ఉద్యోగాల కల్పనలో ఏపీ ‘నంబర్‌ వన్‌’

Minister Shankar Narayana Said AP Was Number One In Job Creation - Sakshi

మంత్రి శంకర్ నారాయణ

సాక్షి, అనంతపురం: ఉద్యోగాల కల్పనలో దేశంలోనే నంబర్‌ వన్‌గా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించిందని మంత్రి శంకర్‌ నారాయణ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు సత్వర పరిష్కరించడానికే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కేవలం ఐదునెలల్లో నెరవేర్చి ఇతర నాయకుల కంటే తాను భిన్నమైన నేతగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  నిరూపించుకున్నారన్నారు.

ప్రజలకు నమ్మకం కలిగింది..
వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కలిగిందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతి పక్షాల పాత్ర నామ మాత్రమేనని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top