
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,495 కరోనా పరీక్షలు నిర్వహించగా, 510 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 87,5025కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని 665 డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 86,2895 మంది డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: 20 వేల కోట్లతో రెండో విడత వ్యాక్సిన్)
గత 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరు, వైఎస్సార్ కడప, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మృతిచెందగా, ఇప్పటివరకు ఏపీలో 7052 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5078 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,07,67,117 పరీక్షలు నిర్వహించారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్లతో సరికొత్త ప్రయోగం)