రివర్స్‌ టెండరింగ్‌తో రూ.900 కోట్లు ఆదా..

Minister Anil Kumar Says AP Government To Save Rs 900 Crore From Reverse Tendering - Sakshi

జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి, నెల్లూరు: రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అయిందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాజెక్టుల్లో దాదాపు రూ.4 నుంచి 5వేల కోట్ల వరకు నిధులు ఆదా అవుతాయన్నారు. పోలవరం రివర్స్‌ టెండర్లలో నవయుగ సంస్థను కూడా పాల్గొనాలని ఆహ్వానించామని తెలిపారు. టీడీపీ హయాంలో టెండర్‌ పొందిన రిత్విక్‌ సంస్థ వెలుగొండ రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువకే టెండర్‌ వేసిందని పేర్కొన్నారు. నిధులు ఆదా చేసిన ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు అభినందించాలన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ లేకపోతే ఈ నిధులు ఏ బాబు జేబులోకి వెళ్లేవో అందరికీ తెలుసునన్నారు. మంచి మనసున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం వలనే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు కళకళలాడుతున్నాయని మంత్రి అనిల్‌కుమార్‌ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top