30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు | AP Legislative Assembly Winter Session From November 30 | Sakshi
Sakshi News home page

30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Nov 26 2020 5:43 PM | Updated on Nov 27 2020 1:22 AM

AP Legislative Assembly Winter Session From November 30 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు  సమావేశాలపై నోటిఫికేషన్‌ గురువారం విడుదలయ్యింది. డిసెంబర్‌ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే నిర్ణయంపై స్పష్టత రానుంది. (చదవండి: వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్‌)

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, ఎర్రచందనం, డ్రగ్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు కేవలం అక్రమ ఇసుక, మద్యం అమ్మకాలకు మాత్రమే  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిమితమైంది. ఇకపై  గ్యాంబ్లింగ్, ఆన్ లైన్ బెట్టింగ్, డ్రగ్స్, ఎర్రచందనం, ఇతర నిషేధిత పదార్ధాలు ఏస్ఈబి పరిధిలోకి తీసుకువచ్చింది.(చదవండి: పన్నులపై రెండు పత్రికల దుష్ప్రచారం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement