కోవిడ్‌ వ్యాక్సిన్లతో సరికొత్త ప్రయోగం

Test will be on Combinatiion of Vaccines - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రష్యా సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ కనుగొన్న స్పుత్నిక్‌ వి కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఇప్పటికే రష్యా మార్కెట్‌లోకి ప్రవేశించిన విషయం తెల్సిందే. మరో పక్క ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులతో కలసి ఆస్ట్రాజెనెకా రూపొందించిన మరో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ను ప్రపంచ మార్కెట్‌లోకి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరగుతున్నాయి. వీటిలో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ సక్సెస్‌ రేటు 92 శాతం కాగా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తొలి దశలో 70 శాతంగా తేలిన విషయం తెల్సిందే. ఈ రెండింటి ఫలితాలను బేరీజు వేసిన పరిశోధకులకు ఓ సరికొత్త ఆలోచన వచ్చింది.  (మొదటి విడత టీకా వేసేది వీరికే..)

స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌తోని ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను కలిపి ట్రయల్స్‌ నిర్వహిస్తే! అదే సరికొత్త ఆలోచన. రెండు వ్యాక్సిన్లు కూడా జలుబుకు కారణమవుతున్న వైరస్‌ల నుంచి తయారు చేసినవే అవడం ఈ ట్రయల్స్‌ ప్రతిపాదనకు మరో కారణం. స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌తో కలిపి ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఆస్ట్రాజెనికా శనివారం ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరులోగా ఈ ట్రయల్స్‌ మొదలవుతాయని, రెండు వ్యాక్సిన్లను కలపడం వల్ల మెరుగైన ఫలితాలు లభించిన పక్షంలో కొత్త వ్యాక్సిన్‌ను రష్యానే తయారు చేస్తుందని రష్యా సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ ప్రకటించింది.  (క్రిస్మస్‌కు ముందే ఇండియాలో వ్యాక్సిన్‌!)

సోవియట్‌ యూనియన్‌ కాలంలో రోదసిలోకి విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహం పేరు స్పుత్నిక్‌ వి. ఈ పేరునే ఇప్పుడు రష్యా కోవిడ్‌ వ్యాక్సిన్‌కు పెట్టారు. స్పుత్నిక్‌ వి సక్సెస్‌ రేటు 92 శాతం ఉండడంతో రష్యా మార్కెట్‌లోకి వ్యాక్సిన్‌ విడుదలకు రష్యా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ వ్యాక్సిన్‌ పట్ల పాశ్చాత్య దేశాలు ఇంతవరకు ఆసక్తి చూపకుండా నిర్లిప్తంగానే ఉన్నాయి. మరోపక్క ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ సక్సెస్‌ రేటు 70 శాతం ఉండడంతో వ్యాక్సిన్‌ ప్రభావాన్ని మరోసారి సమీక్షించాల్సిందిగా ఉన్నతాధికారులను  బ్రిటన్‌ అధికార యంత్రాంగం ఆదేశిందింది.  (వచ్చే జనవరిలోనే వ్యాక్సిన్‌: అక్టోబరు నాటికి..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top