
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి.. ఏపీ టవర్స్ లిమిటెడ్ సీఈవోగా ఎం.రమణారెడ్డి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా ఎస్‌బిఆర్.కుమార్‌లకు బాధ్యతలు అప్పగించారు.