ఆన్‌లైన్‌ కాల్‌మనీపై ఉక్కుపాదం | AP Police Special Focus On Online Call Money | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ కాల్‌మనీపై ఉక్కుపాదం

Dec 22 2020 9:59 PM | Updated on Dec 23 2020 9:51 AM

AP Police Special Focus On Online Call Money - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఆన్‌లైన్ కాల్ మనీ వ్యవహారాలపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చిన వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీలకు, సీఐడీ, సైబర్ క్రైమ్ విభాగానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. కాల్‌ మనీ వేధింపులకు పాల్పడితే ఉపేక్షించమని డీజీపీ హెచ్చరించారు. ఆన్‌లైన్ కాల్‌మనీ బాధితులకు పోలీస్‌శాఖ అండగా ఉంటుందని పేర్కొన్నారు. చట్టబద్ధత లేని యాప్‌ల ద్వారా రుణాలు స్వీకరించొద్దని సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్‌లపై డయల్ 100, 112లకు ఫిర్యాదు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement