేకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా మొత్తం మీద 800 ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించాలన్న ఆలోచనతో అధికార యంత్రాంగం ఉంది. సబ్ రిజి్రస్టార్ విలువ(ఎస్ఆర్) ప్రకారం మూడు రెట్ల అదనపు ధరతో జిరాయితీ భూములు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా భూ సేకరణ ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత మేర స్థలం అవసరమన్న దానిపై యంత్రాంగం అంచనా వేస్తోంది. జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్బన్ పరిధిలో ఉండే నాలుగు మండలాలు మినహా.. మిగిలిన 11 మండలాల్లో వివరాలు సేకరిస్తున్నారు. అరకు, పాడేరు మండలాల్లో అక్కడ గిరిజనులకు ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన 9 మండలాల్లో అసలు ప్రభుత్వ స్థలాలు ఎంత మొత్తంలో ఉన్నాయి, ప్రైవేటు భూములు ఎంత మేర సేకరించాలి, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాల పరిస్థితిపై సర్వే చేసి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వినయ్‌చంద్ ఇటీవల తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో శివారు కొండలు, గుట్టలు, పోరంబోకు స్థలాలు ఎంత మేర ఉన్నాయన్న దానిపై రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. 3 లక్షల మందికి పట్టాల పంపిణీ ఉగాది నాటికి మూడు లక్షల మంది పేదలకు పట్టాలు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో అనువైన భూములను గుర్తించేందుకు తహసీల్దార్లు స్వీయ పర్యవేక్షణలో రెవెన్యూ బృందాలు రంగంలోకి దిగాయి. వీటిని ఆర్డీవోలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భూములు అందుబాటులో ఉన్నా.. అవి గ్రామాలకు శివారులోనూ, కొండలు, గెడ్డలు, గుట్టలకు అనుకుని ఉన్నాయి. ఇక అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, విశాఖ రెవెన్యూ డివిజన్లలో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు ఉన్నారు. ఇళ్ల స్థలాలు కేటాయింపులో స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దరఖాస్తులను విచారణ చేసి తగు నిర్ణయం తీసుకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం.. ప్రభుత్వ, జిరాయితీ భూముల సేకరణ తర్వాత.. అవసరమైతే అసైన్డ్ భూములపై తీసుకుని వారికి ల్యాండ్ పూలింగ్ ద్వారా తిరిగి భూములు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఎకరానికి 900 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగర పరిధిలోని మండలాల్లో అసైన్డ్ భూములు లభ్యతపై అన్వేషణ జరుగుతోంది. విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో విశాఖ రూరల్, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం మండలాల్లో ఏ మేర అసైన్డ్ భూములు ఉన్నయన్న దానిపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. భూసేకరణలో నిర్లక్ష్యం వద్దు పేద ప్రజలకు ఉపయోగ పడే స్థలాలను సేకరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వద్దని కలెక్టర్ వినయ్‌చంద్ ఇటీవల జరిగిన సమీక్షలో తహసీల్దార్లకు సూచించారు. భూములను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధం అని కూడా చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబ్బంది పని చేయాలని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం ఉగాది పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయాలన్నారు. సొంత ఇళ్లు కట్టుకోవడానికి ఎలాంటి స్థలం తీసుకుంటామో.. అదే పద్ధతిలో ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలం ఉండాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. -
మెట్రో రీ టెండరింగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు డిజైన్లలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో అదనంగా 4 కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. ఈ మేరకు పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) సన్నద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించే బా«ధ్యతను గత ప్రభుత్వం 2017లో ఏఎంఆర్‌సీకి అప్పగించింది. అదే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వీఎంఆర్డీఏ భవన్లో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. టెండర్లు దాఖలు చేయాలనుకుంటున్న ఆయా దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పీపీపీ విధానంలో సాధ్యాసాధ్యాలపై ఆర్ఎఫ్పీకి ఆహ్వానించగా 5 సంస్థలను 2017లో ఎంపిక చేశారు. డీపీఆర్‌లో మార్పులు తీసుకొచ్చి, మెట్రో రైల్ కాకుండా లైట్ మెట్రోగా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. లైట్ మెట్రో వల్ల వ్యయం తగ్గింది. గతంలో రూ.12,500 కోట్లుగా ప్రాజెక్టును సిద్ధం చేయగా లైట్ మెట్రో ప్రాజెక్టు వల్ల రూ.8,300 కోట్లకు అంచనా వ్యయం తగ్గింది. లైట్ మెట్రో వల్ల ప్రాజెక్టు స్వరూపం మారకపోయినా రైళ్లలో మార్పులు వస్తాయి. మెట్రో కోచ్‌లు తగ్గుతాయి. సాధారణంగా ఒక మెట్రో రైల్ సామర్ధ్యం 600 ఉంటే.. లైట్ మెట్రోలో 400 ప్రయాణికులు ఏక కాలంలో ప్రయాణించగలరు. ఈ విధంగా మార్పులు తీసుకొచి్చన ప్రాజెక్టుపై 5 సంస్థలు పీపీపీ పద్ధతిలో ఆసక్తి చూపించాయి. వచ్చిన 5 సంస్థలకు ప్రాజెక్టు చేపట్టేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ని 2018 మార్చిలో అన్ని సంస్థల నుంచి స్వీకరించిన ఏఎంఆర్‌సీ.. జనవరి 2019లో అగ్రిమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించింది. త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పట్టాలెక్కించాలి్సన చంద్రబాబు ప్రభుత్వం మెట్రోపై అశ్రద్ధ చూపించింది. ఫలితంగా ప్రాజెక్టు ఆలస్యమైంది. తాజాగా మెట్రో రైలు ప్రాజెక్టుల్లో పలు మార్పులు చేసింది. కొత్తగా టెండర్ల ప్రక్రియ.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాత టెండర్లని రద్దు చేసి.. కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. చేసిన మార్పులకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి దశలో గతంలో 42 కిలోమీటర్లు మాత్రమే ప్రపోజల్స్ ఉండేవి. కానీ గాజువాకతోనే ఆపెయ్యకుండా స్టీల్ ప్లాంట్ వరకూ పొడిగించాలన్న డిమాండ్ మేరకు ప్రాజెక్టును మరో 4 కి.మీ మేర విస్తరించారు. దీంతో పాటు గతంలో 8 కారిడార్లు మాత్రమే ఉండేవి. పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా కారిడార్ల సంఖ్య కూడా 10కి చేరుకుంది. మొత్తం 140 కి.మీ వరకూ మెట్రోరైలు పొడిగించారు. దీంతో పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా రీటెండర్లను పిలవాలని ఏఎంఆర్‌సీ సిద్ధమవుతోంది. ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో కొత్త సంస్థల్ని ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు అదనంగా కిలోమీటర్లు, కారిడార్లు ఏర్పాటు చెయ్యడంతో గతంలో ఉన్న రూ.8,300 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరిగి రూ.9 వేల కోట్లకు చేరుకుంది. రీటెండర్ ప్రక్రియకు సిద్ధమవుతున్నాం.. విశాఖ మెట్రో ప్రాజెక్టుని వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకనుగుణంగా ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేస్తున్నాం. గతంలో ఉన్న డీపీఆర్‌ని కూడా మారుస్తున్నాం. ఫస్ట్ ఫేజ్‌లో అదనంగా 4 కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. దీనివల్ల పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తులు చేస్తున్నాం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. – రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ భోగాపురం వరకూ పెంచేందుకు కసరత్తు మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ముందుగా ఫస్ట్ ఫేజ్‌పై ప్రధాన దృష్టి సారించాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఏఎంఆర్‌సీ, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ సంయుక్త కార్యచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నాం. భోగాపురం వరకూ కారిడార్‌ని పొడిగించాలన్నది సీఎం జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నాం. ఆరో కారిడార్‌లో దీనికి సంబంధించిన ప్రతిపాదనని రూపొందించాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
ఏపీలో రూ.25కే కిలో ఉల్లి..
సాక్షి, సచివాలయం: ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉల్లిని రాయితీపై అందించడానికి చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో యంత్రాంగం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రం వెలుపల మార్కెట్లలో కూడా ఏపీ ప్రభుత్వం ఉల్లి కొనుగోలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25కే ఉల్లిని సరఫరా చేస్తోంది. అధిక ధరకు కొనుగోలు చేసిన ఉల్లిని సామాన్యులకు రూ.25కే రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. శనివారం 400 టన్నులు కొనుగోలు చేయగా, శుక్రవారం 369 టన్నుల ఉల్లిపాయలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉల్లి సమస్యను పరిష్కరించడానికి కర్నూలు, షోలాపూర్, తాడేపల్లిగూడెం, ఆళ్వార్ మార్కెట్ల నుంచి ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 3,395 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేయగా, రైతుబజార్లో రూ.25కే ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉల్లి ధర ఎంతగా పెరిగినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లలో కిలో కేవలం రూ.25 చొప్పున విక్రయిస్తూనే, మరోవైపు మరింతగా మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు పలు శాఖల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిపోకుండా చర్యలు తీసుకుంటోంది. (చదవండి: ‘ఉల్లి’కి ముకుతాడేద్దాం) -
స్త్రీలకు రెట్టింపు నిధి
వేపాడ: మహిళా సంఘాల సభ్యుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా సంఘాల సభ్యు లకు ఇచ్చే స్త్రీ నిధి రుణాల మంజూరు మొత్తాన్ని రెట్టింపు చేసింది. వైఎస్సార్ క్రాంతి పథకం కింద బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా స్త్రీ నిధి రుణం మంజూరు చేస్తోంది. జిల్లాలోని 34 మండలాల్లో ఉన్న ఏడు క్లస్టర్ల పరిధిలో 43,752 మహిళా సంఘాలు ఉన్నాయి. స్త్రీనిధి రుణ లక్ష్యం 2019–20 ఆర్థిక సంవత్సంలో 7,775 సంఘాలకు 124.66 కోట్లు కాగా, ఇప్పటి వరకు 5,944 సంఘాలకు 83.89 కోట్లు స్త్రీనిధి రుణం అందజేశారు. లక్ష్యం మేరకు రుణాలు మంజూరుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి మొ త్తాన్ని రెట్టంపు చేయడం, వడ్డీ› తగ్గింపు, వాయిదాల కుదింపుతో మహిళలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పాడిపరిశ్రమ, కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర దుకాణాలు, పండ్ల దుకాణం తదితర వ్యాపారాలకు స్త్రీ నిధి రుణం తోడ్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. స్త్రీ నిధి రుణం మంజూరు ఇలా.. డ్వాక్రా సంఘంలో పదిమంది సభ్యుల్లో ఇద్దరు సభ్యులకు రూ.లక్ష చొప్పున, లేదంటే నలుగురు సభ్యులకు రూ.50 వేలు చొప్పున రెండు లక్షలు పొందవచ్చు. అదే 11 మంది సభ్యులున్న సంఘంలో ఆరుగురు మహిళలు రూ.మూడు లక్షల వ్యక్తిగత రుణం తీసుకునే అవకాశం ఉంది. స్త్రీ నిధి రుణాలకు అర్హత ఉన్న సంఘాలు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో రుణం మంజూరు చేస్తారు. గతంలో వడ్డీ 12.50 శాతం ఉండేది. ప్రస్తుత జగనన్న ప్రభుత్వం 11.75 శాతానికి తగ్గించింది. గతంలో బ్యాంకు లింకేజీ రుణంగా తీసుకుంటే 60 వాయిదాల్లో చెల్లించుకునేవారు. ఇకపై 48 నెలల్లో చెల్లించుకునే వెసులబాటు కల్పించారు. సక్రమంగా వాయిదాలు చెల్లించే సంఘాలకు ప్రభుత్వమే వడ్డీ లేని రుణం మంజూరు చేస్తుంది. మహిళలకు మేలు చేయాలనే... సీఎం వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రలో మహిళల ఇబ్బందులకు స్వయంగా గమనించారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్దేశంతో స్త్రీ నిధి రుణం రెట్టింపు చేశారు. గత ప్రభుత్వంలో బ్యాంకు లింకేజీ రుణం గ్రూపునకు రూ.5 లక్షలు మించి తీసుకుంటే స్త్రీ నిధి రుణం ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం రూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు రుణాన్ని డీఆర్డీఏ సిబ్బంది బ్యాంకు నుంచి అందజేస్తున్నారు. అంతకన్నా తక్కువ రుణం తీసుకున్న సంఘంలోని పది మంది సభ్యుల్లో ఇద్దరికి మాత్రమే స్త్రీ నిధి రుణం రూ.లక్ష మాత్రమే పొందే అవకాశం ఉంది. ఇద్దరికి చెరో రూ.50వేలు రుణం చాలక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని అవస్థలు పడేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయాలు పొదుపు సంఘాల సంభ్యులకు మేలు చేకూర్చుతున్నాయి. పెరిగిన కేటాయింపులు: బ్యాంకు లింకేజీ రుణాలు, ఉన్నతి, స్త్రీనిధి, రుణాలు వసూలు చేయడం, సమావేశాలు, రికార్డుల నిర్వహణ, సమర్ధవంతంగా పనిచేస్తున్న మండల సమాఖ్యలను ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా విభజిస్తారు. గతంలో గ్రేడ్లు వారీగా ఇచ్చే స్త్రీనిధి మొత్తాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళల్లో ఆనందం కలిగించింది. ఏ గ్రేడ్‌కు ఎంత పెంచారంటే... ఏ–గ్రేడ్‌లోని సంఘాలకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు, బీ గ్రేడ్‌కు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు, సీ–గ్రేడ్‌కు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు, డీ గ్రేడ్‌లోని సంఘాలకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు రుణాన్ని పెంచారు. సక్రమంగా రుణాలు చెల్లించడంతో పాటు పేదరిక నిర్మూలన సంస్థ షరతులను సక్రమంగా అమలు చేస్తే సంఘాలకు అదనంగా నిధులు మంజూరు చేస్తారు. ప్రథమ స్థానంలో ఎస్.కోట... జిల్లాలోని 7 ఏసీ క్లస్టర్ల పరిధిలో ఎస్.కోట క్లస్టర్‌లోని 1464 సంఘాలకు రూ.25.43 కోట్లు రుణ లక్ష్యంకాగా.. ప్రోగ్రెస్‌లో ఉన్న వాటితో కలిపి 1716 సంఘాలకు 25.79 కోట్ల రుణాలు మంజూరు చేసి జిల్లాల్లో 101.42 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. పార్వతీపురం క్లస్టర్ రూ.63.44 కోట్లు రుణం ఇచ్చి ఆఖరు స్థానంలో నిలిచింది. ఆనందం రెట్టింపు మహిళా సంఘాల స భ్యులకు స్త్రీనిధి రుణం రెట్టింపు చేయడం ఆనందంగా ఉంది. చిన్నచిన్న వ్యాపారాల తో ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కలి గింది. బయట అప్పులు చేసుకునే అవసరం లేదు. వాయిదాలు సకాలంలో కడితే వడ్డీ రాయితీ వస్తుందని చెబుతున్నారు. – భోజంకి మాధవి, సంఘసభ్యులు, వేపాడ స్వయం ఉపాధికి ఊతం స్త్రీనిధి రుణాల మంజూరుతో పొదుపు సంఘాల మహిళల స్వయం ఉపాధికి ఊతం లభిస్తుంది. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా స్త్రీ నిధి రుణం ఇవ్వడం, గతంలో కంటే సభ్యులను పెంచడం, రెట్టింపు రుణం ఇవ్వడం చాలా మంచినిర్ణయం. మహిళలు ప్రైవేటు అప్పులు చేసే అవసరం ఉండదు. రుణాలతో వ్యాపారపురోగతి సాధించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో స్త్రీ నిధి లక్ష్యం చేరువలో ఉన్నాం. నేటికి ప్రోసెస్‌లో ఉన్న నంఘాలతో కలిపి 88.95 శాతం లక్ష్యం చేరుకున్నాం. ఎస్.కోట క్లస్టర్ మొదటి స్థానంలో నిలిచింది. స్త్రీనిధి రుణం రెట్టింపు వల్ల మహిళలకు ఆనందం కలుగుతోంది. – కె.సుబ్బారావు, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ, విజయనగరం -
నేటి ముఖ్యాంశాలు..
►ఏపీ: నేడు వైఎస్సార్ ‘లా’ నేస్తం పథకం ప్రారంభం నేడు జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా పథకం ప్రారంభం కొత్తగా ‘లా’ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లకు.. వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్ల పాటు నెలకు రూ.5వేలు ఆర్థిక సాయం 2016, ఆ తర్వాత ‘లా’ పరీక్ష ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లు అర్హులు ►హైదరాబాద్: నేడు షాద్‌నగర్ కోర్టులో దిశ కేసు నిందితుల కస్టడీపై విచారణ ►హైదరాబాద్: ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రధాని, కేంద్రమంత్రులను కలవనున్న కేసీఆర్ తెలంగాణలో ఐఐఎం ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చ ►హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు కిలో మీటరుకు 20 పైసలు పెంచిన ఆర్టీసీ అన్ని సర్వీసుల్లో అమలు కానున్న ఛార్జీల పెంపు ►ఢిల్లీ: నేటి నుంచి మహిళా కమిషన్ స్వాతి నిరవధిక నిరాహార దీక్ష రేపిస్ట్‌లకు 6 నెలల్లో ఉరిశిక్ష వేసేలా కేంద్రం హామీ ఇవ్వాలని డిమాండ్ ►హైదరాబాద్: సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావుకు ఉత్తమ కలెక్టర్ అవార్డు ఎన్నికల్లో దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు కలెక్టర్ హనుమంతరావుకు అవార్డు ప్రకటించిన తెలంగాణ సర్కార్ నేడు అవార్డు అందుకోనున్న కలెక్టర్ హనుమంతరావు భాగ్యనగరంలో నేడు ►సినీ సంగీత విభావరి వేదిక: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అబిడ్స్ సమయం: సాయంత్రం 5.30 గంటలకు ►స్టాండప్ కామిడీ బై ఓపెన్ మైక్ వేదిక: బరిస్టా కాఫీ షాప్, రోడ్ నెం.1, బంజారాహిల్స్ సమయం: రాత్రి 8 గంటలకు ►ట్యూస్ డే కార్పొరేట్ నైట్ వేదిక:అల్యన్స్ ఫ్రాంఛైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6.30 గంటలకు ►కేబీఆర్స్ ఆన్వల్ పికాక్ ఫెస్టివల్ వేదిక: హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్, గచ్చిబౌలి సమయం: ఉదయం 7 గంటలకు ►లేబల్ లవ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కౌంటర్ మీసర్స్ టు అర్బన్ హీట్ ఐలాండ్స్ వేదిక: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, సమయం: ఉదయం 9–30 గంటలకు ►గోస్మార్ట్ ఇండియా వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ►ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ వేదిక: జ్యోత్ జెంటర్మ్ హైదరాబాద్, రోడ్‌నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 9–30 గంటలకు ►సిల్క్ అండ్ కాటన్ ఎక్స్ పో ఎగ్జిబిషన్ అండ్ సేల్ వేదిక: శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్ కాలనీ సమయం: ఉదయం 10.30 గంటలకు ►సుదీర్ఘ గానవాహిని – ఘంటసాల స్వరవైభవం వేదిక: రవీంద్రభారతి సమయం: సాయంత్రం 5–30 గంటలకు ►సీ ఫుడ్ ఫెస్టివల్ వేదిక: అబ్సల్యూట్ బార్బిక్, రోడ్‌నం.1, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 1 గంటలకు ►కోనసీమ టు గోల్కొండ – ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక:గ్యాలరీ 78,రోడ్ నం.3 ఇజ్జత్‌నగర్ సమయం: ఉదయం 11 గంటలకు వేదిక: అవర్‌సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ►అఫ్రోడబుల్ – ఆర్ట్ ఎగ్జిబిషన్ సమయం: ఉదయం 10 గంటలకు ►మోహినీయట్టం క్లాసెస్ సమయం: సాయంత్రం 4–30 గంటలకు ►కరాటే ట్రైనింగ్ క్లాసెస్ సమయం: సాయంత్రం 6 గంటలకు ►కలరియపట్టు వర్క్‌షాప్ సమయం: ఉదయం 7 గంటలకు ►యోగా ఫర్ సీనియర్స్ వర్క్‌షాప్ సమయం: ఉదయం 8–30 గంటలకు ►ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ వేదిక: చైనాబ్రిస్టో,రోడ్‌నం.1, జూబ్లీహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►పెట్ ఫ్రెండ్లీ సండే బ్రంచ్ వేదిక: హ్యాత్ హైదరాబాద్ , గచ్చిబౌలి సమయం:మధ్యాహ్నం12.30 గంటలకు ►థాయ్‌లాండ్ టు చైనా ఫుడ్ ఫెస్టివల్ వేదిక: వివంత బై తాజ్, బేగంపేట్ సమయం:మధ్యాహ్నం12–30 గంటలకు ►టాలెంట్ హంట్– ఏ నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఎమెర్జింగ్ ఇండియన్ ఆర్టిస్ట్స్ వేదిక:జొయెస్ఆర్ట్ గ్యాలరీ, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
►గుంటూరు: నేడు గుంటూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వైఎస్సార్ ఆరోగ్య పథకం కింద ఆసుప్రతుల్లో చికిత్స తర్వాత.. బీపీఎల్ కుటుంబాలకు ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం ఆపరేషన్ చేయించుకున్న రోగులకు చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం మొత్తం 26 విభాగాల్లో 826 శస్త్రచికిత్సలకు ఆర్థిక సాయం వర్తింపు రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5వేలు చెల్లింపు నెలలో గరిష్టంగా రూ.5వేలు, రోజుకు రూ.225 చొప్పున 22 రోజులకు సాయం ►విశాఖ: నేటి నుంచి పీఎల్జీఏ వారోత్సవాలు మన్యంలో అదనపు పోలీసు బలగాల మోహరింపు భాగ్యనగరంలో నేడు ►కరిగార్ హాత్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10:00 గంటలకు ►సిల్క్ అండ్ కాటన్ ఎక్స్ పో వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం, శ్రీనగర్ కాలనీ సమయం: ఉదయం 10–30 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక:ఏల్యన్స్ ప్రాంఛైజ్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 930 గంటలకు ►సీ ఫుడ్ ఫెస్టివల్ వేదిక: అబ్సల్యూట్ బార్బేక్యూ రోడ్‌నం.1, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 1 గంటలకు ►కోనసీమ టు గోల్కొండ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ సమయం: ఉదయం 11 గంటలకు ►కలరిపయట్టు వర్క్‌షాప్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 7 గంటలకు ►పెట్ ఫ్రెండ్లీ సండే బ్రంచ్ వేదిక: హయత్ హైదరాబాద్, గచ్చిబౌలి సమయం: మధ్యాహ్నం 1230 గంటలకు ►థాయ్‌లాండ్ టు చైనా ఫుడ్ ఫెస్టివల్ వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్ సమయం: మధ్యాహ్నం 1230 గంటలకు ►ఈవెనింగ్ బఫెట్ వేదిక: లీయోన్య హోలిస్టిక్ డెస్టినేషన్, శామీర్‌పేట్ సమయం: రాత్రి 730 గంటలకు -
ఎల్ఆర్‘ఎస్’ !
పురపాలక సంఘాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్)ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు మంత్రివర్గం సైతం ఆమోదించింది. కొవ్వూరు: ఎల్.ఆర్.ఎస్. అమలుకు విధి, విధానాల ఖరారుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారులు ముమ్మరంగా కుస్తీ చేస్తున్నారు. రెండు, మూడు వారాల్లో ఉత్తర్వులు సైతం వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న లేవుట్లకు మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. ఈ పథకం ద్వారా జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, ఎనిమిది పురపాలక సంఘాలకు సుమారు రూ.100 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 1997లో ఎల్ఆర్ఎస్ ప్రారంభమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మరోసారి 2007లో అనుమతి ఇచ్చారు. 2012 వరకు ఈ పథకం కొనసాగింది. అనంతరం వచ్చిన ప్రభుత్వా లు ఎల్ఆర్ఎస్ను పట్టించుకోలేదు. మళ్లీ ఇన్నేళ్లకు సీఎం జగన్మోహన్రెడ్డి దీనిపై దృష్టి సారించారు. పట్టణాల్లో మరింతగా విస్తరించి.. జిల్లావ్యాప్తంగా 2015 నాటికి 38 అనధికారిక లేఅవుట్లను అధికారులు గుర్తించారు. వీటిలో భీమవరంలో 19, తాడేపల్లిగూడెంలో ఏడు, జంగారెడ్డిగూడెంలో మూడు, నిడదవోలులో తొమ్మిది లేఅవుట్లు ఉన్నాయి. కొవ్వూరు, నరసాపురం, తణుకు, పాలకొల్లు, ఏలూరులో నిల్ చూపించారు. ఇదిలా ఉండగా 2014 నాటికి ఏలూరు నగరపాలక సంస్థ ఊడా పరిధిలో రూరల్ ప్రాంతాల్లో 162 అనధికార లేఅవుట్లను గుర్తించారు. అయితే నాలుగైదేళ్లలో జిల్లావ్యాప్తంగా పట్టణాలు విస్తరించాయి. జనాభా కూడా పెరిగింది. రియల్ వ్యాపారం ఆ స్థాయిలోనే విస్తరించింది. ఈ నేపథ్యంలో పల్లెల్లో సైతం లేఅవుట్లు వెలిశాయి. వీటిలో అనధికారిక లేఅవుట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా ఇటువంటి లేఅవుట్లన్నీ క్రమబద్ధీకరించుకునే అవకాశం వచ్చింది. దీనిద్వారా ఆయా పురపాలక సంఘాలకు భారీగా ఆదాయం సమకూరనుంది. 2015 నాటికి ఉన్న లెక్కల ప్రకారం చూస్తే రూ.40 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం, అయితే ప్రస్తుతం పెరిగిన లేఅవుట్లను కలుపుకుంటే ఆదాయం రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ అమలు ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల వరకు పురపాలక సంఘాలకు ఆదాయం సమకూరవచ్చని అంచనా వేస్తున్నారు. గైడ్‌లైన్స్‌పై అధికారుల కసరత్తు.. ఎల్ఆర్ఎస్ విధివిధానాల ఖరారుపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీప్లానింగ్ అధికారులు ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 మంది రియల్టర్ల వివరా లు సేకరించారు. ఆయా పురపాలక సంఘాల పరిధిలో ఉండే రియల్టర్లు, ప్లాట్లు విక్రయించే వ్యక్తులు, మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ప్రతిని«ధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి ఫోన్ నంబర్లు, వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్ అమలులో తలెత్తే ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. గైడ్‌లైన్స్ ఖరారులో వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మునిసిపాలిటీల్లో వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం నూతనంగా నియమించిన ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులకు సైతం ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో మినహా మిగిలిన అన్ని పురపాలక సంఘాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించారు. ముందుగా ఆయా వార్డు సచివాలయ ఉద్యోగుల పరిధిలో మ్యాప్‌లు తయారు చేయిస్తున్నారు. త్వరలో ఎల్ఆర్ఎస్ జీఓ పురపాలక సంఘాల్లో అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రియల్టర్స్ వివరాలు, ఫోన్ నంబర్లను అధికారులు సేకరిస్తున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు సైతం తీసుకుంటున్నారు. వచ్చే నెలలో ఎల్ఆర్ఎస్ జీఓ విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. పురపాలక సంఘాల వారీగా ఉన్న అక్రమ లేవుట్ల వివరాలు సేకరిస్తున్నాం. ఈ మేరకు సచివాలయ పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బందికి అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నాం. 2015 నాటికి 38 అనధికారిక లేఅవుట్లు ఉన్నట్టు గుర్తించాం. ఈ సంఖ్య రెండింతలు పెరిగే అవకాశం ఉంది. – వైపీ రంగనాయకులు, పట్టణ ప్రణాళిక విభాగం ఉపసంచాలకులు -
8 కారిడార్లు.. 140.13 కి.మీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజె క్టు పట్టాలెక్కుతోంది. ఇన్నాళ్లూ ఆలోచనలు, ప్రతిపాదనలు, డిజైన్లలో మార్పులు, డీపీఆర్‌లో చేర్పులతోనే కాలయాపన జరగడంతో ఒకానొక సమయంలో నగరానికి మెట్రో గగన మే అనే ఆలోచనకి ప్రజలు వచ్చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోనే విశాఖ మెట్రో ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో మెట్రో ప్రాజెక్టుకి పునరుజ్జీవం వచ్చింది. 2015–16 ఆర్థిక సంవత్సర ప్రారంభంలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఈ బాధ్యతల్ని అప్పటి ప్రభుత్వం అప్పగించింది. 3 కారిడార్లతో డీపీఆర్‌ని సిద్ధం చేశారు. మొత్తం రూ. 12,500 కోట్లు ప్రాజెక్టుగా డిజైన్ చేశారు. 2016–17లో ఈ ప్రాజెక్టుని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సొంతంగానే ప్రతిప్రాజెక్టూ చేపట్టిన నేపథ్యంలో పీపీపీ విధానంలోకి వెళ్లడంతో సదరు కార్పొరేషన్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ బాధ్యతల్ని అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ)కి అప్పగించారు. మెట్రో నుంచి.. లైట్ మెట్రోగా... పీపీపీ విధానంలో సాధ్యాసాధ్యాలపై ఆర్ఎఫ్పీకి ఆహ్వానించగా 5 సంస్థలను 2017లో ఎంపిక చేశారు. డీపీఆర్‌లో మార్పులు తీసుకొచ్చి.. మెట్రో రైల్ కాకుండా లైట్ మెట్రోగా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. లైట్ మెట్రో వల్ల వ్యయం తగ్గింది. గతంలో రూ.12,500 కోట్లుగా ప్రాజెక్టుని సిద్ధం చెయ్యగా.. లైట్ మెట్రో ప్రాజెక్టు వల్ల రూ.8,300 కోట్లకు అంచనా వ్యయం తగ్గింది. లైట్ మెట్రో వల్ల.. ప్రాజెక్టు స్వరూపం మారకపోయినా.. రైళ్లలో మార్పులు వస్తాయి. మెట్రో కోచ్‌లు తగ్గుతా యి. సాధారణంగా ఒక మెట్రో రైల్ సామర్ధ్యం 600 ఉంటే.. లైట్ మెట్రోలో 400 ప్రయాణికులు ఏక కాలంలో ప్రయాణించగలరు. ఈ విధంగా మార్పులు తీసుకొచ్చిన ప్రాజెక్టుపై 5 సంస్థలు పీపీపీ పద్ధతిలో ఆసక్తి చూపించాయి. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ 52 శాతం భరించగా.. మిగిలిన 48 శాతం నిధుల్ని సదరు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ భరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.4,200 కోట్లు కొరియా నుంచి రుణం తీసుకొచ్చేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అప్పట్లో ప్రయత్నించింది. తరువాత మరుగున పడిపోయింది. తొలిదశలో 35 కి.మీ.. కానీ... వాస్తవానికి 2016 పనులు ప్రారంభించాలన్నది మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి లక్ష్యం. కానీ అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టులో మార్పులు, చేర్పులూ చేస్తూ కాలయాపన చేసింది. 2016లో పనులు ప్రారంభించి తొలిదశలో 35 కి.మీ వరకూ కారి డార్ల పనులు పూర్తి చేసేందుకు 2018 డిసెంబర్‌ని గడువుగా నిర్దేశించుకున్నారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో ప్రాజెక్టు ఇంకా పరిశీలన స్థాయిలోనే నిలిచిపోయింది. ఏఎంఆర్‌సీకి 245 ఎకరాలు.. ఈ ప్రాజెక్టుకి నిధులు సమకూర్చుకునేందుకు అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఏఎంఆర్‌సీకి ప్రభుత్వ భూములు అందించాలని సర్కారు నిర్ణయించింది. నగరంలోని 245 ఎకరాలు ఇచ్చేందు కు ప్రభుత్వం అంగీకరించింది. ఈ భూముల్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి వాటి ద్వారా వచ్చి న ఆదాయాన్ని సముపార్జించుకోనుంది. ఇప్పటికే పలు చోట్ల వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భూముల్ని గుర్తించారు. ముడసర్లోవలో 100 ఎకరాలు, మధురవాడ క్రికెట్ స్టేడియం సమీపంలో 2 ఎకరాలు, ఎన్వీపీ లా కాలేజీ ఎదురుగా 50 ఎకరాలు రెవిన్యూకి చెందిన భూములతో పాటు శిల్పారామం సమీపంలో 13 ఎకరాలు, టూరిజం శాఖకు చెందిన స్థలం, పరదేశీపాలెంలో రెవెన్యూ, జీవీఎంసీకి చెందిన 80 ఎకరాలు ఏఎంఆర్‌సీకి ఇచ్చేందుకు ప్రతిపాదించారు. మొత్తంగా కొత్త ప్ర భుత్వం వచ్చాక మెట్రో రైలు ప్రాజెక్టు పరుగులు పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ►ప్రారంభంలో ప్రతి స్టేషన్ నుంచి 10 నిమిషాలకో ట్రైన్ ►రద్దీని బట్టి.. ప్రతి రెండు నిమిషాలకో ట్రైన్ పరుగులు ►రెండు 750 వాట్స్ డీసీ కోచ్ ►డిపోలు ఏర్పాటు చేసేలా ప్రాజెక్టు రూపకల్పన ►విమానాశ్రయ ప్రాంతంలో ఒకటి, హనుమంతువాక వద్ద మరొక డిపో ఏర్పాటు హైదరాబాద్ మెట్రో కంటే మిన్నగా... హైదరాబాద్ మెట్రో రైల్ కంటే మిన్నగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉండబోతుంది. అన్నింటికీ అనుకూలంగా.. ఇక్కడి వాతావరణానికి అనువుగా ప్రణాళికలు రూపొందించాం. మెట్రో నిర్మాణంలో ప్రస్తుత జాతీయ రహదారి భవిష్యత్తు అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ స్థలం అందుబాటులో ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నగరంలోని ట్రాఫిక్ పరిస్థితుల్ని అంచనా వేసి ప్రాజెక్టుకి రూపకల్పన చేశాం. ప్రభుత్వం నిర్దేశించే మార్గంలో మెట్రో ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తాం. – రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రోరైల్ ప్రాజెక్టు ఎండీ రాష్ట్రానికే ప్రతిష్టాత్మకం... విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు రాష్ట్రానికే ఎంతో ప్రతిష్టాత్మకమైంది. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాం. నగరంలో ట్రాఫిక్, మెట్రో అవకాశాల్ని పరిశీలించిన తర్వాత సమగ్రమైన ప్రణాళికతో రూట్ మ్యాప్‌ని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధం చేసింది. – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి -
సువర్ణ పాలన
శ్రీకాకుళం/ శ్రీకాకుళం పాతబస్టాండ్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఆరు నెలల పాలనలో రాష్ట్రాన్ని నవశకం వైపు పయనించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో ఆయన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారమే కాకుండా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ నవశకం పేరిట ఇంటింట సర్వేలు జరిపిస్తున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేందుకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని వలన ప్రజలు గతంలోలా జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పని ఉండదు. వారి గ్రామంలో ఉన్న సచివాలయానికి వెళ్లి సమస్యను తెలియజేస్తే 72 గంటల్లో దానిని పరిష్కరిస్తారు. మద్యపాన నిషేధం... మద్యపాన నిషేధం నిర్ణయంతో మహిళల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో తొలి ఏడాది 20 శాతం మద్యం దుకాణాలను తొలగిం చడంతో ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో 191 దుకాణాలు నడుస్తున్నాయి. అంతకుముందు 237 దుకాణాలు ఉండేవి. కొద్దిరోజుల క్రితమే బార్లలో 40 శాతం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 19 బార్లు ఉండగా వీటిలో 8 బార్ల వరకు మూతపడే పరిస్థితి ఉంది. దీనికితోడు మద్యం ధరలను పెంచడంతో చాలా మంది మద్యం అలవాటును మానుకుని ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉన్నారు. ఉద్యోగాల విప్లవం.. జిల్లాలోని వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలను కల్పించారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్లను, పలువురు ఉద్యోగులను నియమించారు. జిల్లాలో 1100 పంచాయతీలు, ఒక నగరపాలకసంస్థ, మూడు మునిసిపాలిటీలు ఉండగా వీటి పరిధిలో ఇప్పటివరకు 9,500 మందికి పైగా ఉద్యోగాలు పొందారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పింఛన్ల పెంపుతో ఆసరా.. వైఎస్సార్ భరోసా క్రింద వృద్ధులు, వికలాంగులు దీర్ఘకాలిక రోగులు, వితంతువులు తదితర వర్గాలకు పింఛన్ పెంపు దశల వారీగా చేసే కార్యక్రమంలో ప్రస్తుతం తొలి విడతగా రూ.2,250కు పెంచారు. వికలాంగులకు రూ.3,000, కిడ్నీ రోగులకు రూ.10 వేలు, డప్పు కళాకారులకు రూ.3 వేలు వంతున పెంచారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 3,42,948 మంది ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు. వీరి సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా వలంటీర్ల ద్వారా నేరుగా ధరఖాస్తు చేసుకున్నవారు మరో 34,085 మంది ఉన్నారు. వీరికి కూడా ఈ పింఛన్‌ను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం.. జిల్లాలో ప్రస్తుతం తెలుపురంగు రేషన్‌కార్డులు 8,32,636 ఉన్నాయి. వీటికి గాను నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేసేందుకు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీరి ద్వారా ప్రతి నెలా 13,243 మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అలాగే కొత్తగా జిల్లాలో 12 వేల మంది కార్డుల కోసం వివిధ రకాలుగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే నవశకంలో భాగంగా గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటా సర్వే నిర్వహించి కొత్తగా బియ్యం కార్డుకు అర్హులను ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కొత్తగా వారికి జనవరి నాటికి బియ్యం కార్డును అందజేసేందుకు అన్ని చర్యలూ తీసుకోవడం జరిగింది. జగనన్న విద్యావసతి.. జగనన్న విద్యావసతి ద్వారా ఇప్పటికే జిల్లాలో సుమారుగా 76,200 మంది విద్యార్థులు వసతి, ఉచిత విద్యను పొందుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలతోపాటు కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో ఈ విద్యార్థులు ఉన్నారు. రానున్న విద్యాసంవత్సరంలో మరింతమంది విద్యార్థులు ఈ ప్రయోజనం కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తగా మరో 10 వేల మంది విద్యార్థులకు జగన్న విద్యావసతి అందుబాటులోకి రానుంది. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా.. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన రూ.10 వేల లోపు ఖాతాదారులకు ఆ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసి వారి కన్నీళ్లను తుడిచింది. జిల్లాలో ఇలాంటి వారు 48,08,033మంది ఉండగా రూ.36.90 కోట్లు అందజేశారు. మరికొద్ది నెలల్లో రూ.20 వేల లోపు ఖాతాదారుల జాబితాను సేకరించి వారికి కూడా నగదును జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మద్యనిషేధం మా బతుకుల్లో వెలుగు నింపింది.. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యనిషేధం మా కుటుంబానికి ఎంతో మేలు చేసింది. గతంలో ఊరూరా బెల్టుషాపులు ఉండడంతో నా భర్త రోజంతా తాపీ మేస్త్రీగా పనిచేసి సంపాదించిన మొత్తాన్ని తాగుడుకు ఖర్చు చేసేవాడు. దీంతో కుటుంబంలో గొడవలతోపాటు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం ఊళ్లో బెల్టుషాపులు మూసేయడంతో మద్యం అందుబాటులో లేక నా భర్తకు ఆ చెడు అలవాటు తగ్గింది. దూరప్రాంతానికి వెళ్లి అధిక ధర చెల్లించాల్సి రావడంతో తాగాలనే కోరిక సన్నగిల్లింది. మాలాంటి పేద కుటుంబాలకు సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎంతో మేలు చేసింది. –మానేకం కోకిల, ముత్యాలపేట, కవిటి మండలం విద్యారంగానికి పెద్ద పీట... విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యమైనది అమ్మఒడి. 1 నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే విద్యార్థులకు ఏటా రూ.15 వేలను వారి తల్లి ఖాతాలో జమ చేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. విద్యార్థుల సంఖ్య పెరిగేలా, డ్రాప్‌అవుట్ తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా పిల్లలను చదువుకు పంపిన తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ఆ బరువు మోసేందుకు సిద్ధమయింది. ఈ పథకాన్ని జనవరి 9న ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం చురుకుగా సాగుతోంది. ఈ పథకం క్రింద జిల్లాలో ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల్లో చదువుఉన్న విద్యార్థులు సుమారుగా 3,12,145 మందికి ప్రయోజం చేకూరుతోంది. వైఎస్సార్ రైతు భరోసా.. రైతులకు వ్యవసాయ పనులలో సాయపడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతుభరోసా. అర్హులైన రైతులకు ఏడాదిలో మూడు విడతల్లో రూ.13,500 అందజేసే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. తొలి విడతగా జిల్లాలో 3.38 లక్షల రైతు కుటుంబాలకు గాను తొలివిడతలో 7,500 వంతున ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఆ నగదును జమ చేయడం జరిగింది. సుమారుగా జిల్లాలో రైతుల కోసం 5,510 కోట్లను సిద్ధం చేసింది. దీంట్లో కౌలు రైతులు అటవీ భూముల సాగుదారులు, ఈనాం భూములు ఉన్నవారికి కూడా రైతు భరోసాను క ల్పించి ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంది. ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ.. జిల్లాలో ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రుల్లో ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. గతంలో ఐదేళ్లపాటు ఈ పథకం నీరసించింది. వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మరిన్ని వ్యాధులను ఈ పథకంలో చేర్పించారు. రూ.వెయ్యి దాటిన ప్రతి వైద్య ఖర్చులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడంతో జిల్లాలో 8 లక్షల కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. తాజాగా వచ్చిన మార్గదర్శకాలతో ఈ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల సంఖ్య మరో 70 వేల వరకూ పెరగనుందని అంచనాలు వస్తున్నాయి. విద్యార్థులకు ‘వెలుగు’ విద్యార్థులకు పాఠశాలల్లోనూ, వసతి గృహాల్లో నూ రుచికరమైన, పౌష్టికాహారం అందించేలా మధ్యాహ్న భోజనాన్ని రూపకల్పన చేస్తూ ధరలను కూడా పెంచారు. గతంలో అందజేస్తు న్న బియ్యం స్థానంలో నాణ్యమైన బియ్యాన్ని అందజేస్తున్నారు. మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డించే కార్మికుల వేతనాలను కూడా పెంచారు. పాఠశాల నాడు–నేడు పేరిట కార్యక్రమాన్ని అమలు చేస్తూ అధునాతన సౌకర్యాలతో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించి అందుకు అవసరమైన అంచనాలు రూపొందిస్తున్నారు. 500 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 46 పాఠశాలలు అప్‌గ్రేడ్ అయ్యే పరిస్థితి ఉంది. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ వారానికోసారి నో బ్యాగ్‌డేను అమలు చేస్తున్నారు. రోజులో నాలుగుసార్లు మంచినీరు తాగేందుకు సమయాన్ని కేటాయింపజేస్తున్నారు. కంటి పరీక్షలు జరిపి వారిలో వెలుగు నింపేందుకుగాను వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇప్పటికే 80 శాతం పూర్తి చేశారు. -
ఇప్పటివరకు 129.. ఇక 68
మహారాణిపేట(విశాఖ దక్షిణ): మద్యం నిషేధం దశల వారీగా అమలు చేయడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే విక్రయాలతో పాటు టైమింగ్స్ కూడా తగ్గించింది. ఇక బార్లకు కూడా కళ్లెం వేయనుంది. నూతన బార్ పాలసీలో 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభు త్వం 40 శాతం బార్లు తగ్గించాలని ఇప్పటికే నిర్ణయించడంతో జిల్లా ఎ క్సైజ్ అధికారులు ఇప్పటికే ఆ ప్రకియ ప్రారంభించారు. ఎక్కడెక్కడ ఉంచాల్లో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్‌తో లైసెన్స్‌లు పూర్తి.. ప్రస్తుతం నడుస్తున్న బార్ల లైసెన్సులు డిసెంబర్ 31తో రద్దు అవుతాయి. వాస్తవానికి ప్రస్తుత బార్ల లైసెన్సులు 2020 జూన్ ఆఖరి వరకు ఉన్నాయి. మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన రోజులకు సంబంధించి లైసెన్స్ ఫీజును ప్రభుత్వం బార్ యజమానులకు తిరిగి చెల్లిస్తుంది. ఇక 68 బార్లే.. ప్రస్తుతం జిల్లాలో 129 బార్లు ఉన్నా యి. ప్రభుత్వం 40 శాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో 68 బార్లు మాత్రమే జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి విశాఖ నగర పరి«ధి(జీవీఎంసీ)లో 66 ,యలమంచలి,నర్సీపట్నం మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు కానున్నాయి. ఫీజుల పెంపు మరో వైపు 2020 జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న బార్ల లైసెన్స్ ఫీజులు ప్రభుత్వం పెంచింది. 50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.25 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీలో రూ.50 లక్షలు, 5 లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న మున్సిపాలిటీ/నగర పాలక సంస్థలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.75 లక్షలు లైసెన్స్ ఫీజులు చెల్లించాలి. ఈ ప్రాతిపదికన విశాఖ నగర పరిధిలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.75 లక్షలుగా నిర్ణయించారు. ఆన్లైన్లో దరఖాస్తులు.. బార్ లైసెన్స్‌ల కోసం ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేయాల్సి వుంది. ఎక్సైజ్ శాఖ వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 6లోగా (మధ్యాహ్నం మూడు గంటలు) ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంది. 7న డ్రా తీస్తారు. అలాగే ఒక కాపీని ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలి. అన్ని డాక్యుమెంట్లు,బార్ నడిపే ఇంటి యజమాని నుంచి లేఖ, ఇతర డాక్యుమెంట్లు తప్పని సరిగా సమర్పించాలి. మార్గదర్శకాలు రాగానే.. నూతన మద్యం పాలసీలో భాగంగా బార్ల తగ్గింపుపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిపై శుక్రవారం రాజపత్రం కూడ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేసేందుకు సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాం. ఏడాది పాటు బార్లు నడపడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి. బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకున్న వారు రూ.10 లక్షల డీడీ సమర్పించాలి. బార్లు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా ద్వారా ఎంపిక చేస్తాం. -టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్, విశాఖపట్నం. -
గిరిజనానికి వరం
సీతంపేట: ఏజెన్సీలో ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇక అదనపు పోషకాహారం అందనుంది. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ్ అభియాన్ పథకాన్ని ఎనిమిది జిల్లాల్లో అమలు చేసేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో భాగంగా మరికొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర, ఉభ య గోదావరి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలో అమలు ఇలా.. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఐటీడీఏ పరిధిలోని 20 సబ్‌ప్లాన్ మండలాల పరిధిలో 1250 గిరిజన గ్రామాలున్నాయి. జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 4,192 అంగన్వాడీ కేంద్రాలుండగా, ఏజెన్సీలో 825 కేంద్రాలున్నాయి. వీటిలో 422 మెయిన్, 403 మినీ అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఏడు నెలల నుంచి ఆరేళ్ల లోపు సుమారు 17939 ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏజెన్సీలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులంతా కలిపి సుమారు 25వేల మంది లబ్ధిదారులున్నట్టు గుర్తించారు. జిల్లాలో 11 శాతం కంటే తక్కువ రక్తహీనత గల గర్భణులు సుమారు 9 వేలు, మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు లోపు పోషణకు గురైన చిన్నారులు–1549మంది, 7 నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు–1624 గురైనట్టు గతంలో గుర్తించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ్ పథకం ద్వారా వారందరికీ అదనంగా పోషకాహారం అందించనున్నారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులందరికీ పోషకాహారం అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ నుంచి కొత్త మెనూ అంగన్వాడీ కేంద్రాలకు అమలు చేయనున్నారు. ఈ పథకంలో ఆరు నెలల నుంచి 3 ఏళ్ల చిన్నారులకు నెలకు రూ.600లతో ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు, వంద గ్రాముల బాలామృతాన్ని అందజేస్తారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు నెలకు 25 రోజులపాటు కోడిగుడ్డుతో పాటు అన్నం, ఆకుకూరలు, పప్పుతో భోజనం, పాయసం, లడ్డు, బిస్కెట్లు ఇస్తారు. గర్భిణులు, బాలింతలకు గుడ్డు, పాలు, ప్రోటీన్లతో కూడిన భోజనాన్ని అందించనున్నారు. విధి విధానాలు రావాల్సి ఉంది.. ఈ పథకానికి సంబంధించి విది విధానాలు రావాల్సి ఉంది. దీంతో అమలు ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోషకాహారం అందజేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశానుసారం సక్రమంగా పోషకాహారాన్ని ప్రతి లబ్ధిదారుడికి అందజేస్తాం. – పి.రంగలక్ష్మి, సీడీపీఓ, సీతంపేట పక్కాగా అమలు చేయాలి.. ఏజెన్సీలోని 8 జిల్లాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ్ అభియాన్ పక్కాగా అమలు చేయాల్సిందే. ఎక్కడ ఎటువంటి లోపాలు ఉండకుండా చూడాల్సిన అవసరం సంబంధిత అధికారులపై ఉంది. గిరిజన ప్రాంతాల్లో ఈ తరహా పథకాలను అమలు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మా గిరిజనుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. –విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్ -
కూలుతున్న గంజాయి కోటలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఏజెన్సీలో నాడు టీడీపీ నేతల అండతో పెచ్చరిల్లిన్న గంజాయి మాఫియా సామ్రాజ్యాన్ని కూలగొట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. గంజాయి సాగు నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయడంతో పాటు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ దశాబ్దం నుంచి వేళ్ళూనుకున్న స్మగ్లర్ల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ఆరు నెలల వ్యవధిలోనే 95 కేసులు నమోదు చేసి 245 మందిని అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ.60 కోట్ల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్యంలో గంజాయి వనాలను కూకటివేళ్లతో పెకిలిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే ఆ మాట నిలబెట్టుకుంటూశరవేగంగా చర్యలు చేపట్టారు. ఫలితంగా తక్కువ వ్యవధిలోనే సాగు మూడొంతులకు పడిపోయింది. పదేళ్ల క్రితం నుంచే.. గంజాయి ఖిల్లాగా మారిన విశాఖ మన్యంలో ఆ పంట సాగు పదేళ్ళ కిందటే పురుడుపోసుకుంది. హుకుంపేట మండలం మారుమూల ప్రాంతమైన సరసపాడు అటవీ ప్రాంతంలో ఈ సాగు తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. మన్యం దిగువన ఉన్న దేవరాపల్లి మీదుగా గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుని తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు అమాయక గిరిజనులతో గంజాయి సాగు చేపట్టారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నా అప్పటి పాలకులు సరిగ్గా పట్టించుకోని నేపథ్యంతో గిరిజనులు గంజాయి సాగు పట్ల ఆకర్షితులయ్యారు. దీంతో క్రమేపీ పంట విస్తీర్ణం పెరిగి పదివేల ఎకరాలు దాటిపోయింది. ఓ దశలో సాధారణ పంటల సాగుకంటే గంజాయి సాగు వైపే పూర్తిగా మొగ్గుచూపే పరిస్థితి వచ్చేసింది. ఏజెన్సీలోని మొత్తం 11 మండలాలకు గానూ ఏడు మండలాలు.. జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, చింతపల్లి మండలాలకు గంజాయి సాగు విచ్చలవిడిగా విస్తరించింది. ఆరు నెలల్లోనే అనూహ్య మార్పు.. గంజాయి సాగు, రవాణా నిరోధంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన పరిస్థితులను గిరిజనులే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్ళారు. గంజాయి స్మగ్లింగ్ వల్ల అనేక మంది గిరిజనులు జైలు పాలవుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు వాపోయేవారు. అదే సమయంలో విశాఖ నగరంలో యువత గంజాయికి బానిసలుగా మారిన తీరు ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. దాంతో అధికారంలోకి వచ్చాక గంజాయి సాగును పూర్తిగా నిర్మూలిస్తామని ఎన్నికల సమయంలో జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కాగానే గంజాయి నిర్మూలనకు అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు, అధికారాలు ఇచ్చారు. ఎక్సైజ్, ఫారెస్ట్, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో గిరిజనులు గంజాయి సాగు జోలికి పోకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని, కాఫీ సాగు విస్తరించాలని సీఎం సూచించారు. ఆ మేరకు అధికారులు వెంటనే రంగంలోకి దిగి స్మగ్లర్లకు ముకుతాడు వేసే దిశగా చర్యలు చేపట్టారు. నిఘా తీవ్రతరం చేసి తక్కువ వ్యవధిలోనే ఎన్నడూ లేనన్ని కేసులు నమోదు చేశారు. ఫలితంగా గత ఏడాది వరకు సగటున పదివేల ఎకరాల్లో సాగైన గంజాయి విస్తీర్ణం ఇప్పుడు మూడు వేల ఎకరాలకు పరిమితమైంది. అది కూడా పూర్తిగా మారుమూల అటవీ ప్రాంతాలు, ఏవోబీ పరిధిలోకి వచ్చే ఒడిశా సరిహద్దు గ్రామాల్లోనే సాగవుతున్నట్టు అధికారులు గుర్తించారు. స్వచ్ఛందంగా సాగుకు స్వస్తి.. గంజాయి సాగు వద్దని ప్రభుత్వం నిర్వహిస్తున్న చైతన్య కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటలకు ఇస్తున్న ప్రోత్సాహంతో గిరిజనులు స్వచ్ఛందంగా గంజాయి సాగు విడనాడారు. ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలల్లో ఈ పంట సాగు ప్రారంభిస్తారు. అయితే జూన్ నుంచే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడంతో గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. జి.మాడుగుల, పెదబయలు మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఈ ఏడాది గంజాయి సాగును పూర్తిగా విరమించారు. ప్రభుత్వ పిలుపు మేరకు గంజాయి సాగును విరమించిన గిరిజనులు తమ దుస్థితిని, అవసరాలను అధికారులకు విన్నవించుకుంటున్నారు. వ్యవసాయ యంత్ర పనిముట్లు కావాలనిఅధికారులను కోరుతున్నారు. ఏజెన్సీలో ఐదు తాత్కాలిక చెక్‌పోస్టులు.. ఏజెన్సీలో చాలా చోట్ల గంజాయి సాగుకు అడ్డుకట్ట వేశాం. గతంలో పండించిన పంట రవాణాను నిరోధించేందుకు ఐదు తాత్కాలిక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. శివలింగాపురం, భీమవరం, డౌనూరు, గరికనంద, జీనపాడు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు నెలకొల్పాం. గంజాయి పండించినా, అక్రమ రవాణా చేసినా నారోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(ఎన్డీపీఎస్)–1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – టి. శ్రీనివాసరావు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ కమిషనర్ పెంచి పోషించిన టీడీపీ నేతలు.. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక గంజాయి స్మగ్లింగ్ బహిరంగ వ్యాపారంగా మారిందంటే అతిశయోక్తి కాదు. సాగు, అక్రమ రవాణాలో అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులే కీలకంగా మారారు. గంజాయి రవాణాకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఓ మాజీ మంత్రి పూర్తిస్థాయిలో అండదండలు అందించేవారనేది బహిరంగ రహస్యం. స్వయంగా ఆయనే ఈ మాఫియాకు డాన్‌గా చెలామణీ కావడంతో స్మగ్లర్లకు ఎదురు లేకుండా పోయింది. మాజీ మంత్రి అనుచరులు, సన్నిహితులైన టీడీపీ నేతలతో పాటు మన్యంలోని టీడీపీ నేతలు కూడా స్మగ్లర్లతో చేతులు కలిపారు. గంజాయి సాగు, రవాణాను అడ్డుకోవాల్సిన అధికారుల చేతులు కట్టేయడంతో ఏజెన్సీలో పండిన గంజాయి యధేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిపోయేది. కేసుల కోసం అడపాదడపా ఎక్సైజ్ అధికారులు దాడులు చేసినట్టు చూపించినప్పటికీ అసలు స్మగ్లర్లను వదిలేసి కూలి డబ్బుల కోసం సరుకును రవాణా చేస్తున్న గిరిజనులు మాత్రమే కటకటాల పాలయ్యేవారు. దీనికి 2014 ఆగస్టు 9 నాటి ఘటనే ఉదాహరణ. పెదబయలు మండలం గోమంగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన అంబులెన్స్‌లో భారీఎత్తున గంజాయి తరలిస్తుండగా పోలీసులు సుండ్రుపుట్టు రోడ్డులో పట్టుకున్నారు. ఈ కేసులో డ్రైవర్ సీదరి మత్స్యరాజును అరెస్టు చేయగా.. ఆయన అసలు సూత్రధారులైన టీడీపీ నేతల పేర్లు వెల్లడించారు. కానీ నాటి పాలకుల ఆదేశాలతో ఈ కేసును ఒక్క డ్రైవర్ అరెస్టుతోనే సరిపెట్టేశారు. -
ఇక పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, విశాఖపట్నం, మహారాణిపేట: ఐదేళ్ల పాటు ఆకాశంలో మబ్బులు చూపించి.. అభివృద్ధి సాధించామంటూ చెప్పుకున్న గొప్పలు ఆరు నెలల కాలంలోనే దూది పింజల్లా తేలిపోతున్నాయి. విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసి యువత భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చేసిన పాలకుల విధానాలకు స్వస్తి చెబుతూ ప్రతి ఒక్క పేద, మధ్య తరగతి విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా చేయూతనందించేందుకు సీఎం వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ప్రభుత్వం విలువైన పథకాల్ని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. ప్రభుత్వమంటే సమాజాన్ని అభివృద్ధి చేసే నిర్ణయాలు తీసుకునేలా పనిచెయ్యాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాలతో జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యా ఫలాలు అందుకోనున్నారు. 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్... వృత్తి విద్యసహా ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థుల ఫీజులను పూర్తిస్థాయిలో 100 శాతం రీయింబర్స్మెంట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఫైల్‌పై ముఖ్యమంత్రి జగన్ సంతకం చేసిన నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ ఈ ఏడాది జూలై 23న ఉత్తర్వులు జారీ చేసింది. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల ఫీజులపై జీవో 38 విడుదల చేసింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మాడీ, ఫార్మాడీ(పీబీ), బీఆర్క్, బీ.ఫార్మా, ఎం.ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2018–19 విద్యాసంవత్సరానికి అమలు చేసిన ఫీజులే 2019–20 విద్యా సంవత్సరానికి కూడా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజన్న ప్రసరించిన విద్యావెలుగులు... పేద విద్యార్థులందరికీ ఉన్నత విద్యా ఫలాలు అందించాలన్న లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. ఉచిత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులు కూడా పేదరికం వల్ల తన బిడ్డని ఉన్నత చదువులు చదివించలేకపోయామన్న నిరుత్సాహపడకూడదన్న లక్ష్యంతో రాజన్న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2004లో ఈ పథకం ప్రారంభమైంది. పథకం ప్రారంభం కాకముందు ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం, కొంత వరకు మాత్రమే ఫీజుల చెల్లించేది. మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు, బీసీలు, ఈబీసీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుతో.. ఇంటర్‌తోనే విద్యకు ఫుల్స్టాప్ పెట్టే పరిస్థితి నుంచి పేద, మధ్యతరగతి విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎమ్మెస్సీ వంటి ఉన్నత చదువుల వైపు అడుగులు వేశారు. ఐదేళ్లు... రూ.100 కోట్ల బకాయిలు... మహానేత వైఎస్సార్ మరణించిన తర్వాత... గడిచిన ఐదేళ్లుగా రీయింబర్స్మెంట్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో విశాఖపట్నం జిల్లాలోనే రీయింబర్స్మెంట్ బకాయిలు అక్షరాలా రూ.100 కోట్లకు చేరాయని ప్రైవేటు విద్యాసంస్థల సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. విశాఖ శివారు ప్రాంతంలో 20కిపైగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తుంది. దీనికి సంబంధించి విద్యార్థి కళాశాలలో జాయిన్ అయినప్పుడు ప్రభుత్వం కళాశాల యాజమాన్యానికి ఉత్తర్వులు అందిస్తుంది. అందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజును ఇస్తామని పేర్కొంటారు. విద్యార్థికి కళాశాలలో అడ్మిషన్ ఇచ్చేలా చేస్తారు. గడచిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏనాడు పట్టించుకోలేదు. ఇంజినీరింగ్ విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలు ఏడాదికి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. కానీ టీడీపీ హయాంలో రూ.35 వేలకు మించి ఇవ్వకపోవడంతో.. ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందన్న ఆశతో ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు ఇక్కట్లు పడ్డారు. మిగిలిన ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు చాలా కుటుంబాలు అప్పులపాలైన ఘటనలూ లేకపోలేదు. ఫీజులు పెంచేసిన టీడీపీ... టీడీపీ అధికారంలో ఉండగా కాలేజీల యాజమాన్యాలకు మేలు కలిగేలా ఫీజులను 30 శాతం మేర పెంచింది. అదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మాత్రం పెంచకపోవడం గమనార్హం. రూ.35వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసింది. అదిపోగా మిగతా భారం మొత్తం విద్యార్థి భరించాల్సి వచ్చేది. ఫలితంగా ఒక్కో విద్యార్థి కుటుంబం కోర్సు పూర్తయ్యే సరికి రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షలకు వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇక ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ.45 వేలకు పెంచుతామంటూ ఒక జీవోను విడుదల చేసి విద్యార్థులను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి గత ప్రభుత్వం రూ.35వేల ఫీజు రీయింబర్స్‌మెంటును కూడా కాలేజీలకు చెల్లించకపోవడంతో కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. మళ్లీ విద్యా సుగంధాలు... ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ.. ప్రతిపక్షనేతగా సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు పంచే అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి హామీలన్నింటినీ అమలు చేస్తున్నారు. తాజాగా బుధవారం అమరావతిలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజన్న మరణంతో అస్తవ్యస్తంగా మారిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఊపిరిపోయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విద్యావరాలు అందించేలా పథకాలు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సడలించిన నిబంధనలు... ►జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అర్హులందరికీ అందేలా ప్రభుత్వం నిబంధనల్లో అనేక మార్పులు తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ►ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సంవత్సరానికి ఆదాయ పరిమితి రూ.2 లక్షలు, మిగిలిన వాళ్లకు రూ.లక్షలోపు ఆదాయం ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందన్న నిబంధనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సడలించింది. వార్షికాదాయం రూ.2.50 లక్షలు లోపు ఉన్న అందరికీ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు వర్తిస్తాయి. ►10 ఎకరాల లోపు మాగాణి లేదా, 25 ఎకరాల్లోపు మెట్టభూమి ఉన్నవారికి లేదా, రెండూ కలిపి 25 ఎకరాల్లోపు ఉన్న వారూ ఈ పథకానికి అర్హులు. ►ఆదాయంతో సంబంధం లేకుండా పారిశుద్ధ్య కార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని వారికీ ఈ పథకం వర్తిస్తుంది. ►కారు మినహా ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులే. ►ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ రెండు పథకాలకు అనర్హులు. ►పట్టణాల్లో 1500 చ.గజాలు ఆస్తి ఉన్న వారికీ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ►పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై కోర్సుల్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అనుబంధ, విశ్వవిద్యాలయాలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల హర్షం... పేదవిద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలుతో పాటు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విద్యార్థులు తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ చదువుల కోసం అప్పుల ఊబిలో కూరుకుపోయే దుస్థితి తల్లిదండ్రులకు తప్పుతుందని విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫీజులెలా చెల్లించాలని ఆందోళన చెందకుండా చదువులపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంటున్నారు. మరోపక్క ఫీజులతో పాటు విద్యార్థుల వసతి, భోజనాల కోసం ఏటా రూ.10 నుంచి రూ.20 వేల వరకూ చెల్లించేందుకూ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో విద్యార్థుల చదువులపైనే దృష్టి సారించగలమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం జగన్ నిర్ణయం..పేద విద్యార్థులకు వరం
సాక్షి, అనంతపురం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువులకు బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అనంతపురం ఎన్జీవో హోం లో రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆంగ్ల మాద్యమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని బీసీ సంఘం ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నేతలు స్వాగతించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైఎస్ జగన్ నిర్ణయం ఓ వరమని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో పేద విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ విమర్శలు అర్థరహితమన్నారు. ప్రకాశం: ఆంగ్ల మాద్యమం ఆవశ్యకత పై ఒంగోలు లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదర్ క్లబ్లో జరిగిన సమావేశంలో దళిత బహుజన మేధావులు ఈ చర్చలో పాల్గొన్నారు. ‘బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్ మీద పట్టు సాధించారు..కాబట్టే ప్రపంచ మేధావి అయ్యారని’ వక్తలు తెలిపారు. తిరుపతి: ఇంగ్లీష్ మాద్యమం కు మద్దతుగా తిరుపతిలో అంబేద్కర్ మిషన్ ఇండియా నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇంగ్లీష్ భాష ధనికులకే కాదు.. పేదలకు కూడా అవసరమన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టారని ప్రతినిధులు తెలిపారు. సీఎం నిర్ణయానికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామన్నారు. -
43 లక్షల మందికి ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 43 లక్షల మందికి సాయం అందించామని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతు భరోసా పథకానికి కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవడానికి మరో నెల పొడిగించామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మార్కెటింగ్ సీజన్ ప్రారంభం అయ్యిందని, పత్తి కొనుగోలుకు సీసీఏ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వేరుశనగకు కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ విషయంలో నిరంతరం సమీక్ష చేస్తున్నామన్నారు. పొలంబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నారు. అపరాల బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని.. వాటికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారని.. దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో నేరుగా రైతులే పాల్గొనేందుకు చర్యలు చేపడతామన్నారు. బయో ప్రొడక్ట్స్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, దానిపై కూడా చర్యలు చేపట్టేందుకు చర్చిస్తామన్నారు. కౌలు రైతుల విషయంలో రికార్డుల సమస్యలు ఉన్నాయని..వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎంవీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. -
ఉద్యోగాల కల్పనలో ఏపీ ‘నంబర్ వన్’
సాక్షి, అనంతపురం: ఉద్యోగాల కల్పనలో దేశంలోనే నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు సత్వర పరిష్కరించడానికే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కేవలం ఐదునెలల్లో నెరవేర్చి ఇతర నాయకుల కంటే తాను భిన్నమైన నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారన్నారు. ప్రజలకు నమ్మకం కలిగింది.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కలిగిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతి పక్షాల పాత్ర నామ మాత్రమేనని చెప్పారు. -
విద్యావ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా విధానంలో ఉత్తమ ప్రమాణాలు, భారీ సంస్కరణలు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానటరింగ్ కమిషన్ పని చేస్తుందని కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలు పెంచడంతో పాటు, ఉపాధ్యాయులకు శిక్షణలిచ్చి విద్యాబోధనలో నైపుణ్యం సాధించే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనలో భాగంగా ఈ నెల 14 నుండి మొదటి విడతలో ప్రతి మండలంలో 15 పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పేద బడుగు వర్గాల పిల్లల చదువు కోసం ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం అమలు చేయనుందని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా 25 శాతం సీట్లు బలహీన వర్గాల విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్య అందించనున్నామని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు కమిషన్ కు జ్యుడీషియల్ అధికారాలు వున్నాయని వెల్లడించారు. -
‘సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం’
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని వీవోఏ, సంఘమిత్ర, మెప్మా సిబ్బంది తెలిపారు. ఏపీ ప్రభుత్వం వారి జీతాలు మూడు వేల నుంచి 10 వేలకు పెంచడంతో మంగళవారం సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి మాట్లాడుతూ..ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప నేత వైఎస్ జగన్ అని కొనియాడారు. అనంతరం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మంజూరు చేసిన వేలాది మొక్కలను ఇంటింటికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి: ఏపీ ప్రభుత్వం వీవోఏ,ఆర్పీలకు గౌరవ వేతనాన్ని పదివేలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం జంగారెడ్డి గూడెం మసీదు సెంటర్లో ఎమ్మెల్యే ఎలీజా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని తెలిపారు. ఆరు నెలల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కనీస వేతనాలు పెంచాలని ఆర్పీలు, వీవోఏలు ధర్నాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా: తమ గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచడం పట్ల కైకలూరు నియోజకవర్గ బుక్ కీపర్లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా: సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు శృంగవరపుకోట వీవోఏలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటివరుకు చాలీ చాలని జీతాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 10 వేలు వేతనాన్ని పెంచిన సీఎం వైఎస్ జగన్‌కు ఎంతో రుణపడి ఉంటామన్నారు. దేవి కూడలిలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వీవోఏలు పూలమాలలు వేశారు. తూర్పుగోదావరి: సీఎం వైఎస్ జగన్ పదివేలు గౌరవ వేతనం ప్రకటించడంపై యానిమేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి మెప్మా, ఆర్పీ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. -
‘స్వప్రయోజనాల కోసమే ఏకపక్ష నిర్ణయం’
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో పిలుపునిచ్చిన ఆందోళనకు మా మద్దతు లేదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏకపక్షంగా ఎన్టీవోలు ఆందోళనకు పిలుపునివ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసేందుకే ఆందోళనకు పిలుపునిచ్చారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయం తగదన్నారు. ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్నారు. అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచిందని తెలిపారు. పెద్దఎత్తున ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఆందోళనకు పిలుపునివ్వడం సరైన పద్ధతి కాదన్నారు. ఉద్యోగులు తమ డిమాండ్లపై ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని వెంకటేశ్వర్లు సూచించారు. -
నష్టపోయిన ఏపీకి సాయం అందించండి
సాక్షి, అమరావతి: విభజన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పలు విధాలుగా నష్టపోయిందని, రాష్ట్రం అభివృద్ధి కి అవసరమైన సహకారాన్ని అందించాలని ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్.. కేంద్ర ఇంధన వనరులు, సహజ వాయువులు, ఉక్కు శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌ను కోరారు. శుక్రవారం ఏపీ గవర్నర్‌ను కేంద్రమంత్రి మర్యాద పూర్వకంగా కలిసారు. ఉదయం రాజ్ భవన్ చేరుకున్న ఆయన గవర్నర్ తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్ లోనే అల్పాహార విందును స్వీకరించిన కేంద్ర మంత్రి.. అనంతరం గవర్నర్ తో పలు అంశాలను చర్చించారు. నిధులు,ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఓఎన్జిసి కేజీ బేసిన్ ను సందర్శించాలని గవర్నర్ ను ఆహ్వానించారు. ఉక్కు శాఖను కూడా నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు కర్మాగారానికి కూడా రావాలని హరిచందన్ ను కోరారు. ఇటీవల గవర్నర్ విశాఖపట్నంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ సంస్థను సందర్శించగా, అక్కడ చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కూడా వీరిరువురి మధ్య లోతైన చర్చ నడిచింది. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి అర్జున రావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మద్య నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని సీఎం చెప్పారు. బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరుకే మాత్రమే బార్లలో మద్యం అమ్మకాలు సాగించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
ఏపీలో ‘మత్తు’ వదులుతోంది
సాక్షి, అమరావతి: మద్య నియంత్రణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అక్టోబరు నెలలో గణనీయంగా మద్యం విక్రయాలు, వినియోగం తగ్గుముఖం పట్టాయి. అంతేకాక ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండటంతో నిర్ణీత సమయానికే వాటిని మూసివేస్తున్నారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేయడంతో గతానికి భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అందించిన తాజా వివరాలు ప్రకారం.. 2018 అక్టోబరులో 32,28,366 కేసులు లిక్కర్‌ను విక్రయించగా, 2019 అక్టోబరులో మాత్రం 23,60,089 కేసులు మాత్రమే అమ్మారు. గతేడాది అక్టోబరు నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరు నెలలో మద్యం విక్రయాలు 27 శాతం తగ్గాయి. అదే బీరు అమ్మకాలు చూసుకుంటే 2018 అక్టోబరులో 23,86,397 కేసులు అమ్ముడు కాగా, ఈ ఏడాది అక్టోబరులో 10,40,539 కేసులు మాత్రమే విక్రయించారు. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 56.4 శాతం తక్కువగా బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం వచిన తర్వాత రాష్టంలో ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను 4380 నుంచి 3500కు తగ్గించడమే కాకుండా, మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టడంతో విక్రయాలు బాగా తగ్గాయి. మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకూ పరిమితం చేయడం అమ్మకాలు తగ్గడానికి మరో కారణం. బెల్టుషాపులు కనుమరుగు.. మరోవైపు గ్రామాల్లో కూడా బెల్టుషాపులు కనుమరుగయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామాల్లో నిరంతరం నిఘా పెంచుతున్నారు. బెల్టుషాపుల ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం ఉన్న ప్రదేశాలపై నిఘాను పటిష్టం చేశారు. మద్యం అమ్మకాలు గ్రామాల్లో జరగనీయవద్దంటూ పోలీసులు నేరుగా ఆయా గ్రామంలోని పెద్దలకు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మరో వైపు మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మద్య నియంత్రణ, నిషేధం దిశగా వేస్తున్న అడుగుల్లో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటులో భాగంగా మహిళా పోలీసులను నియమించడం ద్వారా మద్య నియంత్రణ, నిషేధం దిశగా తీసుకుంటున్న చర్యల అమలుపై ప్రభుత్వం తన సంకల్పాన్ని గట్టిగా చాటింది. -
‘సంచలనాత్మక నిర్ణయాలు అమలు చేశారు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావు, విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రం.. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటుకు మహానుభావుడు పొట్టి శ్రీరాములు చేసిన కృషి అనిర్వచనీయం అని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగాన్ని నేడు స్మరించుకోవాల్సిన రోజు అని అన్నారు. సంచలన నిర్ణయాలు అమలు చేశారు.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలోనే సంచలనాత్మమైన నిర్ణయాలు అమలు చేశారన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా సచివాలయాల ఉద్యోగాల భర్తీ అత్యంత చారిత్రాత్మకం అని కొనియాడారు. గత నాలుగు నెలల కాలంలోనే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని వెల్లడించారు. పాడేరులో త్వరలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు కాబోతోందని తెలిపారు. విశాఖ నగర వాసులకి తాగునీటి సమస్య తీర్చేలా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. విశాఖలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ తెలిపారు. గత ప్రభుత్వం విస్మరించింది.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గత టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అమరజీవి పొట్టి శ్రీరాములను స్మరించుకోవడానికే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోందన్నారు. నేడు తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజు అని వెల్లడించారు. పవిత్రదినంగా పాటించాలి.. ఆంధ్రులకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. నవంబర్ 1ని పవిత్ర దినంగా పాటించాలని సూచించారు. చరిత్రలో నిలిచిపోయిన రోజు.. ‘నవంబర్ 1’ చరిత్రలో నిలిచిపోయిన రోజు అని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు. నాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖపట్నం అభివృద్ధి జరిగిందని గుర్తుచేశాడు. నేడు సీఎం వైఎస్ జగన్ విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. పొట్టి శ్రీరాముల త్యాగాన్ని ప్రతి ఏటా స్మరించే అవకాశాన్ని సీఎం వైఎస్ జగన్ కల్పించారన్నారు. -
త్యాగ ధనులను స్మరించుకుందాం
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో విజయవాడ బాపు మ్యూజియంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేసిన బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెలలో ప్రారంభిస్తారని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ మ్యూజియం ప్రజలకు అందుబాటులో రానుందని చెప్పారు. ఈ వేడుకల్లో పాల్గొనడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పన చేసి జాతికి ఇక్కడ నుంచే అందించారని పేర్కొన్నారు. దేశం గర్వించేలా తెలుగు జాతి కీర్తిని పింగళి వెంకయ్య దశదిశలా వ్యాపింప చేశారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన విక్టోరియా మ్యూజియం అభివృద్ధికి అన్ని విధాల సహకరించి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన త్యాగ ధనుల ప్రాణ త్యాగాలను అందరూ స్మరించుకునేలా ఈ వేడుకలు జరగాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని మంత్రి కన్నబాబు తెలిపారు. గత ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని పట్టించుకోలేదు.. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నవంబర్ 1 అనగానే రాష్ట్ర ప్రజలకు పొట్టి శ్రీరాములు గుర్తుకు వస్తారని చెప్పారు. గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. సమావేశాల పేరుతో విద్యార్థులను ఎండల్లో కూర్చోపెట్టారని.. నవ నిర్మాణ దీక్షల పేరుతో వేల కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. 1921 ఏప్రిల్ 1న విక్టోరియా మ్యూజియంలో జాతీయ జెండా రూపకల్పనకు చర్చలు జరిగాయని గుర్తు చేశారు. పింగళి వెంకయ్య ఈ మ్యూజియంలో తాను రూపొందించిన జాతీయ జెండాను గాంధీకి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మ్యూజియంలో లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తామని మల్లాది విష్ణు వెల్లడించారు. -
‘పార్టీలకు అతీతంగా క్రీడలకు ప్రాధాన్యత’
సాక్షి, విశాఖపట్నం: విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లో రాణిస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన గురువారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ స్టేట్ క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 12 వరుకు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 50 సంవత్సరాల వేడుకలను విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరుపుతామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో ఎవరికీ లేని గౌరవం క్రీడాకారులకు ఉంటుందన్నారు. పార్టీలకతీతంగా క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. క్రీడలకు సహకారం అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విశాఖలో స్పోర్ట్స్ హబ్ నిర్వహణ పూర్తిస్థాయిలో కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని మంత్రి కృష్ణదాస్ వెల్లడించారు. -
జీర్ణ దేవాలయాలను ఉద్ధరించిన జీవో
ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలంగా అర్చకులు కంటున్న కలలు నెరవేరేలా గత సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగ భద్రత, అర్హత కలిగిన వారసత్వ గుర్తింపు, చిన్న దేవాలయాలపై దేవాదాయ శాఖ పెత్తనాన్ని తొలగించే ఈ ఉత్తర్వుల కోసం అరకొర జీతాలతో, సదుపాయాలతో గ్రామాల్లో దేవాలయాల్ని అంటి పెట్టుకొని జీవిస్తూ ఉన్న అర్చకులు ఎదురుచూస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఇది సాధించటం కోసం అర్చక సమాఖ్య ప్రతినిధులు తిరగని ఆఫీసు లేదు, కలవని అధికారులు, రాజకీయ నాయకులు లేరు. 1987లో మొదలైన ఈ కష్టాలకు 2007లో రాజశేఖర్ రెడ్డి చట్ట సవరణ ద్వారా వెసులుబాటు కల్పిస్తే ఒక దశాబ్దం తర్వాత దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణ రూపంలో తీసుకువచ్చారు. 2017 లో ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ముసాయిదా తయారై జీవో 76 రూపంలో విడుదలైనా, ఆనాటి ప్రభుత్వం వాటిని నిర్ధారించకుండానే వదిలేసింది. ఈరోజు శాశ్వత ప్రాతిపదికలో జీవో 439 ద్వారా ఆ అంశాలను నిర్ధారించారు. 1987వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని సమూలంగా చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సు మేరకు సవరించి నూతన చట్టాన్ని తీసుకువచ్చారు. అంతవరకు ఉన్న వ్యవస్థను నాశనం చేయడంలో ఈ చట్టం సఫలీకృతం అయింది. కానీ దానికి ప్రత్యా మ్నాయంగా మరొక విధానాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చట్టంలో ఎక్కడా కనిపించలేదు. సంస్కరణ ప్రధానంగా కాకుండా, ఎవరి మీదనో ద్వేషంతో, కోపంతో చట్టాలు తీసుకొని వస్తే దాని దుష్పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఈ చట్ట సవరణలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని మిరాసి హక్కులను తొలగించారు. ఈ మొత్తం చట్టంలో హర్షించదగిన సంస్కరణ ఇది ఒకటి. మరి ఇంక ఏ దేవాలయంలో లేని విధంగా తిరుమల దేవాలయంలో స్వామి వారికి సేవ చేసినందుకు ఆలయ ఆదాయంలో రకరకాల సేవలకు భాగం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మిరాసీలు చాలా ఉన్నా ప్రధానమైనది అర్చక మిరాసి. ఆలయ ఆదాయం పెరగటంతో మిరాసీదారులకు కూడా ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. ఈ మిరాసి రద్దుతోపాటు వారసత్వ హక్కు, చిన్న గ్రామాలలో అర్చకులకు వచ్చే దక్షిణలు, దేవాలయాల్లో సేవ చేసినందుకు ఏర్పాటుచేసిన సర్వీస్ ఈనాములను రద్దు చేశారు. దేవాదాయ శాఖను విస్తృతపరచి ఆదాయం లేని చిన్న చిన్న దేవాలయాలను కూడా దేవాలయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న దేవాలయాలను వాటిని అంటిపెట్టుకుని అరకొర ఆదాయంతో పనిచేస్తున్న అర్చకులను ఈ సంస్కరణ బాగా దెబ్బ తీసింది. వారికున్న చిన్న ఆదాయపు వనరులను తీసివేశారు కానీ, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఎటువంటి వనరులను ఏర్పాటు చేయలేకపోయింది. చిన్న ఆలయాల నిర్వహణకు ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటి అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేక పోయింది. ఈ అంశాన్ని పరిశీలించి సుప్రీంకోర్టు ఇచ్చిన భిన్న ఉత్తర్వులను అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో తాత్సారం ప్రదర్శించింది. రాజకీయంగా పట్టించుకోని, స్పందిం చని నిరంకుశ ప్రభుత్వం, అవినీతిమయమైన, చలనం లేని దేవాదాయ, ధర్మాదాయ శాఖతో ఆ రోజుల్లో చిన్న దేవాలయాల్లోని పురోహితులు పడిన కష్టాలు వర్ణనాతీతం. చట్ట సవరణ వారికి వ్యతిరేకంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మొదలెట్టారు. అధికార యంత్రాంగం విస్తరించి చిన్న దేవాలయాలు కూడా వారి పరిధిలోకి రావటంతో ఆ వచ్చే అరకొర ఆదాయం ఈ అధికారుల జీతాలకే సరిపోయింది. ఈ సమస్య కేవలం అర్చకులకే కాదు. దేవాలయానికి ఇతరత్రా సేవలు చేస్తున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు మొదలైనవారు కూడా అనుభవించారు. ఈ చిన్న చిన్న కులాల వారి కుండే సర్వీస్ ఈనాములను కూడా తొలగించారు. గ్రామాలలోని చిన్న దేవాలయాల్లో చాలామంది బ్రాహ్మణ కులాలకు సంబంధించని లింగాయతులు, బోయలు, తంబళ్ల కులస్తులు, చాద్ధాట వైష్ణవులు అర్చకత్వం నిర్వహిస్తుంటారు. వీరందరు కూడా ఈ నూతన చట్టంతో తరతరాల వృత్తిని వదిలి పెట్టలేక, సరైన జీవనభృతి లేక కష్టాలు అనుభవించారు. ఈ సమయంలో చిన్న గ్రామాలలోని దేవాలయాల అర్చకుల తరఫున నాయకత్వం వహించి దేవాలయాల పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిన ఘనత చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎమ్వీ సౌందర్‌రాజన్‌కి దక్కు తుంది. సుప్రీంకోర్టు దాకా ఈ అంశంపై జరిగిన కేసులలో వీరు చాలా ప్రధాన పాత్ర పోషించారు. ప్రజాభిప్రాయాన్ని చిన్న దేవాలయాల అర్చకుల సమస్యలు అర్థం చేసుకునే విధంగా కూడగట్టడంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. సుప్రీంకోర్టు తన తీర్పులో చిన్న దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక విధానాలు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఆనాటి మంద తోలు మూర్ఖ ప్రభుత్వం ఈ సమస్యలపై కమిటీలు వేయడం వరకే పరిమితం అయింది కానీ సమస్య పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపలేదు. ప్రభుత్వ అధినేతల నిర్లక్ష్య ధోరణితో ఏకపక్షంగా అధికారులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అర్చకులను ఎటువంటి పారితోషికం లేకుండా పదవీ విరమణ చేయించటం, వారి వారసులకు అర్చకత్వం బాధ్యతలు ఇవ్వకపోవటం సాధారణమైపోయింది. ఈ వేధింపులు తాళలేక మహబూబ్‌నగర్ జిల్లా అలంపురంలో భీష్మ సేనా చారి అనే పురోహితుడు గుడిగంటకు ఉరి వేసు కుని 2001లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. 2004లో ప్రభుత్వం మారటంతో ఈ సమస్యపై నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దృష్టి సారించింది. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అఖిలపక్ష సిఫార్సు మేరకు చట్టాన్ని సవరించి వారసత్వ హక్కులను గుర్తించింది. ఆ చట్ట సవరణకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది.. రాష్ట్రంలో ఆదాయం బాగా వచ్చేటటువంటి దేవాలయాలు చాలా కొద్ది మాత్రమే. ఆ ఆలయా లకు చిన్న గ్రామాలలో ఉండే ఆలయాలకు ఒకే విధమైన విధివిధానాలు ఉండాలి అనుకోవడం అవివేకం. గ్రామాలలోని చిన్న దేవాలయాలను ప్రత్యేకంగా పరిగణించి గ్రామ సమాజం యొక్క ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో అధికార యంత్రాంగం నియంత్రణ లేకుండా నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి ఈ విధి విధానాలు ఆ లక్ష్య సాధనకు తప్పకుండా ఉపయోగపడతాయి. అర్హతలేని వారసత్వానికి ఎక్కడా తావులేదు. ప్రభుత్వం కూడా సరైన విధానాలు ఏర్పాటు చేసి, సరైన ప్రావీణ్యం ఉన్నవారే ఎంపిక అయ్యేటట్లు చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా వారికి ఇచ్చే పారితోషికం తగిన స్థాయిలో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. పెద్ద దేవాలయాల ఆదాయాన్ని దీనికి కేటాయించడం ద్వారా కనీసం అర్చ కునికి 15 వేల రూపాయల నెలసరి పారితోషికం వచ్చేట్టుగా ఏర్పాట్లు చేయవచ్చు. అదేవిధంగా ధార్మిక ఉద్యోగులను దేవాదాయశాఖ పరిధి నుంచి తొలగించి ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేవలం హిందూ ధర్మంపై అవగాహన, విశ్వాసం ఉన్న వారితో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దేవాలయాల ఆస్తులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. విద్యాసంస్థల పేరుతో, మరొక పేరుతో చాలామంది చౌకగా దేవాదాయ భూములు ఆక్రమించుకున్నారు. మరికొందరు చట్టవిరుద్ధంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. వీరందరిని దేవాదాయ భూముల నుంచి తొలగించి భూములు ఆలయాలకు చెందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సరైన ఆదాయవనరులు ఏర్పడి దేవాలయాలు సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. అర్హత కలిగిన అర్చకులు, న్యాయబద్ధమైన పారితోషికం ఉన్ననాడు గ్రామాలలోని దేవాలయాలను హిందూధర్మ పరిరక్షణ ప్రచార కేంద్రాలుగా తీర్చిదిద్దవచ్చు. అర్చకులలో సామాజిక స్పృహ ఒక ప్రధాన బాధ్యతగా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు ప్రభుత్వం తీసుకున్న చర్య స్వాగతింపదగినది. భవిష్యత్తులో గ్రామాలలో దేవాదాయ వ్యవస్థను బలోపేతం చేయటానికి మరిన్ని చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
చేనేతలకు కొండంత అండ
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో సొంతంగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలందరికీ వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చేనేత జౌళి శాఖ రాష్ట్రంలో నిర్వహించిన సర్వే ప్రకారం 13 జిల్లాల్లో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలు 75,243 ఉన్నట్లు గుర్తించారు. ఈ కుటుంబాలకు డిసెంబర్ నెలలో రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రూ.180.58 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు. బడ్జెట్లో చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం రూ.200 కోట్లు కేటాయించారు. ఇంకా అర్హులైన కుటుంబాలు ఉంటే వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తారు. సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా.. మగ్గం ఉన్న ఒక చేనేత కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నప్పటికీ ఒక యూనిట్‌గానే తీసుకుని రూ.24 వేలు అందిస్తారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి దారిద్య్ర రేఖకు దిగువనున్న చేనేత కుటుంబాలే అర్హతగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చేనేత, జౌళి శాఖ సర్వే ఆధారంగా గ్రామ, వార్డు వలంటీర్లు క్షేత్ర స్థాయిలో చేనేత కుటుంబాల తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులోగా తనిఖీలను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. వలంటీర్ల తనిఖీల అనంతరం ఇంకా ఎవరైనా అర్హులుగా తేలితే వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. జిల్లా కలెక్టర్లు అర్హులైన చేనేత కుటుంబాల జాబితాలను ఆమోదించాల్సి ఉంది. అర్హులైన చేనేత కుటుంబాల నిర్ధిష్ట బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలను ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్లు అందజేయాల్సి ఉంటుంది. వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ వాలాలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించిన తరహాలోనే చేనేత కుటుంబాలకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా నేరుగా నగదు బదిలీ చేయనున్నారు. -
తుది అంకానికి ఆమోదం
సాక్షి, అమరావతి: పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోద ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ జాయింట్ కమిషనర్, ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్‌గుప్తా నేతృత్వంలో సమావేశమైన రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ (ఆర్ఈసీ)సవరించిన అంచనాలను ఆమోదించింది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ కింద చెల్లించే పరిహారాన్ని ఎలా లెక్కగట్టారో ఈనెల 31న వివరణ ఇస్తే నవంబర్ 1న లేదా 2న కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపుతామని స్పష్టం చేసింది. ఈ నివేదికపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేస్తే పోలవరానికి సవరించిన అంచనాల ప్రకారం నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లతో పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఇప్పటికే ఆమోదించింది. సీడబ్ల్యూసీ టీఏసీ నివేదికపై కేంద్ర జల్‌శక్తి శాఖ జాయింట్ కమిషనర్ జగ్‌మోహన్‌గుప్తా నేతృత్వంలో పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో ఆర్కే జైన్, సీడబ్ల్యూసీ పీఏవో విభాగం డైరెక్టర్ అతుల్‌జైన్, కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్ అమర్దీప్సింగ్ చౌదరి, కేంద్ర ఆర్థిక శాఖ ప్రాజెక్టు కాస్ట్ ఎనాలసిస్ విభాగం డైరెక్టర్ ఉపేంద్రసింగ్‌లు సభ్యులుగా ఏర్పాటైన ఆర్ఈసీ గురువారం సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనుల అంచనాలకు ఆమోదం.. పోలవరం పనుల సవరించిన అంచనా వ్యయం రూ.22,380.63 కోట్లు. ఇందులో హెడ్‌వర్క్స్ వ్యయం రూ.9734.34 కోట్లు కాగా ఎడమ కాలువ వ్యయం రూ.4202.69 కోట్లు, కుడి కాలువ వ్యయం రూ.4318.96 కోట్లు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4124.64 కోట్లు ఉంది. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై సీడబ్ల్యూసీ టీఏసీ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం లభించింది. పోలవరం భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ సవరించిన అంచనా వ్యయం రూ.33,168.24 కోట్లు. ఇందులో హెడ్ వర్క్స్‌లో ముంపునకు గురయ్యే భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ వ్యయం రూ.29,270.52 కోట్లు కాగా ఎడమ కాలువ భూసేకరణ వ్యయం రూ.2002.55 కోట్లు. కుడి కాలువ భూసేకరణ వ్యయం రూ.1895.17 కోట్లు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనకు సంబంధించి పోలవరం ముంపు మండలాల్లో కొన్ని చోట్ల భూసేకరణ అవార్డులను కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్ అమర్‌దీసింగ్ ప్రస్తావిస్తూ 2014కి ముందు ఎకరానికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తే తర్వాత సగటున రూ.11.52 లక్షల చొప్పున పరిహారం చెల్లించారని దీన్ని ఎలా లెక్క గట్టారని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక భూమి మార్కెట్ విలువ ఎకరం రూ.3.50 లక్షలు అయిందని, దీనికి రెండున్నర రెట్లు ‘సొలీషియం’ కలిపితే రూ.11.52 లక్షలు అవుతుందని, కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలు వీటిని లెక్క కట్టాయని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ వెంకటేశ్వరరావులు వివరించారు. (‘సొలీషియం’ అంటే భూమి కోల్పోవటం వల్ల జీవనోపాధులపై పడే ప్రభావం ఆధారంగా చెల్లించే పరిహారం) నిర్వాసితులకు ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణానికి తక్కువ ఖర్చు అవుతుందని, కానీ పోలవరం నిర్వాసితులకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని.. పునరావాస కల్పన మొత్తాన్ని ఎలా లెక్క కట్టారని అమర్దీప్ సింగ్, ఉపేంద్రసింగ్‌లు ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పందిస్తూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముంపు గ్రామాల్లో నిర్వాసితులు కోల్పోయిన ఇళ్లలో ఒక్కో ఇంటికి సగటున రూ.మూడు లక్షలు, ఇళ్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇంటి నిర్మాణానికి రూ.3.15 లక్షలు, నిర్వాసిత కుటుంబాలకు రూ.6.86 లక్షల చొప్పున పరిహారం, పునరావాస కాలనీల్లో 24 రకాల మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.ఏడు లక్షల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. సవరించిన అంచనాల మేరకు నిధులిస్తే 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. నిధుల మంజూరులో జాప్యం జరిగితే ఆ ప్రభావం పనులపై పడి అంచనా వ్యయం పెరిగేందుకు దారి తీస్తుందన్నారు. ఆయన వివరణతో ఆర్ఈసీ సభ్యులు ఏకీభవించారు. ఇదే తుది సమావేశం.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలకు సంబంధించి ఇదే తుది సమావేశమని ఆర్ఈసీ చైర్మన్ జగన్మోహన్గుప్తా స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం, నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీకి వ్యయాన్ని ఎలా లెక్క కట్టారనే వివరాలతో అధికారులను ఈనెల 31న ఢిల్లీకి పంపాలని అమర్దీప్సింగ్ సూచించారు. ఆ తర్వాత సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపుతామన్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి అమర్దీప్ సింగ్, ఉపేంద్ర సింగ్‌లు వివరించనున్నారు. వారిద్దరూ ఆర్ఈసీలో సభ్యులు. ఈ నేపథ్యంలో ఆర్ఈసీ నివేదిక ఆధారంగా పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర లాంఛనమేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరానికి కేంద్ర ఆర్థిక శాఖ నాబార్డు ద్వారా నిధులను విడుదల చేస్తుంది. వారంలో ఆర్ఈసీ నివేదిక.. ‘పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ఆర్ఈసీ సమగ్రంగా చర్చించింది. ప్రాజెక్టు పనుల వ్యయానికి సంబంధించి ఆమోదం తెలిపింది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయాన్ని ఎలా లెక్క కట్టారనే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్ అమర్దీప్ సింగ్ వివరణ కోరారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం మార్కెట్ విలువకు రెండున్నర రెట్లు సొలీషియం కలిపి పరిహారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని.. ఆ లెక్క ప్రకారమే సగటున రూ.11.52 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నామని వివరించాం. ఇదే చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీని అమలు చేస్తున్నామని తెలిపాం. సహాయ పునరావాస ప్యాకేజీ విభాగం అధికారులను 31న ఢిల్లీ పంపాలని అమర్దీప్సింగ్ సూచించారు. నవంబర్ 1న లేదా 2న కేంద్ర ఆర్థిక శాఖకు ఆర్ఈసీ నివేదిక పంపుతుంది. దాని ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటుంది. పోలవరాన్ని 2021కి పూర్తి చేయాలంటే సవరించిన అంచనాల మేరకు నిధులు ఇవ్వాలని కోరాం’ – ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర జలవనరుల శాఖ 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం లెక్కింపు ‘భూసేకరణ చట్టం 2013 ప్రకారమే భూసేకరణ పరిహారం, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయాన్ని లెక్కించాం. ఇదే అంశాన్ని ఆర్ఈసీకి వివరించాం. అమర్దీప్ సింగ్ ప్రస్తావించిన అంశాలపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 31న సహాయ పునరావాస ప్యాకేజీ విభాగం అధికారులను ఢిల్లీ పంపుతాం. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖకు ఆర్ఈసీ నివేదిక పంపుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ ఏవైనా సందేహాలను వ్యక్తం చేస్తే అమర్దీప్సింగ్, ఉపేంద్రసింగ్‌లే నివృత్తి చేస్తారు’ – ఎం.వెంకటేశ్వరరావు, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
10 రోజులు డెడ్‌లైన్ పెట్టాం: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలా కళాశాలలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని తెలిపారు. కోచింగ్‌లు పేరుతో పెడుతున్న బోర్డులను కళాశాల యాజమాన్యాలు వెంటనే తొలగించాలన్నారు. 699 కాలేజీల బోర్డులను తొలగించామని..1300 కాలేజీలకు 10 రోజులు డెడ్‌లైన్ పెట్టామని వెల్లడించారు. అన్ని కళాశాలల బోర్డులు ఒకేవిధంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఆటస్థలాలు, ల్యాబ్‌లు లేకుండా కాలేజీలు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలలకు ఫైర్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని లేకపోతే చర్యలు చేపడతామన్నారు. ఇంటర్ సిలబస్‌లో కూడా మార్పులు తీసుకొస్తాం.. 2013 తరువాత ఇంటర్ బోర్డ్ సమావేశం కూడా నిర్వహించని దుస్థితి ఏర్పడిందని మంత్రి ఆదిమూలపు అన్నారు. ఇంటర్ సిలబస్‌లో కూడా మార్పులు తీసుకొస్తామన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు క్రమబద్దీకరణకు ఉపసంఘం వేశామని చెప్పారు. శాశ్వత ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ కళాశాలలు 50 వేలు నుండి 2.50 లక్షలు ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని.. వాటిపై రెగ్యులేటరీ కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రైవేట్ హాస్టళ్ల చట్టాన్ని కూడా సవరిస్తామని తెలిపారు. ఫిర్యాదులు ఆన్లైన్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. సమస్యలుంటే ఇంటర్ విద్యార్థులు ourbieap@gmail.com, 9391282578 నెంబరుకు ఫిర్యాదు చేయొచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. -
రివర్స్ టెండరింగ్‌తో రూ.900 కోట్లు ఆదా..
సాక్షి, నెల్లూరు: రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అయిందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాజెక్టుల్లో దాదాపు రూ.4 నుంచి 5వేల కోట్ల వరకు నిధులు ఆదా అవుతాయన్నారు. పోలవరం రివర్స్ టెండర్లలో నవయుగ సంస్థను కూడా పాల్గొనాలని ఆహ్వానించామని తెలిపారు. టీడీపీ హయాంలో టెండర్ పొందిన రిత్విక్ సంస్థ వెలుగొండ రివర్స్ టెండరింగ్‌లో తక్కువకే టెండర్ వేసిందని పేర్కొన్నారు. నిధులు ఆదా చేసిన ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు అభినందించాలన్నారు. రివర్స్ టెండరింగ్ లేకపోతే ఈ నిధులు ఏ బాబు జేబులోకి వెళ్లేవో అందరికీ తెలుసునన్నారు. మంచి మనసున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం వలనే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు కళకళలాడుతున్నాయని మంత్రి అనిల్‌కుమార్ అన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితుల సంబరాలు..
సాక్షి, విశాఖపట్నం: అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. తొలి విడతలో రూ.10వేలలోపు డిపాజిట్లు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో బాధితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అగ్రిబాధితులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో జరిగిన సంబరాల్లో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పదివేల లోపు అగ్రి బాధితులు 52వేల మంది ఉన్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అగ్రి బాధితుల జీవితాలతో చెలగాటం ఆడుకుందన్నారు. అదే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసి వారి కళ్లల్లో ఆనందం నింపారన్నారు. వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడు నడింపల్లి కృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నాలుగు నెలల్లోనే అమలు చేశారన్నారు. కార్యక్రమంలో విశాఖ తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, మొల్లి అప్పారావు, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ప్రేమ్‌బాబు, నగర అనుబంధసంఘాల అధ్యక్షులు బోని శివరామకృష్ణ, కాళిదాస్‌రెడ్డి, రామన్నపాత్రుడు, మాజీ కార్పొరేటర్లు రామకృష్ణరెడ్డి, లక్ష్మీరాము, చొక్కరశేఖర్, వార్డు అధ్యక్షులు పీతల గోవింద్, రవికుమార్, గిరిబాబు, గణేష్ రెడ్డి, కనకరాజు పాల్గొన్నారు. -
‘గోల్డ్’లాంటి కబురు
సాక్షి, విశాఖపట్నం నెట్వర్క్: ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. ఎన్నికలకు ముందు ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాధితులకు హితవు పలికిన విధంగానే..పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలోనే హామీ ఇచ్చిన విధంగా రూ.10వేల లోపు డిపాజిటర్లకు న్యాయం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 13 జిల్లాల్లో రూ.10 వేలలోపు డిపాజట్లు 3,69,655 మందికి పంపిణీ చేయనున్నారు. ఇందులో తొలి దశలో జిల్లా 52,005 డిపాజిటర్లకు సుమారుగా రూ.46 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో ఉన్న బాధితులందరిలోనూ పండగ వాతావరణం నెలకొంది. నగరంలో పలుచోట్ల సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడు నడింపల్లి కృష్ణంరాజు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ‘అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయాలని చూసిన టీడీపీ నేతలు’ అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు చెల్లించాల్సి ఉందని, కానీ ఆ ఆస్తులను దోచుకోవడానికి చంద్రబాబు అండ్ కో బృందం కుట్ర పన్నుతుందని పలువురు నాయకులు దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉండగా, వీరిలో 9 లక్షల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బాధితులు ఉన్నారు. చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ స్వార్థ రాజకీయాల కోసం డిపాజిట్ దారులకు వేదన మిగిల్చారని, అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలవాల్సిన గత ప్రభుత్వం సంస్థ ఆస్తులు కబ్జా చేసేందుకు అధిక ప్రయత్నాలు చేసిందని అన్నారు. సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం.. ఆరేళ్ల క్రితం రూ.10వేలు డిపాజిట్ చేశాను. నెలకు వెయ్యి రూపాయల చొప్పున పాలసీ కట్టాను. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు నెలల్లో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు మా కుటుంబంలో మరో రూ. 60 వేలు కూడా డిపాజిట్ చేశాం. జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. –ఎ. వెంకటలక్ష్మి, హెచ్‌బీ కాలనీ. మా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న వెంటే.. మా పిల్లల పేరు మీద డిపాజిట్లు చేశాం. అప్పట్లో రూ.10వేలు, రూ.10 వేలు చొప్పున రెండు పాలసీలు చేశాం. మొత్తం రూ.20 వేలు డిపాజిట్ చేశాం. డబ్బు తక్కువే కావొచ్చు కానీ. మా లాంటి పేద కుటుంబాలకు ఇదే ఆసరా. అవి కూడా పోయేసరికి చాలా బాధనిపించింది. టీడీపీ నేతలకు ఎన్నోసార్లు గత ఐదేళ్లలో మోరపెట్టుకున్నాం. నిరాశే మిగిలింది. అలాకాకుండా ఎన్నికలకు ముందు హామి ఇచ్చిన జగనన్న తన తండ్రిలాగే మాట తప్పకుండా మాలాంటి పేదలు ఎందరినో కాపాడారు. మాప్రాణం ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటాం. –సీహెచ్ మోహిని, వెంకోజీపాలెం. కష్టపడి సంపాదించిన డబ్బులు పోయాయి .. నేను రోజూ కూలి చేసుకున్న సంపాదనను మా పిల్లలకు ఆసరాగా ఉంటాయని నెలకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ.20 వేల రూపాయలు డిపాజిట్ చేశాను. నాకు తెలియకుండా నా భర్త కూడా నెలకు 1200 చొప్పున 12 నెలలు డిపాజిట్ చేశారు. మొత్తం పోయే సరికి చనిపోవాలనిపించింది. ఇప్పుడు జగన్ బాబు ఇస్తున్నాడని తెలిసి చాలా ఆనందంగా ఉంది. –పచ్చిపాల తవుడమ్మ, మహారాణిపేట మా ఇంట్లో సంబరాలు చేసుకున్నాం.. నేను టీ షాపు పెట్టుకుని జీవిస్తున్నాను. దానిపై వచ్చే ఆదాయం డిపాజిట్ల పేరిట రూ.60 వేలు కట్టాను. మరో పాలసీ రూ.54 వేలు కట్టాను. రెండూ పోయే సరికి నెలరోజుల పాటు నిద్ర కూడా పట్టలేదు. మా పిల్లలు భవిష్యత్తుకు పనిచేస్తాయని డిపాజిట్ చేస్తే మోసం చేశారని బాధపడ్డాం. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు న్యాయం చేశారు. –అమర భాగ్యలక్ష్మి, మద్దిలపాలెం. సీఎంకు కృతజ్ఞతలు.. అగ్రిగోల్డ్ బాధితులకు 10వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషంగా ఉంది. కష్టపడిన డబ్బులను అగ్రిగోల్డ్‌లో దాచుకోవడం జరిగింది. సంస్థ మూసివేయడంతో డబ్బులు వస్తాయో లేదా అర్థం కాలేదు. నూతన ప్రభుత్వం 10వేల లోపు ఉన్నవారికి చెల్లించేందుకు చర్యలు చేపట్టడం సంతోషంగా ఉంది. –మన్నా వీరస్వామి, అనంతగిరి -
అందుకే ‘ఆంధ్రజ్యోతి’కి భూకేటాయింపు రద్దు
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో రూ.40 కోట్లు విలువ చేసే భూమి కేవలం రూ.50.05 లక్షలకే కేటాయింపు.. జాతీయ రహదారుల విస్తరణలో ఎకరం భూమి కోల్పోతే దానికి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండగా అలా చేయకుండా అత్యంత ఖరీదైన చోట 1.5 ఎకరాలు కేటాయింపు.. జిల్లా కలెక్టర్ అభ్యంతరపెట్టినా ఖాతరు చేయని వైనం. ఇవీ.. గత ప్రభుత్వం ఆంధ్రజ్యోతి దినపత్రికకు నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ఆర్థిక ప్రయోజనం కల్పించిందో చెప్పడానికి నిదర్శనాలు. జిల్లా కలెక్టర్, సీసీఎల్‌ఏలు కనీసం రూ.7.26 కోట్లకు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించినా పెడచెవిన పెడుతూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అర ఎకరం భూమిని కేవలం రూ.5 వేలకు, మరో ఎకరం భూమిని రూ.50 లక్షలకు ఆంధ్రజ్యోతికి చెందిన ఆమోదా పబ్లికేషన్‌కు కేటాయించేశారు. వ్యాపారం చేసుకునే సంస్థకు ప్రజాప్రయోజనాల పేరుతో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టడంపై విశాఖ వాసి ఒకరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నేరుగా ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ వ్యవహారం బయటకొచ్చింది. విశాఖపట్నం నడిబొడ్డున మధురవాడలోని పరదేశీ పాలెంలో సర్వే నెంబర్లు 191/10–14 వరకు ఉన్న 1.5 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని తేలడంతో ప్రజాప్రయోజనాల దృష్టా ప్రభుత్వం ఈ భూకేటాయింపును రద్దు చేసింది. అక్రమ వ్యవహారం ఇలా.. ఎన్‌హెచ్–5 విస్తరణలో భాగంగా ఆంధ్రజ్యోతికి చెందిన ఎకరం భూమిని 1986లో ప్రభుత్వం తీసుకుంది. దీనికి నష్టపరిహారంగా ఏకంగా 1.5 ఎకరాల విలువైన భూమిని కొట్టేయడానికి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కథ నడిపించారు. 2014లో చంద్రబాబు సీఎం కాగానే జిల్లా కలెకర్ట్‌కు విజ్ఞప్తి చేయించారు. సాధారణంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిని సేకరించినప్పుడు నష్టపరిహారం ఇస్తుంది తప్ప బదులుగా ఖరీదైన ప్రాంతంలో అంతే పరిమాణంలో భూమి ఇవ్వదు. అయితే.. చంద్రబాబు ఏకంగా 1.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ జూలై 28, 2017లో నిర్ణయం తీసుకున్నారు. ఆమోద పబ్లికేషన్ భూమి తీసుకొని రెండేళ్లు దాటినా ఇంతవరకు అక్కడ ఎటువంటి పనులూ ప్రారంభించలేదని, ఫిర్యాదు అందిన తర్వాత నోటీసులు జారీ చేయడంతోహడావిడిగా బుల్డోజర్లు, జేసీబీలు తీసుకొచ్చి చదును చేయడం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ నివేదికలో పేర్కొనడంతో ప్రభుత్వం భూకేటాయింపును రద్దు చేసింది. (చదవండి: అక్రమ ఆమోదంపై వేటు) -
విశాఖ భూ కుంభకోణాలపై సిట్
మితిమీరిన బంధుప్రీతి, భూదాహంతో విశాఖ భూములను చెరబట్టి అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు సాగించిన భూకబ్జాల నిగ్గు తేల్చి, దోషులపై చర్యలు తీసుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. వందల కోట్లలో సాగిన ఈ కుంభకోణాలపై విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించింది. వాస్తవానికి అప్పట్లోనే భూదందాలను సాక్షి వరుస కథనాలతో వెలుగులోకి తేవడం.. రచ్చ కావడంతో అప్పటి టీడీపీ సర్కారు సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. కానీ కబ్జాకాండల్లో పాత్రధారులు, సూత్రధారులందరూ తమ పార్టీవారే కావడంతో.. సిట్ సమర్పించిన నివేదికను అప్పటి ప్రభుత్వం తొక్కిపెట్టింది.కాగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి భూ కుంభకోణాలపై పక్కాగా విచారణ జరిపించి.. దోషులు, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ప్రస్తుత ప్రభుత్వం.. తన మాటకు కట్టుబడి సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇద్దరురిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఒక రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జితో కూడిన ఈ బృందం.. జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై మూడు నెలల్లో సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ నగరం, సమీప మండలాలు, ప్రాంతాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా భూ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అది ప్రభుత్వ స్థలమైనా.. ప్రైవేటు స్థలమైనా సరే.. కబ్జాదారులు తమ కబంధ హస్తాల్లోకి తీసుకునేవాళ్లు. డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా దేన్నీ వదల్లేదు. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. కొందరు అధికారులు వారితో కుమ్మక్కు కాగా.. మరి కొందరి మెడపై అధికారమనే కత్తి పెట్టి పనులు చేయించుకున్నారు. ఇక రికార్డులు తారుమారు చేయడమనే సరికొత్త భూ దందాకు బహుశా దేశంలోనే మొదటిసారి ఇక్కడే బీజం పడిందన్నది జగమెరిగిన సత్యం. అప్పట్లో సాక్షిలో వరస కథనాలు రావడంతో ఎట్టకేలకు తెలుగుదేశం ప్రభుత్వం సిట్‌ను నియమించినప్పటికీ.. ఆ నివేదిక మాత్రం వెలుగు చూడలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ ప్రభుత్వం రాగానే.. ప్రజల నుంచి వచ్చిన వినతులు, విజ్ఞప్తుల మేరకు భూ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుంబాక విజయసాయిరెడ్డి విశాఖ వచ్చిన సందర్భంలో కూడా.. మరో సిట్ ను నియమించి ఈసారి పక్కాగా విచారణ చేపట్టి.. అక్రమార్కుల అంతుతేలుస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. సిట్ చీఫ్‌గా డా. విజయ్‌కుమార్.. రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారి డా.విజయ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి.భాస్కరరావులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. సిట్ బృందం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని నిర్దేశించింది. సభ్యులుగా అవసరమైతే అర్హులైన వారిని నియమించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం రాత్రి జీవోని విడుదల చేశారు. విధులు.. అధికారాలు.. -సిట్ బృందానికి ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులు, వెబ్‌ల్యాండ్ ఖాతాలను నిశితంగా పరిశీలించే అధికారం ఉంటుంది. -మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూముల రికార్డులను.. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించే అధికారం ఉంది. -ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయన్నదానిపై కమిటీ విచారణ జరుపుతుంది. - రికార్డుల ట్యాంపరింగ్ ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతారు. -భూ వివాదాలు, ఆరోపణలకు సంబంధించి ఏ అధికారినైనా, ఏ వ్యక్తినైనా పిలిచి విచారించే అధికారం సిట్‌కు ఉంది. -ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది. -జిల్లా అధికారులు సిట్‌కు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. -సిట్ బృందానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించింది. అక్రమార్కులను వదిలిపెట్టం : ముత్తంశెట్టి అల్లిపురం(విశాఖ దక్షిణం): భూ ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం కొత్తగా సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన సిట్ భూ ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించినా.. సకాలంలో రిపోర్టును బహిర్గతం చేయలేదన్నారు. భూకబ్జాదారులకు కొమ్ము కాయటమే కాకుండా భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ నాయకులను రక్షించుకునేందుకు సిట్ నివేదికను బుట్టదాఖలా చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్విజయకుమార్, వై.వి.అనురాధ, విశ్రాంత జిల్లా సెషన్స్ జడ్జి టి.భాస్కరరావులతో కూడిన సిట్ మూడు నెలల పాటు పనిచేస్తుందని తెలిపారు. బాధితులు సిట్ సభ్యులను కలసి వివరాలు అందజేయాలని కోరారు. -
సంక్షేమ జాతర
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సంక్షేమ జాతర కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. తాజాగా బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. మత్స్యకార, చేనేత వృత్తులవారు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, న్యాయవాదులు, హోంగార్డులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ వర్గాలకు ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వీటి ద్వారా జిల్లాలో దాదాపు 50 వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ ద్వారా చేనేతలకు సాయం.. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చనున్నారు. ఒక్కొక్క చేనేత కార్మికునికి సంవత్సరానికి రూ.24 వేల మేరకు ప్రభుత్వం సాయం చేయనుంది. ఈనెలాఖరుకల్లా లబ్ధిదారుల రీ వెరిఫికేషన్ పూర్తి చేసి డిసెంబర్ 21 నుంచి అమల్లోకి తేనుంది. ఈ లెక్కన జిల్లాలో 2 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మత్స్యకారులకు రూ.10 వేల చేయూత వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం సాయం చేయాలని నిర్ణయించింది. మెకనైజ్డ్, మోటారైజ్డ్, నాన్ మోటారైజ్డ్ బోట్లు ఉన్న కుటుంబాలకు వర్తింపచేయనుంది. తెప్పలపై సముద్రంలోకి చేపల వేటకు వెళ్లేవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ప్రకారం జిల్లాలో సుమారు 15 వేల మందికి ప్రయోజనం కలగనుంది. వేట నిషేధ సమయమైన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ సాయం వర్తించనుంది. నవంబర్ 21న ఈ పథకం అమల్లోకి రానుంది. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని కూడా 50 శాతం పెంచుతూ కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచనుంది. బంకులో డీజిల్ తెచ్చుకుంటున్న సమయంలోనే సబ్సిడీ లబ్ధి చేకూర్చనుంది. మధ్యాహ్న భోజన కార్మికులు, హోంగార్డులకు వేతన పెంపు.. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం రూ.వేయి నుంచి రూ.3 వేలకు పెంచేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో 6 వేలమంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. హోంగార్డుల డెయిలీ అలవెన్స్‌ను రూ.600 నుంచి రూ.710కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 660మంది వరకు లబ్ధి పొందనున్నారు. జూనియర్ న్యాయవాదులకు తీపి కబురు.. ఎన్రోల్ అయి, మూడేళ్లలోపు ఉన్న జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేల స్టయిఫండ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా అమలు చేయనుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూర్చనుంది. దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు నేరుగా వారి అకౌంట్లకు జీతాలు వేయనుంది. దీనితో మధ్య వర్తుల ప్రమేయం, దోపిడీకి చెక్ పడనుంది. వైఎస్సార్ ఆదర్శం పథకం కింద యువతకు వాహనాలు.. ఇసుక రవాణా, పౌరసరఫరాలు సహా ప్రభుత్వం వాడే ప్రతి రవాణాలో స్వయం ఉపాధికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ట్రక్కుల కొనుగోలుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ట్రక్కు కొనుగోలుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. లబ్ధిదారుడు రూ.50 వేలు కడితే ట్రక్కు వచ్చేలా స్కీమ్ రూపొందించనుంది. కనీసం నెలకు రూ.20 వేలు ఆదాయం వచ్చేలా, ఐదేళ్ల తర్వాత యువతకు ఆ వాహనం సొంతమయ్యేలా చర్యలు తీసుకుంటుంది. కిడ్నీ ఆసుపత్రి పోస్టులకు గ్రీన్ సిగ్నల్.. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన పలాస కిడ్నీ ఆసుపత్రిలో పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిలో 5 రెగ్యులర్ పోస్టులు, 100 కాంట్రాక్ట్ పోస్టులు, 60 అవుట్ సోర్సింగ్ పోస్టులకు మంత్రివర్గం ఆమోదం పలికింది. -
ఆనందోత్సాహాల కల‘నేత’
సాక్షి, విశాఖపట్నం /సాక్షి నెట్వర్క్: సన్నని దారం.. చక్కని పనితనం.. చూపరుల్ని ఆకట్టుకునే వర్ణం.. అందంతోపాటు హాయినిచ్చే మన వస్త్రం.. హుందాతనాన్ని తెచ్చిపెట్టడమే చేనేత గొప్పతనం. వస్త్రాల తయారీలో అద్భుత కళ.. చేనేత. కానీ.. ఈ వృత్తిని నమ్ముకున్న వారి జీవితాలు మాత్రం దుర్భంగానే మిగిలిపోయాయి. అధికారంలోకి రాగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, చేనేత వర్గాలు తీసుకున్న రుణాలన్నీ వడ్డీతో సహామాఫీ చేసేస్తామంటూ ఊదరగొట్టిన టీడీపీ.. గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా వారిని పూర్తిగా విస్మరించింది. కానీ.. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే.. చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా అందిస్తోంది. నేతన్నకు నేస్తంగా ఉంటూ.. వారి జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరించేందుకు చేయూతనిస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగి, ఉపాధి కల్పించే చేనేత రంగం.. అనాదిగా వివక్షకు గురవుతూనే ఉంది. 2014 ఎన్నికల ముందు చేనేత సహకార సంఘాల పరిధిలో ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో పూర్తిగా గాలికొదిలేశారు. కేవలం నేత కార్మికుల వ్యక్తిగత రుణాలకే లబ్ధిని పరిమితం చేసి.. అవి కూడా కేవలం నేత పని కోసం తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ జాబితాలో చేర్చి.. వారి ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో 20 చేనేత సహకార సంఘాలుంటే. ..వాటి పరిధిలో 3,500కు పైగా మగ్గాలున్నాయి. ఈ మగ్గాలపై 19వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. సంఘాల్లో లేనివారు జిల్లాలో మరో లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. వివిధ బ్యాంకుల్లో సంఘాల్లోని వందలాది మంది చేనేత కార్మికులకు రుణాలున్నప్పటికీ ముడి సరుకుల నిమిత్తం 48 మంది తీసుకున్న రుణాలు రూ.5.47 లక్షలుగా చేనేత జౌళీ శాఖాధికారులు లెక్క తేల్చారు. అదే విధంగా ప్రభుత్వాదేశాల మేరకు చేనేత సహకార సంఘాల పరిధిలో రూ.కోట్లల్లో ఉన్న రుణాలను పక్కన పెట్టేశారు. జీవితాలు మారనున్నాయి... గత ప్రభుత్వం చెప్పింది చెయ్యకుండా చేనేతని వంచించింది. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. అన్ని వర్గాల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఇందులో భాగంగా చేనేత కార్మికుల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీలో చేనేత కుటుంబాలకు ఆర్థిక అభయ హస్తం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21న ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది. దీనికి సంబంధించిన విధివిధానాల్ని త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన అర్హుల జాబితాను సిద్ధం చెయ్యాలంటూ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. నేతన్నల్లో హర్షం... ప్రభుత్వ నిర్ణయంతో నేతన్నల మోముల్లో నవ్వులు విరబూశాయి. ఐదేళ్లుగా హామీల పేరుతో దగా పడిన తమ జీవితాలకు ఆర్థిక దన్ను దొరికిందని చేనేత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నాళ్లూ.. ఎన్ని బట్టలు నేసినా.. జీవితాలకు సరైన భరోసా లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తమ బతుకులకు వెలుగులు తీసుకొచ్చే నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సబ్బవరం, కొత్తపేట, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లో ఎక్కువ మంది చేనేత కార్మిక కుటుంబాలున్నాయి. -
కడలి కెరటమంత కేరింత
సాక్షి, పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణ): గంగపుత్రులపై సీఎం జగన్ సర్కారు వరాల జల్లు కురిపించింది. మత్స్యకారుల్లో సాగరమంత సంతోషాన్ని నింపింది. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం తీసుకోలేదని మత్స్యకార సంఘాలు అంటున్నాయి. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.10వేలకు పెంచడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్‌మోటరైజ్డ్ బోట్లు ఉన్న కుటుంబాలతో పాటు తెప్పలపై వేటకు వెళ్లేవారికి కూడా ‘వైఎస్సార్ మత్స్యకారుల వేట నిషేధ సహకారం’ పథకాన్ని తొలిసారిగా వర్తింపజేస్తున్నందుకు మత్స్యకారులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచడంపై బోట్ల యజమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గతం: 2002 మార్చికి ముందు రిజిస్టర్ అయిన బోట్లకు మాత్రమే డీజిల్ సబ్సిడీ ఇవ్వడం వల్ల కేవలం 350 బోట్లకు మాత్రమే సబ్సిడీ దక్కేది. ప్రస్తుతం: సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల 3550 బోట్లకు సబ్సిడీ దక్కనుంది. సర్కారు తీసుకున్న నిర్ణయంతో ప్రతి ఏటా డీజిల్ సబ్సిడీ కింద 25 కోట్ల రూపాయల్ని మత్స్యకారులు రాయితీ రూపంలో పొందనున్నారు -
‘ఆంధ్రజ్యోతి’కి స్థల కేటాయింపులు రద్దు
తన తాబేదార్లకు, అంతేవాసులకు విశాఖను వడ్డించిన విస్తరిలా మార్చేసి.. భూములను అడ్డంగా వడ్డించేసిన గత టీడీపీ సర్కారు నిర్వాకం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. తాబేదార్లకే కాదు.. నిత్యం తనకు భజన చేసే తోక పత్రికలకు సైతం రూ.కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరలకు ధారాదత్తం చేసేసిన పచ్చ సర్కారు.. పచ్చి అక్రమాలకు.. తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. అప్పనంగా అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకొని.. వాటిని అర్హులైన పేదలకు ఇచ్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నగర శివారు పరదేశిపాలెంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న అత్యంత విలువైన ఒకటిన్నర ఎకరాల భూమిని తన తోక పత్రికకు దఖలుపరుస్తూ.. 2017లో అప్పటి టీడీపీ సర్కారు జరిపిన కేటాయింపులపై ఇప్పటి ప్రభుత్వం వేటు వేసింది. ఆ భూమిని పేదలకు కేటాయించాలని బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించింది. కాగా అడ్డగోలుగా పొందిన ఆ భూమిని ఇప్పటికే తవ్వుకొని కంకర అమ్మకాల ద్వారా రూ.7 కోట్లకుపైగా అప్పనంగా వెనుకేసుకోవడం కొసమెరుపు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ శివారున పరదేశిపాలెంలో రూ.కోట్ల విలువైన 1.50 ఎకరాల స్థలాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్య సంస్థ అయిన ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేవలం రూ.50 లక్షల 5వేలకే ఇచ్చేస్తూ.. 2017 జూన్ 28న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి ముందు ఎప్పుడో.. 1986లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు పరదేశిపాలెం గ్రామ పరిధి సర్వే నెం.191, 168లలో ఎకరా రూ.10వేల ధరకు 1.50ఎకరాల భూమి కేటాయించింది. అయితే కొన్నాళ్లకు జాతీయ రహదారి విస్తరణ కోసం ఇందులో ఎకరా భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మిగిలిన 50 సెంట్ల భూమి అప్పటి నుంచి ఆ సంస్థ అధీనంలోనే ఉంది. జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16) కోసం స్వాధీనం చేసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా వేరే భూమి ఇవ్వాలని, 1986లో తమకు కేటాయించిన ధరకే ఎకరా రూ.10వేల చొప్పున రేటు నిర్ణయించాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం 2016లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరింది. ఇలా సదరు పత్రిక కోరడమే ఆలస్యం.. ఆగమేఘాల మీద స్పందించిన బాబు సర్కారు అదే ప్రాంతంలో ఒకటిన్నర ఎకరాల భూమిని గుర్తించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కలెక్టర్ చెప్పిన రేటు కాదని.. అప్పటి జిల్లా కలెక్టర్ యువరాజ్ ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉందని పేర్కొంటూ.. మార్కెట్ విలువ ఎకరా రూ.7.26 కోట్లుగా నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2016 ఆగస్టు 10న ఇచ్చిన ఈ నివేదికను అనుసరించి అదే ఏడాది అక్టోబర్ 4వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ రివైజ్డ్ నివేదిక పంపించారు. ఆ నివేదికలో కూడా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.7.26 కోట్లకే కేటాయించాల్సిందిగా ఎలినేషన్ ప్రతిపాదనలు పంపారు. కానీ టీడీపీ సర్కారు జిల్లా అధికారుల సిఫార్సులను లెక్కలోకి తీసుకోలేదు. పరదేశిపాలెం సర్వేనంబర్ 191/10 నుంచి 191/14లో అందుబాటులో ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని ఆమోద పబ్లికేషన్స్‌కు కేటాయిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల వలవన్ 2017 జూన్ 28న జీవో ఎంఎస్. 25ను జారీ చేశారు. 0.50 సెంట్ల భూమిని పాత ధర కింద ఎకరా రూ.10వేల రేటుతో, ప్రత్యామ్నాయంగా ఇస్తున్న ఎకరా భూమిని ఎకరా రూ.50 లక్షల రేటుతో కేటాయించాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడేళ్లలో భూమిని ఉపయోగించాలనీ, ఆ భూమిలో ఉన్న వాటర్ బాడీస్ (చెరువులు, గెడ్డలు)ను రూపు మార్చకూడదని స్పష్టం చేశారు. సంబంధిత అవసరాలకు మాత్రమే వినియోగించాలని, వివరాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి మార్చి 31వ తేదీకల్లా ఈ భూమి వినియోగంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక్కడ ఎకరా కోట్లలో పలుకుతుందనేది అందరికీ తెలిసిందే. అలాంటిది ఒకటిన్నర ఎకరాల భూమిని కేవలం రూ.50లక్షలకే ధారాదత్తం చేయడం అప్పట్లోనే వివాదమైంది. ఇప్పుడు బలహీనవర్గాలకు కేటాయించేలా... పేదలకు చెందాల్సిన విలువైన భూమిని అధికారం అడ్డం పెట్టుకొని ఆంధ్రజ్యోతికి అప్పనంగా ఇచ్చేసినట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. విలువైన ఈ స్థలంలో పదుల సంఖ్యలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమి కేటాయింపును రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలాన్ని బలహీనవర్గాలకు కేటాయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించనున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. గ్రావెల్ తరలింపుతో రూ.కోట్లు కొల్లగొట్టారు ఇక ఎకరాన్నర స్థలంలో ఉన్న కొండలను చదును చేసే పనిని టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఓ బడా నిర్మాణ సంస్థకు సదరు భూమి పొందిన ఆమోదా పబ్లికేషన్స్ అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ కొండను చదును చేసి రోజుకు సుమారు రూ. 2లక్షల విలువ చేసే గ్రావెల్ తరలిస్తోంది. ఏడాది నుంచి ఈ వ్యవహారం సాగుతోంది. మొత్తంగా ఇప్పటివరకు రూ. 7కోట్ల విలువైన గ్రావెల్‌ను అడ్డగోలుగా తరలించినట్టు చెబుతున్నారు. ఈ కొండను లెవెల్ చేసి గ్రావెల్ అమ్ముకున్నందుకు ప్రతిగా సదరు సంస్థ ఉచితంగా ఆమోదా పబ్లికేషన్స్‌కు కార్యాలయం నిర్మించి ఇవ్వాలన్నదే వారి మధ్య ఒప్పందంగా తెలుస్తోంది. -
పిడుగుపాటు: తెలుగు రాష్ట్రాల్లో విషాదం
సాక్షి, పశ్చిమగోదావరి/జోగులాంబ/కామారెడ్డి: తెలుగు రాష్ట్ర్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం చింతపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు పాస్టర్లు మృతి చెందారు. మృతులను నరసాపురానికి చెందినవారిగా గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. పిట్లం గ్రామ శివారులో జాతీయ రహదారి విస్తరణలో విద్యుత్ స్తంభాల వద్ద పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కామారెడ్డి మండల కేంద్రంలో పిడుగు పాటుకు గురై దేమె రవి(23) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతునికి 9 నెలల కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబాల్లో విషాదం నెలకొంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ రైతుకు చెందిన రెండు గేదెలు మృతి చెందాయి. గొర్రెలపైకి దూసుకెళ్లిన బస్సు.. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం వెంకటాపురం గ్రామం దగ్గర పెట్రోల్ బంకు సమీపంలో గద్వాల్ డిపో ఆర్టీసీ బస్సు గొర్రెల పైకి దూసుకెళ్లిడంతో 15 గొర్రెలు మృతిచెందాయి. విద్యుత్‌షాక్‌తో ఇద్దరు మృతి.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ లో విద్యుత్ కంచె తగిలి విద్యుత్ షాక్ తో ఇద్దరి మృతి చెందారు. మృతుల్లో ఒకరు రైతుకాగా, మరొకరు కూలీగా గుర్తించారు. అడవి పందుల కోసం కంచెకు రైతులు విద్యుత్ అమర్చడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. -
రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి
సాక్షి, అమరావతి: అక్టోబర్ 13న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రతి ఏడాది ఆశ్వయుజ పౌర్ణమి రోజున నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వాల్మీకి జయంతి నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలకు రూ.25 లక్షల నిధులు విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి జయంతిని అనంతపురం జిల్లాలో రాష్ట్ర్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. వాల్మీకి జయంతి నిర్వహణకు అనంతపురం జిల్లాకు రూ.6 లక్షలను కేటాయించింది. మిలిగిన 12 జిల్లాలకు రూ.లక్షన్నర చొప్పున నిధులను ప్రభుత్వం కేటాయించింది. -
‘మార్గాలు అన్వేషించాలి’
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, దొనకొండ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమగ్రాభివృద్ధి జరిగే విధంగా పారదర్శక పాలసీ విధానం తీసుకురావాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులకు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాలసీని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో పరిశ్రమల శాఖ, ఐ.టీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి విడివిడిగా సమీక్ష నిర్వహించారు. మార్గాలు అన్వేషించాలి.. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ఇచ్చే ప్రాధాన్యతలు, రాయితీలను అవగాహన చేసుకుని, మన రాష్ట్రానికి అత్యధిక నిధులు, పరిశ్రమలు తరలివచ్చేందుకు అనువైన మార్గాలను అన్వేషించాలని మంత్రి తెలిపారు. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణమున్న ఆంధ్రప్రదేశ్ కు ..కేంద్రం సహకారం, పాలసీలు బాగుంటే పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి స్పష్టం చేశారు. మొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి విడి భాగాలను తీసుకువచ్చి ఇక్కడ తయారు చేసే పరిశ్రమలతో పాటు, ఆ విడి భాగాలు కూడా ఇక్కడే తయారు చేసే పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు వీలుగా పాలసీ ఉండాలన్నారు. పరిశ్రమలకు కావలసిన మెటీరియల్, యూనిట్లకు సంబంధించినవన్నీ ఒకే చోట ఉంటే పారిశ్రామికవేత్తలకు కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు. తద్వారా మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి అన్నారు.(చదవండి: ఏపీ వైపు.. పారిశ్రామిక వేత్తల చూపు) బాధ్యతను మరిచిపోకూడదు.. ఐ.టీ పాలసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆ శాఖ మంత్రి ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఐ.టీ ప్రమోషన్ పై దృష్టి సారించాలన్నారు. ఐ.టీ రంగానికి అత్యాధునిక సదుపాయాలు, అందుబాటులో వనరులు ఏమేం ఉన్నాయో చూసుకుని వాటికి మరింత ప్రాధాన్యతనిస్తూ పాలసీ తయారు చేయాలన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఐ.టీ, పరిశ్రమలను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే బాధ్యతను మరచిపోకుండా పాలసీని తయారు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి మేకపాటి స్పష్టమైన సూచనలు చేశారు. పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, ఏపీఐఐసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు కృష్ణ గిరి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ఐ.టీ శాఖ సమీక్షా సమావేశంలో ఈ-ప్రగతి సీఈవో బాలసుబ్రహ్మణ్యం, ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ సీఈవో పవనమూర్తి, ఐ.టీ సలహాదారులు, తదితరులు హాజరయ్యారు. -
‘ఏపీలో 18 శాతం తగ్గిన మద్యం అమ్మకాలు’
సాక్షి, విజయవాడ: నవరత్నాలలో భాగంగా దశలవారీ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంఎం నాయక్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో విధి విధానాలు నిర్ణయించాల్సి ఉందని.. ఇంకా 56 షాపులను గుర్తించాల్సి ఉందని చెప్పారు. మూడు మాత్రమే ఐఎంఎల్, బీరు బాటిళ్లు ఇచ్చేలా నిర్ణయించామన్నారు. కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చిదని.. 3,500 షాపులని ఏపీఎస్‌బీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం 3,317 షాపులు ప్రారంభమయ్యాయన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో షాపులు తీసేస్తామని తెలిపారు. ఆలయాలు, ఆసుపత్రులు, పాఠశాలల దగ్గరలో మద్యం షాపులు ఉండవని స్పష్టం చేశారు. ఎమ్మార్పీ ఉల్లంఘన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సుండి, ఇంటర్ విద్యార్హత ఉన్నవారిని మాత్రమే సేల్స్మేన్లుగా నియమించామన్నారు. 12 వేల మందిని ఔట్‌సోర్స్ పద్దతిలో తీసుకున్నామని వెల్లడించారు. సూపర్వైజర్ ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులు వెంటనే ఇండెమ్నిటీ బాండు ఇవ్వాలని కోరారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరుకు కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం మద్యం అమ్మకాలు సాగుతాయన్నారు. ఎమ్మార్పీ అవకతవకలపై బెవరేజ్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్కు 25 వాహనాలు లిచ్చామని.. మిగిలిన వాహనాలు త్వరలో ఇస్తామని నాయక్ తెలిపారు. 18 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయి: గత ఏడాదితో పోలిస్తే 18 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి అన్నారు. మద్యం మహమ్మారిని సమాజం నుంచి పారద్రోలేందుకు ఈ కొత్త మద్యం పాలసీ వచ్చిందని చెప్పారు.14,944 మంది మహిళా కానిస్టేబుళ్లు గ్రామ సచివాలయాల ద్వారా పని చేస్తారని వెల్లడించారు. 31 చెక్ పోస్టులు, 18 బోర్డర్ మొబైల్ బృందాలు ఉంటాయని తెలిపారు. మూడు కేసులు నమోదయితే పీడీ యాక్ట్ 93 ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు ఐడీ లిక్కర్, ఎన్డీపీఎల్ మీద దృష్టి పెడతాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పి.హరికుమార్ తెలిపారు. ఎక్సైజ్ సూపరిండెంట్ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు టీంలు పనిచేస్తాయని చెప్పారు. 93 మండలాల్లో 204 గ్రామాలను నాటుసారా తయారీ గ్రామాలుగా గుర్తించామని పేర్కొన్నారు. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు 4,875 సారా కేసులు నమోదు చేసామని..52,018 లీటర్ల సారాను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అన్ని జిల్లాలకు పక్క రాష్ట్ర్రాల సరిహద్దులు ఉన్నాయని.. ప్రతి యాభై ఇళ్లకి ఉన్న గ్రామ వలంటీర్లతో.. ఎన్ఫోర్స్మెంట్ ఎగ్జిక్యూటివ్ కలసి పనిచేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. మద్యపాన నియంత్రణలో గ్రామ, వార్డు వలంటీర్ల సహాయం తీసుకుంటామని తెలిపారు. నెలలో మూడు కేసులు ఒకే వ్యక్తిపై నమోదయితే పీడీ యాక్టు అమలు చేస్తామని స్పష్టం చేశారు. -
బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం: డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర్రంలో మద్యం షాపుల సంఖ్యను 20 శాతం తగ్గించామని.. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు సాగుతాయన్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్ షాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇకపై ప్రభుత్వం ఆధీనంలోనే మద్యం అమ్మకాలు జరుగుతాయని వెల్లడించారు. అవినీతి లేని పాలన అందించటమే ధ్యేయంగా వైఎస్ జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా సీఎం జగన్ నవరత్నాలు అమలు చేస్తున్నారని చెప్పారు. (చదవండి: అమల్లోకి కొత్త మద్యం పాలసీ) -
ఏపీలో 8 ప్రత్యేక కోర్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక కోర్టులను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చిన్నారులపై లైంగిక దాడుల కేసులను ఈ ప్రత్యేక కోర్టులు విచారించనున్నాయి. చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా,నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బాలలపై లైంగిక వేధింఫుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను త్వరితగతిన విచారణకు ఈ ప్రత్యేక కోర్టులు మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. వందకు పైగా పోస్కో చట్టం కేసులు పెండింగ్ లో ఉన్న జిల్లాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కోర్టులను ఏర్పాటు చేసింది. -
‘రికార్డు స్థాయిలో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు’
సాక్షి, అమరావతి: విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు నిర్వహించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఒకేరోజు రికార్డు స్థాయిలో 96 శాతం పాఠశాలల్లో ఎన్నికలు జరిపామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,612 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించామన్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరిపామని మంత్రి చెప్పారు. 63 శాతం పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. -
‘కొరత లేకుండా ఇసుక సరఫరా’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గా 41,37,675 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ నెల 5 నుంచి నూతన ఇసుక విధానం అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో 102 ఇసుక రీచ్ లను, 51 స్టాక్ యార్డ్ లను సిద్ధం చేశామన్నారు. మొత్తం 41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సప్లై కోసం టెండర్లు కూడా పిలవడం జరిగిందని తెలిపారు. గోదావరి, కృష్ణానదిలో వరద కారణంగా ఇసుక రవాణా కొంత ఇబ్బందికరంగా మారిందన్నారు. వరదలు తగ్గుముఖం పట్టగానే పూర్తిస్థాయిలో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రవాణా కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 స్టాక్ యార్డ్ లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 20 వేయింగ్ మిషన్ లను ఇందుకోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టాదారు భూమి నుంచి కూడా ఇసుక సరఫరా కొరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో రైతాంగం ఎక్కువమంది సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేరు వాగులో దాదాపు 263 ఎకరాలలో ఇసుక టెండర్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని వెల్లడించారు. అలాగే నెల్లూరు జిల్లాలో 12 రీచ్ ల నుంచి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను, రోజుకు పది వేల క్యూబిక్ మీటర్ల మేర సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గుంటూరు, కృష్ణ, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో కొత్త రీచ్ లను గుర్తించడం జరిగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పడవల ద్వారా ఇసుకను తీసుకు వచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం జరిగిందని వివరించారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద పరిస్థితులు తగ్గుముఖం పట్టగానే అవసరానికి తగినంత ఇసుక నిల్వలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. జిల్లా ఇసుక పరిమాణం(క్యూబిక్ మీటర్లలో) శ్రీకాకుళం జిల్లా 5,09,360 తూర్పు గోదావరి 6,33,358 పశ్చిమ గోదావరి 2,22,230 కృష్ణా 7,11,800 గుంటూరు 5,50,254 నెల్లూరు 4,21,145 కడప 5,05,928 కర్నూలు 1,97,600 అనంతపురం 2,50,500 చిత్తూరు 1,35,500 మొత్తం 41,37,675 -
ఎన్నాళ్లో వేచిన ఉదయం..
సాక్షి, అరసవల్లి: గ్రామ స్వరాజ్య పాలన అందించే అధికార సిబ్బంది నియామకాలకు అంతా సిద్ధమైంది. గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. కీలక విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో పల్లె, పట్టణ స్థాయిలో ప్రజలకు పాలన మరిం త చేరువకానుంది. ఈమేరకు జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఫలితాల్లో ప్రతిభ గల అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి, కాల్‌లెటర్ల పంపిణీని శనివారం అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టారు. రాత పరీక్షల్లో క్వాలీఫై అయినప్పటికీ, రోస్టర్ పాయింట్ల ప్రకారం రిజర్వేషన్ల ప్రాప్తికి తుది జాబితాను ఆయా శాఖాధికారులే స్వయంగా సిద్ధం చేసి, 1ః1 నిష్పత్తిలోనే కాల్‌లెటర్లను జారీ చేశారు. దీంతో కాల్‌లెటర్ సమాచారం అందుకున్న అభ్యర్థికి దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసినట్టే అని చెప్పవచ్చు. సమయం తక్కువున్న కారణంగా శనివారం రాత్రి నుంచి అభ్యర్థులకు నేరుగా మెయిల్ లేదా ఫోన్లో తెలియజేస్తూ ఈనెల 23 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు రావాలంటూ సమాచారమిచ్చారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన జెడ్పీ సీఈవో బి.చక్రధరరావు, డిప్యూటీ సీఈవో ఎం.ప్రభావతి, డీపీవో రవికుమార్‌లు తమ సిబ్బందితో కలిసి కసరత్తును పూర్తి చేశారు. ఇందులో వివిధ ప్రభుత్వశాఖాధికారులు కూడా తమ విభాగాల పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల మెరిట్ లిస్టులను తయారు చేసి రోస్టర్ పాయింట్ల ఆధారంగా కాల్‌లెటర్ల పంపిణీకి చర్యలు చేపట్టారు. కాల్‌లెటర్లు లేదా సమాచారం అందుకున్న అభ్యర్థులు వెంటనే తమ సర్టిఫికేట్లు, ధ్రువీకరణ పత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 929 సచివాలయాల్లో 7326 పోస్టులు.. జిల్లాలో మొత్తం 1141 గ్రామ పంచాయతీల్లో మొత్తం 835 గ్రామ సచివాలయాలను, శ్రీకాకుళం కార్పొరేషన్, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస మున్సిపాల్టీలు, పాలకొండ, రాజాం నగర పంచాయతీల్లో మొత్తం 94 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో మొత్తం 929 సచివాలయాల్లో ప్రస్తుతం 13 విభాగాల పోస్టుల కింద 7326 పోస్టులను తాజాగా భర్తీ చేయనున్నారు. అయితే 1ః1 నిష్పత్తిలో మొత్తం 7326 మందికి మాత్రమే కాల్‌లెటర్లు జారీ అయ్యాయి. వీరందరికీ ఈనెల 23 నుంచి సర్టి ఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొదలుకానుంది. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఈనెల 27న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను ఆ యా మండల పరిషత్ అధికారులే ఇవ్వనున్నారు. వచ్చే నెల 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల వ్యవస్థ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్తగా విధుల్లోకి వస్తున్న ఉద్యోగులం తా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ పోస్టులకు అదనంగా ఇవే సచివాలయాల్లో ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో మొత్తం 679 ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టుల కింద జూనియర్ లైన్మన్ల (జేఎల్ఎం) పోస్టుల భర్తీ కూడా దాదాపుగా పూర్తయినప్పటికీ కో ర్టు కేసు పెండిం గ్ అంశంగా ఉండడంతో ప్రస్తుతానికి భర్తీ చేయడం లేదు. త్వరలోనే ఇవి కూడా భర్తీ జరిగే అవకాశముంది. రేపటి నుంచి వెరిఫికేషన్.. జిల్లాలో గ్రామ/వార్డు సచివా లయాల పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా విడుదలైన వెంటనే ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ఎంపిక కమిటీ అధికారులు కాల్ లెటర్లను జారీ చేయడం ప్రారంనించారు. ఈమేరకు సమాచారం అంది న అభ్యర్థుల సర్టిఫికేట్లను ఈనెల 23 నుంచి 25 వరకు పరిశీలన చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రం సమీపంలోని మునసబుపేట గాయత్రి డిగ్రీ కళాశాలలో 16 గదులు, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో 18 గ దులు, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళా శాలలో 19 గదులను సిద్ధం చేశారు. ఈమేరకు అభ్యర్థులకు వీలుగా అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ఈనెల 23 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) అధికా రులు నిర్వహించనున్నారు. అయితే అ భ్యర్థులంతా తమ విద్యార్హతలతోపా టు ఇతర ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క అభ్యర్థి తన రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను (వెనుక సొంత అడ్రస్‌తో), అలాగే మొత్తం సర్టిఫికేట్లన్నీ రెండు సెట్ల జిరాక్స్ కాపీలను కూడా వెంట తీసుకురావాల్సి ఉంది. 1:1 నిష్పత్తిలో కాల్‌లెటర్లు జారీ చేయడంతో పోస్టుకు ఒ క్కరే వెరిఫికేషన్‌కు హాజరుకానున్నారు. ఒకటికి మించిన పోస్టుల్లో ఎంపికైన వారున్నా.. లేదా.. వెరిఫికేషన్‌లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కలిగివున్నా వారి స్థానాల్లో ఉద్యోగాల భర్తీని జి ల్లా ఎంపిక కమిటీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ స్థానాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది. అభ్యర్థులూ...అప్లోడ్ చేయాల్సినవి ఇవే...! -పుట్టిన తేది సర్టిఫికేట్ (పదో తరగతి సర్టిఫికేట్) -పరీక్షలకు తగిన విద్యార్హతల మార్కుల లిస్టులు -4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు (లోకల్) -రెసిడెన్స్ సర్టిఫికేట్ (తహసీల్దార్ మాన్యువల్‌గా జారీ చేసినది) -కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ (రెండు సంవత్సరాల క్రితం జారీ చేసినదైనా అనుమతిస్తారు) -ప్రతి బీసీ అభ్యర్థికి నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్ (తహసీల్దార్ మాన్యువల్‌గా జారీ చేసిన) -లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ (తహసీల్దార్ మాన్యువల్‌గా జారీ చేసిన) -దివ్యాంగుల ధ్రువీకరణ (ప్రభుత్వ వైద్యులు, సదరం ధ్రువీకరణ) -ఎక్స్–సర్వీస్‌మెన్ (జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి ధ్రువీకరణ) -స్పోర్ట్స్, ఎన్సీసీ సర్టిఫికేట్లు (సంబంధిత జీవోలననుసరించి) వెరిఫికేషన్ కేంద్రాల్లో ఎవరికి...? ఎక్కడ..? సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కీలకం కావడంతో జిల్లా ఎంపిక కమిటీ అధికారులంతా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎంపిక చేసిన మూడు ప్రైవేటు కళాశాలల్లో ఈమేరకు వివిధ రకాల కేటగిరిలకు చెందిన ఉద్యోగాల అభ్యర్థుల సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయనున్నారు. ఈమేరకు ప్రత్యేకంగా బోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రానికి ఒక్కో ఫెసిలిటేటర్‌ను కూడా నియమించారు. 1. శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాల, ఎచ్చెర్ల -పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5 -డిజిటల్ అసిస్టెంట్ -విలేజ్ రెవెన్యూ అధికారి (వీఆర్వో) -ఏఎన్ఎం / హెల్త్ అసిస్టెంట్ -పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ 2. గాయత్రి (గురజాడ) డిగ్రీ కళాశాల, మునసబుపేట, శ్రీకాకుళం -మత్స్యశాఖ అసిస్టెంట్ -సెరికల్చర్ అసిస్టెంట్ -వ్యవసాయ శాఖ అసిస్టెంట్ -ఉద్యానవన శాఖ అసిస్టెంట్ -మహిళా పోలీస్ -ఇంజినీరింగ్ అసిస్టెంట్ 3. శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, ఎచ్చెర్ల -సర్వేయర్ అసిస్టెంట్ -ఎడ్యుకేషన్ అసిస్టెంట్ -మున్సిపాల్టీల్లో శానిటేషన్ అసిస్టెంట్‌తోపాటు ఇతర పోస్టులు అభ్యర్థులూ... ఆందోళన వద్దు ! ‘సమయం చాలా తక్కువుంది... కుల, నివాస, నాన్ క్రీమీలేయర్ వంటి కొత్త సర్టిఫికేట్లు ఎలా వస్తాయి... అధికారులు ఇస్తారో లేదో... అన్న ఆందోళన వద్దు..’ అంటూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎంపిక కమిటీ కన్వీనర్ జె.నివాస్ అభ్యర్థులకు భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి జిల్లా పరిషత్ సమావేశమందిరంలో అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ఆయన ఈమేరకు పలు సూచనలు చేశారు. 1ః1 నిష్పత్తిలో ఉద్యోగాల కోసం మెరిట్లో ఉన్న వారికి శని, ఆదివారాల్లోనే కాల్‌లెటర్లు జారీ చేయాలని, వీరికి ఈనెల 23, 24, 25 తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో మునసబుపేటలోని గాయత్రి డిగ్రీ కళాశాల, ఎచ్చెర్లలో శ్రీశివానీ, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ఈమేరకు వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అలాగే జిల్లాలో అన్ని మండలాల తహశీల్దార్లకు కూడా అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ సర్టిఫికేట్ల జారీని అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. -అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా అధికారులు వ్యవహరించాలని, ఎవ్వరినీ ఆందోళనకు గురిచేయొద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈనెల 23 నుంచి 25 వరకు జరుగనున్న వెరిఫికేషన్‌లో ఎవరైనా ఏవైనా సర్టిఫికేట్లు తేలేని వారుంటే... వారికి ఈనెల 26వ తేదీ సాయంత్రం వరకు గడువు ఇవ్వాలని, ఈలోగా అభ్యర్థులు సర్టిఫికేట్లను సమర్పించాలని సూచిం చారు. -కులధ్రువీకరణ పత్రం (కమ్యూనిటీ సర్టిఫికేట్) విషయంలో కూడా రెండేళ్ల క్రితం ఇచ్చిన సర్టిఫికేటు అయినా అధి కారులు అనుమతి ఇవ్వాల్సిందే... ఒకవేళ తాజాగా ఇవ్వాల్సి వస్తే... తహశీల్దార్లు మాన్యువల్‌గా ఇవ్వాలి. ప్రతి బీసీ అభ్యర్థికి నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ సర్టిఫికేట్‌ను బీసీ అభ్యర్థులందరికీ తహశీల్దార్లు మాన్యువల్‌గా ఇవ్వాలి -ఒరిజినల్ హాల్టిక్కెట్టును మాత్రం అభ్యర్థి వెంట తప్పనిసరిగా తీసుకురావాలి. -కాల్ లెటర్ రాగానే అభ్యర్థి అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లు, వెరిఫికేషన్‌లో చూపించిన సర్టిఫికేట్లు సరిపడాల్సి ఉంటుంది. -4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లను సమర్పించిన వారు లోకల్‌గానూ గుర్తించాలి. నాన్‌లోకల్‌లో ఉన్న వారు ఆయా ప్రాంత రెసిడెన్స్ సర్టిఫికేట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను కూడా చూపించాల్సి ఉంటుంది. -ఐటిఐ లేదా డిప్లమో చదివిన అభ్యర్థులు, ఇంజినీరింగ్ చదువుతుంటే.. వారి నుంచి సర్టిఫికేట్లను ఆశించలేమని, అలాంటి సందర్భాల్లో మానవతా దృక్పథంతో ధ్రువీకరించుకుని అవకాశమివ్వాలని సూచించారు. -అభ్యర్థులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా, అలాగే అర్హులకు అవకాశంలో తేడాలు లేకుండా రోస్టర్ జాబితా నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వరకు అధికారులు శ్రద్ధగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. -
ఎక్కడుంటే అక్కడే రేషన్..
బొబ్బిలి: బతుకుదెరువు కోసం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కూలీలు, కుటుంబాలు ఇక నిశ్చింతగా ఉండొచ్చు. రేషన్ కార్డు తొలగింపు భయమే ‘రద్దయిపోయింది’. ఇప్పటి వరకూ అంతర్ జిల్లాల స్థాయిలోనే అంతంత మాత్రంగా ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రారంభించింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోర్టబిలిటీ విధానాన్ని ప్రారంభించి, ఏపీ లబ్ధిదారులకు తెలంగాణలో రేషన్ ఇచ్చే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. దీని వల్ల రేషన్ కార్డు రద్దవుతుందనే ఇబ్బందులు లేని వ్యవస్థ మొదలుకానుంది. కార్డు డిలీట్ కష్టాలకు ఇక చెక్.. జిల్లాలో 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా 846 అన్నపూర్ణ కార్డులుండగా.. 1,117 మంది లబ్ధిదారులన్నారు. అలాగే అంత్యోదయ కార్డులు 84,972 ఉంటే అందులో లబ్ధిదారులుగా 2,34,076 మంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులు 6,27,235 ఉండగా, లబ్ధిదారులు 18,25,778 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా దారిద్య్ర రేఖ దిగువన జీవిస్తున్న వారికి తెల్ల రేషన్ కార్డులు 7,13,053 ఉన్నాయి. అయితే జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కుటుంబాలు 80 వేలకు పైగానే ఉన్నాయి. అనేక కుటుంబాలు.. పిల్లలను కూడా అక్కడే చదివిస్తున్నాయి. వలస వెళ్లిన వారిలో చాలా మంది ఇప్పటికీ రెండుమూడు నెలలకోసారి స్వగ్రామానికి వచ్చి రేషన్, పింఛన్లు తీసుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. ఒక్కోసారి రాలేని వారి కార్డులు కూడా డిలీట్ అయిన సందర్భాలున్నాయి. కూలీలకు మరింత ప్రయోజనం.. కొత్తగా తీసుకొచ్చిన పొర్టబిలిటీ విధానాన్ని తొలుత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభించడం రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేకూరుస్తుంది. దీని వల్ల ఆయా కుటుంబాలు ఎక్కడుంటే అక్కడే రేషన్ తీసుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల వలస కూలీలకు ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. అలాగే కొంత మంది నాలుగేసి నెలల పాటు ఇతర ప్రాంతాల్లో కూలీ పనులకు వెళ్తుంటారు. వారు ఇకపై అక్కడ మార్కెట్లో కొనుగోలు చేసుకోకుండా, రేషన్ ద్వారానే బియ్యం, ఇతర సరుకులు తీసుకోవచ్చు. గతంలో జిల్లా వరకే.. రాష్ట్రంలో 2015లో ఈ పోర్టబిలిటీ విధానాన్ని ప్రారంభించినా కేవలం మండలాలకే పరిమితమై ఉండేది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఇతర మండలాల కార్డులను అనుసరించి సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. కానీ, అంతర్రాష్ట్ర పోర్టబిలిటీ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నూతనంగా అమల్లోకి వచ్చింది. -
వాన కురిసె.. చేను మురిసె
సాక్షి, అమరావతి: గడచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు తగ్గింది. గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉంటే ఇప్పుడది 19 శాతానికి తగ్గిపోయింది. ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. దీంతో బుధవారానికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 17.54 లక్షల హెక్టార్లకు పెరిగింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరి నాట్లు పుంజుకున్నాయి. గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలు మినహా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నాట్లు జోరుగా పడుతున్నాయి. అలాగే విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాధారిత పంటలతోపాటు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనూ వరి నాట్లు ప్రారంభించారు. అయితే రాయలసీమ జిల్లాలు మాత్రం ఇంకా లోటు వర్షపాతంలోనే ఉన్నాయి. నాలుగు రాయలసీమ జిల్లాలుసహా మొత్తం ఏడు జిల్లాలు బుధవారానికి 20 శాతం నుంచి 50 శాతం వరకు లోటు వర్షపాతంలో ఉన్నాయి. విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సాధారణ స్థితిలో ఉండగా శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే రెండు మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోనూ పరిస్థితి మెరుగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే పంటల సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని చేరుతుందని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రిజర్వాయర్లకు ఇప్పుడిప్పుడే నీరు రావడం ప్రారంభమైంది. ఈసారి శ్రీశైలం, సాగర్లు నిండేందుకు ఆస్కారం కనిపిస్తున్నందున సాగర్ కుడికాలువకు నీరిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగ్గిన వర్షపాతం లోటు... ఈ ఖరీఫ్ సీజన్లో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మొత్తంగా 556 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికి 275.4 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే 224.1 మిల్లీమీటర్లే కురిసింది. అయితే గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉండగా.. తాజాగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మెరుగైంది. వర్షపాతం లోటు ప్రస్తుతం 19 శాతానికి తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం సైతం పెరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 38.30 లక్షల హెక్టార్లుగా ఖరారు చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఇప్పటికి 22.17 లక్షల హెక్టార్లు అంటే సుమారు 79 శాతం విస్తీర్ణంలో పంటలు వేసి ఉండాల్సింది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు 17.74 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో ఎక్కువగా జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు వరి ఉంది. మొక్కజొన్న, రాగి, కంది, పత్తి, చెరకు వంటి పంటలైతే 75 శాతం వరకు వేసినట్టు వ్యవసాయ శాఖ లెక్కలేసింది. ఈ సీజన్లో ఇప్పటికి 7.44 లక్షల హెక్టార్లలో వరినాట్లు పడాల్సి ఉండగా.. 6.33 లక్షల హెక్టార్లలో వేశారు. ఖరీఫ్‌లో మొత్తంగా 15.19 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేయాలన్నది లక్ష్యం. ఇదిలా ఉంటే.. గోదావరి వరదలతో నీట మునిగి దెబ్బతిన్న వరి నారు మళ్లు తిరిగి పోసుకునేందుకు వీలుగా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. -
ఫిబ్రవరిలో డీఎస్సీ నియామకాలు: గంటా
-
ఫిబ్రవరిలో డీఎస్సీ నియామకాలు: గంటా
హైదరాబాద్: డీఎస్సీ-2014 రాతపరీక్షలకు హాజరై, ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని వెయ్యికళ్లతో ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు తీపికబురు. 8,086 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి లైన క్లియర్ అయింది. ఫిబ్రవరి మొదటి వారంలో డీఎస్సీ నియామకాలు ఉంటాయని ఆంధ్ర ప్రదేశ్ మానవవనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. 8,086 పోస్టులకు కోర్టు నుంచి అనుమతి వచ్చిందన్నారు. మిగిలిన పోస్టులపై కోర్టు స్పష్టత ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులకు సంబంధించి కోర్టుకు తీర్పుకు లోబడి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి సర్వీస్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు గంటా వెల్లడించారు.