ఆంధ్రా జాలర్ల విడుదలకు పాక్‌ అంగీకారం

Pakistan Agrees To Release Andhra Fishermens - Sakshi

ఫలించిన ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయత్నాలు

సాక్షి, విజయవాడ: పాకిస్తాన్‌ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్ల విడుదలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ నెల 6న వాఘా సరిహద్దు వద్ద భారత్‌ అధికారులకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మొత్తం 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ అప్పగించనుంది. మత్స్యకారుల జాబితాను పాక్‌ ప్రభుత్వం.. భారత విదేశాంగ శాఖకు పంపించింది.

పొట్టకూటి కోసం గుజరాత్‌ వలస వెళ్ళిన  ఆంధ్రా జాలర్లు 2018 డిసెంబర్‌లో పొరపాటున గుజరాత్‌ తీరం వద్ద పాకిస్తాన్‌ జలాల్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్‌ అరెస్ట్‌ చేసింది. పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ దృష్టికి ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు, బాధితులు తీసుకొచ్చారు. తక్షణమే విడుదలకు కృషి చేయాల్సిందిగా వైఎస్‌ జగన్‌.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి  విదేశాంగ శాఖపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పలుమార్లు ఆయన లేఖలు రాశారు. విజయసాయి రెడ్డి లేఖతో కేంద్ర విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంది. దీంతో ఆంధ్ర జాలర్లను విడిచి పెట్టేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అంగీకరించింది.

పాకిస్తాన్‌ విడుదల చేసిన ఆంధ్రా జాలర్ల జాబితా..
ఎస్‌.కిశోర్‌ , తండ్రి అప్పారావు
నికరందాస్‌ ధనరాజ్, తండ్రి అప్పన్న
గరమత్తి, తండ్రి రాముడు
ఎం. రాంబాబు, తండ్రి సన్యాసిరావు
ఎస్‌. అప్పారావు, తండ్రి రాములు
జి. రామారావు, తండ్రి అప్పన్న
బాడి అప్పన్న, తండ్రి అప్పారావు
ఎం. గురువులు, తండ్రి సతియా
నక్కా అప్పన్న, తండ్రి లక్ష్మయ్య
నక్క నర్సింగ్, తండ్రి లక్ష్మణ్‌
వి. శామ్యూల్, తండ్రి  కన్నాలు
కె.ఎర్రయ్య, తండ్రి లక్ష్మణరావు
డి. సురాయి నారాయణన్, తండ్రి అప్పలస్వామి
కందా మణి, తండ్రి అప్పారావు
కోరాడ వెంకటేష్, తండ్రి నరసింహులు
శేరాడ కళ్యాణ్, తండ్రి అప్పారావు
కేశం రాజు, తండ్రి అమ్మోరు
భైరవుడు, తండ్రి కొర్లయ్య
సన్యాసిరావు, తండ్రి మీసేను
సుమంత్‌ తండ్రి ప్రదీప్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top