ఏపీ: కరోనా కేసులు భారీగా తగ్గుముఖం | 128 New Corona Positive Cases Reported In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 128 కరోనా కేసులు..

Jan 4 2021 6:58 PM | Updated on Jan 4 2021 7:21 PM

128 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 29,714 కరోనా పరీక్షలు నిర్వహించగా, 128 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 883210కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.(చదవండి: కోవాగ్జిన్‌ : భారత్‌ బయెటెక్‌ క్లారిటీ)

కరోనా బారినపడి గత 24 గంటల్లో చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, ఇప్పటివరకు 7118 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 252 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 8,73,149 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు  స్థాయిలో నిర్వహిస్తున్నారు. నేటివరకు రాష్ట్రంలో 1,20,02,494 శాంపిల్స్‌ను పరీక్షించారు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 2,943 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement