ఏపీ ఎన్జీవో చేపట్టే ఆందోళనకు జేఏసీ దూరం

APJAC President Bopparaju Venkateswarlu Comments On AP NGO - Sakshi

ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు

సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో పిలుపునిచ్చిన ఆందోళనకు మా మద్దతు లేదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏకపక్షంగా ఎన్టీవోలు ఆందోళనకు పిలుపునివ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసేందుకే ఆందోళనకు పిలుపునిచ్చారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి  ఏకపక్ష నిర్ణయం తగదన్నారు.

ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చిందన్నారు. అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచిందని తెలిపారు. పెద్దఎత్తున ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఆందోళనకు పిలుపునివ్వడం సరైన పద్ధతి కాదన్నారు. ఉద్యోగులు తమ డిమాండ్లపై ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని వెంకటేశ్వర్లు సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top