
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 57,752 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 733 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 866438కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరంలో ఒక్కరి చొప్పున మొత్తం ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 6976కి చేరుకుంది. (చదవండి: హెటెరో కీలక డీల్..మరో రెండు నెలల్లో వ్యాక్సిన్!)
గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1205 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8లక్షల 47వేల 325 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 12,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 99,13,068 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం)