రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session Starts From Tomorrow - Sakshi

 ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

తొలిరోజు వ్యవసాయ రంగంపై చర్చించనున్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న సమావేశాల్లో ప్రభుత్వం పలువురి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనుంది. శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలో బీఏసీ నిర్ణయించనుంది. తొలిరోజు వ్యవసాయ రంగంపై చర్చించనున్నారు. నివర్ తుపాను ప్రభావంపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది. నివర్ తుపాను ప్రభావంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. 19 బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. (చదవండి: ఆ ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: కొడాలి నాని)

ఎకానిమల్‌ ఫీడ్, ఫిష్‌ ఫీడ్ యాక్ట్, ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్, ఏపీ ఫిషరీష్ వర్సిటి బిల్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసైన్డ్‌ భూముల చట్ట సవరణ, అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్‌ యాక్ట్, ఏపీ వ్యాట్ బిల్, ఏపీ ట్యాక్స్ ఆన్‌ ప్రొఫెషన్స్ ట్రేడ్స్ సవరణ బిల్, ఏపీ స్పెషల్ కోర్ట్స్ ఫర్ ఉమెన్, మోటార్ వెహికల్ చట్టం, ఆన్‌లైన్ గేమింగ్ నిషేధితచట్టం, స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఏపీ ఎఫ్‌ఆర్‌బిఎం సవరణ బిల్లు, స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు, మున్సిపల్ లా సవరణ బిల్లులను ప్రభుత్వం  ప్రవేశపెట్టనుంది. 20 ప్రధాన అంశాలను ప్రభుత్వం చర్చించనుంది. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతీ అంశాన్ని చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. (చదవండి: పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top