కడలి కెరటమంత కేరింత

AP Government Ten Thousand Compensation Hike For Fishermen - Sakshi

మత్స్యకారులపై సర్కారు వరాల జల్లు

వేట నిషేధ పరిహారం రూ.10 వేలకు పెంపు

డీజిల్‌ సబ్సిడీ పెంపుపై సర్వత్రా హర్షం 

సాక్షి, పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణ): గంగపుత్రులపై సీఎం జగన్‌ సర్కారు వరాల జల్లు కురిపించింది. మత్స్యకారుల్లో సాగరమంత సంతోషాన్ని నింపింది. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం తీసుకోలేదని మత్స్యకార సంఘాలు అంటున్నాయి. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.10వేలకు పెంచడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్‌మోటరైజ్డ్‌ బోట్లు ఉన్న కుటుంబాలతో పాటు తెప్పలపై వేటకు వెళ్లేవారికి కూడా  ‘వైఎస్సార్‌ మత్స్యకారుల వేట నిషేధ సహకారం’ పథకాన్ని తొలిసారిగా వర్తింపజేస్తున్నందుకు మత్స్యకారులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. డీజిల్‌ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచడంపై బోట్ల యజమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

గతం:  2002 మార్చికి ముందు రిజిస్టర్‌ అయిన బోట్లకు మాత్రమే డీజిల్‌ సబ్సిడీ ఇవ్వడం వల్ల కేవలం 350 బోట్లకు మాత్రమే సబ్సిడీ దక్కేది.

ప్రస్తుతం: సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం వల్ల 3550 బోట్లకు సబ్సిడీ దక్కనుంది. సర్కారు తీసుకున్న నిర్ణయంతో ప్రతి ఏటా డీజిల్‌ సబ్సిడీ కింద 25 కోట్ల రూపాయల్ని మత్స్యకారులు రాయితీ రూపంలో పొందనున్నారు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top