ప్రతిపక్షాల విమర్శలు సబబు కాదు..

Adimulapu Suresh Said Conducting Teacher Transfer Counseling Transparently - Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, ప్రకాశం జిల్లా: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ కేటగిరీలలో కొన్ని స్థానాలు బ్లాక్ చేయడం గతం నుంచి వస్తున్న విధానమేనని.. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన వివరించారు. (చదవండి: జనవరి 9న జగనన్న అమ్మఒడి సాయం)

‘‘కేటగిరీ 4లో కూడా కొన్ని స్థానాలు బ్లాక్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీలలో బదిలీలకు 48 వేల 897  ఖాళీలను గుర్తించాం. వెబ్ కౌన్సిలింగ్‌లో సర్వర్ల సమస్యను దృష్టిలో ఉంచుకుని రేపటి వరకూ ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చాం. బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు ట్రాన్స్ ఫర్ పోర్టల్‌లో ఉంచాం. బ్లాక్ చేసిన స్థానాలను డీఎస్సీ నియామకాల సమయంలో భర్తీ చేస్తాం. అప్పుడు మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని’’ మంత్రి పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ పై ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో పూర్తిగా చర్చించామని,  వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలు మాట్లాడటం సబబు కాదని మంత్రి సురేష్‌ హితవు పలికారు. (చదవండి: ‘జూమ్‌లో చంద్రబాబు.. ట్విట్టర్‌లో లోకేష్‌’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top