ఆంధ్రప్రదేశ్: రోజురోజుకి కరోనా మహమ్మారి మరింతగా తిరిగి రూపు దాల్చుతుంది. తాజాగా తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తిరుపతి అర్బన్ పరిధిలో 65 ఏళ్ల వృద్దురాలు తీవ్ర అస్వస్థకు గురికాగా, కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోగల జిల్లా అస్పత్రిలో అడ్మిట్ చేశారు.
గత కొన్నిరోజులుగా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న వృద్దరాలిని జూలై 23న వైద్యులు కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె కుటుంబంలోని సభ్యులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. వారికేమి కరోనా లక్షణాలు లేవని వైద్యశాఖ పేర్కొంది.
అయితే, శనివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్‌లో 10 మందికి పైగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం కరోనా కేసులు 49 చేరగా, పలు ఆస్పత్రులల్లో 24 మందిదాకా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, కృష్ణా, తిరుపతి, విశాఖ, అల్లూరి జిల్లాలో ఒక్కో కరోనా కేసు నమోదైంది. దీంతో జిల్లాలలోని వైద్యశాఖల వివరాలతో.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారినపడి ఇప్పటికి నలుగురు ప్రాణాలను కోల్పోయినట్లుగా తెలుస్తోంది.


