ఏపీ: యూకే నుంచి వచ్చిన 11 మందికి కరోనా | Corona Positive For 11 Travelers Who Came To AP From UK | Sakshi
Sakshi News home page

యూకే నుంచి వచ్చిన 11 మందికి కరోనా

Dec 28 2020 7:07 PM | Updated on Dec 28 2020 7:32 PM

Corona Positive For 11 Travelers Who Came To AP From UK - Sakshi

సాక్షి, అమరావతి: యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు వచ్చిన వారి సంఖ్య 1363కి చేరింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారు.. వారి కాంటాక్ట్స్‌లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఇప్పటివరకు 1,346 మందిని అధికారులు ట్రేస్ చేయగా, మరో 17 మంది కోసం ట్రేసింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. యూకే నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 11 మందికి కరోనా నిర్థారణ అయ్యింది.(చదవండి: మరి కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్‌ : సీరం)

అనంతపురం, నెల్లూరులో ఒక్కొక్కరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారి కాంటాక్ట్స్‌లో 5,784 మందికి పరీక్షలు నిర్వహించారు. యూకే రిటర్న్స్‌తో కాంటాక్ట్ అయిన 12 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎనిమిది మందికి పాజిటివ్‌ కాగా, తూ.గో.జిల్లాలో ముగ్గురికి, నెల్లూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. (చదవండి: ఎంత కాలంలో కరోనా ఖతం...?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement