పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు.. 63 శాతం ఏకగ్రీవం

Minister Adimulapu Suresh Says 96 Percent Of Schools Are Parent Committee Elections - Sakshi

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు నిర్వహించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఒకేరోజు రికార్డు స్థాయిలో 96 శాతం పాఠశాలల్లో ఎన్నికలు జరిపామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,612 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించామన్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు జరిపామని మంత్రి చెప్పారు. 63 శాతం పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top