టీడీపీ పాలనలో విద్యుత్ రంగం నిర్వీర్యం

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి, విజయవాడ: గత టీడీపీ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పీపీఏ లు ద్వారా తక్కువ ధరకు సోలార్ పవర్ వస్తున్న అధిక మొత్తం లో కోట్ చేశారన్నారు. విద్యుత్ చార్జీల పెంపు లేదని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించడమే ధ్యేయం అని పేర్కొన్నారు. రైతులకు పగటి పూట 9 గంటలు విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం రూ.1700 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు రంగం 70వేల కోట్లు అప్పుల్లో ఉందని చెప్పారు.
ఏపీసీపీడీఎల్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ఇంధన శాఖ సెక్రటరీ శ్రీకాంత్ తెలిపారు. పీపీఏలు తగ్గించుకుంటూ తక్కువ ధరకు విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి