ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు | 538 New Corona Positive Cases Reported In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు

Dec 10 2020 6:46 PM | Updated on Dec 10 2020 6:50 PM

538 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,354 కరోనా పరీక్షలు నిర్వహించగా, 538 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 87,3995కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 558 మంది కోవిడ్‌ నుంచి క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 86,1711 డిశ్చార్జ్‌ అయ్యారు. (చదవండి: కాచుకున్న కరోనా!)

గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరు,కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7047కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5237 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరుకు 1,06,35,197 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: అలర్జీ ఉంటే వ్యాక్సిన్‌ వద్దు)

Advertisement
 
Advertisement
Advertisement