
సాక్షి, అమరావతి: ఆంధ్రపదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 867063కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: కరోనాకు వ్యాక్సిన్లు రావడం ఓ భ్రమేనా!?)
గడచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు.. మొత్తం ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 6981కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి క్షేమంగా కోలుకుని 1,186 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు మొత్తం 848511 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుత్తం 11571 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 99,62,416 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: కరోనా ఎఫెక్ట్: నల్లకోడికి ఫుల్లు డిమాండ్)