ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు.. | 319 New Covid Positive Cases Reported In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు..

Jan 8 2021 7:17 PM | Updated on Jan 8 2021 7:18 PM

319 New Covid Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో  59,671 కరోనా పరీక్షలు నిర్వహించగా, 319 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 884490కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. (చదవండి: కోవిడ్‌ భయం: విమానం మొత్తాన్ని బుక్‌ చేసుకున్నాడు)

కోవిడ్‌ బారిన పడి గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7127కి చేరింది. గడచిన 24 గంటల్లో 308 మంది కోవిడ్‌ కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  8,74,531 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో  2,832 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో  కరోనా నిర్ధారణ పరీక్షలు కోటి 22 లక్షలు దాటాయి. రికార్డు స్థాయిలో కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,22,24,202 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: మా వ్యాక్సిన్‌ చాలా డేంజర్‌: చైనా ఎక్స్‌పర్ట్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement