పన్నులపై రెండు పత్రికల దుష్ప్రచారం

Botsa Satyanarayana Comments On Eenadu And ABN Andhra Jyothi - Sakshi

జీవో ఉద్దేశం తెలియకుంటే వివరణ అడగరా?

మంత్రి బొత్స ధ్వజం  

సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు అసత్య కథనాలను ప్రచురిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ పభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వ జీవోలోని ఉద్దేశాలు ఆ పత్రికల అధినేతలకు అర్థం కాకుంటే సంబంధిత అధికారులను అడిగితే వివరణ ఇచ్చేవారు కదా? అని ప్రశ్నించారు. కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేసిందని, దాని ప్రకారమే జీవో విడుదల చేశామన్నారు.

ప్రభుత్వం ఏడాదిన్నరలోనే నవరత్నాలతో సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తోందని, 90 శాతం హామీలను నెరవేర్చిందని, అలాంటప్పుడు ప్రజలపై భారం మోపాలని ఎందుకు భావిస్తుందని ప్రశ్నించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆస్తి పన్ను ఎలా ఉండాలో కేంద్రమే సిఫార్సు చేసిందని తెలిపారు. దీన్ని ఎఫ్‌ఆర్‌బీఎంకు ముడి పెట్టిందని, రుణ పరిమితి ఈ సంస్కరణలు అమలు మీద ఆధారపడి ఉంటుందన్నారు. అయినా ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదని, స్థానిక సంస్థలకే అందచేస్తుందన్నారు. నీటి పన్నుపై కూడా అసత్య కథనాలు ప్రచురించారని మండిపడ్డారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top