సాక్షి హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో చేపట్టిన బదిలీల రద్దుపై అధికారులకు విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఎసీ నాయకులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న రాత్రి వరకూ మింట్ కాంపౌండ్ లో ఎర్రగడ్డ స్కాడా ఆఫీసులో చర్చలు జరిగాయి. ఎట్టిపరిస్థితుల్లో బదిలీలను వాయిదా వేసేది లేదని యాజమన్యం స్పష్టం చేయడంతో రాజీకి అంగీకారం కుదరలేదు.
దీంతో విద్యుత్ జేఏసీ నేతలు మహా ధర్నా కొనసాగిస్తామని తెలిపారు. ఈ రోజు( గురువారం) నుంచి జిల్లాలో / సర్కిళ్లలో రిలే దీక్షలు చేపడతామని తెలిపారు.ఈ చర్చలలో యాజమాన్యం తరపున సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, డైరెక్టర్ చక్రపాణి ఐఏఎస్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నారాయణ పాల్గొనగా జేఏసీ తరపున ఎనిమిది మంది నాయకులు పాల్గొన్నారు.


