సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ కె.హరిత కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేష్ ధోత్రే, ఫిషరీస్ డైరెక్టర్‌గా ఫిషరీస్‌గా కే.నిఖిలా, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భవానీ శంకర్ నియమితులయ్యారు.


