నిబద్దతతో పోలీస్‌ శాఖ సేవలు..

Gautam Sawang Said Police Department Working With Commitment - Sakshi

ఎస్‌పీఎస్‌డీఆర్‌ఎఫ్‌ వాహనాలను పరిశీలించిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ నిబద్దత‌తో పనిచేస్తోందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ, అత్యంత సాంకేతికతతో కూడిన సామర్థ్యం ఎస్‌పీఎస్‌డీఆర్‌ఎఫ్‌ వాహనాల్లో ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. పడవ, రోడ్డు ప్రమాదాలు, ఫైర్‌ యాక్సిడెంట్లు, భవనాలు కూలినప్పుడు రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టాన్ని నియంత్రించవచ్చని చెప్పారు. ముంబాయి తర్వాత దేశంలో మన రాష్ట్రంలోనే ఈ వాహనాలు వచ్చాయని పేర్కొన్నారు. (చదవండి: తగ్గిన నేరాలు.. పెరిగిన కేసులు)

2020లో కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని, పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. టెక్నాలజీ వినియోగాన్ని విస్తృత పరిచి 2021లో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో కేంద్రం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఇంటివద్దే వేడుకలు జరుపుకోవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు.(చదవండి: అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top