అగ్రిగోల్డ్‌ బాధితుల సంబరాలు.. | AgriGold Victims Celebrated In Visakhapatnam | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితుల సంబరాలు..

Oct 20 2019 7:19 AM | Updated on Oct 20 2019 7:20 AM

AgriGold Victims Celebrated In Visakhapatnam - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న వంశీకృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు తదితరులు  

సాక్షి, విశాఖపట్నం: అగ్రిగోల్డ్‌ బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తొలి విడతలో రూ.10వేలలోపు డిపాజిట్లు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో బాధితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అగ్రిబాధితులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో జరిగిన సంబరాల్లో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పదివేల లోపు అగ్రి బాధితులు 52వేల మంది ఉన్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అగ్రి బాధితుల జీవితాలతో చెలగాటం ఆడుకుందన్నారు. అదే సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసి వారి కళ్లల్లో ఆనందం నింపారన్నారు.

వైఎస్సార్‌సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడు నడింపల్లి కృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం వైఎస్‌ జగన్‌ నాలుగు నెలల్లోనే అమలు చేశారన్నారు. కార్యక్రమంలో విశాఖ తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, మొల్లి అప్పారావు, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్‌ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ప్రేమ్‌బాబు, నగర అనుబంధసంఘాల అధ్యక్షులు బోని శివరామకృష్ణ, కాళిదాస్‌రెడ్డి, రామన్నపాత్రుడు, మాజీ కార్పొరేటర్లు రామకృష్ణరెడ్డి, లక్ష్మీరాము, చొక్కరశేఖర్, వార్డు అధ్యక్షులు పీతల గోవింద్, రవికుమార్, గిరిబాబు, గణేష్‌ రెడ్డి, కనకరాజు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement