breaking news
Pawan Kalyan
-
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన సభలో నేతల అసంతృప్తి
-
Asaduddin Owaisi: ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు
-
వారు దుండగులు కాదా?.. టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ల చేసిన ఒక ప్రకటనను అంతా స్వాగతించాలి. హైదరాబాద్ లో ఒక న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని వారు ఖండించారు. కూటమి పెద్దల భావజాలంలో మార్పు వచ్చి ఉంటే సంతోషించాలి. కాని వారు అన్ని విషయాలలో మాదిరి ఇక్కడ కూడా డబుల్ గేమ్ ఆడడం బాగోలేదని చెప్పాలి. చంద్రబాబు చేసిన ప్రకటనను గమనించండి. హైదరాబాద్ లో ఒక టీవీ చానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విద్వంసం సృష్టించడం దారుణమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు,సమాజం దీనిని ఆమోదించదని అంటూ,ఆ ఛానల్ యాజమాన్యానికి ,సిబ్బందికి ఆయన సంఘీభావం తెలియచేశారు. 👉చంద్రబాబు ఈ ప్రకటన చేసిన వెంటనే అందరికి గుర్తుకు వస్తున్నది ఏపీలో ఉన్న పరిస్థితి గురించే. ఏపీలో తనకు నచ్చని మీడియాపై ప్రభుత్వం చేస్తున్న దాడి, ప్రత్యేకించి సాక్షి మీడియాపై కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు చూస్తున్న ఎవరికి అయినా చంద్రబాబు మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించదు. తమకు మద్దతు ఇస్తే ఒక రకంగాను, లేకుంటే మరో రకంగాను టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తున్న తీరు ఇట్టే తెలిసిపోతుంది.👉ఈ మధ్య సాక్షి టీవీ డిబేట్ కు సంబందించి ఒక వివాదాన్ని సృష్టించి కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయించిన తీరు,ఆ తర్వాత కేసులు పెట్టడమే కాకుండా.. జర్నలిస్టులను అరెస్టు చేసిన వైనం, అక్కడితో ఆగకుండా సాక్షి మీడియా కార్యాలయాలపై టీడీపీకి చెందినవారు చేసిన దాడులు,వీరంగం వేసి విధ్వంసం సాగించిన పద్దతి గురించి కూడా కూటమి నేతలు మాట్లాడి వాటిని ఖండించి ఉండాలి కదా!. పైగా అనని మాటలు అన్నట్లుగా, ఒక ప్రాంతానికి ఆపాదించి సాగించిన రచ్చ అందరిని ఆశ్చర్యపరచింది. సాక్షి సంస్థలపై దాడులకు పాల్పడినవారిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు లు చేయలేదు? అలా చేసినవారు దుండగులు కాదా?వారు టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?ప్రజాస్వామ్యంలో బెదిరింపులు ,దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చెబుతున్న చంద్రబాబుకు ఏపీ విషయంలో అదే సూత్రం వర్తించదా?.. దీనికి ఆయన ఏమి జవాబిస్తారు. నిత్యం సాక్షిపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ, ఆ మీడియాను ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచన సాగించే ఆయన తనకు మద్దతు ఇచ్చే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రమే స్వేచ్చ ఉండాలని చెప్పడం సహేతుకమే అవుతుందా?. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.👉సాక్షి డిబేట్లో ఒక పదం అభ్యంతరకరం అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. దానిపై వివరణ కోరవచ్చు. కాని అసలు ఆ పదం పలకని జర్నలిస్టునే అరెస్టు చేశారే!. విచిత్రం ఏమిటంటే డిబేట్లో ఒక విశ్లేషకుడు ఒకసారి ఆ పదాన్ని ఉచ్చరిస్తే, తెలుగుదేశం మీడియా సంస్థలు వందల సార్లు ప్రచారం చేశాయి. అలాగే లక్షల పత్రికలలో దానిని యధాతధంగా ప్రచురించాయి. ఆ విశ్లేషకుడు మాట్లాడింది అభ్యంతరకర పదమే అనుకుంటే దానిని ఎల్లో మీడియా ప్రచారం చేయకూడదు కదా?. కాని ఎందుకు విచ్చలవిడిగా ప్రచారం చేశారు. వారు చేసింది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా!, మరి వారిపై కేసులు పెట్టరా?దీనిపై ప్రభుత్వంకాని, పోలీసు కాని, న్యాయ వ్యవస్థకాని ఎందుకు స్పందించలేదంటే ఏమి చెబుతాం. హైదరాబాద్ లో దాడికి గురైన టీవీ చానల్ కొన్ని వీడియాలకు పెట్టిన తంబ్ నెయిల్ చాలా దారుణంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానించారు. ఈ అంశాలను టీడీపీ, జనసేన పెద్దలు కనీసం ఖండించలేదు. అయినా ఆ సంస్థపై దాడి చేయాలని ఎవరం చెప్పం. చట్టప్రకారం పోవాల్సిందే. ఏపీలో సాక్షి మీడియా వివరణ ఇచ్చినా అన్యాయంగా దాడులు చేశారే!. సాక్షిపై దాడులు జరుగుతున్నప్పుడు , ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఇష్టారీతిన విమర్శలు ఆరోపణలు చేస్తున్నప్పుడు టీడీపీ మీడియా చంకలు గుద్దుకుంటూ మరింత రెచ్చిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలోప్రభుత్వం.. వాళ్లకు బంధించిన మీడియా కలిసి మరీ నానా బీభత్సం సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యం, బెదిరింపులు, మీడియాను కట్టడి చేయడం వంటి అంశాలు.. చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకదు!!.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్రం అంతా గంజాయి కేంద్రం అయిపోయిందని చంద్రబాబు,ఇతర కూటమి నేతలుతీవ్ర విమర్శలు చేసేవారు. అంటే అప్పుడు ఏపీలో ఉన్నవారంతా గంజాయి తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నట్లు భావించాలా?. పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు 30 వేల మంది మహిళలు ఏపీలో మిస్ అయిపోయారని ప్రచారం చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా?. అంతెందుకు తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఆరోపించినప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినలేదా?. అయినా ఎవరిపైన ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాని తమకు అధికారం ఉంది కదా అని విషయాన్ని వక్రీకరించి సాక్షిపై దాడి చేయడం ,కేసులు పెట్టి వేధించడం మాత్రం ప్రజాస్వామ్యబద్దం అని వారు భావిస్తున్నట్లా?. సాక్షిని మాత్రమే కట్టడి చేయాలన్నది వారి అభిమతమా?. అంతెందుకు.. సాక్షి టీవీ చానల్ ప్రజలలోకి వెళ్లరాదన్న ఉద్దేశంతో ఆయా నగరాలలో ,పట్టణాలలో కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఒత్తిడి చేసి సాక్షి ప్రసారం కాకుండా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మీడియా స్వేచ్చ గురించి నీతులు చెబితే ఎవరైనా నమ్ముతారా?.. చంద్రబాబు కు ఇది కొత్తేమి కాదు. 2014 టైమ్‌లో కూడా కూడా సాక్షితో పాటు మరికొన్ని చానళ్లపై కూడా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో నిషేధం పెట్టారు. అప్పట్లో కాపుల రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే,ఆ వార్తలు ప్రచారం కాకుండా ఎన్నిరకాల ఆటంకాలు కలిగించారో అందరికి తెలుసు. ఈసారి కూడా సాక్షి టీవీతో మరో రెండు చానళ్లపై కూడా ఆంక్షలు విధించారని చెబుతున్నారు. ఇదీ చంద్రబాబుకు మీడియా స్వేచ్చపై ఉన్న విశ్వాసం. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అన్న సూత్రం బాగా వర్తిస్తుందా?ఇక పవన్, లోకేష్ లు కూడా టీవీ చానల్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో మాత్రం మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి కాదని వీరు భావిస్తున్నారన్నమాట.ఏపీలో జర్నలిస్టులను అరెస్టు చేయించి,అదేదో గొప్పపనిగా ఛాతి విరుచుకున్న నేతలు తెలంగాణలో జరిగిన ఘటనకు గుండెలు బాదుకుంటున్నారు. దీనినే హిపోక్రసి అంటారు.అలా అని హైదరాబాద్ లో దాడి ఘటనను సమర్ధించడం లేదు.కాని ఏపీలో కూటమి నేతల తీరుతెన్నులు మాత్రం ఇలా రెండుకళ్ల సిద్దాంతంతో సాగుతుండడమే బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
యానిమల్ ఎఫెక్ట్..'హరి హర వీరమల్లు'లో బాబీ డియోల్ పాత్ర ఎలా ఉండబోతుందంటే..
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై 3న ట్రైలర్ ఆవిష్కరణ జరగనుంది.'హరి హర వీరమల్లు' చిత్రానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అలాగే పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇక 'యానిమల్' సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. 'హరి హర వీరమల్లు'లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తుండటం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.నిజానికి బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించారు. కానీ, 'యానిమల్'లో బాబీ నటనను చూసిన తర్వాత దర్శకుడు జ్యోతి కృష్ణ 'హరి హర వీరమల్లు'లో ఆయన పాత్రను పునః రచించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారు.బాబీ డియోల్ గురించి జ్యోతి కృష్ణ ఇలా అన్నారు.. "యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ నటన అద్భుతం. పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను" అని జ్యోతి కృష్ణ తెలిపారు. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బాబీ డియోల్ నటనలోని భావోద్వేగ లోతును తీసుకురావడం కోసం.. ఆ పాత్రను ఎంతగానో మెరుగుపరిచారు. జ్యోతి కృష్ణ దిద్దిన మెరుగులతో ఔరంగజేబు పాత్ర మరింత బలంగా, ఆకర్షణీయంగా మారింది.యానిమల్ తర్వాత బాబీ డియోల్ సరికొత్త స్టార్డమ్ చూశారు. ఆ స్టార్డమ్ కి న్యాయం చేయడానికి మరియు ఆయనపై ఉన్న అంచనాలను అందుకోవడానికి ఔరంగజేబు పాత్రకు మరింత ఆకర్షణీయమైన ఆర్క్ అవసరమని జ్యోతి కృష్ణ భావించారు. అందుకే ఆ పాత్ర వ్యక్తిత్వం, నేపథ్య కథ, ఆహార్యం వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు. "నేను సవరించిన స్క్రిప్ట్‌ను చెప్పినప్పుడు, బాబీ గారు చాలా ఉత్సాహపడ్డారు. ఆయన తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇష్టపడే నటుడు. హరి హర వీరమల్లులో బాబీ డియోల్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తారు. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం" అని దర్శకుడు జ్యోతి కృష్ణ పేర్కొన్నారు.ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతిభగల సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం ఒక దృశ్య కావ్యంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. -
KSR Live Show: బాబు అన్ ఫిట్.. జేసీ రప్పా రప్పా.. పవన్ తాట తీస్తా
-
ముందుంది మస్త్ మజా
2025 నేటితో సగం పూర్తయింది. అయితే ఈ ప్రథమార్ధంలో వచ్చిన స్టార్ హీరోల చిత్రాల సంఖ్య తక్కువే. కానీ ద్వితీయార్ధం ధూమ్ ధామ్‌గా ఉండబోతోంది. పలువురు స్టార్స్ వెండితెరపైకి దూసుకు రావడానికి రెడీ అయ్యారు. సో... 2025 సెకండాఫ్ హీరోల అభిమానులకు పండగే. అలాగే హీరోయిన్ల ఫ్యాన్స్‌కి కూడా. ‘ముందుంది మస్త్ మజా’ అంటూ థియేటర్లకు రానున్న ఆ చిత్రాల గురించి...ఈ ఏడాదే విశ్వంభర ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘విశ్వంభర’ వాయిదా పడింది. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, ‘విశ్వంభర’ అనే పుస్తకం, ‘విశ్వంభర’ ప్రపంచం సినిమాలో కీలకంగా ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్స్‌తో యూనిట్ బిజీగా ఉంది. ‘విశ్వంభర’ ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.అఖండ తాండవం హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రానున్న తాజా చిత్రం ‘అఖండ 2’. 2021లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోంది. సంయుక్త ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారని టీజర్ స్పష్టం చేస్తోంది. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. సైమన్ ఈజ్ కమింగ్ ధనుష్‌తో కలిసి ‘కుబేర’ సినిమాతో థియేటర్స్‌లోకి వచ్చారు నాగార్జున. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ఈ మూవీలో నాగార్జున చేసిన లీడ్ రోల్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉండే రోల్‌ని నాగార్జున ‘కూలీ’లో చేశారు. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సైమన్ అనే పవర్ఫుల్ విలన్‌పాత్రలో నాగార్జున కనిపిస్తారు. నాగార్జున పూర్తి స్థాయి విలన్‌గా కనిపించనున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇటు వీరమల్లు... అటు ఓజీ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు, ఓజీ’... ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదే విడుదల కాన్నాయి. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’గా జూలై 24న విడుదల కానుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మించారు. ఇక పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఓజీ’. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాను సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది.పోలీసాఫీసర్ లక్ష్మణ్ భేరీరవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లక్ష్మణ్ భేరీ అనే పవర్ఫుల్పోలీసాఫీసర్పాత్రలో రవితేజ కనిపిస్తారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. షూటింగ్ దాదాపు పూర్తయింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. రాజా సాబ్ రెడీ విష్ణు మంచు టైటిల్ రోల్ చేసిన ‘కన్నప్ప’ సినిమాలో రుద్రగా కనిపించి ప్రేక్షకులను అలరించారు ప్రభాస్. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ హారర్ కామెడీ యాక్షన్ సినిమాను మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లు. తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కనిపిస్తారు.ఆంధ్రా కింగ్ తాలూకా... ఓ సినిమా హీరోకి, ఆ హీరో ఫ్యాన్‌కి మధ్యలో జరిగే సంఘటనలతో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో అభిమానిగా రామ్, సినిమా స్టార్ సూర్యకుమార్‌గా ఉపేంద్ర కనిపిస్తారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాజమండ్రిలో ఆరంభమైంది. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. సెంటిమెంటల్ తమ్ముడు ఈ ఏడాది మార్చిలో నితిన్ నుంచి ‘రాబిన్‌హుడ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలైలో ‘తమ్ముడు’ సినిమాతో మరోసారి వస్తున్నారు నితిన్. అక్కా తమ్ముడు సెంటిమెంట్‌తో వస్తున్న ఈ సినిమాలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, లయ కీలకపాత్రధారులు. లయ తమ్ముడిపాత్రలో నితిన్ కనిపిస్తారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. త్వరలో కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు కానీ జూలై చివర్లో లేదా ఆగస్టులో ‘కింగ్డమ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమా రెండు డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో సాగుతుందని టాక్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమికులు క్రైమ్ చేయాల్సి వస్తే! ఈ ఏడాది మే 1న నాని హీరోగా చేసిన ‘హిట్ 3’ సినిమాలో అడవి శేష్ గెస్ట్ రోల్ చేశారు. ఇక ఆయన సోలో హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్: ఏ లవ్‌స్టోరీ’ డిసెంబరు 25న రిలీజ్ కానుంది. ఈ క్రైమ్ లవ్‌స్టోరీ థ్రిల్లర్ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, అనురాగ్ కశ్యప్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. బ్రేకప్ చేప్పుకున్న ప్రేమికులు కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథనం అని తెలిసింది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ–నిర్మాత.కిష్కింధపురిలో...బెల్లకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. అలాగే లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ‘హైంధవ’, సాగర్‌కె. చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ సినిమాలు కూడా చేస్తున్నారు సాయిశ్రీనివాస్. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.సోషియో ఫ్యాంటసీ ‘స్వయంభూ’ నిఖిల్ హీరోగా నటిస్తున్నపాన్–ఇండియా మూవీ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నిఖిల్ ఒక యోధుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేశ్ హీరోయిన్లు. ఇందులో హీరో మాత్రమే కాదు... హీరోయిన్లు కూడా యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.లవ్‌స్టోరీ తెలుసు కదాఈ ఏడాది వేసవిలో ‘జాక్’ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ థియేటర్స్‌కి వచ్చారు. ఇక ఈ దీపావళికి ‘తెలుసు కదా’ అనే లవ్‌స్టోరీతో రానున్నారు సిద్ధు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 17న రిలీజ్ కానుంది. ముక్కోణపు ప్రేమకథగా ‘తెలుసు కదా’ ఉంటుందట. ఏటిగట్టు సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 75 శాతం పూర్తయింది. ఈ సినిమా సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. మిరాయ్ అడ్వెంచర్ ‘హను–మాన్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తర్వాత హీరో తేజ సజ్జా నటిస్తున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ‘మిరాయ్’. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్. మంచు మనోజ్ విలన్‌గా చేస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. ఇంకా నవీన్‌చంద్ర ‘షో టైమ్’, ఆది సాయికుమార్ ‘శంబాల’, సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’తోపాటు పలు మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఉమన్ పవర్ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలు వరుసగా విడుదలవుతుంటే... స్టార్ హీరోయిన్ల చిత్రాలూ దూసుకు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో తమ పవర్ చూపించడానికి అనుష్క, లావణ్యా త్రిపాఠి, రష్మికా మందన్నా వంటి తారలు రెడీ అయ్యారు. ⇒ పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన ఓ బాధిత గిరిజన మహిళ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి, లెజెండ్‌గా ఎలా ఎదిగింది? అనే కథాంశంతో అనుష్క ‘ఘాటీ’ రూపొందింది. క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో తమిళ హీరో విక్రమ్ ప్రభు లీడ్ రోల్ చేశారు. ⇒ కుటుంబ బంధాలను నిలపడానికి సతీ లీలావతి ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సతీ లీలావతి’. లావణ్యా త్రిపాఠి టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ ఆమె భర్తపాత్ర చేశారు. భార్యాభర్తల అనుబంధాన్ని ఎమోషనల్‌గా, ఎంటర్టైనింగ్గా చూపిస్తూ, తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. . ⇒ స్టార్ హీరోల చిత్రాల్లోనూ గుర్తింపు తెచ్చుకునేపాత్రలు చేస్తూ దూసుకెళుతున్న రష్మికా మందన్నా నటించిన తొలి ఉమన్ సెంట్రిక్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి ఓ లీడ్ రోల్ చేశారు. ఈ ప్రేమకథా చిత్రంలో క్లిష్టమైన రిలేషన్‌షిప్‌ని ఎదుర్కొనే కాలేజీ విద్యార్థినిగా రష్మిక నటించారు. ఇక ఇది కాకుండా ‘మైసా’ అనే మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీ కూడా రష్మిక డైరీలో ఉంది. ⇒ అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ ఈ సినిమాను నిర్మించారు. మూఢ నమ్మకాలు, మహిళా సాధికారిత వంటి అంశాలతో రూపొందిన ‘పరదా’ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.⇒ ఇంకా కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’ అంటూ టైటిల్ రోల్లో ఆగస్ట్ 27న థియేటర్స్‌కు రానున్నారు. జేకే చంద్రు దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ చిత్రం తెలుగులోనూ రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. అలాగే వరలక్ష్మిపోలీసాఫీసర్గా నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా మరికొందరు నాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో తమ పవర్‌ని నిరూపించుకోనున్నారు. కన్యారాశి టైమ్ వచ్చిందిహిట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (2018)కి సీక్వెల్‌గా ‘ఈఎన్ఈ రిపీట్’ సినిమా రానుంది. ‘ఏలినాటి శనిపోయింది.. కన్యారాశి టైమ్ వచ్చింది’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. తొలి భాగంలో నటించిన విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను సీక్వెల్లోనూ నటించనున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ సీక్వెల్‌కు దర్శకత్వం వహించనున్నారు. డి. సురేష్‌బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్.ఫీల్‌గుడ్ లవ్స్టోరీనరేశ్ అగస్త్య హీరోగా విపిన్ దర్శకత్వంలో ఉమా దేవి కోట నిర్మించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాలో రబియా ఖతూన్ కథానాయికగా నటించారు. ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో రూపొందించిన ఈ చిత్రంలో మ్యూజిక్‌కి మంచి స్కోప్ ఉంది. జస్టిన్ ప్రభాకరన్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఈ చిత్రం మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
విశాఖ భీమిలిలో కూటమి నాయకుల మధ్య వివాదం
-
గిన్నిస్ బుక్‌లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల
ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్‌పై సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించొచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్‌కు పదవీ గండం ఉండేది. .. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్‌వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. .. సింగయ్య మృతి కేసులో జగన్‌పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్‌ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్‌కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. .. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఇంకా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్ట్ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. ‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్‌ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’:::మాజీ మంత్రి శైలజానాథ్ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్‌కు పట్టదా?. :::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. :::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. :::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి -
అంగన్వాడీ అక్కచెల్లెళ్లల్లారా అని అరిచాడు..ఇప్పుడేమైపోయాడో కూడా తెలియదు
-
వర్మ విశ్వరూపం.. పవన్ కు ఇక చుక్కలే..
-
అర్థించినా ఆలకించని పవన్
సాక్షి, రాజమహేంద్రవరం : ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ పలు సందర్భాల్లో ఉపన్యాసాలు ఇచి్చన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ‘తమ ఆడబిడ్డకు ఇంకా న్యాయం జరగలేదన్నా.. న్యాయం చేయండి’ అని అభ్యర్థించినా పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఘటన రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గురువారం చోటుచేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికికి చెందిన ఓ టెన్త్ విద్యార్థిని ఆర్నెల్ల క్రితం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలేమిటో నిగ్గుతేల్చాలని కుటుంబ సభ్యులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో మూడునెలల క్రితం రాజమహేంద్రవరం వచ్చిన పవన్‌కళ్యాణ్‌కు బాధితులు ఎయిర్‌పోర్టు వద్ద కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిoచారు. అయినా ఇప్పటివరకూ న్యాయం జరగకపోవడంతో గురువారం అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు వచ్చారు. ‘ఇంకా న్యాయం జరగలేదన్నా..’ అంటూ ఫ్లెక్సీ చూపిస్తూ నిరసన తెలిపారు. కొద్దిసేపు అక్కడే ఉన్నా వారిని పవన్ గమనించలేదు. దీంతో పోలీసులు పవన్‌ను కలిసే ఏర్పాటుచేస్తామని వారిని వేదిక వద్దకు తీసుకెళ్లారు. పవన్ ప్రసంగం అయిన వెంటనే మాట్లాడిస్తామని చెప్పడంతో వారు ఫ్లెక్సీ కిందకు దింపేశారు. కానీ, సభ పూర్తయిన వెంటనే పవన్ వారితో మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక బాధితులు వెనుదిరిగారు. జనసేన కార్యకర్తల వీరంగం.. సభలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పవన్‌కళ్యాణ్ ప్రసంగిస్తుండగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారి చిందులకు సభలోని కుర్చీలు విరిగిపోయాయి. ‘ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్’..!సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రసంగంలో ‘రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్’ అని పలికారు. దీంతో జనసేన కార్యకర్తలు అరవడం ప్రారంభించారు. పక్కనున్న వ్యక్తి డిప్యూటీ సీఎం అని చెప్పడంతో.. తిరిగి డిప్యూటీ సీఎం అని పురందేశ్వరి అన్నారు. -
‘పవన్ ఎవరి నార తీస్తావ్..ఎవరి మక్కెలు ఇరగదీస్తావ్!’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో గురువారం భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో భద్రతా లోపాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సింగయ్య మృతిపై చంద్రబాబు చేస్తున్న రాజకీయాల్ని వివరించారు.అనంతరం, వైఎస్సార్సీపీ శాసన మండలి విపక్షనేత,బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో చట్టవ్యతిరేక చర్యలను చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌కు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వడం లేదు. భద్రత కల్పించకపోగా తిరిగి మా నాయకుడితో పాటు మాపై కేసులు పెడుతున్నారు. ఇది అప్రజాస్వామికం. ఈ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. గవర్నర్ దృష్టికి అన్ని అంశాలను తీసుకెళ్లాం. సత్తెనపల్లిలో ప్రైవేట్ వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని సాక్షాత్తూ జిల్లా ఎస్పీనే స్టేట్ మెంట్ ఇచ్చారు. సింగయ్య ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్‌కు సంబంధం లేదన్నారు. మూడు రోజుల తర్వాత ప్రభుత్వం ఒత్తిడితో ఎస్పీ మరో ప్రకటనను చేశారు. కారు డ్రైవర్ , కారులో ఉన్న జగన్‌తో పాటు మరికొంత మందిపై కేసులు పెట్టారుఇలాంటి దుర్మార్గపు చర్యలు ఏనాడూ చూడలేదు. చరిత్రలో ఎన్నడూ చూడనట్లు కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాధరణ ఉన్న నాయకుడు. మా నాయకుడికి రక్షణ కల్పించాలి. సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా?. నిజంగా ప్రభుత్వం భద్రత కల్పిస్తే ఘటన జరిగినపుడు ఎవరూ ఎందుకు చూడలేదు.ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది .ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడం మా బాధ్యత. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చూడలేదు’ అని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,హోమంత్రి అనితకు బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. పవన్ ఎవడి నార తీస్తారు.. ఎవరి మక్కెలు ఇరగదీస్తారు.ప్రజలే అందరి నార తీస్తారని గుర్తుంచుకోండి. తెలివితక్కువ మాటలు వెనక్కి తీసుకోవాలి. బాధ్యతా రాహిత్యమైన మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. గతంలో పర్యటనల సమయంలో చంద్రబాబు ఎందుకు అడిగారు. జడ్ ప్లస్ ఉన్న వ్యక్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా అని ఎందుకు ప్రశ్నించారు -
కాకినాడ జిల్లా కరప గ్రామానికి చెందిన మార్వాడి కుటుంబం ఆవేదన
-
పవన్ అన్నా.. కాపాడు అన్నా!
సాక్షి, తూర్పుగోదావరి: తమ బిడ్డ కనిపించడం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కనిపించేలా ఓ కుటుంబం ఫ్లకార్డులతో నిరసనకు దిగింది. పవన్‌ను కలిసేందుకు వచ్చిన మార్వాడి కుటుంబాన్ని ఆయన సిబ్బంది పట్టించుకోకుండా పంపేశారు.కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం మార్వాడి కుటుంబం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది. ఈ నెల 8వ తేదీన ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఎయిర్‌ఫోర్ట్ నుంచి బయట పవన్ కళ్యాణ్ రాక కోసం ప్లకార్డులు పట్టుకుని బాధిత కుటుంబం ఎదురుచూసింది. ఎయిర్‌ఫోర్ట్ వద్ద కూడా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మీ ఇంటికి TDP నేతలు రాగానే వీటన్నింటిపై నిలదీయాలి: YS జగన్
-
RK Roja: వీడియో కాల్ లో పరామర్శలు చేసే నువ్వు.... నీతులు మాట్లాడుతుంటే...
-
పవన్ కల్యాణ్ పై తమిళ నటుడు కట్టప్ప సత్యరాజ్ ఆగ్రహం
-
పవన్ ది EVM గెలుపే.. రోజా సంచలన వ్యాఖ్యలు
-
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తామంటే ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)కి తమిళ నటుడు సత్యరాజ్(Sathyaraj) వార్నింగ్ ఇచ్చాడు. తమిళనాడులో మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనంలో పవన్ .. నాస్తికులు, సెక్యులరిస్టులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే… అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని విమర్శించాడు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్… తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు. విడుతలై చిరుతైగల్ కచ్చి (వీకేసీ) పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, పవన్ వ్యాఖ్యలను ఇప్పటికే డీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు తమిళనాడుతో మీకేం సంబంధం’ అని డీఎంకే కీలక నేత, మంత్రి శేఖర్ బాబు పవన్‌ని ప్రశ్నించారు. ‘మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ అంతగా తమిళనాడుపై ప్రేమ ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించు’ అని పవన్‌కి సవాల్ విసిరాడు. -
పవన్.. దమ్ముంటే వారిద్దర్నీ తొక్కిపెట్టి నార తీయాలి: రోజా
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. పాలనను పక్కన పడేసి దాడులు, అరాచకాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్‌ను ప్రజలు ఓడించలేదు.. ఈవీఎంల గోల్‌మాల్‌తో ఓడించారు. వైఎస్ జగన్ సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్ర. అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో కనిపిస్తుంది. మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా పవన్ కల్యాణ్. మరి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌ను తొక్కిపెట్టి నార తీయాలి కదా’ అని ప్రశ్నించారు. -
సేనాని @20ఏళ్ల పాలేరు.. జన సైనికులకు అరుపులే మిగిలాయా?
శిఖరం ఒకరి ముందు తలవంచదు.. సముద్రం ఎవరి కాళ్లకు సలాం చేయదు అంటూ పెద్ద పెద్ద డైలాగులు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అధికారం రుచి మరిగి ఇప్పుడు పాలేరుగా పనిచేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ప్రజల తరఫున ప్రశ్నిస్తాను అని చెప్పిన జనసేనని.. ఇప్పుడు ఇంకో 20 ఏళ్లు కూటమిని, ప్రభుత్వాన్ని మోయడానికి తనకి ఎలాంటి భేషజాలు, నామోషి, సిగ్గు లేదని తేల్చేశారు.వైఎస్ జగన్ మీద కడుపుమంట కావచ్చు.. అక్కసు కావచ్చు... ఈర్ష్య.. అసూయ కావచ్చు ఏదైనా కానీ జనసేనాని మాత్రం ఆజన్మాంతం చంద్రబాబుకు, లోకేష్‌కు సేవకుడిగా బతకడానికి తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు రాజకీయంగా ఎలాంటి విజన్, దార్శనికత.. ముందుచూపు, పార్టీ బలోపేతంపై నిబద్ధత లేదని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ ఇచ్చే మూటలు తీసుకుంటూ ఆ పార్టీని గెలిపించడానికి తాను రాజకీయంగా ఎంత నీచనికైనా దిగజారతానని తేల్చి చెప్పేశారు. దీంతో సీఎం అంటూ ఆయన సభల్లో గొంతు వాచిపోయేలా అరిచే ఆయన అనుచరులకు మాత్రం నైరాశ్యం మిగిలింది. నిన్ను గెలిపించడానికి.. సీఎంగా చూడడానికి మేము ఎన్నిసార్లు తెలుగుదేశం వారికి ఊడిగించేయాలి అంటూ వారు తమలో తాము కుమిలిపోతున్నారు.వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు ఉన్నంతకాలం లేదా ఆయనకు ఆసక్తి ఉన్నంతకాలం బాబుకే ప్రాధాన్యం ఉంటుంది. అంతే తప్ప కొద్దిపాటి సీట్లు తీసుకుని పోటీ చేసే పవన్ కల్యాణ్‌కు ఎప్పటికీ ముఖ్యపాత్ర దక్కదు. ఢిల్లీ బీజేపీ పెద్దల ఒత్తిడి పుణ్యమా అని ఆయనకు డిప్యూటీ సీఎం అనే నామమాత్రపు పదవిని కట్టబెట్టి కాపుల్లో ఆయనకు ఉన్న పరపతి, ఓటు బ్యాంకును చంద్రబాబు విజయవంతంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యం దక్కలేదని.. ప్రోటోకాల్ తగ్గిందని పవన్‌కు ఉన్నంత ఇంపార్టెన్స్ లేదని ఇబ్బంది పడుతున్న లోకేష్ అనధికారికంగా సీఎంగానే వ్యవహరిస్తూ అన్ని పనులు చేస్తున్నారు.మరోవైపు, ఆయనకు ఎలాగైనా డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నాయకుల నుంచి డిమాండ్లు కూడా తెర వెనుక నుంచి చేయిస్తున్నారు. ఇక, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తే వచ్చే ఎలక్షన్ల నాటికి లోకేష్‌ను సీఎం అభ్యర్థిగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు పల్లకి మోస్తున్న పవన్ వచ్చే ఎన్నికల్లో లోకేష్ తరఫున పనిచేయాల్సి ఉంటుంది. అంటే లోకేష్ సీఎం కావడానికి కూడా పవన్ బేషరతుగా ఒప్పుకున్నట్లుగా లెక్క.. అంటే తండ్రి కొడుకులకు సేవ చేయడానికి పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినట్లుగా ఇటు కాపు సామాజిక వర్గం ఆయన అభిమానులు సైతం భావిస్తున్నారు. చంద్రబాబు లేకపోతే ఆయన కొడుకు లోకేష్‌కు అయినా సరే ఆయన అడుగులకు మడుగులు నొక్కడానికి పవన్ రెడీగా ఉన్నట్లు మొన్నటి ప్రకటనలతో అర్థమైంది.ఇంకో 20 ఏళ్ల పాటు తెలుగుదేశానికి తాను పాలేరుగా ఉంటానని ఆయన స్పష్టంగా చెప్పేశారు. చంద్రబాబు, లోకేష్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వడానికి అంగీకరించరు. ఎన్నటికీ పవన్ వారి తాబేదారిగా మాత్రమే ఉండాలి అన్నది వారి అభిమతం. నిన్ను సీఎంగా చూడాలని నేను తాపత్రయపడుతుంటే నువ్వు తెలుగుదేశానికి 20 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ తీసుకుని మరి పాలేరుగా పనిచేయడానికి సిద్ధం అవుతున్నప్పుడు ఇక మేమేం చేస్తాం.. అంటూ జన సైనికులు లోలోన కుమిలిపోతున్నారు. -సిమ్మాదిరప్పన్న. -
‘ప్రశ్నించే గొంతుకు అన్నారు కదా.. ఆ గొంతు ఇప్పుడు ఏమైంది...?’
తూర్పుగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో భయంకరమైన రాజకీయాలు చూడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి ప్రభుత్వంలో కేవలం కక్ష సాధింపు రాజకీయాలే కనబడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగటం లేదని ధ్వజమెత్తారు. ‘టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి వయసుకు తగ్గ మాటలు మాట్లాడటం లేదు. మాజీ ముఖ్యమంత్రి పై విమర్శలు చేసిన బుచ్చయ్య చౌదరిపై కేసులు ఉండవు. వాళ్లు మాట్లాడిన మాటలకు ఎటువంటి సెక్షన్లు వర్తించవు. వైఎస్సార్సీపీ నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు మాట్లాడితే మాత్రం వెంటనే ఎక్కడ లేని సెక్షన్లు పుట్టుకొచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఓ అభిమాని ప్లకార్డు ప్రదర్శించిన దాని గురించి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ లు పెట్టి టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోవాస్తవాలను వాస్తవాలుగా చూపించడం ,తప్పు జరిగిన చోట ఖండించడం జరగడం లేదు. పల్నాడు ఘటనలో ఎస్పీ ప్రెస్ మీట్ లో ముందు ఒకలా మాట్లాడారు.. ఈరోజు ఎస్పీని మ్యాను ప్లేట్ చేశారు.సెక్షన్లు మార్చేసి వాళ్లకు ఇష్టం వచ్చినట్లు చేయాలని చూస్తున్నారు. జగనన్న ఎక్కడికి వెళ్ళినా జన సందోహం స్వచ్ఛందంగా వస్తున్నారు... అది చూసి నేతల తట్టుకోలేకపోతున్నారు.కూటమినేతలుచెప్పిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నమ్మి ఓట్లేసి మోసపోయామని ప్రజలకు కుమిలిపోతున్నారు. ప్రతి కుటుంబంలో కూడా జగనన్నను గుర్తుచేసుకోని వారు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం మా మీద బురద చల్లడం కోసం మహిళలు మిస్ అయ్యారు అని అన్నారు. వాలంటీర్లకు 5000 ఏం సరిపోతాయి మీ పొట్టను కొట్టను అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరీపొట్ట కొట్టాడు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో దళితులు వెలివేతకు గురైతే కనీసం స్పందించలేదు. ప్రశ్నించే గొంతుకు అన్నారు కదా ఆ గొంతుక ఇప్పుడు ఏమైంది...?’ అని ప్రశ్నించారు తానేటి వనిత. -
తండ్రి 420.. కొడుకు 840... అబద్ధాలు: Perni Nani
-
‘ఏడాదిలోనే చంద్రబాబు చేసిన అప్పు అక్షరాల రూ.1.62 లక్షల కోట్లు’
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత చిత్తశుద్ధితో అమలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.‘ఓట్ల కోసం కూటమి నేతలు,ఎల్లో మీడియా వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు 420 అబద్ధాలు,లోకేష్ 840 అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు,పవన్,లోకేష్ సొంత డబ్బా కొట్టుకోవడం.. వైఎస్ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ రూ.14లక్షల కోట్లు అప్పులు చేశారని.. చంద్రబాబు,లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. చంద్రబాబు తొలి ఏడాదిలోనే రూ.1.62 లక్షల కోట్లు అప్పు చేశారు’అని ఆరోపించారు. -
ఏపీలో పనికిమాలిన పాలన: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయిందని.. టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ..‘‘చంద్రబాబు ముఖానికి పట్టుమని పది మంది కూడా రారు. అందుకే వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయింది.అందుకే టీడీపీ ుండాలు రెచ్చిపోతున్న చూస్తూ ఉండిపోతోంది.రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు, హత్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత ఎక్కడ ఉన్నారు?. లోకేష్‌కు పొలిటికల్ నాలెడ్జ్ లేదు. లోకేష్ షాడో సీఎం.. చంద్రబాబు పని లేక మూలన కూర్చున్నారు. సిగ్గుమాలిన తండ్రీకొడుకులతో ఏపీలో పనికిమాలిన పాలన నడుస్తోంది.ఏపీలో రాజకీయ నేతలను, మహిళలను వేధిస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ అంటే గిరిజన పిల్లలను నేల మీద పడుకోబెట్టడమా?. సనాతని వేషం వేసుకుని పవన్ కల్యాణ్ తిరుగుతున్నారు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. వైఎస్ జగన్ పాలనలో దిశ యాప్‌తో మహిళలకు రక్షణ ఉండేది. మహిళలకు రక్షణతో పాటు ఆర్థికంగా బలోపేతం కూడా అయ్యారు’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
చిరంజీవి తల్లికి తీవ్ర అస్వస్థత!
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి.. తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ మీటింగ్‌లో ఉన్న పవన్ కల్యాణ్.. హుటాహుటిన అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్‌కి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ విషయం వినిపిస్తుంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అస్వస్థత గురించి క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: చిరు పక్కన అనామక హీరోయిన్?)ఈ ఏడాది జనవరిలో అంజనా దేవి.. 75వ పుట్టినరోజు సెలబ్రేట్ పూర్తి చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నిరోజులకే అంటే ఫిబ్రవరిలో.. ఈమె అనారోగ్యానికి గురయ్యారనే రూమర్స్ వచ్చాయి. కానీ వెంటనే కోలుకున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని మెగా ఫ్యామిలీ నుంచి స్పష్టత వచ్చింది. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురయ్యారనే తెలిసి మెగా అభిమానులు కంగారు పడుతున్నారు.అంజనా దేవికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల విషయానికొస్తే చిరంజీవి హీరోగా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మనవడు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్. మిగిలిన ఇద్దరు కొడుకులు నాగబాబు, పవన్ కల్యాణ్. కూతుళ్ల పిల్లలు కూడా ప్రస్తుతం నటులుగా రాణిస్తున్నారు. కుటుంబం అంతా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు) -
స్టీల్ ప్లాంట్ లో రెండు విభాగాలు ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయం
-
విశాఖ ఉక్కుకు కూటమి సర్కార్ వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కుకు కూటమి సర్కార్ వెన్నుపోటు పొడుస్తూ.. ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. స్టీల్ ప్లాంట్‌లో రెండు విభాగాలు ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయించింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్, సింటర్ ప్లాంట్లను ప్రైవేటపరం చేసేందుకు రంగం సిద్ధమైంది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం దరఖాస్తులకు ఆహ్వానించింది ఇప్పటికే పలు అనుబంధ విభాగాలను ప్రభుత్వం అమ్మేసింది.స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోరెత్తడం లేదు. కూటమి ప్రభుత్వ వైఖరిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపకపోగా అనుబంధ విభాగాల ప్రైవేటుపరం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
YS Jagan: ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికెళ్లడం తప్పా?
-
సుపరిపాలన సభలో పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘నేనూ సినిమాల నుంచే వచ్చా.పిచ్చి వేషాలు వేయకండి .. కాలుకు కాలు మక్కెలు ఇరగదీస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు..మేం ఇక్కడ సరదాగా లేం. చాలా దెబ్బలు తిని వచ్చాం .. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకండి.సజ్జనుడికి కోపం వస్తే అడవి కూడా ఆపలేదు. మాది మంచి ప్రభుత్వం .. మెతక ప్రభుత్వం కాదు. పిచ్చి వేషాలు వేస్తే .. తొక్కి నారతీస్తాం అంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బాబు, పవన్ పై బైరెడ్డి అదిరిపోయే సెటైర్లు
-
10 లక్షల కుటుంబాలు కోర్టుకెక్కితే.. ఇది కదా అసలైన గిన్నీస్ రికార్డు
-
పవన్ కల్యాణ్ సొంత శాఖ అధికారుల నిర్వాకం
-
అంతులేని యోగ సంపద!
‘అంతులేని కథ’ అనే ఒక సినిమా ఉంది. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ’70వ దశకంలో సంచలన చిత్రం. ఓ కుటుంబ యజమాని తన బాధ్యతల్ని వదిలేసి పారిపోతాడు. పెళ్లీడొచ్చిన పెద్ద కూతురు ఆ భారాన్ని తన భుజాలమీదేసుకుని బండి నడిపిస్తుంది. అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత పారిపోయిన పెద్దమనిషి ఇంటికి ఉత్తరం రాస్తాడు. ఇన్నేళ్లూ తాను కష్టపడి సంపాదించిన అంతులేని సంపదతో తిరిగొస్తున్నానని ఆ ఉత్తరంలో చెబుతాడు. ఇల్లంతా పండుగ వాతావరణం. ఆ రోజు రానే వచ్చింది. ఆయన దిగనే దిగాడు. కాకపోతే కాషాయ దుస్తుల్లో, సన్యాసి వేషంలో! షాక్ తిన్న కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి తన ఉత్తరంలో రాసిన సారాంశాన్ని వివరిస్తాడు. తన ఉద్దేశంలో సంపద అంటే భక్తి సంపద, జ్ఞాన సంపద, తపః సంపద, మోక్ష సంపద... ఇవి దండిగా సంపాదించానని చెబుతాడు.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని ఒక గొప్ప ఈవెంట్‌గా మలుచుకునేందుకు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ అక్కరకొచ్చింది. ప్రధానిని పిలుచుకున్నారు. 3 లక్షల మందితో విశాఖ తీరంలో ఆసనాలు వేయించి, గిన్నిస్ బుక్ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. గతంలో ఎవరూ చేయని ఘనమైన కార్యాన్నే గిన్నిస్ బుక్ వాళ్ళు రికార్డులోకి ఎక్కిస్తారు. ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని తాపేశ్వరం స్వీట్ షాప్ వాళ్లు 29,465 కిలోల బరువు ఉన్న లడ్డూను తయారు చేసినందుకు షాపు యజమాని పోలిశెట్టి మల్లిబాబుకు గిన్నిస్ బుక్‌లో చోటు దొరికింది. రామ్ సింగ్ అనే జైపూర్ వాసి నాలుగున్నర మీటర్ల పొడవైన మీసాలు పెంచి ఈ ఘనత సాధించాడు. ఆంటోనీ విక్టర్ అనే మరో భారతీయుడు చెవుల మీద ఏడు ఇంచుల పొడవైన వెంట్రుకల్ని పెంచాడు. ఇదేమీ చిన్న ఫీట్ కాదు కదా! అందుకే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది.అట్లాగే చేతి వేళ్లకు ఉన్న గోళ్ళను ఎనిమిదిన్నర మీటర్లు పెంచి ఒకరు, తలకాయతో 46 టాయిలెట్ సీట్లను పగలగొట్టి మరొకరు, 459 స్ట్రాలను ఒకేసారి నోట్లో కుక్కి ఇంకొకరు ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈ విశిష్ట ఘనతలు ఆంధ్రప్రదేశ్‌కు రెండు లభించాయి. ఒకే ప్రదేశంలో మూడు లక్షల మందికి పైగా యోగా చేసినందుకు ఒకటి, 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసినందుకు మరొకటి! గిన్నిస్ రికార్డుల కోసం ఎక్కువ మందితో ఒకే చోట డాన్సులు చేయించడం, డ్రమ్స్ వాయించడం, పాటలు పాడించడం వంటి కార్యక్రమాలను సాధారణంగా పెద్ద పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల వాళ్ళు చేస్తుంటారు. ఇది మరీ పెద్ద రికార్డు కనుక స్వయంగా ప్రభుత్వమే తన భుజాల మీదకు ఎత్తుకుంది. డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా వెళ్లాలని తాఖీదులు వెళ్లాయి. స్వచ్ఛంద సంస్థలని బలవంతంగా రంగంలోకి దింపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ హాజరయ్యే బాధ్యతను ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. వేలాది బస్సులను ఏర్పాటు చేశారు. టీ షర్టులను, మ్యాట్లను ఉచితంగా అందజేశారు. ఐదు లక్షలు టార్గెట్‌గా పెట్టుకుంటే, అటెండెన్స్ మూడు లక్షల మార్కు దాటింది. కార్యక్రమం విజయవంతం కావడం, ఒకేసారి రాష్ట్రానికి విశిష్టమైన రెండు గిన్నిస్ రికార్డులు లభించటం సహజంగానే ముఖ్యమంత్రిని మిక్కిలి సంతోషపరిచింది. కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. విశాఖపట్నం అంటే తనకెంతో ఇష్టం కనుక ఈ ఘనత విశాఖకు లభించేలా చేశానని అర్థం వచ్చేలా మాట్లాడారు. హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు తను విశాఖలోనే బస్సులో కూర్చుని అజమాయిషీ చేసిన సంగతిని గుర్తు చేశారు. ముంబయ్‌ని మించి, విశాఖలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమం సందర్భంగా ప్రధాని సమక్షంలో ఆయనను చరిత్ర సృష్టించిన వ్యక్తిగా పొగిడిన బాబు – మీడియా సమావేశంలో ఆయనకు మరిన్ని పొగడ్తలు తగిలించారు. ఒక ప్రభుత్వం ఏడాది పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు సహజంగా ఫోకస్ కావాల్సిన అంశాలు, చర్చనీయాంశాలు కావలసిన సంగతుల స్థానాన్ని ఇటువంటి మెగా ఈవెంట్ ఆక్రమించడం కూడా బాబు ఆనందానికి ఇంకో కారణం కావచ్చు. సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డును తెచ్చిపెట్టిన గిరిజన బాలలు విశాఖలో ఆకలితో అలమటించారని, పడుకునేందుకు, కనీస అవసరాలకు చోటు దొరక్క అగచాట్ల పాలయ్యారని వస్తున్న వార్తలు, తన ఆనందానికి భంగం కలిగించడం ఆయనకు ఇష్టంలేదు. అందుకే ఆ ఘటనపై విచారమూ లేదు... విచారణా లేదు.ప్రభుత్వం ఏడాది పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చనీయాంశం కావలసిన అంశాలను ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొన్న జనం ముందుకు, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో గణాంకాల సహితంగా నిరూపించారు. ఆయన సొంత గణాంకాలు కావవి! ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల గణాంకాలతోనే జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారు. ఏడాది కాలంలోనే లక్షా అరవై వేల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించారు. ఏడాదిగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని నిలిపివేయడంపై నిలదీశారు. ప్రభుత్వ బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్యకు బ్రేకులు వేయడంలోని ఔచిత్యం ఏమిటని అడిగారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్’, ‘ఆరోగ్యశ్రీ’ బకాయిల ఎగవేతపై, రైతాంగాన్ని కష్టాల కడలిలో ముంచడంపై తూర్పారబట్టారు. అన్నింటినీ మించి ‘‘ఎన్నికల బాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీయండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి ఇంటింటికీ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసింది. ‘‘చంద్రబాబు నాయుడు – పవన్ కల్యాణ్ అను మేము రాష్ట్ర ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ష్యూరిటీ పత్రంలో పేర్కొన్న హామీలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని పేర్కొంటూ వారిద్దరూ ఆ పత్రాలపై సంతకాలు చేశారు. ఆ పత్రంలో కుటుంబ యజమాని పేరు, తండ్రి పేరు, వయసుతోపాటు కుటుంబ సభ్యుల సంఖ్యను, తాము హామీ ఇస్తున్న పథకాల్లో ఆ కుటుంబానికి వర్తించే వాటిని పేర్కొన్నారు. ఆ పథకాల కింద వారికి మొదటి ఏడాది జరిగే లబ్ధిని, ఐదేళ్లలో జరిగే లబ్ధిని కూడా పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న కోటీ నలభై లక్షల కుటుంబాలకు ఈ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసినట్టు సమాచారం. జూన్ 2024 నుంచి ఈ హామీలు వర్తింపచేస్తామని కూడా ఈ పత్రంలో స్పష్టంగా రాశారు. ఆ లెక్కన ప్రమాణ పత్రాల సాక్షిగా ఏపీ ప్రజలకు ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయి పడిందని అంచనా.ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేసినప్పుడు బాధ్యత గల ప్రభుత్వాలు దానికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. సమాధానం ఇవ్వకపోగా ప్రతిపక్ష నేత పిలుపునిచ్చినట్టుగా ఎవరైనా నిలదీస్తే తాట తీస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం ఒక విడ్డూరం. పైగా అసలు కథను వదిలేసి ‘రప్పా రప్పా’ అనే ఓ పిట్ట కథను పట్టుకొని జగన్ మోహన్ రెడ్డి అనని మాటల్ని ఆయనకు ఆపాదించి మీడియాలో తెలుగుదేశం పార్టీ వీరంగం వేసింది. ఆ మీడియాలోనే చదివిన వాళ్లకు, చూసిన వాళ్లకు ఏం అర్థమవుతుంది? రెండున్నర గంటల మీడియా సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి ‘రప్పా రప్పా’ అనే అంశంపైన మాత్రమే మాట్లాడారని అనుకుంటారు కదా! ఇదే తెలుగుదేశం పార్టీకి కావలసింది. ప్రతిపక్ష నేత లేవనెత్తిన అంశాలు జనంలోకి వెళ్ళకూడదు, చర్చ జరగకూడదు.ఒకవేళ కూటమి పెద్దల ఖర్మ కాలి, ఈ ప్రమాణ పత్రాలను తీసుకుని కోటి కుటుంబాల వారు తమకు బకాయిలు ఇప్పించాలని కోర్టుల మెట్లెక్కితే? కోర్టులు ఎలా స్పందిస్తాయనేది పక్కన పెడదాం. ప్రభుత్వం మోసం చేసిందంటూ కోటి కాదు, పది లక్షల కుటుంబాల వారు ఒకేసారి ఫిర్యాదులు చేసినా అదే పెద్ద రికార్డు! దాని ముందు గిన్నిస్ రికార్డులు, పిన్నిస్ రికార్డులు అన్నీ బద్దలు కావాల్సిందే! ఇదిగో జనం నుంచి ఇటువంటి సామూహిక ఫిర్యాదులు రాకుండా వారి ఆలోచనలను హైజాక్ చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, గిన్నిస్ బుక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్నది. యోగా అనేది సర్వరోగాలకూ, సకల సమస్యలకూ ఏకైక దివ్యౌషధం అన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు.‘రోజు ఒక గంట యోగా చేయండి. అదే పదివేలు’ అని ముఖ్యమంత్రి పిలుపునిస్తున్నారు. యోగాపై విశాఖ డిక్లరేషన్ కూడా త్వరలో విడుదల చేస్తారట! బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నామని, యోగా–నేచురోపతి గేమ్ ఛేంజర్లుగా మారబోతున్నాయని ఆయన ప్రకటించారు. ఇక అల్లోపతి అటకెక్కినట్టేనా? యోగాభ్యాసాల్లో చేయించే ఎక్సర్‌సైజుల్లో చాలా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు గతంలో పాఠశాలల్లో ఉన్న డ్రిల్ పీరియడ్లలో నేర్పించినవే. ఇప్పుడు మైదానాలు, స్పోర్ట్స్ టీచర్లు, స్పోర్ట్స్ పీరియడ్లను ఎత్తేశారు కాబట్టి, ఎవరింటి దగ్గర వాళ్లు గంటసేపు యోగా చేయమంటున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ దివంగతులైన రోజు జూన్ 21. అదే రోజును ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించడం కేవలం కాకతాళీయమే కావచ్చు.కానీ, ఈ ప్రకటన తర్వాత యోగా గురువులు తామరతంపరగా పుట్టుకొస్తున్నారు. యూట్యూబ్‌ల ద్వారా పాఠాలు చెబుతున్నారు. అందులో రోగాల స్పెషలిస్టులు కూడా బయలుదేరారు. నడుము నొప్పికి సేతుబంధాసనమట! సంతానం కలగాలంటే భుజంగాసనమట! ఇలానే కడుపునొప్పికి, గ్యాస్ మంటకు, దగ్గుకు, ఆయాసానికీ చివరికి ఎయిడ్స్‌కు, క్యాన్సర్‌కు కూడా యోగా చిట్కాలు చెప్పే గురువులు తయారయ్యారు. వీటన్నిటినీ వైద్యశాస్త్రం ఆమోదిస్తుందా, వీళ్ళందరికీ శరీర నిర్మాణ శాస్త్రంపై అవగాహన ఉన్నదా అనేవి ప్రశ్నార్థకాలు. ఆమధ్య ‘టెలిగ్రాఫ్ ఇండియా’ ఒక పరిశీలనాత్మక వ్యాసం రాసింది. అందులో ‘అష్టాంగ యోగా’ను ఆచరిస్తున్న వారిలో 62% మంది మోకాలి నొప్పులు, పిక్క కండరాల సమస్యలను ఎదుర్కొంటున్నారట! ఏ వయసు వారు ఎటువంటి ఆసనాలు వేయవచ్చు? ఆసనాలు వేసే సరైన పద్ధతి ఏమిటనే అవగాహన శాస్త్రీయంగా కల్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి. యూట్యూబ్ సందేశాలు విని, పునర్ యవ్వనం ప్రాప్తిస్తుందని నమ్మి ముసలాళ్లు కూడా వజ్రాసనం వేసి కూర్చుంటే మోకాలి చిప్పలు దెబ్బతినవా? ఈ వేలం వెర్రిని నియంత్రించుకోకుంటే దుష్ఫలితాలు కూడా ఉంటాయని గ్రహించాలి.పిల్లలు పాఠశాల మైదానాల్లో నేర్చుకునే జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలకు, ఇంటి దగ్గర ఇరుకు గదుల్లో అభ్యసించే యోగా సరైన ప్రత్యామ్నాయమేనా అనేది కూడా ఆలోచించాలి. యోగాభ్యాసం ద్వారా శారీరక చురుకుదనం, మానసిక పరిపక్వత దేదీప్యమానమవుతుందనే అభిప్రాయం నిజమైతే దీన్ని ప్రమోట్ చేసే పద్ధతి గిన్నిస్ బుక్ ప్రదర్శనల ద్వారా కాదు. యోగాభ్యాసం ఫలితంగా ఫలానా అథ్లెట్ ఫలానా కప్పు గెలుచుకొచ్చారని, ఫలానా క్రీడా జట్టు ఫలానా టోర్నమెంట్ గెలిచిందని ఉదాహరించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఫలానా వ్యక్తులు ఫలానా ఆవిష్కరణలు చేశారని, నోబెల్ బహుమతి గెలిచిన వారి మేధ వెనుక యోగాభ్యాసం ఉన్నదనేటటువంటి పాఠాలు ఎక్కువ మోటివేట్ చేస్తాయి. కాకపోతే అటువంటి ఉదాహరణల కోసం కాస్త కష్టపడి శోధించాలి.‘సకల సమస్యలకు యోగానే మందు’ అనే ప్రచారాన్ని ముందుకు తెస్తున్న చంద్రబాబు లాంటి వాళ్లు ‘‘ప్రభుత్వ బడుల్లో టోఫెల్ పాఠాలెందుకు, సీబీఎస్ఈ ఎందుకు, ఐబి ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు? యోగా ఉందిగా! ‘ఆరోగ్యశ్రీ’ ఎందుకు, ‘ఫ్యామిలీ డాక్టర్’ ఎందుకు? యోగా చేయండి చాలు!’’ అనే ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉన్నది. ‘అంతులేని కథ’లో సదరు సన్యాసిరావు సంభాషించిన జ్ఞాన సంపద, భక్తి సంపద, తపః సంపద మాదిరిగానే! ఇక ఆంధ్ర దేశంలో యోగ సంపద కూడా దినదిన ప్రవర్ధమానం కావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తోడల్లుడు కావడమే అర్హతా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మిత్రభేదంతో సతమతమవుతున్న జనసేనకు పిఠాపురంలో కొత్త కుంపట్లు రాజుకున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ రూపంలో జనసేన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ పెద్ద సవాల్నే ఎదుర్కొంటోంది. ఆయన రాజకీయాన్ని తట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు నానా తంటాలూ పడుతున్నారు. ఈ తలనొప్పి ఇలా కొనసాగుతూండగానే పులి మీద పుట్రలా నియోజకవర్గంలో పార్టీపై ఆధిపత్యం కోసం ‘గ్లాస్’మేట్స్ కుమ్ములాడుకుంటున్నారు. వారిని దారికి తెచ్చుకోలేక ఆ పార్టీ సతమతమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎన్నికై , ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ ఈ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి పోతూంటారు. తమ్ముడి తోడ్పాటుతో శాసన మండలి సభ్యుడైన ఆయన అన్న, సినీ నటుడు నాగబాబు కూడా అదే మార్గం అనుసరిస్తున్నారు.ఆయన నియోజకవర్గానికి వస్తే ఏదో ఒక కొత్త సమస్య రాజేసి పోతూంటారనేది బహిరంగ రహస్యమే. ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై పరోక్షంగా లేనిపోని విమర్శలు చేస్తూ నాగబాబు కొత్త తలపోట్లు తెచ్చి పెడుతూంటారు. పవన్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పటి నుంచీ ఈ నియోజకవర్గంలో జనసేన బాధ్యతలను నాగబాబుకు వరుసకు తోడల్లుడైన మర్రెడ్డి శ్రీనివాస్‌కు అప్పగించారు. కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గం ద్వారపూడికి చెందిన మర్రెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాల్లో ఎటువంటి అనుభవమూ లేదు. అయినప్పటికీ ఆయనను నియోజకవర్గ ఇన్చార్జిని చేసినా, పవన్‌పై అభిమానంతో ఆ పార్టీ నేతలు, అభిమానులు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు.తోడల్లుడు కావడమే అర్హతా?గత ఎన్నికల్లో కూటమి గద్దెనెక్కి, పవన్ ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ పిఠాపురం ఇన్చార్జి పదవి కోసం జనసేనలో కుమ్ములాటలు మొదలయ్యాయి. పవన్, నాగబాబు అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గంపై ఆధిపత్యం చెలాయించాలనే ఆశావహుల జాబితా రోజులు గడిచేకొద్దీ చాంతాడులా పెరుగుతోంది. ఎవరి మట్టుకు వారే ఈ పదవి కోసం ఆరాటపడుతూ ప్రస్తుత ఇన్చార్జి మర్రెడ్డి మైనస్‌లపై ఫోకస్ చేస్తున్నారు. రాజకీయాల్లో అనుభవం లేకున్నా కేవలం నాగబాబుకు వరుసకు తోడల్లుడు కావడమే అర్హతగా ఇన్చార్జిని చేశారన్నది ఆ పార్టీ నేతలు మొదటి నుంచీ లోపాయికారీగా విమర్శిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి వరకూ మర్రెడ్డికి పైనుంచి కింది వరకూ అంతటి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. ఈ నేపథ్యంలో జనసేన ఇన్చార్జిగా మర్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో అవలంబిస్తున్న వైఖరిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎంపిక చేసుకున్న కొందరికి మాత్రమే ఆయన పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిని ఆవిర్భావం నుంచీ పార్టీ వెన్నంటి నిలిచిన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో, ఆ పార్టీలో సొంత సామాజికవర్గ నేతలే మర్రెడ్డికి తాజాగా కుంపటి రాజేస్తూండటం జనసేనలో హాట్‌టాపిక్‌గా మారింది.విభేదాలకు ‘తొలి గంట’గతంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానం ఉత్సవాల సందర్భంగా తొలి గంట కొట్టే విషయంపై రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఆ సందర్భంగా మర్రెడ్డి ఒక వర్గానికి కొమ్ము కాయడం అప్పట్లో రచ్చరచ్చ అయ్యింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కు చేబ్రోలులోని తన ఇంటిని ఓదూరు నాగేశ్వరరావు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన వర్గం మర్రెడ్డిని బహిరంగంగానే నిలదీసింది. దీనిని సాకుగా తీసుకుని చేబ్రోలులో పవన్‌కు ఇచ్చిన ఇంటిని కావాలనే ఖాళీ చేయించి, పార్టీకి, పవన్‌కు స్థానికంగా అడ్రస్ లేకుండా చేశారని ఓదూరు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మర్రెడ్డి సమయస్ఫూర్తితో సర్దుబాటు చేయలేకపోతున్నారని ఆయన వ్యతిరేక వర్గం పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లిందని చెబుతున్నారు. అంతటి రాజకీయ అనుభవం ఆయనకు లేని విషయమై ముఖ్య నేతలకు గట్టిగా చెప్పారని సమాచారం. అదే సందర్భంలో స్థానికేతరుడైన మర్రెడ్డి స్థానే స్థానికులకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌ను తెర మీదకు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో మర్రెడ్డికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడా) చైర్మన్ పదవి కట్టబెట్టి, పార్టీలోని అర డజను మంది నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలనే విషయమై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.రూ.కోట్ల కోసం కొట్లాటలుఇటీవల పవన్ నియోజకవర్గానికి కేటాయించిన రూ.4 కోట్ల పనుల పంపకాల అంశం కూడా ఆ పార్టీ నేతల మధ్య మరింత అగ్గి రాజేసిందనే చర్చ జరుగుతోంది. పనుల కేటాయింపులో మర్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారంటూ కొందరు నేతలు పార్టీ ముఖ్యుల వద్ద ‘పంచాయితీ’ పెట్టారని సమాచారం. తనకు నచ్చిన ఒకరిద్దరికి మాత్రమే ఆయన పనులు అప్పగించడం మిగిలిన నేతలకు రుచించడం లేదు. అకస్మాత్తుగా విదేశాల నుంచి వచ్చిపడిన వారికి పదవుల పంపకంలో ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతలు తీవ్రంగా విభేదిస్తున్నారు. అందునా ఇటీవల మంజూరైన నీటిపారుదల, రహదారుల వంటి పనులను నేతల రూపంలో ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడంపై వారు గుర్రుగా ఉన్నారు. అకస్మాత్తుగా వచ్చిపడిన నేతలకు ఇస్తున్న ప్రాధాన్యం తమకెందుకివ్వడం లేదని పలువురు నిలదీస్తున్నారు. ఇటీవల పిఠాపురం రూరల్ ఎఫ్‌కే పాలెం, విరవాడ గ్రామాలకు చెందిన పాపిడిదొడ్డి చెరువులో జరిగిన మట్టి తవ్వకాల్లో పంపకాల విషయంపై జనసేనలో ఇరు వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరిగాయి. రెండు వర్గాలూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కానీ, మర్రెడ్డి అనుయాయుడి ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసి, వైరివర్గం ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో, అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. -
ఇది నీ వీడియోనే.. దమ్ముంటే సమాధానం చెప్పు
-
'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా ఐదేళ్లుగా పురిటి నొప్పులు పడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2020లో షూటింగ్ మొదలుపెడితే కొన్నాళ్ల క్రితం దాన్ని పూర్తి చేశారు. ఈ మధ్యలో చిత్రీకరణ వాయిదా మీద వాయిదా పడుతూ వచ్చింది. సరే అంతా పూర్తయింది అనుకుంటే ఇప్పుడు రిలీజ్ విషయంలో ఎడతెగని వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఫైనల్‌గా ఇప్పుడు ఓ విడుదల తేదీని ప్రకటించారు.జూలై 24న మూవీ రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. ఈసారి పవన్ కల్యాణ్‌తో పాటు సినిమాలో విలన్‌గా నటించిన బాబీ డియోల్ ఫొటోని కూడా పోస్టర్లో ఉంచారు. ఈసారి కూడా రిలీజ్ చేస్తారా లేదంటే వాయిదా వేస్తారా అనే అనుమానం అభిమానుల్లో ఉండనే ఉంది. ఎందుకంటే ఓటీటీ సంస్థతో ఇంకా డిస్కషన్ జరగలేదు.(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)లెక్క ప్రకారం ఈ ఏడాది మార్చి 27న మూవీ వస్తుందని తొలుత ప్రకటించారు. షూటింగ్ పూర్తికాకపోవడంతో మే 30కి వాయిదా పడింది. అప్పటికీ పనులు కాకపోవడంతో జూన్ 12న థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా ఈ మేరకు ఒప్పుకొంది. ఈ తేదీ దాటితే మాత్రం డీల్‌లో మాట్లాడుకున్న డబ్బులు కట్ చేస్తారనే టాక్ వినిపించింది. తర్వాత కొన్నిరోజులకు అనుకున్నదే జరిగింది. మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు జూలై 24న రాబోతున్నట్లు ప్రకటించారు.ఓటీటీ సంస్థ ఈసారి రిలీజ్ విషయంలో ఏం చేస్తుందో చూడాలి? ఒకవేళ చర్చలు సఫలం అయితే సరేసరి. లేదంటే మాత్రం మళ్లీ వాయిదా పడుతుందేమో? ఈ సమస్య కాదన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బయ్యర్లు దొరకడం లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకే జూన్ 12 నుంచి వాయిదా వేసినట్లు కూడా అప్పట్లో రూమర్స్ వచ్చాయి. మరి ఈసారైనా ఎలాంటి అడ్డంకి లేకుండా 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: సడన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా) -
సిగ్గుండాలి.. అప్పుడు వెక్కిలి నవ్వులు ఇప్పుడు సుక్తులా..!
-
Shyamala: డిప్యూటీ సీఎం కనబడుట లేదు..
-
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
శ్రీసత్యసాయి జిల్లా: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు.శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిని ఉపేక్షించబోమని చెబుతున్న పవన్‌కు. రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎంందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పవన్‌కు తెలియదా? అని శ్యామల నిలదీశారు. రాష్ట్రంలో రోజుకో దారుణం జరుగుతున్నా పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారని ప్రశ్నించారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా.. పవన్ కళ్యాణ్ మౌనం దాల్చడంపై ‘డీసీఎం మిస్సింగ్’ అనే ఫ్లకార్డును ప్రదర్శించారు శ్యామల.టీడీపీ కూటమిది ప్రజా విజయం కాదు.. ఈవీఎంల గెలుపని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని, పేదల సన్నిధి వైఎస్ జగన్ అని శ్యామల కొనియాడారు. -
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'.. ఆ బిగ్ మూవీతో పోటీ పడనుందా?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈనెలలో విడుదల కావాల్సినా ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ నెలలోనే థియేటర్లలో చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఈ సినిమా పలుసార్లు వాయిదా పడడం.. పెద్దగా బజ్ లేకపోవడంతో హరిహర వీరమల్లుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాలేదు. ఇక చేసేదేం లేక జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా వేయక తప్పలేదు.తాజాగా ఈ హరిహర వీరమల్లుకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మూవీ విడుదల తేదీని గురువారం ప్రకటిస్తామని పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ ప్రకటనతో పవన్ అభిమానుల్లో కాస్తా ఆశలు చిగురించాయి. అయితే ఈ నెల చివరి వారంలో బాక్సాఫీస్ వద్దకు రానుందా..వచ్చే నెలలో రిలీజ్ కానుందా? అనేది రేపు క్లారిటీ రానుంది. అయితే మరో వైపు జూలై 25న థియేటర్లలో రానుందని సోషల్ మీడియా వేదికగా కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ విడుదల కానుంది. ఆ డేట్ కనుక ఖరారైతే బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్తో హరిహర వీరమల్లు పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. Release Date Announcement Tomorrow 🦅💥#HariHaraVeeraMallu @MegaSuryaProd pic.twitter.com/9v6jryuTV0— HariHaraVeeraMallu (@HHVMTeam) June 18, 2025 -
ప్రశ్నిస్తానన్న పవన్.. ఏమైపోయావ్?: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలు మోసపోయారని.. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగిన ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నిలదీశారు. బుధవారం ఆయన ‘‘జగన్ అంటే నమ్మకం-చంద్రబాబు అంటే మోసం’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘చంద్రబాబు 1 లక్ష 50 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తమ యంత్రాంగానికి దోచిపెడుతున్నారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న లోకేష్ ఆ హామీ మరిచిపోయారా?. తల్లికి వందనం పథకంపై కూటమి నాయకులు డబ్బులు కోరుకుంటున్నారు. ఏడాది కూటమి పాలనలో స్త్రీ శక్తి పథకం డబ్బులు ఎవరికీ వేశారు?. రాష్ట్ర మహిళలు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారా?. ఏ ఆగస్ట్‌లో ఈ ఉచిత బస్సు అమలు చేస్తారు?’’ అంటూ కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.‘‘కూటమి పాలనలో వ్యవసాయ రంగంలో పూర్తిగా దెబ్బతింది. ప్రజలు ప్రభుత్వన్ని నిలదీస్తారని రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో డీబీటీ ద్వారా నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు జమ చేసేవాళ్లం. పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త వైఎస్సార్‌పై కూడా విమర్శలు చేస్తున్నారు. 1 లక్ష 50 వేల కోట్లలో పోలవరానికి ఎంత కేటాయించారు?. మైనింగ్ కార్పొరేషన్లో గనులకు వచ్చే లక్షల కోట్ల రూపాయల మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్తున్నాయి’’ అని కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పిఠాపురంలో జనసేన కార్యకర్త అన్యాయన్నీ ప్రశ్నించాడని ఊరు నుంచి వెలివేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేస్తే వీడియో కాల్లో పరామర్శిస్తారా?’’ అంటూ కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. -
తాట తీస్తా.. తోలు తీస్తా.. అన్నావ్ కదా పవన్ ఇప్పుడు ఏమైంది?
సాక్షి,విశాఖ: రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతుంటే తాట తీస్తా.. తోలు తీస్తానన్న పవన్ కల్యాణ్ ఏమయ్యారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. ఆ ఘటనపై వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడారు.మహిళలు, బాలికలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయి. విశాఖలో టీడీడీపీ కార్యకర్త మహిళను వివస్త్ర చేసి దాడి చేసినా పట్టించుకోలేదు.సత్యసాయి జిల్లాలో బాలికపై లైంగికదాడికి పాల్పడింది టీడీపీ వాళ్లే. నిందితులు అధికార టీడీపీకి చెందిన వాళ్లే కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. రాష్ట్రంలో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై ఎవరైనా చేయివేస్తే తాట తీస్తానన్న పవన్ ఎక్కడున్నారు?మహిళల భద్రతను గాలికొదిలేశారు. హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారు?. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇచ్చిన ప్రాధాన్యత మహిళల భద్రతకు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. -
నువ్వు లోకేశా లేక జోకేశా.. ప్యాకేజీ స్టార్ నీతులు..
-
కథ, పాత్రలో దమ్ముంటే చాలు ఇలాంటి సినిమాలు హిట్టే
‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో హీరో సాయి కుమార్ చెప్పిన డైలాగులకు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయ్. హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపిస్తే అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు దక్కే మజానే వేరు. ఖాకీ డ్రెస్‌లో లాఠీ, తు పాకీ చేతబట్టి ఆన్ డ్యూటీలో భాగంగా పవర్ఫుల్ డైలాగులతో విలన్లకు వార్నింగ్ ఇస్తుంటే ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, కేకలు వేస్తూ సందడి చేస్తుంటారు.పైగా పోలీస్ బ్యాక్‌డ్రాప్ అన్నది ఎవర్ గ్రీన్ ఫార్ములా. కథ, పాత్రలో దమ్ముంటే చాలు పోలీస్ సినిమాలు హిట్టయిపోతాయ్. ఇప్పటికే పోలీస్ కథాంశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల్లో ‘ఆన్ డ్యూటీ’ అంటూ పోలీస్‌గా విజృంభిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ముత్తువేల్ పాండియన్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ (2023) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్ర కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా ముత్తువేల్ పాండియన్ సత్తా ఏ రేంజ్లో ఉంటుందన్నది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అయితే ‘జైలర్ 2’లో విద్యాబాలన్ నటించనున్నారని టాక్. అయితే ఆమె పాత్ర ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. కెరీర్లో తొలిసారి... వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ‘ఈశ్వర్’ (2002) సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారాయన. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో, ఈ జనరేషన్ హీరోల్లో ఖాకీ డ్రెస్ వేయని ఒకే ఒక్క హీరో ప్రభాస్. ఆయన్ని ఖాకీ డ్రెస్‌లో, పవర్ఫుల్ పాత్రలో చూడాలని ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ‘స్పిరిట్’ సినిమాతో ఫుల్స్టాప్ పడింది. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పిరిట్’.ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా త్రిప్తి డిమ్రీ నటిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణణ్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారి ప్రభాస్ ఖాకీ డ్రెస్‌లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ‘స్పిరిట్’లో పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఏ రేంజ్లో విజృంభిస్తారో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి. పోలీస్ జాతర పోలీస్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు హీరో రవితేజ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘వెంకీ’ (2004)లో మొదటిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించినప్పటికీ ఆ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించరు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’ (2006) సినిమాలో విక్రమ్ రాథోడ్‌గా పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘ఖతర్నాక్, మిరపకాయ్, పవర్, టచ్ చేసి చూడు, క్రాక్’ వంటి సినిమాల్లో పోలీసాఫీసర్‌గా తనదైన మేనరిజమ్‌తో ప్రేక్షకులను అలరించారు రవితేజ.చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలోనూ ఏసీపీ విక్రమ్ సాగర్‌గా కనిపించారు. తాజాగా రవితేజ పోలీస్ ఆఫీర్‌గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ఈ సినిమాలో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందుతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా మే 9న విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించలేదు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్‌లో... పవన్ కల్యాణ్ పోలీసాఫీసర్ పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గబ్బర్ సింగ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో మరోసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించారు పవన్ కల్యాణ్. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. కాగా తనకు ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో మరోసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పవన్ కల్యాణ్‌తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.డబుల్ ధమాకా హీరో కార్తీ పోలీసాఫీసర్‌గా ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘సర్దార్’ (2022) చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా కార్తీ–పీఎస్ మిత్రన్ దర్శకత్వంలోనే ‘సర్దార్ 2’ రానున్న సంగతి తెలిసిందే. ఆషికా రంగనాథ్, మాళవికా మోహనన్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సినిమాలో కార్తీ తండ్రీ కొడుకులుగా ద్వి పాత్రాభినయం చేశారు. తండ్రి ఖైదీ పాత్రలో కనిపించనుండగా ఆయన కొడుకు పాత్ర పవర్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుందట. హిట్ 4లో.... తెలుగులో ‘హిట్’ సిరీస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సిరీస్‌లో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (విశ్వక్ సేన్), ‘హిట్: ది సెకండ్ కేస్’ (అడివి శేష్), ‘హిట్: ది థర్డ్ కేస్’ (నాని) సినిమాలు విజయం సాధించాయి. ఈ సిరీస్‌లో రానున్న నాలుగో చిత్రం ‘హిట్ 4’. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించనున్నారు. ఏసీపీ వీరప్పన్‌గా కార్తీ నటించనున్నట్లు ‘హిట్: ది థర్డ్ కేస్’ క్లైమాక్స్‌లో చూపించారు మేకర్స్.స్పై పోలీస్ ఆఫీసర్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో, స్పై పోలీస్ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారట విజయ్.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ నటించిన ఏ సినిమా ఇప్పటిæవరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమా రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.రెండోసారి... హీరో విశ్వక్ సేన్ రెండోసారి పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ అధికారిగా నటించారు విశ్వక్. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విశ్వక్ సేన్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా మరోసారి ఆయన ఖాకీ దుస్తులు ధరించారు. శ్రీధర్ గంగా దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వీఎస్ 13’ (వర్కింగ్ టైటిల్). ఎస్ఎల్వీసీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో చూస్తుంటే విశ్వక్ మరోసారి పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారని స్పష్టం అవుతోంది. విశ్వక్ ఫేస్ కనిపించకుండా పాకెట్లో తు పాకీతో అటువైపు తిరిగి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ప్రతి యాక్షన్‌కి అదిరిపోయే రియాక్షన్ ఉంటుంది’ అంటూ ఓ కొటేషన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ‘బందూక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. రక్షక్! నటనకు కొన్నాళ్లు విరామం ప్రకటించిన మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన ఓ హీరోగా నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదలైంది. ఈ చిత్రంలో గజపతి వర్మ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు మనోజ్. అదే విధంగా తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ‘మిరాయ్’ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర చేస్తున్నారు మనోజ్. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షక్’. ఈ చిత్రం ద్వారా నవీన్ కొల్లి దర్శకునిగా పరిచయమవుతున్నారు.శ్రీనిధీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు మంచు మనోజ్. మే 20న ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ‘రక్షక్’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లోని మనోజ్ శక్తిమంతమైన లుక్ ఆకట్టుకునేలా ఉంది. కొందరు తాము చేసిన నేరాన్ని బయటకు రాకుండా దాచి పెట్టడానికి ప్రయత్నిస్తే హీరో ఎలా వెలికి తీశాడు? అన్నది కథలో ఆసక్తిగా ఉంటుం దట. అంతేకాదు... ప్రస్తుతం సమాజంలో మహిళల మీద జరుగుతున్న వేధింపులను కూడా ఇందులో ప్రస్తావించారని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. తండ్రి బాటలో... పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు సాయికుమార్. ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో ఆయన నటన, డైలాగులను ఎప్పటికీ మరచిపోలేరు ప్రేక్షకులు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పోలీసాఫీసర్‌గా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు సాయికుమార్. తాజాగా ఆయన తనయుడు ఆది సాయికుమార్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘ఎస్ఐ యుగంధర్’. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు రాకేందు మౌళి విలన్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్‌పై ప్రదీప్ జూలూరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వైవిధ్యమైన కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ పాత్రలో ఆది నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
కూటమి సంవత్సర పాలన పై ఏపీ ప్రజల రియాక్షన్
-
బాధ్యత నుంచి తప్పించుకోవడానికే...
టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్) కార్యక్రమం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ‘పీ4’ ద్వారా ఆర్థికంగా స్థిరంగా ఉన్న వారిని ‘మార్గద ర్శులు’గానూ, వీరు దత్తత తీసుకునే పేద కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’ గానూ పేర్కొన్నారు. ఈ మార్గదర్శులు తమ ఖర్చుతో బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించి నూరు శాతం పేదరిక నిర్మూలన (జీరో పావర్టీ) సాధించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. కానీ దీని వెనక దాగి ఉన్న నిజం వింటే ప్రభుత్వ పెద్దల దుర్బుద్ధి ఇట్టే తేటతెల్లమవుతుంది.ఆంధ్రప్రదేశ్‌లో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. పీ4 ప్రాజెక్టు కింద కేవలం 19.15 లక్షల కుటుంబాలను మాత్రమే ‘పేదలు’గా గుర్తించారు. అంటే 87 శాతం మంది అల్పాదాయ వర్గం (బీపీఎల్) పరిధిలోని కుటుంబాలు ఈ దీని పరిధిలోకి రాలేదన్నమాట. నమోదైన వారిలో సైతం మార్గదర్శకులు దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలు కేవలం 62,970. అంటే మొత్తం పేదల్లో కేవలం ఒక శాతం కన్నా తక్కువే. వీరికి అండగా నిలిచేందుకు గుర్తించిన మార్గదర్శుల సంఖ్య కేవలం 5325 మంది ఉన్నారు. ఈ సంఖ్యలు చూస్తే... ‘పీ4’ ద్వారా పేదల్లో ఎంత శాతం మందికి మేలు చేకూరు తుందో, వారి జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో మెరుగుపడతాయో చెప్పొచ్చు.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా కంపెనీలు, సంస్థలు ఏటా నిర్వహించే దాతృత్వ కార్యకలాపాలను ఇక నుండి పీ4లో మార్గదర్శుల ఖాతాలో చూపించబోతున్నారు. వాస్తవానికి, కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీల స్థాయిని బట్టి తమ లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, పర్యావరణం, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాల్లో పేదల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలి. ఇలా ఏటా వేల కోట్లు కంపెనీలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు అదే పనిని పీ4 కింద చేర్చి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. సాధారణంగా పేదల ఆరోగ్యం, విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి, ఇతర సంక్షేమ అవసరాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ బాధ్యత నుంచి తప్పించు కుంటూ పీ4 పేరిట కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు దీన్ని ప్రభుత్వం అప్పగించాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పేదలకు ఆర్థిక చేయూత నిచ్చే సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడే కుట్రలో భాగమే ఇదని చెప్పొచ్చు. ఈ పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం – పేదలకు ధనవంతులు సహాయం చేయటం! కానీ చంద్రబాబు నాయుడు అమలు చేసిన ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ప్రయోజనం పొందిన పెట్టుబడి దారులను ‘మార్గదర్శులు’ అని పిలవడం సరికాదు. సూపర్–6 వాగ్దా నాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వ పెద్దలు పీ4ను తెరపైకి తెచ్చినట్లుంది. వైఎస్సార్ వంటి మహానేతలు ప్రారంభించిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో పాటు ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్నాలు’ ప్రజల అవసరాలను నేరుగా తీరుస్తూ సంక్షేమాన్ని వారి కళ్ల ముందు నిలిపాయి. కానీ నేటి ప్రభు త్వానికి సంక్షేమ స్పృహ కని పించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఏదైనా పథకాన్ని ప్రభుత్వ భాగ స్వామ్యంతో నడిపితే సత్ఫలితాలుంటాయి. అది జరగనప్పుడు రాష్ట్రాభివృద్ధి తిరోగమిస్తుంది. పీ4 అనేది ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే కార్యక్రమం కానే కాదనేది గమనార్హం. ఇటువంటి కార్యక్రమాల అమలును స్వతంత్ర ట్రస్ట్‌ల ద్వారా, పార దర్శక ఆడిటింగ్‌తో, ప్రభుత్వ భాగస్వామ్యంతో పర్యవేక్షిస్తేనే విశ్వస నీయత పెరుగు తుంది. లేదంటే, ఇది కూడా ఓ ‘సూపర్–6’ నినాదం లాగా మిగిలి పోతుంది. పేదల ఆత్మాభిమానాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టడం దీనిలో కనిపిస్తోంది. తాము సహాయం చేస్తున్నాం కాబట్టి ఎన్నికల సమయంలో తాము చెప్పిన రాజకీయ పక్షాలకే ఓటువేయాలని కార్పొరేట్ సంస్థలు పేదలపై ఒత్తిడి తేవచ్చు. అదే జరిగితే ప్రజా స్వామ్యం మంట గలిసిపోతుంది. కార్పొరేట్లు ఎవరిని తలచుకుంటే వారినే అధికారంలో కూర్చోబెట్టగలుగుతారు. ఎటూ ఈ కార్యక్రమాన్ని తామే ప్రవేశపెట్టాం కనుక పేదప్రజలను తమ ఓటుబ్యాంకుగా కార్పొ రేట్లు మారుస్తారని ప్రస్తుత ప్రభుత్వాధినేత ఆలోచన. ఇదే పీ4 వెనుక ఉన్న అసలు రహస్యం!– తలకోల రాహుల్ రెడ్డి,ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనలిస్ట్ -
ఆడబిడ్డలపై పవన్ నీచపు వ్యాఖ్యలు.. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేది వీళ్ళేనా?
-
'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్లోకి పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ పెండింగ్ పెట్టిన ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎన్నికల ముందే ప్రారంభం అయింది. కొన్నాళ్లకే ఎన్నికలు రావడం..పవన్ బిజీ అయిపోవడంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లింది. ఇటీవల ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కల్యాణ్ అఫీషియల్ గా షూటింగ్లో జాయిన్ అయ్యారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్లో పాల్గొంటోంది. పవన్ ఎంట్రీతో సెట్స్‌లో జోష్ నెలకొంది అని చిత్రబృందం పేర్కొంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
అటు బాలయ్య.. ఇటు పవన్.. తగ్గేదెవరు?
టాలీవుడ్‌కి సంక్రాంతి, దసరా, దీపావళి పండగలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో పలు బడా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పండగ వేళ సెలవులు ఉండడం.. అంతా ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉంటారు కాబట్టి.. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ ఈ పండగ సమయాల్లోనే వస్తుంటాయి. అయితే ఒక్కోసారి రెండు మూడు పెద్ద సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కొన్ని సార్లు అవన్నీ హిట్ అయితే..మరికొన్ని సార్లు వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే విజయం సాధిస్తుంది. ఈ పోటీ కారణంగా కొన్ని మంచి చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోతున్నాయి. అందుకే ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్దాలేవి జరగట్లేదు. స్టార్ హీరోలలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతున్నారు. పోటీ ఉన్నా తమకు సినిమాకు ఢోకా లేదు అనుకుంటే తప్ప.. రిలీజ్ చేయట్లేదు. కానీ త్వరలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్దం జరగబోతుంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారిలో ఒకరు బాలకృష్ణ(Nandamuri Balakrishna) అయితే మరో స్టార్ హీరో పవన్ కల్యాణ్( Pawan Kalyan). వీరిద్దరు బక్సాఫీస్ వార్కి రెడీ అవుతున్నారు.మరోసారి బాక్సాఫీస్‌పై ‘తాండవం’?బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ: తాండవం’(Akhanda 2). వీరిద్దరి కాంబినేషన్లో 2021లో వచ్చిన ‘అఖండ’సినిమాకు సీక్వెల్ ఇది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో పాటు రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. దసర కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం రాబోతుందని వెల్లడించారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఓజీ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కానుంది.‘ఓజీ’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఓజీ(OG) ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అదే రోజు బాలయ్య కూడా అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇద్దరి సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకేసారి రావడం రెండూ సినిమాకు మంచిది కాదని సినీ పండితులు చెబుతున్నారు. కాస్త గ్యాప్ తీసుకొని వస్తే రెండు చిత్రాలకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని, ఒకోసారి వస్తే కొంచెం తేడా అయితే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా ‘తగ్గేదే లే’ అంటూ బాక్సాఫీస్ వార్కి సై అంటారా? కొద్ది రోజుల్లో తెలుస్తుంది. -
చంద్రబాబు సర్కార్ నైతిక బాధ్యత వహించాలని మహిళల డిమాండ్
-
చంద్రబాబు,పవన్,లోకేష్ కనుసన్నల్లోనే.. కొమ్మినేని అరెస్ట్ ముందు జరిగిన కుట్ర
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు అనంతపురంలో టీడీపీ కార్యకర్తల గ్యాంగ్ రేప్, ఇంటర్ విద్యార్థిని హత్యా ఘటనలతో ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నినుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు సర్కారు కేఎస్ఆర్ లైవ్ షోను అడ్డం పెట్టుకుంది. తాను చేయని వ్యాఖ్యలకు.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించింది. అయితే ఈ అరెస్ట్‌కు ముందుకు కొమ్మినేనిపై కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రకు తెరతీసింది. ఆ కుట్రంతా లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. అసలేం జరిగిందంటే? ఈ నెల 6న సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యలను డిబేట్లో కొమ్మినేని వారించారు. ఇది జరిగిన 24 గంటల తర్వాత.. ఈ నెల 7న ఆ వ్యాఖ్యలను ఐటీడీపీ వైరల్ చేసింది. కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్‌కు ఆపాదిస్తూ విషప్రచారం చేయించింది. వెను వెంటనే పథకం ప్రకారం టీడీపీ అనుకూల వ్యక్తులతో అమరావతిలో లోకేష్ అమరావతిలో ప్రదర్శనలు చేయించారు.తాను చేసిన వ్యాఖ్యలపై కృష్ణం రాజు క్షమాపణ చెప్పినా.. వైఎస్ జగన్ కుటుంబసభ్యులపై అసభ్య వ్యాఖ్యలు, పోస్టింగ్‌లు పెట్టారు. నిన్న (ఆదివారం) టీడీపీ వారితో రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేయించారు.ఇది ఓ వైపు జరుగుతుండగా ప్రణాళికా బద్ధంగా నిన్న మధ్యాహ్నం 1.49కి సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి మద్దతుగా పవన్ ఆఫీస్ నుంచి మధ్యాహ్నం 3.40కి ప్రెస్ నోట్ విడుదలైంది. తర్వాత సాయంత్రం 6.45కి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోపే హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇలా చంద్రబాబు అండ్ కో.. ఏపీలో కొనసాగుతున్న దారుణల్ని, అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు కొమ్మినేని అరెస్ట్ చేశారంటూ ఏపీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులు సైతం కూటమి ప్రభుత్వం తీరును ఖండిస్తున్నారు. -
పవన్ అడ్డాలో అరాచకాలు.. ఆధారాలతో బయటపెట్టిన వర్మ
-
పవన్ అడ్డాలో ఘోరాలు.. వర్మ స్ట్రాంగ్ వార్నింగ్
-
పవన్ పై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
-
విజయవాడలో సెలూన్ షాప్ ప్రారంభించిన పవన్ కల్యాణ్
-
పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బహుశా జూలైలో రిలీజ్ ఉండొచ్చు. మార్కెట్లో చూసుకుంటే ఈ సినిమాపై అసలు బజ్ లేదు. మొన్నీమధ్య అంటే శుక్రవారం మచిలీపట్నంలో మూవీ ఈవెంట్ జరగ్గా.. దీనికి ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఓ విషయాన్ని మర్చిపోయిన ఈమె.. ఓ రకంగా మూవీ పరువు తీసేసిందనే చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే?పవన్ 'హరిహర..' సినిమా నుంచి ఇదివరకే రెండు మూడు పాటలు రిలీజయ్యాయి కానీ వాటికి పెద్దగా రీచ్ లేదు. ఇప్పుడు మచిలీపట్నం ఈవెంట్‌ని యాంకరింగ్ చేసిన ఉదయభాను, డైరెక్టర్ జ్యోతికృష్ణతో మాట్లాడుతుంటే మధ్యలో కల్పించుకుని.. ఇదంతా చూస్తుంటే ఇందులో పవన్ కల్యాణ్ కచ్చితంగా ఓ పాట పాడి ఉంటారని, అదేంటో చెప్పండి.. సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా? అని ఏమీ తెలియనట్టుగా అడిగేసింది. దీంతో డైరెక్టర్ ఏం అనాలో తెలీక బిక్కమొహం వేశాడు.(ఇదీ చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్‌బీ..)ఎందుకంటే కొన్నాళ్ల క్రితం పవన్ పాడిన 'మాట వినాలి' అనే పాటనే తొలుత రిలీజ్ చేశారు. ఈవెంట్‌కి యాంకరింగ్ చేస్తున్న ఉదయభానుకి ఆ విషయం కూడా తెలియకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె అడిగేసరికి అక్కడిక్కడ కవర్ చేసిన దర్శకుడు జ్యోతికృష్ణ.. పాట గురించి చెప్పుకొచ్చారు. అలానే ఇదే ఈవెంట్లో మాట్లాడుతూ పవన్ ఇప్పటికీ మూడుసార్లు సినిమా చూశారని, ఆయనకు తెగ నచ్చడంతో గంటసేపు తనని మెచ్చుకున్నారని జ్యోతికృష్ణ చెప్పాడు.అప్పుడెప్పుడో 2020లో మొదలైన ఈ సినిమా.. కొన్నాళ్ల క్రితం షూటింగ్ ముగించుకుంది. థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకుంటే ఎక్కడలేని కష్టాలన్నీ వస్తున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదని మూవీ టీమ్ అంటోంది గానీ మూవీ కొనేందుకు బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి అన్ని అడ్డంకులు దాటుకుని 'హరిహర వీరమల్లు' థియేటర్లలోకి ఎప్పుడొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు) -
సెలూన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సాక్షి,విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెలూన్‌ను ఘనంగా ప్రారంభించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు రోడ్డు అయ్యప్ప నగర్ సమీపంలో ఆదివారం ‘సెలూన్ కొనికి’ని ప్రారంభించారు. అయితే సెలూన్ ప్రారంభోత్సవానికి పవన్ టీషర్టు, షార్ట్ వేసుకొని వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. Salon Koniki ఓపెనింగ్ కి విచ్చేసిన పవన్ కళ్యాణ్..#PawanKalyan pic.twitter.com/PqYwHZUcAL— N Media News (@NMediaNewsOffl) June 8, 2025మరోవైపు, రాష్ట్రంలో కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం, అక్రమ కేసులు, ఆమడ దూరంలో అభివృద్ధితో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లే అంశంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమలు రాక, వెంటాడుతున్న నిరుద్యోగాన్ని ప్రస్తావిస్తూ ఇదేనా రాష్ట్ర అభివృద్ధి అంటూ పవన్ తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పవన్ కల్యాణ్ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్ నారంగ్
‘‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలని కావాలని ఆపుతున్నారనడం తప్పు. ఆయన (పవన్ కల్యాణ్) సినిమాని ఎవరూ ఆపరు... ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్ట్స్ వీక్ నా సినిమా (‘కుబేర’ని ఉద్దేశించి) కూడా రిలీజ్‌కి ఉంది కదా? ఆయన సినిమా రిలీజ్ ఆపడం అనేది అసాధ్యం?’’ అని ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు సునీల్ నారంగ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎస్ఎఫ్సీసీ) సమావేశంలో అధ్యక్షుడితో ΄ాటు కొత్త ΄ాలక మండలిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నిర్మాత సునీల్ నారంగ్ వరుసగా మూడోసారి ఎంపికయ్యారు. ఉ΄ాధ్యక్షులుగా రవీంద్ర గో΄ాల, ఉదయ్ కుమార్ రెడ్డి కె, సెక్రటరీగా శ్రీధర్ వీఎల్, జాయింట్ సెక్రటరీగా చంద్రశేఖర్ రావు జె, ట్రెజరర్‌గా సత్యనారాయణ గౌడ్ .బి ఎన్నికయ్యారు. అదే విధంగా 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సునీల్ నారంగ్ మాట్లాడుతూ– ‘‘అల్లు అరవింద్‌గారు, ‘దిల్’ రాజు, సురేష్‌బాబు, నా వద్ద థియేటర్లు ఉన్నాయనడం కరెక్ట్ కాదు. నా వద్ద 70 థియేటర్లు ఉంటే 40 బుకింగ్స్ ఉన్నాయి. 30 థియేటర్లు లీజ్ తీసుకున్నాం. అది కూడా గ్రౌండ్ లీజ్... ప్లస్ మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. అవన్నీ కలిపినా కేవలం ఐదారు శాతం మాత్రమే ఉన్నాయి. అనవసరంగా ఆ నలుగురు అంటూ మాట్లాడటం తగదు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అందరి సినిమాలూ రావాలి, విడుదలవ్వాలని కోరుకుంటాం. హీరోలు ఏడాదికి ఐదు సినిమాలు చేయాలి, పది చేయాలి అని మాట్లాడటానికి నేను ఎవరు? అది వాళ్ల ఇష్టం. వాళ్ల పారితోషికం నిర్ణయించడానికి మేము ఎవరు? హీరోలు అనేవాళ్లు దేవుళ్లు. 145 కోట్ల దేశ జనాభాలో ఇరవై ముప్పై మందే హీరోలున్నారు. లేదంటే నలభై మంది ఉంటారు. అలాంటి వాళ్ల గురించి నేను ఏం మాట్లాడాలో తెలియడం లేదు. సినిమా రిలీజైన 28 రోజులకే ఓటీటీలో విడుదల చేయడం అన్నది కూడా ఓ శత్రువులా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీలో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్... ఎవరూ బాగాలేరు. కానీ, డిజిటల్ ప్రొవైడర్స్ అయిన వీఎమ్‌ఎస్, క్యూబ్ వాళ్లు, ఓటీటీ వాళ్లు బాగున్నారు. నాతో సినిమా తీయమని నిర్మాతలను ఏ డైరెక్టరూ, హీరో పిలవరు. మాకు ఇష్టం అయితే మేం వెళుతున్నాం... మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరి ఇష్టం వారిది’’ అని తెలిపారు.‘టీఎస్ఎఫ్సీసీ’ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ‘సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ 2, కోర్ట్’ సినిమాల ద్వారానే ఎగ్జిబిటర్లకు డబ్బులు వచ్చాయి. మన హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలని వినతి చేస్తున్నాను. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో టిక్కెట్ ధరలు, క్యాంటీన్ ధరలు సాధారణంగా ఉంటున్నాయి. కానీ, మల్టీప్లెక్స్‌లో ఎక్కువ ఉంటాయి. కావాలంటే రెండింటినీ పోల్చి చూడండి’’ అన్నారు. నిర్మాతలు సురేష్‌బాబు, కిరణ్, కేఎల్ దామోదర్ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
'హరిహర వీరమల్లు' ఫ్యాన్స్ కోసం మరో సినిమా..?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కెరీర్లోనే సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన 'తొలిప్రేమ' (Tholiprema) 1998 జూన్ 24న విడుదలైంది. ఇప్పుడు మరోసారి రిలీజ్ కానుంది. ఈమేరకు ఒక పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో కీర్తిరెడ్డి హీరోయిన్గా నటించగా ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు. జీవీజీ రాజు నిర్మాత. అయితే, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ పలుమార్లు రీరిలీజ్ అయింది. 'తొలిప్రేమ' విడుదలై 25 ఏళ్లు సందర్భంగా 2023లో చివరిసారిగా రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే.పవన్ కల్యాణ్ నటించిన కొత్త సినిమా హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే, పలు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందడంతో తెరపైకి తొలిప్రేమ సినిమాను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 14న తొలిప్రేమ రీరిలీజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్ అవుతుంది. దానిని నిర్మాత ఎస్కేఎన్ కూడా షేర్ చేశారు. -
పిఠాపురంలో ఇసుక దందా బయటపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ
-
ఏడాదికే బండి బోరుకొచ్చేసిందా.. బాబు సర్వేలో ఇదే తెలిసిందా?
నాచేతి మాత్ర.. వైకుంఠ యాత్ర.. అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పాలన తీరు. అధికారంలోకి రావడానికి నడవని అడ్డదారి లేదు.. కరవని అడ్డమైన గడ్డీ లేదు. మునుపటి ఎన్నికల్లో మోదీని నానామాటలూ అన్న బాబు మొన్నటి ఎన్నికలకు ముందు పొత్తుకోసం ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. అదీకాకుండా పవన్ కళ్యాణ్.. కాపు ఓట్లు.. వీటన్నిటికీ తోడు రాష్ట్రంలో కనిపించిన ప్రతివ్యక్తికి.. ప్రతి కులానికి.. ప్రతి వర్గానికి నోటికొచ్చిన హామీ ఇచ్చి గెలిచి ఏడాదైంది.ఏడాదిలో చాలా చేసేసాం అని బయటకు మేకపోతులా గాంభీర్యం చూపుతున్నా లోలోన బాబులు ముగ్గురిలోనూ గుబులు మాత్రం కలుగుతోంది. ముగ్గురు కలిసినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను 40 శాతం ఓట్ల నుంచి కిందకు రప్పించలేకపోయారు. జగన్ కన్నా వాళ్ళు గొప్పగా సాధించిన ఓట్లేమీ లేకున్నా సీట్లు గణనీయంగా వచ్చాయి. ఈసారి కూడా ప్రజలు ఇలాగే తమ గాలిమాటలు నమ్ముతారన్న గ్యారెంటీ లేదు. అందుకే ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సెల్ఫ్ చెక్ చేసుకుంటోంది.బాబు పాలన ఎలా ఉంది అంటూ ప్రజలకు ఐవీఆర్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏడాదిలోనే పనితీరును మదింపు చేసుకుంటున్నారు అంటే లోలోన చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్‌కు గట్టిగానే డౌట్ కొడుతోందని అర్థం అవుతోంది. ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా బాబు గారి పాలన ఎలా ఉంది అని ఫోన్లో అడుగుతున్నారు.. ప్రజలు ఆ కాల్ రాగానే.. తుపుక్.. తుపుక్ అని సమాధానాలు ఇస్తుండటంతో ఏం చేయాలో తోచడం లేదని తెలుస్తోంది. తల్లికివందనం.. ఆడబిడ్డ నిధి.. ఫ్రీ బస్సు.. నిరుద్యోగ భృతి.. రైతు భరోసా.. ఇలా ఏదీ అమలు చేయకపోవడంతో జనం ఘోరంగా తిడుతున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందట. పైగా అభివృద్ధి.. సంక్షేమం వంటి అంశాలను వదిలేసి కేవలం వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేయడం.. అనవసరమైన అంశాలను ప్రచారంలోకి తెచ్చి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం వంటి చిల్లర పనులను ప్రజలు ఏవగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కేకే సర్వే అనే సంస్థ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు భారీగా గెలుస్తారని చెప్పింది కూడా ఈ కేకే సర్వే సంస్థ. అయితే అదే సంస్థ ఇప్పుడు దాదాపు 70 మందికి పైగా ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పిఠాపురంలో గెలవడం కష్టమే అని అంటున్నారు. ఏడాదిలోనే ప్రజల్లో ఇంట నగుబాటు మొదలైందంటే రానున్న నాలుగేళ్లలో కూటమి నాయకులను వెంటాడి తరిమే పరిస్థితి ఉంటుందని కొందరు సర్వేలో చెబుతున్నారు. గ్రేటాంధ్ర.. ది తెలుగు న్యూస్.. జర్నలిస్ట్ సాయి వంటి వాళ్ళు పెట్టిన ఆన్లైన్ పోల్‌లో కూడా ఇలాగే దారుణమైన ఫలితాలు వచ్చాయి. గ్రామాల్లో నాయకుల దందాలు.. పెచ్చుమీరిన క్రైమ్.. రౌడీయిజం ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాయి. ఆ భయం లోలోన ఉండబట్టే ఐవీఆర్ఎస్ సర్వే చేయించారని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
మూడు సార్లు సినిమా చూశారు.. మరో మూవీ చేస్తానని హామీ: డైరెక్టర్
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా చేశారు. దాదాపు ఐదేళ్ల పాటు చాలా ఇబ్బందులు పడిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. సోషల్ మీడియాలో మాత్రం వేరే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాకు బయ్యర్లు దొరకట్లేదని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు పక్కనబెడితే మూవీని అధికారికంగా వాయిదా వేసినా సరే ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు. తాజాగా మచిలీపట్నంలో ఈవెంట్ నిర్వహించారు.మచిలీపట్నం బీచ్ ఒడ్డున 'హరిహర..' ఈవెంట్ శుక్రవారం సాయంత్రం జరిగింది. దీనికి హీరోయిన్ నిధి అగర్వాల్‌తో పాటు డైరెక్టర్ జ్యోతికృష్ణ హాజరయ్యారు. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతికృష్ణ ఏమన్నారంటే.. 'పవన్ కల్యాణ్.. ఒక్కసారి కాదు ఈ సినిమాని మూడు సార్లు చూశారు. గంటపాటు నన్ను మెచ్చుకున్నారు. మళ్లీ ఇంకో సినిమా చేస్తానని మాటిచ్చారు. అసురన్ అనే పాటని అయితే ఏకంగా 500 సార్లు విన్నారు' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు)సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మాట్లాడటం బాగానే ఉంది. కాకపోతే రియాలిటీలో చూసుకుంటే 'హరిహర వీరమల్లు' సినిమాకు మార్కెట్లో పెద్దగా బజ్ లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో రావాల్సిన ఈ మూవీ.. దాదాపు 11-12 సార్లు వాయిదా పడింది. దీంతో పవన్ అభిమానులే ఈ చిత్రం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదనిపిస్తుంది. అలాంటిది పవన్.. తన సినిమాని మూడుసార్లు చూడటం, మరో మూవీ చేస్తానని దర్శకుడికి మాటివ్వడం అంటే నెటిజన్లు సందేహపడుతున్నారు. వచ్చే నెలలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. మరి సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి?డైరెక్టర్ జ్యోతికృష్ణ విషయానికొస్తే.. నిర్మాత ఏఎం రత్నం కొడుకు. చాన్నాళ్లుగా డైరెక్షన్ చేస్తున్నాడు. 2003లో 'నీ మనసు నాకు తెలుసు' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత కేడీ, ఊ ల లా లా అనే తమిళ చిత్రాలు చేశారు. తెలుగులో గోపీచంద్‌తో 'ఆక్సిజన్', కిరణ్ అబ్బవరంతో 'రూల్స్ రంజన్' తీశారు. ఇవన్నీ థియేటర్ దగ్గర ఆడలేదు. ఇప్పుడు కూడా క్రిష్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. మరి 'హరిహర..'తోనైనా హిట్ కొడతారేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
హరిహర వీరమల్లు విడుదల లేనట్లే.. ప్రకటించిన నిర్మాత
జూన్‌లో రిలీజవుతున్న పెద్ద సినిమాల్లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu Movie) ఒకటి. జూన్ 12న ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ అది అయ్యే పనిలా కనిపించడం లేదని చాలారోజులగా ప్రచారం జరుగుతోంది. చివరకు అదే నిజమైంది. ఇప్పటికే పలుమార్లు సినిమాను పోస్ట్‌పోన్ చేసిన చిత్రబృందం తాజాగా మరోసారి మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ఏ.ఎం రత్నం వెల్లడించాడు.వాయిదా తప్పట్లేదుజూన్ 12న సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అది కుదర్లేదని పేర్కొన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయక తప్పడం లేదన్నాడు. హరిహర వీరమల్లును మరింత గొప్పగా మలచాలన్నదే తమ ప్రయత్నం అని, ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నామని వివవరణ ఇచ్చాడు. దీనికోసమే మరికాస్త సమయం అవసరమవుతుందని, అందరి ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇచ్చాడు.ఎప్పటికీ గుర్తుండిపోయేలా..ప్రతి దృశ్యం ఆశ్చర్యపరిచేలా, ప్రతి శబ్దం ప్రతిధ్వనించేలా, ప్రతి సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నాడు.. త్వరలో ట్రైలర్‌తోపాటు కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాం అని తెలిపాడు. హరిహర వీరమల్లు సినిమాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చదవండి: మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా? -
'హరిహర వీరమల్లు' బడ్జెట్ ఎంతో చెప్పిన నిర్మాత
పవన్ కల్యాణ్ (Pawan kalyan) నటించిన హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu) వాయిదా పడటం ఇక లాంఛనమే అని చెప్పవచ్చు. ఈ మూవీ జూన్ 12న విడుదల కావాల్సి ఉండగ పలు కారణాల వల్ల విడుదలకు బ్రేకులు పడ్డాయి. త్వరలో అధికారికంగా కొత్త రిలీజ్ తేదీతో ప్రకటన రావచ్చని సమాచారం. సుమారు 5 ఏళ్లకు పైగా ఈ మూవీ కోసం నిర్మాత ఏఎం రత్నం పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే వడ్డీల వల్ల బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు.విడుదల వాయిదాకు కారణం ఏంటి..?హరిహర వీరమల్లు విడుదలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇండస్ట్రీలో ఉన్న మాట. ముంబైకి చెందిన ప్రముఖ ఫైనాన్స్ సంస్థలకు చెల్లించాల్సిన డబ్బు క్లియరన్స్ చేస్తే తప్ప సినిమా విడుదల కాదనేది చిత్ర పరిశ్రమలోని వారికి తెలిసిన వాస్తవం. ఇప్పటికిప్పుడు అంత డబ్బు క్లియర్ చేయాలంటే సినిమా థియేటర్ హక్కులు మొదట విక్రయించాలి. కానీ, హరిహర వీరమల్లును కొనేవారు ఎవరూ లేరు. అందుకు ప్రధాన కారణం నిర్మాత ఏఎం రత్నం చెబుతున్న రేటు పట్ల ఎగ్జిబీటర్స్, బయ్యర్లు ఆమోదయోగ్యంగా లేరని టాక్. తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్ల వరకు థియేటర్ రైట్స్ నుంచి రావచ్చు. కానీ, నిర్మాత క్లియర్ చేయాల్సిన ఫైనాన్స్ ఎంత అనేది చెప్పలేం. ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో ఓటీటీ నుంచి కూడా ఒత్తిడి ఉంది. ఇప్పటికే వారు ముందు కుదుర్చుకున్న ఢీల్లో రూ. 5 కోట్లకు పైగానే కోత పెట్టారని సమాచారం. ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ అన్నీ సెటిల్ కావాలంటే పవన్ కల్యాణ్ దిగిరావాల్సి ఉంటుంది. సినిమా పంపిణీ చేయడంలో ప్రముఖంగా వినిపించే పేర్లు దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రీ మూవీస్, సితార వంటి వారితో ఆయన లేదా తన తరఫు వారు ఎవరైనా చర్చలు జరిపితే హరిహర వీరమల్లుకు లైన్ క్లియర్ అయ్యే ఛాన్స్ వుంది. లేదంటే ఆ ఫైనాన్స్ సంస్థలకు పూర్తిగా డబ్బు అయినా చెల్లించాల్సి ఉంటుంది.'వీరమల్లు' బడ్జెట్హరిహర వీరమల్లు సినిమా కోసం ఎంత బడ్జెట్ పెట్టారని నిర్మాత ఏఎం రత్నంను మీడియా వారు ప్రశ్నంచగా ఆయన ఇలా చెప్పారు. ' ఈ సినిమా కోసం నా కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ పెట్టాను. మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో వడ్డీలు కూడా బాగా పెరిగాయి. అందరూ రూ. 200 కోట్ల బడ్జెట్ సినిమా అనుకుంటున్నారు. కానీ, అంతకు మించే ఈ మూవీ కోసం ఖర్చు చేశాం. సినిమా మీద నమ్మకంతోనే బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు.' అని నిర్మాత అన్నారు. బడ్జెట్ అంతలా పెరిగిపోవడానికి ప్రధాన కారణం పవన్ కల్యాణ్ కావడంతో ఈ మూవీకి సంబంధించి తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటున్నారని తెలుస్తోంది. -
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్ కల్యాణ్‌లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!. కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్లు కోత పెట్టింది నిజమే కదా!. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు. కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు కదా?ఇది వెన్నుపోటే కదా!. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి! చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే ఖర్చు పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో భూమిని మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే.. ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్‌కు పండగే కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్లకు పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్ అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్‌ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హరిహర వీరమల్లు వాయిదా.. అదే ప్రధాన కారణమా?
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానుల బ్యాడ్ న్యూస్. పవన్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడింది. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ చేశారని వార్తలొస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం వీఎఫ్ఎక్స్తో పాటు ఆర్థికపరమైన సమస్యల వల్లేనని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పలుసార్లు వాయిదా పడడంతో డిస్ట్రిబ్యూటర్స్ వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అందువల్లే హరిహర వీరమల్లు వాయిదా తప్పేలా కనిపించడం లేదు.అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనూ ఎలాంటి బజ్ లేకపోవడంతో భారీ నష్టాలు వచ్చే అవకాశముందని పంపిణీదారులు కూడా వెనకాడుతున్నట్లు సమాచారం. ప్రధాన ఆర్థిక పరమైన సమస్యలతోనే ఈ సినిమాను వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆలస్యం కావడానికి మరో ప్రధాన కారణం వీఎఫ్ఎక్స్. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న వీఎఫ్ఎక్స్తో పాటు స్టూడియోలకు చెల్లింపులు చేసే గడువు కూడా ముగిసిపోయినట్లు తెలుస్తోంది. దీనివల్ల పోస్ట్-ప్రొడక్షన్లో మరింత జాప్యం జరుగుతోందని ఓ నివేదిక పేర్కొంది. ప్రస్తుతానికి ఒక వారం వాయిదా మాత్రమే ఉండొచ్చని కొందరు భావిస్తున్నప్పటికీ.. దాదాపు నెల రోజులు ముందుకు వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్.. జూన్ 12 వరకే డీల్‌కు అనుమతించినట్లు సమాచారం. ఆ తేదీ గడువు దాటితే ఒప్పందం డీల్ విలువలో రూ. 20 కోట్ల తగ్గింపు కోరినట్లు సమాచారం. ఇప్పటికే వాయిదాపై పలు ఊహగానాలు వస్తున్నప్పటికీ.. ఆలస్యం గురించి నిర్మాతల నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం కుదరపోతే జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో రిలీజ్ చేస్తారని సమాచారం. -
చంద్రబాబు అబద్ధాలపై తిరగబడ్డ ప్రజలు జగన్ పిలుపుతో దద్దరిల్లిన ఏపీ
-
హామీలకు నేను బాద్యుడిని అన్నావ్.. గొంతు లేవడం లేదా PPP
-
చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య: శ్యామల
-
Perni Nani: మీ వల్ల ప్రతి ఇంట్లో ఎన్ని దీపాలు ఆగాయో తెలుసా?
-
Ambati: ఏడాదైనా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయని చంద్రబాబు
-
అవకాశవాదమే పవన్ సిద్ధాంతం!
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ద్వారా తనదైన రాజకీయ క్రీడ సాగిస్తోందా? కొంతకాలం క్రితం తమిళనాడు పర్యటన సందర్భంగా పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అవుననే అనిపిస్తోంది. బీజేపీ అవసరాలకు తగ్గట్టుగా మాట్లాడేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ అవసరాల కోసం ఒక సామాజిక వర్గాన్ని ఎలా వాడుకున్నారో అందరూ చూశారు. ఈ అవకాశవాదాన్నే బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కరుణ తనపై ఉంటే రాజకీయాల్లో ఢోకా ఉండదన్న ధీమాతో పవన్ అనుకుంటున్నారు. అలాగే తమిళనాట పవన్ సినిమా గ్లామర్ తనకు ఓట్లు తెచ్చిపెడుతుందని బీజేపీ కూడా భావిస్తోంది. అన్నాడీఎంకేతో పెట్టుకున్న పొత్తుతో తమిళనాడులో పాగా వేయాలన్నది బీజేపీ ఎత్తుగడ. పవన్ కళ్యాణ్ బీజేపీ అజెండాను భుజాన వేసుకుని తిరుగుతుండడం చూస్తుంటే, భవిష్యత్తులో ఏపీలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి కొత్త ప్లాన్ అమలు చేస్తాయా అన్న సందేహం కలుగుతుంది. గత అనుభవాల రీత్యా టీడీపీ రాష్ట్రంలో బీజేపీను అంటిపెట్టుకుని ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అయినా వచ్చే కాలంలో బీజేపీ, జనసేనలు ఏపీలో కూడా సొంత అజెండాతో ముందుకు వచ్చి టీడీపీని వెనక్కి నెట్టినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి దీనికి ప్రాతిపదిక కనిపించక పోవచ్చు. కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చెన్నై వెళ్లి జమిలి ఎన్నికలపై మాట్లాడి వచ్చారు. దేశ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బాగుకు జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓకే కానీ.. పవన్ గతంలో దీనికి పూర్తి వ్యతిరేక భావజాలమున్న పార్టీలతో కలిసి పనిచేశారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై ఒకసారి మంచిదని.. ఇంకోసారి అవి మోడీ నియంతృత్వ ఆలోచన అని వ్యాఖ్యానించారు. ప్రజలు వీటిలో దేన్ని నమ్మాలి? ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు కనుక వారి భావజాలానికి మద్దతు ఇస్తున్నారు. గతంలో పవన్, చంద్రబాబు అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ 2019లో కమ్యూనిస్టులు, బీఎస్పీలతో కలిసి పోటీ చేశారు. ఆ పార్టీలు బీజేపీ సిద్దాంతాలకు పూర్తి వ్యతిరేకం. జమిలి ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని, రాష్ట్రాల హక్కులను హరించడానికే ఈ ప్రతిపాదన అని కమ్యూనిస్టులు విమర్శిస్తుంటారు. అప్పుడు ఆ పార్టీలతో కలిసి పోటీచేసి ఓడిపోయిన తర్వాత మొత్తం ప్లేట్ తిప్పేసి పవన్ కళ్యాణ్ బీజేపీని బతిమలాడుకుని వారితో కలిశారు. సినీ నటుడు కనుక ఎందుకైనా పనికి వస్తారులే అని బీజేపీ కూడా ఓకే చేసింది. చంద్రబాబు నాయుడు అయితే జమిలి ఎన్నికలు మంచిదేనని 2004 కి ముందు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు అనేవారు. ఆ తర్వాత కాలంలో ఆయన కూడా కమ్యూనిస్టులతోను, టీఆర్ఎస్తోను జత కట్టారు.అప్పుడు ఫలితం దక్కకపోవడంతో తిరిగి బీజేపీ చెంతకు చేరారు. 2014లో అధికారంలోకి వచ్చినా, 2018 నాటికి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు.ఆ సమయంలో ప్రధాని మోడీని వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, బీజేపీ విధానాలన్నిటిని తీవ్రంగా దుయ్యబట్టేవారు. ఆ క్రమంలో కాంగ్రెస్,తదితర బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి జమిలి ఎన్నికలను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన రాగం ఆలపించారు. పశ్చిమ బెంగాల్ లో షర్మిష్ట అనే యూట్యూబర్‌ను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేయడంపై ఆయన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి మళ్లీ ప్రస్తావించారు. ఏపీలో సోషల్ మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తుంటే పవన్ ఎన్నడూ పట్టించుకోలేదు. తిరుమల లడ్డూపై అపచారపు మాటలతో సహా అనేక సందర్భాలలో పవన్ కళ్యాణే సనాతన ధర్మం కాదు కదా.. అసలు ధర్మమే పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వేరే రాష్ట్రంలో సనాతనం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఒక సిద్దాంతం అంటూ ఏమీ లేదు. అవకాశవాదమే తమ సిద్దాంతంగా వీరు మలచుకుని రాజకీయాలు చేస్తూ కొంత సఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో పవన్‌కు ఏవో కొత్త ఆశలు కలిగి ఉండాలి. ప్రధాని మోడీ ఈయనకు పిలిచి మరీ చాక్ లెట్ ఇచ్చిన ఉత్సాహం ఎటూ ఉంది. దాంతో ఆయన తమిళనాడు వెళ్లి డీఎంకేకి వ్యతిరేకంగా ప్రచారం ఆరంభించారు. జమిలి ఎన్నికలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మద్దతు ఇవ్వాలని కోరారు. కరుణానిధి జమిలిని సపోర్టు చేశారని, ఇప్పుడు అందుకు విరుద్దంగా ఆయన కుమారుడు ఎలా వెళతారని పవన్ ప్రశ్నించడం ఆశ్చర్యమే. అందుకే పవన్ పై సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యానాలు వచ్చాయి. తన తండ్రి కమ్యూనిస్టు ని పవనే చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు బీజేపీతో ఎలా స్నేహం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే,ఆయనను గౌరవించి ఎందుకు ఆ పార్టీలో చేరలేదని మరొకరు ప్రశ్నించారు. స్టాలిన్ ను విమర్శించే ముందు తను చేసిందేమిటో గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే తమిళనాడు ప్రజలకు ఈ విషయాలు పెద్దగా తెలియకపోవచ్చన్నది ఆయన విశ్వాసం కావచ్చు. అలాగే ఈవీఎంల గురించి పవన్ మాట్లాడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. 2019లో ఈవీఎంల వల్ల కూడా వైసీపీ గెలిచి ఉండవచ్చని చెప్పిన ఈయన 2024లో మాత్రం ఈవీఎంలను సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు. బహుశా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మాదిరి మాటలు మార్చిన వారు ,ఎప్పుడు ఏది అవసరమైతే దానిని మాట్లాడేవారు దేశ రాజకీయాలలో మరొకరు ఉండకపోవచ్చు. జమిలి ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం చదివినట్లు అనిపిస్తుంది. మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. ఆ విషయం వేరే చెప్పనవసరం లేదు. అదే సందర్భంలో సనాతన ధర్మంపై అడిగిన ప్రశ్నకు ఈ భూమి సనాతన ధర్మానిది అని, భారతీయ సంస్కృతిలోనే ఉందని ఆయన అన్నారు. వినడానికి, చెప్పడానికే బాగానే ఉంటుంది. కాని ఆచరణలో పవన్ ధర్మంగా ఉంటున్నారా అన్న ప్రశ్న వస్తుంది. సడన్ గా సనాతని వేషం దాల్చి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అపచారపు మాటలు ,అబద్దాలు చెప్పాలని ఏ ధర్మం చెబుతుందో ఆయనకే తెలియాలి. కులం, మతం అన్ని విషయాలలో పవన్ ఎన్ని అసత్యాలు చెప్పారో పలు వీడియోలు తెలియ చేస్తాయి. కొందరు ఇస్లాం, క్రిస్టియానిటిపై దాడి చేయరట. హిందూ మతంపైనే దాడి చేస్తారట. ఎల్లో మీడియాలోనే ఈ కథనం వచ్చింది. ఇది చదివితే ఏమనిపిస్తుంది.అన్ని మతాలు సమానం.. ఎవరూ ఎవరిపై దాడి చేయవద్దని చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి అచ్చంగా బీజేపీ భాషను అరువుకు తీసుకుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం కావలిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంతకాలం సహిస్తాం...హిందువులకు ఉన్నది ఒకటే దేశం..అదే ముస్లింలపై దాడి జరిగితే ఊరుకుంటారా..అంటూ యుద్దం చేయాలన్నట్లుగా మాట్లాడిన ఆయన, తదుపరి ఒకటి,రెండు రోజులకే ఏమని అన్నారు.. భారతదేశం శాంతి కోరుకుంటుంది.. సంయమనంగా ఉంటుంది..అని మాట మార్చేశారే. పనిలో పని ఆయన 1985, 1986 ప్రాంతంలో కశ్మీర్లో షూటింగ్ లలోపాల్గొన్నట్లు ఏదో కూడా చెప్పారు కదా! దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వచ్చిన వార్తలు చూస్తే నవ్వు వస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టింది 1971లో అయితే 15 ఏళ్లకే ఎప్పుడు సినిమాలలో నటించారని నెటిజన్లు ప్రశ్నించారు. ఇలా అనేక విషయాలలో రెండు నాలుకల దోరణి అవలంభించే పవన్ కళ్యాణ్ కు పెద్దగా సిద్దాంత, రాద్దాంతాల పని ఉండదన్న భావనతో బీజేపీ ఈయనను తన గేమ్ లో ఒక పావుగా మార్చుకుని ప్రచారానికి వాడుకున్నట్లు ఉంది.ఆంధ్ర ప్రజల మాదిరి తమిళ ప్రజలు ఈ మాటలకు బోల్తా పడతారా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్‌కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ ఆవేదన
పిఠాపురం: ‘వృద్ధాప్య పింఛనే ఇప్పటివరకు నన్ను బతికించింది. ఇప్పుడు ఆ పింఛన్ కూడా ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికున్నట్టు నిరూపించుకోమంటున్నారు. నేను కాలు కదపలేను. ఎక్కడికీ వెళ్లలేను. పింఛన్ లేకపోతే నాకు దిక్కులేదు. దాన్ని కూడా తీసేసి బతికుండగానే చంపేస్తున్నారు’ అంటూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ కన్నీటిపర్యంతమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన చోడిశెట్టి సుబ్బారావు(85) కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛన్ అందుకుంటూ.. కుమార్తె పార్వతి వద్ద నివసిస్తోంది. వైఎస్ జగన్ సర్కార్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వలంటీర్ ద్వారా ఇంటి వద్దే పింఛన్ అందుకున్న ఆమెకు కూటమి ప్రభుత్వంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ నెల పింఛన్‌ను ఆపేసిన కూటమి సర్కార్.. బతికున్నట్లుగా నిరూపించుకోవాలంటూ ఆమెకు అగ్ని పరీక్ష పెట్టింది. దీంతో తనను ఆదుకోవాలంటూ ఆ వృద్ధురాలు విలపిస్తోంది. నేను బతికే ఉన్నా కదా.. ‘గతంలో ఏ ఇబ్బంది లేకుండా వలంటీరే అన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు ఎవరూ రావట్లేదు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారడంతో ఐరిస్ కూడా పడటం లేదంటున్నారు. ఏది పడకపోయినా నేను బతికే ఉన్నా కదా. నాకు పింఛనే ఆధారం అని చెబుతున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ వృద్ధురాలు విలపించింది. ‘మా అమ్మకు నెలనెలా వచ్చే పింఛన్ డబ్బులతోనే మందులు కొంటున్నా. పవన్‌కళ్యాణ్‌కు ఓటు వేసినందుకు ఇప్పుడు పింఛన్ గురించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది’ అంటూ ఆమె కుమార్తె పార్వతి వాపోయింది. తమకు న్యాయం చేయాలని కోరింది. -
'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనుందా? ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇదే చర్చ నడుస్తోంది. వచ్చే వారం రిలీజ్ పెట్టుకుని ఇలా చేస్తున్నారేంటా అని అభిమానులు మళ్లీ తల పట్టుకుంటున్నారు. ఇంతకీ వాయిదా అని వస్తున్న రూమర్స్ నిజమేనా? వినిపిస్తున్న కారణాలేంటి?సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో అంటే 2019లో అలా పవన్ ఒప్పుకొన్న సినిమా ఇది. 2020 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. అప్పటినుంచి ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు గత నెలలో పూర్తి చేశారు. తొలుత క్రిష్ దర్శకుడు కాగా.. కారణాలేంటో తెలీదు గానీ మధ్యలోనే ఇతడు తప్పుకొన్నాడు. దీంతో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం కొడుకు జ్యోతికృష్ణ.. క్రిష్ స్థానంలోకి వచ్చారు. ఎలాగోలా షూటింగ్ కంప్లీట్ చేశారు.(ఇదీ చదవండి: కమల్ హాసన్‌కి చివాట్లు పెట్టిన హైకోర్ట్)తొలుత ఈ ఏడాది మార్చిలో వస్తుందని అన్నారు. వాయిదా పడింది. మే 30న రావడం పక్కా అన్నారు. అప్పుడు కూడా వాయిదా పడింది. ఎట్టకేలకు జూన్ 12న వస్తుందని పక్కా ఫిక్సయ్యారు. ఇందుకు తగ్గట్లు మరో వారంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కూడా ఉందని డేట్స్ ప్రకటించారు. ప్రస్తుతం సెన్సార్ ముందుకు ఈ చిత్రం వెళ్లింది. కానీ ఇప్పుడు సడన్‌గా వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది.జూలైలో 'హరిహర వీరమల్లు' రిలీజ్ ఉండొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బయ్యర్లు ఇంకా దొరకలేదని, అందుకే వాయిదా వేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ సంగతేంటి అనేది నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే సినిమా మీద పెద్దగా హైప్ లేదు. ఇలాంటి టైంలో మరోసారి గనక వాయిదా పడితే మాత్రం ఉన్న కాస్త హైప్ కూడా పోయే అవకాశముంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?) -
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
Upcoming Tollywood Movies: జూన్‌లో పెద్ద సినిమాల జాతర.. గ్యాపే లేదు!
టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత సమ్మర్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవి కాలం వృథాగా పోయింది. మే నెలలో పెద్ద సినిమాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. వచ్చిన వాటిలో హిట్ 3 చిత్రం ఒక్కటే కాస్త బెటర్‌గా ఆడింది. సమంత ‘శుభం’, శ్రీ విష్ణు ‘సింగిల్’ లాంటి చిత్రాలు కొంతమేర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇలా సమ్మర్‌కి కీలకమైన మే నెల టాలీవుడ్‌ని పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. కానీ అనూహ్యంగా జూన్ నెల టాలీవుడ్‌కి కీలకంగా మారబోతుంది. ఈ నెలలో వారానికొక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. వాటిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’తో ఈ నెల టాలీవుడ్ బాక్సాఫీస్ ఓపెన్ కాబోతుంది. ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దశాబ్దాల తర్వాత మణిరత్నం, కమల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. శింబు కీలక పాత్ర పోషించారు. కోలీవుడ్‌లో మాదిరే టాలీవుడ్‌లోనూ భారీ ప్రమోషన్స్ చేశారు. కమల్ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దీంతో థగ్ లైఫ్‌పై తెలుగులోనూ మంచి హైప్ క్రియేట్ అయింది. జూన్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.ఇక థగ్ లైఫ్ వచ్చిన వారానికే పవన్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న రిలీజ్ కాబోతుంది. చాలా రోజుల తర్వాత పవన్ నుంచి వస్తున్న చిత్రమిది. అంతేకాదు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ కాబోతున్న తొలి సినిమా.దీనిపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.ఎప్పుడైన ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే.. మరుసటి వారం కాస్త గ్యాప్ ఉండేది. లేదంటే చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవి. కానీ ఈ సారి పవన్ సినిమాకు కూడా పోటీ ఎదురైంది. హరిహర వీరమల్లు వచ్చిన మరుసటి వారమే(మే 20) ధనుష్-నాగార్జునల ‘కుబేర’ రిలీజ్ కానుంది. శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై కూడా ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అదే రోజు ఆమిర్ ఖాన్ సితారే జమీర్పర్ రిలీజ్ కాబోతుంది.ఇక జూన్ చివరివారంపై ‘కన్నప్ప’ కర్ఛీఫ్ వేశాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు విష్ణు. చెన్నై, బెంగళూరు, ముంబై తదితర పట్టణాలలో ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇలా జూన్ నెలలో ప్రతి వారం ఒక్కో పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటు గ్యాంబ్లర్స్(జూన్ 6), 8 వసంతాలు (జూన్ 20), మర్గాన్ (జూన్ 27) చిత్రాలు కూడా ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం సూపర్ హిట్‌గా నిలుస్తుందో చూడాలి. -
ఆ ధైర్యం బాబు, పవన్‌తో సహా ఎవరికీ లేదా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రి కావడంతో ఆ రంగానికి విశేష ప్రాధాన్యం లభిస్తుందని అందరూ ఆశించారు. విప్లవాత్మక మార్పులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ శెభాష్ అనిపించుకున్నట్లే.. లోకేశ్ కూడా విద్యాశాఖను ముందు తీసుకెళతారని అనుకున్నారు. కానీ ఏడాది తిరక్కుండానే ప్రశంసల మాటెలా ఉన్నా.. తీవ్ర నిరాశకైతే గురి చేశారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి తరువాత రాష్ట్రవ్యాప్తంగా వెల్లడవుతున్న అభిప్రాయం ఇది. ఉపాధ్యాయులు పరీక్ష పత్రాలు దిద్దిన తీరు, ఫెయిల్ అయిన వారిలో అరవై శాతం మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తున్న చేసుకోవడం, ఏకంగా 11 వేల పత్రాల వాల్యుయేషన్‌లో తప్పులు దొర్లినట్లు స్పష్టం కావడం చూస్తూంటే.. మంత్రిగా లోకేశ్ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యావేత్తలే వ్యాఖ్యానిస్తున్నారు. హడావుడిగా పరీక్ష పత్రాలు దిద్దాల్సి రావడం వల్ల ఉపాధ్యాయులు ఒత్తిడికి గురయ్యారని.. నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ తోడవడంతోనే ఇంత స్థాయిలో తప్పులు దొర్లాయని వీరు విశ్లేషిస్తున్నారు. విద్యా వ్యవస్థలో తానేదో రికార్డు సృష్టించానని చెప్పుకునేందుకు లోకేశ్ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించడంతో ఈ గందరగోళం ఏర్పడిందని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి తన కుమారుడు కాకపోయి ఉంటే ఈపాటికి చంద్రబాబు నాయుడు ఆ మంత్రికి ఎంత స్థాయిలో క్లాస్ పీకి ఉండేవారు చెప్పలేం. కొడుకు కావడంతో ఏమీ అనలేని పరిస్థితి. పైగా లోకేశ్ ఇప్పుడు సర్వశాఖల మంత్రిగా పెత్తనం కూడా చెలాయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ‘రెడ్‌బుక్’ అంటూ వైఎస్సార్సీపీ నేతలను, టీడీపీ విధానాలను వ్యతిరేకించేవారిని వేధించి, జైళ్లలో పెట్టేందుకు లోకేశ్ చూపుతున్న శ్రద్ధలో ఏ కొంచెం తన మంత్రిత్వ శాఖపై చూపి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడిది కాదేమో!. లోకేశ్ బహుశా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖను ఎంచుకుని ఉండవచ్చు కానీ.. వచ్చిన అవకాశాన్ని ఆయన ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారన్నది వాస్తవం. పైగా గత ప్రభుత్వంలో జగన్ ఈ రంగంలో చేసిన మంచిని కూడా చెరిపేసే ప్రయత్నం చేస్తూండటం వల్ల విద్యా రంగం సమస్యలు ఎదుర్కొంటోంది. 👉విపక్షంలో ఉండగా టీడీపీ ఉపాధ్యాయులను రకరకాలుగా రెచ్చగొట్టింది. ప్రభుత్వ టీచర్లు కూడా జగన్ ప్రభుత్వాన్ని అపార్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే తమకు మేలని భావించారు. కానీ.. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంగ్లీషు మీడియంను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ మాధ్యమం ఉనికినే ప్రశ్నార్థకం చేసేశారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యనందించాలనుకున్న జగన్ సంకల్పానికి గండికొట్టేశారు. కింది తరగతుల నుంచే ప్రవేశపెట్టిన ఐబీ కరిక్యులమ్, టోఫెల్ తదితరాలను తీసేశారు. 👉విశేషం ఏమిటంటే ఇదే చంద్రబాబు, పవన్ , లోకేశ్‌లు తమ పర్యటనలలో కొన్నిసార్లు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి జగన్ టైమ్ లో జరిగిన మార్పులు చూసి ఆశ్చర్యపోవడం!. ‘అమ్మ ఒడి’ పేరుతో విద్యార్దుల తల్లులకు రూ.15 వేలు చొప్పున ఇచ్చి అందులో రూ.వెయ్యి టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తే టీడీపీ, జనసేనలు తప్పు పట్టాయి. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న పిల్లలు ఒకొక్కరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని బీరాలు పలికాయి కూడా. అధికారమైతే వచ్చింది కాని ‘అమ్మ ఒడి’ పథకం అసలుకే మోసం వచ్చింది. ఇవన్ని ఒక ఎత్తు.. టెన్త్ విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడేలా వాల్యుయేషన్ జరగడం మాత్రం ఇంకో ఎత్తు. లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు జరిగిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అది కరెక్టా? కాదా? అనేదానిపై లోకేశ్ వివరణ ఇవ్వాలి. నిజమైతే.. తప్పు చేసిన టీచర్లు ఎంత బాధ్యులో, మంత్రిగా లోకేశ్ కూడా అంతే బాద్యుడు అవుతారు!. 👉గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా ఉండగా కొన్నిచోట్ల పశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దాని కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. లోకేశ్‌ను రాజీనామా చేయాలని అడిగే ధైర్యం చంద్రబాబు, పవన్‌తోసహా కూటమి నేతలలో ఎవరికి ఉండకపోవచ్చు. అంతమాత్రాన తన తప్పు ఏమిటో తెలుసుకుని సరిదిద్దుకోవడం పోయి గత ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తే తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్దులకు ఉపశమనం కలుగుతుందా?. 👉ఎంతసేపు రెడ్ బుక్ గోలే కాదు.. తన శాఖలో జరుగుతున్న పరిణామాలను నారా లోకేష్ అర్థం చేసుకోవాలి. కొద్దికాలం క్రితం తమకు విద్యా శాఖకు సంబందించి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు. తప్పు లేదు. ఎందుకంటే.. ఎప్పుడూ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వ్యక్తి కాదు కాబట్టి. పేద విద్యార్దుల బాధలు తెలిసిన వారు కాదు కాబట్టి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన లోకేష్ ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుకున్నారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అయినా లోతుగా అధ్యయనం చేసి ఉండాల్సింది. 👉టెన్త్ లో 66 వేల మంది మార్కుల వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రతి ఏటా ఎంతో కొంతమంది ఇలా దరఖాస్తులు పెట్టుకుంటారు. కొన్ని తప్పులు జరిగితే సరి చేస్తారు. కాని ఈసారి విద్యార్ధులు విభ్రాంతి చెందేలా పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు.. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్‌కు చెందిన గంగిరెడ్డి మోక్షిత పదో తరగతిలో ఫెయిల్ అయినట్లు ఫలితాలలో తెలిపారు. ఆమె తల్లిదండ్రులు వెరిఫికేషన్ పెడితే ఆమెకు సోషల్‌లో 84 మార్కులు వచ్చినట్లు తేలింది. అంతకుముందు సోషల్ సబ్జెక్టులో 21 మార్కులే వచ్చాయని ప్రకటించారు. ఇంత దారుణంగా వ్యత్యాసం ఉంటే విద్యార్ధుల భవిష్యత్తు ఏమి కావాలి. మరో విద్యార్ధికి వెరిఫికేషన్‌లో హిందీలో నాలుగు ప్రశ్నలకు రాసిన జవాబులకు సున్నా మార్కులు వేసేశారట. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మరో విద్యార్ధికి ఇంగ్లీష్‌లో తొలుత 34 మార్కులు వచ్చాయని షీట్ లో తెలిపారు. తీరా వెరిఫికేషన్ కు వెళితే 93 మార్కులు వచ్చాయని వెల్లడైంది. 👉గతంలో ఏదో ఒకటి, రెండు మార్కులు, లేదంటే ఓ పది మార్కుల వరకు తేడా వస్తే వచ్చేవేమో! కాని ఈసారి ఇలా ఇంత తేడాతో ఉంటే ఆ విద్యార్ధుల భవిష్యత్తు ఏమవ్వాలి? ఎవరైనా తొందరపడి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులవుతారు?. విశేషం ఏమిటంటే గతంలో జగన్ టైమ్ లో ఏ చిన్న తప్పు జరిగినా జగన్ రాజ్యంలో.. జగన్ ఇలాకాలో ఘోరాలు అంటూ రాసినా.. ఇప్పటికీ అదే పద్దతిలో దౌర్బాగ్యకర రీతిలో వార్తలు ఇచ్చే ఎల్లో మీడియా ఈనాడు దినపత్రిక ఇప్పుడు ఈ వాల్యుయేషన్ అవతకతవకల విషయంలో మాత్రం ఎక్కడా అసలు మంత్రి లోకేశ్ ప్రస్తావన కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యంలో ఇలా జరుగుతోందని కాని రాయకుండా జాగ్రత్తపడింది. అంతవరకు అయితే ఒక రకం. .. ప్రభుత్వ తప్పులను కూడా వెనకేసుకు వచ్చేలా వార్తలు ఇచ్చే నీచానికి ఈ ఎల్లో మీడియా పాల్పడుతుండడం దురదృష్టకరం. 2022లో జవాబు పత్రాలలో వత్యాసం 20 శాతం ఉండగా, ఇప్పుడు 16.8 శాతం మాత్రమేనని నిస్పిగ్గుగా సమర్దించుకునే యత్నం చేశారు. ఇలాంటి వార్తల విషయంలో వాస్తవాలకు అనుగుణంగా కథనాలు ఇస్తే విద్యార్దులకు ఉపయోగం. కాని, ఇలాంటి వాటిలోకూడా దిక్కుమాలిన రాజకీయం చేయడం వల్ల ఏమి ఉపయోగం?. చంద్రబాబు పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయందని జగన్ వ్యాఖ్యానించారు. దీనికి జగనే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని, దానిని గాడిన పెడుతున్నామని లోకేశ్ ఎదురు దాడి చేశారు. ఏ రకంగా జగన్ పాడు చేసింది..తాను ఏ విధంగా బాగు చేసింది చెప్పుకోకుండా, ఏవో శాతాల అంకెలు చెబితే అందులోని డొల్లతనం బయటపడుతూనే ఉంది. ఎంత సేపు రెడ్ బుక్‌తో గుండెపోటు తెప్పించానని, వారిని జైల్లో వేశా, వీరిని జైల్లో వేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు. తన శాఖలో ఏమి జరుగుతోంది?. ఏ రకంగా పిల్లలకు మేలు చేయవచ్చు?. అంశాలపై లోకేశ్ దృష్టి పెడితే మంచిది. వెరిఫికేషన్, రీవ్యాల్యుయేషన్‌కు వెళ్లిన వారంతా వైఎస్సార్సీపీ వారనో, మరొకటనో చెప్పి, వారిని కూడా రెడ్ బుక్ పేరుతో భయపెట్టకుండా ఉంటే అదే పదివేలు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాపు ఉద్యమకారులపై కూటమి సర్కారు కుట్రలు
-
'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ కోసం వేదిక ఫైనల్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేదిక ఫైనల్ అయిపోయింది. జూన్ 12న ఈ చిత్రం విడుదల కానున్నడంతో ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించిన టీమ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక కోసం సిద్ధమవుతోంది. జూన్ 8న ఈ కార్యక్రమాన్ని జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈమేరకు తాజాగా స్వీ యూనివర్సిటీ రిజిస్టార్కు మెగా సూర్య ప్రొడక్షన్ లేఖ రాసింది.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు. తొలి భాగం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకులు క్రిష్ కొంతభాగం తెరకెక్కింగా.. ఆ తర్వాత నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే హరిహర వీరమల్లు ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెన్సారు కోసం కాపీ కూడా రెడీ అయిపోయింది. తిరుపతిలో హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 8న తారకరామా స్టేడియంలో నిర్వహించడానికి అనుమతులు కోసం దరఖాస్తు. ఎస్వీ యూనివర్సిటీ రిజిస్టార్ కు లేఖ రాసిన మెగా సూర్య ప్రొడక్షన్. అభిమానులు భారీగా హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయనున్న మూవీ టీమ్. చాలా కాలం తరువాత పవన్… pic.twitter.com/4g8fxrX64F— ChotaNews App (@ChotaNewsApp) June 3, 2025 -
తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించిన ఏఎం రత్నం
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara VeeraMallu) సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపంథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ను ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఆశ్రయించారు. పవన్ కల్యాణ్ సినిమాకు ఎపీలో టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతి ఇవ్వాలంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌కు ఆయన వినతి పత్రం అందించారు. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి త్వరలో సంప్రదించనుంది. ఆ సమయంలో 'హరిహర వీరమల్లు' సినిమాకు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని, అదనపు షోలు రన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరనుంది. 'హరిహర వీరమల్లు'కు టికెట్ల రేట్ల పెంపు కోసం పవన్ కల్యాణ్ కొత్త స్కెచ్ వేశారని తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా నిర్మాత ఏఎమ్ రత్నం ద్వారా తన సినిమా కోసం టికెట్ ధరలు పెంపు, అదనపు షోల అనుమతి కోసం ప్లాన్ అమలు చేశారు. పవన్ సూచన మేరకే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏఎమ్ రత్నం కలిశారని అర్థం అవుతుంది. డైరెక్ట్‌గా తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటే విమర్శలొస్తాయని ఫిల్మ్ చాంబర్ ద్వారా పవన్ ఇలా స్కెచ్ వేశారని చెప్పవచ్చు. నేడో, రేపో ఫిల్మ్ చాంబర్ నుంచి కొందరు ఏపీ ప్రభుత్వాన్ని కలవనున్నారు. పవన్ తన సినిమా కోసం థియేటర్స్పై తనిఖీలు చేయించారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన సినిమాకు ఇలా లబ్ధి పొందే ప్లాన్‌ను ఆయన అమలు చేశారు. -
వెన్నుపోటుకు ఏడాది
-
ఈ రోడ్లను చూసి మాట్లాడండి పవన్!
-
పవన్.. ఏంటి నీ గోల
-
ఊరూరా ప'రేషన్'
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం 18వ వార్డు 0486014 నంబర్ షాపులో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీని ఆదివారం ప్రారంభించారు. వద్ధులకు, దివ్యాంగులకు ఇళ్ల వద్దే పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ.. పిఠాపురానికి చెందిన రాయి రామయ్యమ్మ అనే వద్ధురాలికి రేషన్ షాపు వద్దే బియ్యం ఇచ్చారు. వాటిని మోసుకెళ్లేందుకు ఆమె తీవ్ర అవస్థ పడింది. మంత్రి ప్రారంభించిన కొద్దిసేపటికే ఆ రేషన్ షాపును మూసివేయడం కొసమెరుపు.సాక్షి నెట్వర్క్: ఇంటికే రేషన్ విధానం రద్దు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజే ఆదివారం లబ్ధిదారులు నానా అవస్థలు పడ్డారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెంలోని రేషన్ షాపు వద్దకు దాదాపు 3 కి.మీ. దూరంలోని అంకమ్మగూడెం నుంచి గిరిజన మహిళలు బియ్యం కోసం నడుచుకుంటూ వచ్చారు. మూటలు మోసుకుంటూ గూడేనికి చేరుకున్నారు. » భీమవరం మండలం దెయ్యాలతిప్ప గ్రామంలో తొలిరోజు ఒకరిద్దరు లబ్ధిదారులకు రేషన్ ఇచ్చి తలుపులు మూసేశారు. ప్రారంభించిన గంటలోనే దుకాణం మూతపడటంతో క్యూలో నిలబడ్డ లబ్ధిదారులు నివ్వెరపోయారు. యలమంచిలి మండలం మేడపాడు, నరసాపురం మండలం కొప్పర్రులో ఈ–పోస్ యంత్రాలు మొరాయించాయి. తాడేపల్లిగూడెం రూరల్, ఆకివీడు తదితర ప్రాంతాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చి వాహనాలపై సరుకులు తీసుకెళ్లారు. » ‘జగన్ ప్రభుత్వంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ అమలు చేసినా మమ్మల్ని తొలగించకుండా మా కమీషన్ మాకు ఇచ్చేవారు. మాకు సుఖంగా ఉండేది. ఇప్పుడు మళ్లీ మాకు పని పెట్టారు’ అంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పరిధిలో పలువురు డీలర్లు వాపోయారు.» తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో 51 రేషన్ షాపులుండగా 34,483 రేషన్‌కార్డులున్నాయి. డి.ముప్పవరంలో లబ్ధిదారులు సరుకుల కోసం డీలర్ వద్ద ఆధార్, రేషన్ కార్డులను క్యూ లైన్లో పెట్టారు. 65 ఏళ్లు పైబడిన వద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీపై తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని డీలర్లు చెబుతున్నారు. తొలి రోజు సర్వర్ పూర్తి స్థాయిలో పని చేయక కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి షాపులో పదుల సంఖ్యలో మాత్రమే సరుకులు ఇచ్చారు. » విజయనగరం జిల్లాలో పలుచోట్ల మండుటెండలో నిలబడి సరుకులు తీసుకున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి ఉన్నవారు ప్రభుత్వానికి శాపనార్దాలు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, మెళియాపుట్టి తదితర గిరిజన ప్రాంతాల్లో పేదలు తీవ్ర అవస్థలు పడ్డారు. » అనంతపురం జిల్లాలో చాలాచోట్ల ఉదయం 8 గంటలకు చౌక దుకాణాలు తెరుచుకోలేదు. నింపాదిగా తొమ్మిది గంటల తరువాత పంపిణీ మొదలైంది. క్యూలైన్లో నిలబడలేక వద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. రాప్తాడు మండలం చిన్మయినగర్‌లో చౌక దుకాణం వద్ద చాలా ఆలస్యంగా పంపిణీ ప్రారంభించారు. ఉదయమే వచ్చిన కార్డుదారులు సంచులను క్యూ లైన్లలో పెట్టారు. » వైఎస్సార్ జిల్లాలో కడపతోపాటు ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, కమలాపురం తదితర ప్రాంతాల్లో సర్వర్ సమస్యతో కార్డుదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో పిల్లలు రేషన్ సరుకులు తీసుకునేందుకు వచ్చి అవస్థలు పడ్డారు. అన్నమయ్య జిల్లాలో సర్వర్ సమస్యతో రేషన్ సరుకులు అందని పరిస్థితి నెలకొంది. » కర్నూలు ఎన్ఆర్పేటలో సరుకుల కోసం మహిళలు, వద్ధులు, వికలాంగులు రేషన్ షాపుల దగ్గర పడికాపులు కాశారు. సర్వర్ మొరాయించడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చింది. » విశాఖలో తొలి రోజు పలుచోట్ల ఈ–పోస్ యంత్రాలు మొరాయించడంతో కార్డుదారులు ఎండలో రోడ్డు మీద గంటల తరబడి నిరీక్షించారు. పలుచోట్ల నెత్తిమీద సరుకులు మోసుకుంటూ వెళ్లడం కనిపించింది. » అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో చాలాచోట్ల డిపోలకు బియ్యం రాలేదు. సర్వర్ మొరాయించడంతో మారుమూల గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు నిరాశతో వెనుతిరిగారు. గూడెంకొత్తవీధి మండలం కుంకుమపూడి తదితర ప్రాంతాల్లో రేషన్ డిపోలు తెరచుకోలేదు. సర్వర్లు పనిచేయక అరకులోయ మండలంలో పంపిణీ నిలిచిపోయింది. బస్కీ, లోతేరు, ఇరగాయి, తదితర పంచాయతీల పరిధిలో బియ్యం పంపిణీ జరగలేదు. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీలోని జోడిగుమ్మ, పట్నపడాల్పుట్టు, కోసంపుట్టు గ్రామాలకు చెందిన రేషన్ దారులు నాలుగు కిలోమీటర్లు అటవీప్రాంతం మీదుగా వచ్చి అవస్థలు పడుతూ రేషన్ తీసుకెళ్లారు. బూసిపుట్టు, బుంగాపుట్టు పంచాయతీల్లో కూడా చాలా చోట్ల రేషన్ పంపిణీ జరగలేదు. »ఉమ్మడి కష్ణా జిల్లాలో ఉదయం నుంచి సర్వర్ సమస్యతో ఇబ్బందులు తలెత్తాయి. మండుటెండలో దుకాణాల వద్ద మహిళలు, వద్ధులు నిరీక్షించారు. రెండు రోజుల పాటు ఇదే పరిస్ధితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించిన మచిలీపట్నంలోని దుకాణంలో సైతం సర్వర్ సమస్య తలెత్తింది. ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో కార్డుకు సరుకుల పంపిణీకి 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టింది. వత్సవాయి, వేముల నర్వ, గోపువానిపాలెం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో సర్వర్లు మొరాయించాయి.» రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు తొలి రోజే మూతపడటంతో రేషన్ కోసం వచ్చినవారు కాళ్లీడ్చుకుంటూ వెనుదిరిగారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరంలో లేనందువల్లే రేషన్ దుకాణాలు తెరవలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.» ప్రారంభించిన తొలిరోజే పుంగనూరులోని కట్టకిందపాళ్యం రేషన్ షాపు (నెంబరు 1082005) మూతబడింది. డీలర్ బాలాజీ కార్డులు తీసుకుని బియ్యం ఇవ్వకుండా తాళం వేసి వెళ్లిపోయినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. కూలీ పనులు వదిలేసి వచ్చిన వారంతా ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టారు.పిల్లాడిని మోసుకుంటూ..పిల్లలను చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో నాతోపాటే రేషన్ దుకాణానికి తీసుకొచ్చా. నాలుగు కి.మీ. ఎండలో పిల్లాడిని తీసుకెళ్లడంతో సొమ్మసిల్లిపోయాడు. వైఎస్ జగనన్న మాదిరిగా ఇంటింటికీ బియ్యం ఇవ్వాలి. – సవర సావిత్రి, గేసరిగూడ, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా మహిళలు మోసేదెలా?ఇన్నాళ్లూ ఇంటి వద్దనే బియ్యం ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంది. మహిళలు రేషన్ షాపు వద్దకు వచ్చి బియ్యం ఎలా మోసుకెళ్తారన్న విషయం పాలకులకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాత విధానాన్నే అమలు చేయాలి. – షేక్ షాజాదీ, బొమ్మూరు, రాజమహేంద్రవరం రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా ఇంటివద్దనే రేషన్ ఇవ్వాలి జగన్ ప్రభుత్వంలో మాదిరిగా ఇంటి వద్దనే రేషన్ సరుకులు సరఫరా చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా తల్లికి వందనం, రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు. వైఎస్ జగన్ ప్రతి పథకాన్నీ సకాలంలో అమలు చేశారు.– విడియాల శేషారత్నం, కొండ్రుప్రోలు, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా -
పవన్ నియోజవర్గంలో టీడీపీ, జనసేన బాహాబాహీ
పిఠాపురం: టీడీపీ, జనసేనలు పొత్తు పరంగా కలిసి ఉన్నా, కార్యకర్తల దగ్గరకు వచ్చే సరికి ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత లేదనేది మరోసారి బయటపడింది. ఈరోజు(ఆదివారం, జూన్1) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య రగడ చోటు చేసుకుంది. పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోయి మరీ ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు.పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలోనే ఇరు పార్టీల విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ కార్యాక్రమానికి హాజరైన రెండు పార్టీల శ్రేణులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. జై జనసేన, జై టీడీపీ అంటూ ఇరు వర్గాల నినాదాలు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల కార్యకర్తల్లో సఖ్యత అనేది లేకపోవడంతో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ పరిస్థితులు గందరగోళానికి దారి తీసిన సందర్బాల్లో తరచు జరుగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి: పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!! -
పవన్ ధ్యాసంతా తన సినిమాలు.. సినిమా టిక్కెట్లు.. రిటర్న్ గిఫ్ట్ లపైనే
-
అతడే ఒక విలన్.. పవన్ పై సినీ పరిశ్రమ ఫైర్
-
పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!!
పవన్ కళ్యాణ్‌కు అధికారం సంపాదించడంలో ఉన్నంత ఆరాటం.. నేడు ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో కనిపించడంలేదు.. ఏదో చేసేద్దాం అనుకుని వచ్చాను.. ఏమీ చేయలేకపోతున్నానంటున్నారు. తనకు జ్ఞనోదయం అయిందా?. విషయం అవగతమైందా?. చంద్రబాబు నీడలో తన ఉనికి తనకే కనిపించక కళ్లు మసకలు.. బైర్లు కుమ్ముతున్నాయా తెలియని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తనలోని నైరాశ్యాన్ని నిర్వేదాన్ని వెళ్లగక్కారు..వాస్తవానికి ఆయన ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయనకు ప్రభుత్వ నిర్ణయాలు.. పాలసీలతో సంబంధం లేకుండా పోతోంది. ఎంతసేపు లోకేష్‌ను ఎలివేట్ చేసి రేపు ఆయన్ను సీఎంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న చంద్రబాబు పవన్‌ను జస్ట్ పెయిడ్ రౌడీ మాదిరిగా మాత్రమే వాడుకుంటూ పక్కన పెట్టేస్తున్నారు. అంటే పాత సినిమాల్లో సత్యనారాయణ జస్ట్ ఇలా చప్పట్లు కొట్టి జగ్గూ అనగానే పెద్ద కండలతో ఒక రౌడీ వచ్చి హీరో మీద దాడి చేస్తాడు కదా.. ఆ టైప్ పాత్రకు తనను వాడుకుంటున్నట్లు పవన్ గ్రహించారు.ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిణామాలు ఎదురైనప్పుడు మాత్రమే తనను వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్న విషయం పవన్ గ్రహించారు.. అందుకే తన అసంతృప్తిని తాజాగా వెళ్లగక్కారు. తన 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్నాను కానీ పరిస్థితులు చూస్తుంటే మాట మార్చాల్సి వచ్చేలా ఉందని చెప్పేశారు. రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోతుందని అంటూ అధికారులు ఇంకా ప్రభుత్వానికి సహకరించడం లేదని పవన్ నిందారోపణ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో అధికారం మొత్తం చంద్రబాబు.. లోకేష్ చేతిలో మాత్రమే ఉంది వారు చెప్తే తప్ప పూచిక పుల్ల కూడా కదలని పరిస్థితి.ఆఖరికి తన పంచాయతీరాజ్ అటవీ శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. లోకేష్ చెబితే తప్ప పవన్ శాఖలో కూడా ఏమీ జరగడం లేదు. అంటే కేవలం తన ఇమేజ్ ద్వారా ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ఇప్పుడు తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పాటలు వేస్తున్నారు తప్ప తనకు ఏ రకమైన గౌరవ మర్యాదలు రాజకీయ ప్రాధాన్యం దక్కనివ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తన అంతరంగికుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తనను కేవలం ఓట్ల తెచ్చే యంత్రంగా వాడుకొని ఇప్పుడునట్లు లూజ్ చేసి పక్కన పడేస్తున్నారు అని పవన్ గ్రహించారు. అందుకే పొత్తుల విషయమై ఆయన బరస్ట్ అయినట్లుగా తెలుస్తుంది.దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆగడాలు రౌడీయిజం కూడా పవన్‌లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ హత్యలు. అత్యాచారాలు సాధారణమైనాయి.. ఉద్యోగుల పట్ల కూడా తెలుగుదేశం నాయకులు అమర్యాదగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేస్తున్నారు. వాస్తవానికి అధికరణకు వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కక్ష పూర్తి రాజకీయాలు చేయబోనని.. వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడులకు తాను వ్యతిరేకం అని చెప్పారు. కానీ నేడు జరుగుతున్నది దానికి విరుద్ధంగా ఉన్నది. పల్లెలు పట్టణాలు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు పూర్తిగా ఆధిపత్యం సాధించే దిశగా వెళుతూ ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద దాడులు హత్యలకు పాల్పడుతున్నారు.ఇదంతా పవన్ కళ్యాణ్ గమనించి తన అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారని అంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు. నేడు అంతకుమించి దారుణాల జరుగుతున్నాయి దీనికి పవన్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అందుకే తాను 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్న పరిస్థితులు అలా లేవంటూ ఇప్పుడు తాను పునర్ ఆలోచిస్తున్నట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి.వచ్చే నాలుగేళ్లలో పవన్ పరిస్థితి ప్రభుత్వంలో మరింత దిగజారితే.. లోకేష్ ప్రాబల్యం ప్రాధాన్యం పెరిగితే అప్పుడు జనసేన ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం తనను డిప్యూటీ సీఎం హోదాలో ప్రోటోకాల్.. బుగ్గ కారు.. ఓ ఆఫీసు ఓ పదిమంది స్టాఫ్ మినహా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం పాలసీల విషయంలో తన సంప్రదించకపోవడం వంటి అంశాలు పవన్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. తనకు రాజకీయంగా జీరో నాలెడ్జ్ అని భావించడం వల్లనే చంద్రబాబు కూడా తనను చిన్నచూపు చూస్తున్నారని పవన్ లోలోన మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన మనసులోని ఆవేదనను ఈ విధంగా వెళ్లగక్కి చంద్రబాబుకు ఇండికేషన్ పంపించినట్లుగా జన సైనికులు భావిస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న -
ఇదేం పద్దతి పవన్.. నారాయణమూర్తి కౌంటర్
-
పద్దతి మార్చుకో పవన్.. నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
-
‘నవ’ మోసాలు.. ఉపాధ్యాయుల వినూత్న ఉద్యమం
అవనిగడ్డ: జీవో 117ని రద్దు చేయకుండా రెక్టిఫికేషన్ పేరుతో పాఠశాలల సంఖ్యను తొమ్మిది రకాలుగా మార్చడాన్ని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న చేతలకు పొంతన లేని తీరుపై వారు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యమమే సరైన మార్గమని, లేకపోతే భవిష్యత్ లేదని ఉపాధ్యాయులంతా ఏకమవుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉద్యమబాటకు సై అంటున్నారు. నాటి లోకేశ్ వీడియో వైరల్ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ మాట్లాడిన వీడియోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. గౌరవ శ్రీనారా లోకేశ్ గారు ఎన్నికలకు ముందు.. అంటూ ఇంగ్లిష్, తెలుగు మీడియం ఆప్షన్‌పై మాట్లాడిన వీడియో ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే తెలుగు, ఇంగ్లిష్ మీడియంపై ఆనాడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు? ఇప్పుడెలా స్పందిస్తున్నారనే వీడియో సైతం అందరి గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. సంతకాలతో మంత్రి లోకేశ్‌కు లేఖలుఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) యూనియన్ నేతలు ఒకడుగు ముందుకేసి 9 అంశాలపై సంతకాలు చేసిన లేఖలను మంత్రి నారా లోకేశ్‌కు మెయిల్స్, వాట్సాప్‌ల ద్వారా పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉపాధ్యాయుల వాట్సాప్ లేఖ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారాలోశ్‌కు ప్రకాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తులశ్‌పంపారు. అన్ని గ్రామాల్లో 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలంటూ పలు అంశాలపై ఏకరువుపెడుతూ వాట్సాప్ చేశారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్గిష్ మాద్యమాలను కొనసాగించాలని కోరారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులు, ఉన్నతపాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలంటూ వాట్సాప్ ద్వారా మంత్రికి వినతులు పంపినట్లు ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.నాయబ్‌రసూల్, సీఎస్‌పురం మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాసులు, జె.ఎస్.ఆనంద్‌బాబు పేర్కొన్నారు. తొమ్మిది అంశాలివే..1. ప్రతి గ్రామంలో ప్రతిపాదిత ఫౌండేషన్ స్కూల్ స్ధానంలో 1 నుంచి 5 తరగతులుండేలా ప్రాథమిక పాఠశాలలు విధిగా కొనసాగించాలి. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. 2. విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం కోసం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలను కొనసాగించాలి. మైనారిటీ భాషల మాధ్యమాలను కొనసాగించాలి. 3. ఎస్జీటీలకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. 4. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులు దాటితే 5 ప్లస్ 1 ఉపాధ్యాయులను నియమించాలి.5. ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలి. 6. ప్రతిపాదిత ప్రభుత్వ ఉత్తర్వు 21లో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పడనున్న 40 పీరియడ్ల భారాన్ని 32 పీరియడ్లకు మించకుండా చూడాలి. 7. ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. 8. క్లస్టర్లలో ఉపాధ్యాయులు మిగులు చూపించకుండా వారిని విద్యార్థుల సంఖ్యను బట్టి అవరోహణ క్రమం (ఎక్కువ నుంచి తక్కువ స్థాయి)లో పాఠశాలలకు కేటాయించాలి. 9. పెరిగిన జనాభా మేరకు మునిసిపాలిటీ, కార్పొరేషన్, నూతనంగా వెలిసిన ఆవాసాలతో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలి. -
అపస్మారక స్థితిలో 'హరిహర వీరమల్లు' నిర్మాత.. నిజమేంటి?
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా.. ఎట్టకేలకు మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు పాటలు రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా త్వరలో టీమ్ అంతా మీడియా ముందుకొస్తుంది. మూవీ కోసం అభిమానులు కూడా మరీ కాకపోయినా కొంత ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతలోనే చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే మాటలు వినిపించాయి. దీనిపై ఆయన టీమ్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)దాదాపు రెండు దశాబ్దాలుగా పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ఏఎమ్ రత్నం.. పవన్‌తో 'హరిహర వీరమల్లు' తీశారు. దాదాపు ఐదేళ్లుగా సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం.. ఇబ్బందులు దాటుకుని ఈ జూన్ 12న థియేటర్లలోకి రానుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం.. శుక్రవారం ఉదయం బీపీ ఎక్కువ కావడంతో కళ్లు తిరిగి కింద పడ్డారని, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని తొలుత కొన్ని వార్తలొచ్చాయి. దీంతో హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ చేర్పించారని, ప్రస్తుతం ఆయనకు డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారని వినిపించింది.అయితే ఇవన్నీ కూడా కేవలం పుకార్లేనని, ఏఎమ్ రత్నం ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. మరో నిర్మాత ఏ.దయాకర్ కూడా ఈ విషయమై ట్వీట్ చేశారు. అన్నయ్య ఏఎమ్ రత్నం అనారోగ్యం గురించి వస్తున్న రూమర్స్ నిజం కాదని, ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లని వ్యాపింపజేయొద్దని ట్విట్టర్లో రాసుకొచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: NIA అదుపులో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్) -
ఏఐతో బాబు సొంత డబ్బా.. సినిమా పరిశ్రమపై ఆగని పవన్ కల్యాణ్ వేధింపులు
-
పవన్ కల్యాణ్ 'ఓజీ'లో శిరీష.. నారా రోహిత్ క్లారిటీ
పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'ఓజీ'లో శిరీష లేళ్ల ఛాన్స్ దక్కించుకుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ఆమెకు కాబోయే భర్త నారా రోహిత్ తాజాగా ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఓజీ సినిమా గురించి మాట్లాడారు. 'ప్రతినిధి2' చిత్రంలో నారా రోహిత్ సరసన శిరీషా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన వారిద్దరూ గతేడాదిలో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో వివాహం కానుంది.'భైరవం' సినిమా మే 30న విడుదల కానుంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించారు. మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఈ ముగ్గురితో హీరో సాయి ధరమ్ తేజ్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఓజీ అప్డేట్ ఇవ్వాలంటూ రోహిత్‌ను ప్రశ్నించగా ఇలా చెప్పారు. 'ఓజీలో నాకు కాబోయే సతీమణి శీరీషా కూడా నటించారు. ఒక కీలకమైన పాత్రలో నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది' అని ఆయన అన్నారు. ప్రస్తుతం రోహిత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.‘ఓజీ’ సినిమా షూటింగ్ స్పీడ్‌గానే సాగుతుంది. ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమన్ సంగీతం అందించారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్లతో పాటు శిరీషా కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. -
నా చిత్రాల్లో నటించాకే వారందరూ రాజకీయాల్లోకి ఎంట్రీ: ఏఎం.రత్నం
నా చిత్రాల్లో నటించిన తరువాత కథానాయకులు రాజకీయాల్లోకి వెళ్లారని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఇంతకుముందు కోలీవుడ్‌లో ఆయన ఇండియన్ (భారతీయుడు), ఆరంభం, ఎన్నై అరిందాల్ (ఎంతవాడు గాని), వేదాళం వంటి పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఈయన తాజాగా నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఇందులో నిధిఅగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునిల్, కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందించారు. రవికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో జూన్ 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆ చిత్రంలోని తార తార అనే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు కేఎస్.రవికుమార్, కేఆర్ పాల్గొని చిత్రం మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఏఎం రత్నం మాట్లాడుతూ చిత్రం బాగా వచ్చిందని, హరిహర వీరమల్లు చిత్రానికి రెండవ భాగం చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి తన కొడుకు రవికృష్ణ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. కాగా తన చిత్రాల్లో నటించిన తరువాత ఆయా చిత్రాల కథానాయకులు రాజాకీయాల్లోకి ప్రవేశించారని చెప్పారు. నటుడు శరత్‌కుమార్, విజయ్‌కాంత్, విజయ్, విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారని, పవన్‌కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారని ఇది యాదృఛ్చకంగా జరిగిందో ఏమో తెలియదని ఆయన పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రవికృష్ణ మాట్లాడుతూ తాను ఏడెనిమిది ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం హరిహరవీరమల్లు అని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్‌కల్యాణ్ పిలిచి తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని, తాను మాత్రం మీ తండ్రికి అభిమానినని, ఆయన బాగుండాలని, ఆయన లెగసీని నువ్వు కొనసాగించాలని చెప్పారని రవికృష్ణ పేర్కొన్నారు. -
సీజ్ ద థియేటర్.. అంటారేమో!
సాక్షి నెట్వర్క్: సినిమా థియేటర్ల విషయంలో ‘అత్త మీద కోపం దుత్త మీద చూపిందన్నట్లు’ తయారైంది కూటమి ప్రభుత్వ పరిస్థితి. సినిమా థియేటర్ల బంద్.. ఆపై విరమణ ప్రకటనల నేపథ్యంలో ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో ఎక్కడ ‘సీజ్ ద థియేటర్..’ అంటారోనని థియేటర్ల యజమానులు వణికిపోతున్నారు. జూన్ 12న తాను నటించిన హరి హర వీరమల్లు చిత్రం విడుదలవుతున్నందున ఇప్పుడు థియేటర్లు బంద్ చేస్తారా.. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది.. దీని వెనుక ఎవరున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తీరా దీని వెనుక జనసేన నేత ఉన్నారని తెలిసి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది ప్రభుత్వం. ఇంత హంగామా చేసి మిన్నకుండిపోతే బావుండదని భావించి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆయా థియేటర్లలో ఉన్న లోపాలన్నింటిపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో బుధవారం పలు నగరాలు, పట్టణాల్లో పోలీస్, రెవెన్యూ, ఆహార కల్తీ నిరోధక శాఖ, మున్సిపల్ శాఖ, తూనికలు, కొలతలు తదితర శాఖల అధికారులు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. మచిలీపట్నంలో ఆర్డీవో కె స్వాతి మల్టీప్లెక్స్ థియేటర్‌ను తనిఖీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లు అరవింద్‌కు చెందిన గీతా అన్నపూర్ణ థియేటర్‌తో పాటు అడబాల, కోడి రామకృష్ణకు చెందిన మారుతి థియేటర్లను తనిఖీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌కు చెందిన మూడు థియేటర్లలో ఆర్డీవో కె.మధులత ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. లైసెన్స్‌లు, టికెట్ల ధరలు, తినుబండారాలు, శీతల పానీయాల ధరలు, మరుగుదొడ్లు, ఫైర్ సేఫ్టీ.. తదితరాలను పరిశీలించారు. నరసరావుపేట డివిజన్లో 22 థియేటర్లు ఉన్నాయని, వాటన్నింటిలో తనిఖీలు చేయాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించామని ఆర్డీవో తెలిపారు. రాజమహేంద్రవరంలోని గీతా అప్సర, శ్యామల, స్వామి థియేటర్లను జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తనిఖీ చేశారు. విజయవాడ గాందీనగర్‌లోని శైలజ, రాజ్ యువరాజ్, ఐనాక్స్, అలంకార్ థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అమలాపురం, అన్నమయ్య జిల్లా రాయచోటి, రైల్వేకోడూరు తదితర పట్టణాల్లోనూ థియేటర్ల తనిఖీలు కొనసాగాయి. ఉన్నట్లుండి ఈ తనిఖీలేంటి? తనిఖీల సమయంలో థియేటర్ల యజమానులు అధికారులతో వారి కష్టాలు చెప్పుకున్నారు. ఇప్పటికే అరకొర ఆదాయాలతో నష్టపోతున్నామని, చిన్నచిన్న లోపాలను సాకుగా తీసుకుని ‘సీజ్ ద థియేటర్’ అంటే తమ గతి ఏం కావాలని వాపోయారు. ఇదే సమయంలో ఆయా ప్రాంతాల్లో కొంతమంది ప్రేక్షకులు కలుగజేసుకుంటూ విజయవాడ తదితర నగరాల్లోని మల్టీఫ్లెక్స్‌లలో తినుబండారాలు, మంచినీటి బాటిల్ ధర ఆకాశాన్నంటుతున్నాయని.. చిత్తశుద్ధి ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీఫ్లెక్స్ థియేటర్లలో కళ్లెదుటే అధిక ధరలతో తినుబండారాలు విక్రయిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నారని వాపోయారు.ఇదీ సంగతి మల్టీఫ్లెక్స్ థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తే మొదటి వారం రెవెన్యూలో 53 శాతం మల్టీప్లెక్స్ యజమానికి, 47 శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకునే విధంగా నిర్ణయించారు. రెండో వారం కూడా అదే సినిమా ప్రదర్శిస్తే మల్టీప్లెక్స్ యజమానికి 50 శాతం, డిస్ట్రిబ్యూటర్ 50 శాతం తీసుకుంటున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కేవలం షోల ఆధారంగానే అద్దెలు చెల్లిస్తున్నారు. ఒక షో ప్రదర్శనలో హాల్ ఫుల్ అయితేనే అద్దె వస్తోందని, ఫుల్ కాకపోతే రెవెన్యూలో 40 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని.. అలా కాకుండా మల్టీప్లెక్స్‌ల మాదిరిగా తమకు కూడా పర్సంటేజీలు ఇవ్వాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. -
సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు
-
అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు
-
అధికారం ఉంది కదా అని అడ్డంగా నడుస్తున్నారా?
ఏపీలోని సినిమా థియేటర్లపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే కక్ష సాధింపు చర్యలు కొనసాగడం గమనార్హం. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ థియేటర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేనకు సంబంధించిన వారి థియేటర్లలోకి తనిఖీలు పేరుతో వెళ్లినా అక్కడ తూతూ మంత్రంగానే సోదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో అధికారులకు తనిఖీల ఆదేశాలు వెళ్లాయి.మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ నేపథ్యంలో తనిఖీలు షురూ చేశారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ పవన్ ద్వంద్వ వైఖరి అనేది ప్రధానంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.కూటమి నేతల థియేటర్లలో తనిఖీలు ఏవి?డిప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశాలు సరే కానీ, ఇక్కడ ఎవరి థియేటర్లని తనిఖీలు చేయాలనే ఆదేశాలు కూడా ఆఫ్ ద రికార్డు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో టీ\డీపీ, జనసేన నేతల థియేటర్ల వైపు అదికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒకవేళ ఆ థియేటర్లకు పొరపాటున వెళ్లినా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకేసారి ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రధానంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ లీజుకు తీసుకున్న థియేటర్లలోనే తనిఖీలు ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తోంది.కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. మరి అప్పట్నుంచి థియేటర్లలో ఎందుకు తనిఖీలు చేపట్టలేదనేది ప్రధాన ప్రశ్న. థియేటర్లలో పారిశుధ్యం బాగా లేదని, తినుబండారాలు ధరలు ఎక్కువగా ఉన్నాయని, కొంతమంది గుత్తాధిపత్యం నడుస్తోందని ప్రధానంగా ప్రస్తుతం వినిపిస్తున్నమాట. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఈ తనిఖీలు నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.బంద్ కుట్ర చేసింది జనసేన నేతని తేలినా..సినిమా థియేటర్ల బంద్ డ్రామాకు తెరలేపింది జనసేన నేత అని తేలినా, థియేటర్లలో తనిఖీలు మాత్రం ఆగడం లేదు. కక్ష గట్టి థియేటర్లలో తనిఖీలు చేసేస్తున్నారు. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల థియేటర్లలోనే తనిఖీలు చేస్తున్నారు. టీడీపీ నేతల చేతుల్లో అత్యధికంగా సినిమా థియేటర్లు ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. టీడీపీ, జనసేన నేతల థియేటర్లలో తనిఖీలు చేపట్టకుండా కొందరిని మాత్రమే టార్గెట్ చేసి తనిఖీలు చేస్తున్నారు.సినిమా వాళ్ల పట్ల, సినిమా పట్ల ప్రభుత్వ జోక్యం ఏమిటని గతంలో ఊగిపోయిన పవన్.. ఇప్పుడు మాత్రం రగిలిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే ఇప్పుడు ‘రగులుతోంది మొగలి పొద’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నటుడు పవన్. అధికారం ఉంది కదా అని అడ్డంగా వెళ్లిపోయినా నడుస్తుందని మన డిప్యూటీ అనుకుంటున్నట్లు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
AP: సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారుల తనిఖీలు
-
పవన్ కథ అడ్డం తిరిగింది.. మహానాడులో మాయమాటలు
-
హరిహర వీరమల్లు ‘ఐటమ్ సాంగ్’ వచ్చేసింది
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu ). ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘తార తార నా కళ్లు..వెన్నల పూత నా ఒళ్లు’ అంటూ సాగే ఈ పాటకి శ్రీహర్ష లిరిక్స్ అందించగా, లిప్సిక, ఆదిత్య అయ్యంగార్ ఆలపించారు. నిధి అగర్వాల్ తన అందాలతో ఆకట్టుకుంది. -
ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన హస్తం
సాక్షి,విజయవాడ: ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన హస్తం ఉన్నట్లు తేలింది. ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) ప్రధాన అనుచరుడు, జనసేన నేత అత్తి సత్యనారాయణ బంద్ కుట్రకు పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. పార్టీకి మరక అంటకుండా హడావిడిగా సత్యనారాయణపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది .రాజమండ్రి సిటీ జనసేన ఇన్ ఛార్జ్‌గా ఉన్న సత్యనారాయణను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. బంద్ ప్రతిపాదన నిజమా..? అబద్ధమా..? తేలేవరకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ వేముల పాటి అజయ్ కుమార్ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘హరి హర వీరమల్లు’ మూవీ విడుదల సమయంలో థియేటర్ల బంద్ విషయం తెరపైకి వచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ సినీపెద్దలపై, థియేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల బంద్ అంశంలో ఆ నలుగురు పెద్దలను విచారించాలని మంత్రి దుర్గేష్ హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. అయితే ఇప్పుడు ఆ కుట్ర చేసింది దుర్గేష్ అనుచరుడే అని నిర్ధారణయ్యింది. ఫలితంగా తాము ప్రజల్లో అభాసుపాలయ్యామంటూ జనసేన నేతల్లో కలవరం మొదలైంది. -
విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన
-
సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్
-
థియేటర్లకు పవన్ మళ్లీ వార్నింగ్
విజయవాడ: కూటమి ప్రభుత్వంపై సినీ పరిశ్రమకు కనీస మర్యాద, కృతజ్ఞతలు లేవంటూ ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్.. థియేటర్లు తమ బంద్ నిర్ణయాన్ని విరమించినా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ మేరకు థియేటర్లకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్.సినిమా హాళ్లలో ధరలపై విచారణ జరపాలంటూ ఆదేశించారు ఈ మేరకు మంత్రి దుర్గేష్ తో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. సినిమాహాళ్ల బంద్ నిర్ణయంపై సైతం విచారణ జరిపించాలని ఆదేశించారు. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ ధరలపై విచారణకు ఆదేశించారు.తన శాఖకు సంబంధం లేకపోయినా విచారణకు ఆదేశించడం గమనార్హం. దీనిలో భాగంగా పవన్ కల్యాణ్ కార్యాలయం మరోసారి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో సినిమా టికెట్ల ధరల పెంపునకు రావొద్దని హెచ్చరించింది. ఒకవేళ టికెట్ల ధరలు పెంచాలంటే ఫిలిం చాంబర్ ద్వారా రావాలని ఆదేశాల్లో పేర్కొంది. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని ఆదేశాల్లో డిప్యూటీ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది.మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర ఫిలిం డెవలప్ మెంట్ పాలసీ తేవాలని నిర్ణయించారు. గతంలో సినిమా రంగంపై ప్రభుత్వం జోక్యం ఏంటంటూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వరుస పెట్టి ఇండస్ట్రీని వేధింపులకు గురి చేయడం చర్చనీయాంశమైంది. సినిమా ఇండస్ట్రీని లొంగదీసుకుని విచారణకు ఆదేశాలు జారీ చేయడం ఏంటనే విమర్శ వినిపిస్తోంది. గతంలో టికెట్ల ధరలను నియంత్రించిన సందర్భంలో సైతం అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. ఇలా పవన్ ద్వంద్వ వైఖరి ఏమిటనే విశ్లేషకులు చురకలు అంటిస్తున్నారు. అప్పుడు ఆ రకంగా ఊగిపోయారు.. ఇప్పుడు ఈ రకంగా లొంగదీసుకోవాలని చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
'ఓజీ'లో నారా రోహిత్ కాబోయే సతీమణి
పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'లో నారా ఫ్యామిలీకి కాబోయే కోడలు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు నారా రోహిత్‌కు కాబోయే సతీమణి శిరీషా (శిరీష లేళ్ల) ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో నటించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాదిలో నిశ్చితార్థం జరిగింది. త్వరలో ఏడడుగుల బంధంతో ఒకటి కానున్నారు. భైరవం సినిమాతో నారా రోహిత్, ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. సినిమాలపై మక్కువతో ఆమె హైదరబాద్‌లోని తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమా ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా నారా రోహిత్‌తో ప్రతినిధి2లో అవకాశం దక్కింది. అలా వారి పరిచయం కాస్త పెళ్లి వైపు అడుగులు పడ్డాయి. వివాహానికి ఇంకా సమయం ఉండటంతో ఆమె పలు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓజీలో ఛాన్స్ దక్కడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. -
షాడో సీఎం లోకేష్.. సకల శాఖ మంత్రిగా నియామకం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీలో ఒకప్పటి క్రియాశీలక నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబే తీసుకుంటున్నారా? లేక ఆయన ఇంకెవరైనా ఉన్నారా? అనే సందేహమూ వ్యక్తమైంది ఆయన్నుంచి!. అలాగే.. అమరావతి కోసం మరిన్ని భూములు సేకరించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్నీ తీవ్రంగా తప్పుపట్టారు ఆయన. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలంలోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం.. అదే సందర్భంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం!. వాస్తవానికి వడ్డే టీడీపీకి పెద్ద వ్యతిరేకి కాదు.. వైఎస్సార్సీపీ మద్దతుదారు కూడా కాదు. వయసు కారణంగా సీరియస్ రాజకీయాలు చేయని ఈయన అప్పుడప్పుడు కొన్ని అంశాలపై మాత్రం స్పందిస్తున్నారు. తాజాగా ఆయనకు చంద్రబాబు తెలివిపై అనుమానం వచ్చింది. ఆయనతో సంబంధం లేకుండా ఎవరో నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారు. అదెవరో చెప్పడానికి ఆయన సిద్ధపడలేదు కానీ.. బాబుగారి సుపుత్రుడు, మంత్రి లోకేశ్ అన్నది బహిరంగ రహస్యమే!. ఇటీవలి పరిణామాలు, మీడియా కథనాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి!. చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రి.. ప్రభుత్వాన్ని నడుపుతున్నది నారా లోకేశ్(Nara Lokesh) అన్నది తాజా కథనాల సారాంశం. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచకం మొదలైంది కూడా లోకేశ్ నేతృత్వంలోనే అనేది అందరికీ తెలిసిన విషయం. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో పేరుతో చెత్త ఏరివేత వంటివి ముఖ్యమంత్రి చూసుకుంటుంటే.. లోకేశ్ ఏమో తన శాఖతో సంబంధం లేని కార్యక్రమాలకూ ముఖ్య అతిథిగా హాజరవుతుండడం వడ్డే వంటి వారికి అనుమానాలు వచ్చేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి!. గుంతకల్లు సమీపంలోని బేతేపల్లి వద్ద 22 వేల కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ రెన్యుబల్ ఎనర్జీ ప్రాజెక్టుకు లోకేశ్ శంకుస్థాపన చేయడం పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉండగా ఆమోదం పొందింది. ఇప్పుడు శంకుస్థాపన దశకు చేరుకుంది. అది వేరే సంగతి. ఈ ఇంధన ప్రాజెక్టుకు లోకేష్ మంత్రిత్వ శాఖలకు సంబంధం లేదు. అయినా ఇంత భారీ పెట్టుబడి పెట్టే ప్రాజెక్టుకు సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో శంకుస్థాపన జరుగుతుంది. అందులోను చంద్రబాబు ఇలాంటి అవకాశాన్ని వదులుకోరు. కాని అక్కడకు ఆయన వెళ్లలేదు. అదే టైమ్ లో కర్నూలు వద్ద స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ పేరుతో జరిగిన ఒక చిన్న ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ఉపన్యాసం చేశారు. ఊళ్లలో చెత్త ఎత్తుతున్నారా? అన్న ప్రశ్నలతోపాటు రోడ్లపై కూరగాయలు అమ్మే వారిని, బడ్డీ కొట్ల వారిని పలకరిస్తూ కాలక్షేపం చేయడం అందరిని విస్తుపరచింది. కొద్దిరోజుల క్రితం తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమ యూనిట్‌కు కూడా లోకేశే భూమి పూజ చేశారు. ఈ మధ్యకాలంలో లోకేశ్ తన ఇంటిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారట!. ఇందులో రాష్ట్రం అంతటి నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలను తీసుకుంటున్నారట. మంగళగిరిలో తన పేరు మీద ‘‘మన ఇల్లు- మన లోకేశ్’’ ఒక కార్యక్రమాన్ని కూడా నడుపుతున్నారు. ఆర్థిక శాఖ విషయాల్లోనూ లోకేశ్ జోక్యం పెరుగుతోందని, నిధుల విడుదల వంటివి కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో టెండర్ల ఖరారు, ఇతర వ్యవహారాలు కూడా లోకేశే చూసుకుంటున్నారని సచివాలయం వెళ్లివచ్చిన ఒక ప్రముఖుడు చెప్పారు. సచివాలయంలో, పార్టీ కార్యాలయంలోనూ లోకేశ్ హవానే నడుస్తోందంటున్నారు. ఇక ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భార్య నారా బ్రాహ్మణితో ప్రత్యేకంగా కలవడం తెలిసిందే.చంద్రబాబు మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) పరిస్థితి కూడా ఏమీ భిన్నంగా లేదు. డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి హోదాలోని పవన్ కల్యాణ్ సైతం పన్నెత్తు మాట అనలేకపోతున్నట్లు ప్రచారం. తాను ఉప ముఖ్యమంత్రి కాకుండా పవన్ అడ్డుపడ్డారని లోకేశ్ భావిస్తున్నారు. మరోవైపు పవన్ చంద్రబాబు 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కొన్ని సందర్భాల్లో చెప్పినా అది మొక్కుబడి మాట మాత్రమే. చంద్రబాబు తన కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడితో లోకేశ్‌ను డిప్యూటీ చేసినా పవన్ చేసేదేమీ ఉండదు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ఎవరైనా తనను కలిసేందుకు వస్తే చినబాబు (మంత్రి లోకేశ్)ను కలవమని చెబుతుండే వారు. విపక్షంలో ఉండగా లోకేశ్ ‘యువగళం’ యాత్రలో పార్టీ అధ్యక్షుడితో సంబంధం లేకుండా సొంతం పలు హామీలు గుప్పించారు కూడా. అయితే.. 2024లో అనూహ్యంగా అధికారం దక్కడంతో ఆయన రెడ్ బుక్ అమలుకు ఒక ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. లోకేష్ హోం మంత్రి కాకపోయినా ఆ శాఖ మొత్తం ఆయన అధీనంలోనే ఉందని అంటారు. లోకేశ్‌ను ఇప్పటికే కొంతమంది సకల శాఖల మంత్రిగా వ్యాఖ్యానిస్తున్నారు. తాజా మహానాడులో లోకేష్‌ను పార్టీ వర్కింగ్ అధ్యక్షుడిగా చేయవచ్చన్నది ఒక టాక్. అదే జరిగితే ప్రభుత్వంతో పాటు, పార్టీ కూడా పూర్తిగా ఆయన చేతిలోకి వెళ్లిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబే ఒక బ్రాండ్ అని లోకేశ్ చెబుతుండొచ్చు. కానీ.. ఆ పేరుతో ఆయన తన సొంత బ్రాండ్‌ను నిర్మించుకుంటున్నారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో చంద్రబాబుపై కుటుంబపరమైన ఒత్తిడి ఉందని అంటారు. కానీ ఆయన ఎందువల్లో ఆ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనే భయమూ ఉండి ఉండవచ్చు. పవన్ కల్యాణ్‌ను గుడ్ హ్యూమర్లో ఉంచడానికి చంద్రబాబు,లోకేష్ లు ప్రయత్నిస్తున్నారు. దానికి పవన్ కూడా సంతృప్తి చెంది.. ప్రభుత్వపరంగా ఏ అరాచకం జరుగుతున్నా, ఎన్ని తప్పులు చోటు చేసుకుంటున్నా నోరు మెదపడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు అధికారికంగా పట్టాభిషేకం జరగలేదు కాని, అటు ప్రభుత్వం, ఇటు పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుని చంద్రబాబును నామమాత్రంగా చేశారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడడం విశేషం.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏడాదిగా దగా.. ఏం సాధించారని సంబరాలు?
తాము అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగించడంతోపాటు అంతకంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తానంటూ ప్రతి ఎన్నికల సభలోనూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఏడాదిగా కొత్తవి ఒక్కటి కూడా అమలు చేయకపోగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ.1.37 లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారు. అన్ని అప్పులు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదు. హామీలను ఎగ్గొట్టి.. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రెడ్‌బుక్ కుట్రలతో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు.ఇసుక,గనులు,మద్యం దాకా ఎల్లో సిండికేట్ సహజ వనరులను దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది. టీడీపీ కూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, ఆసరా తదితర పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లను డీబీటీ రూపంలో వైఎస్ జగన్ నేరుగా పారదర్శకంగా అందించి ఆదుకున్నారనే చర్చ గ్రామ గ్రామాన జరుగుతోంది. - సాక్షి, అమరావతి ఇది రద్దుల ప్రభుత్వం..వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, పథకాలను టీడీపీ కూటమి సర్కారు రద్దు చేసి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసింది. ఫీజుల పథకానికి చెదలు పట్టించింది. ఆరోగ్యశ్రీని అటకెక్కించింది. రైతన్నలకు పెట్టుబడి సాయం అందించకుండా అప్పుల పాలు చేసింది. చదువుకునే పిల్లలు, రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులను మోసగించి వంచించింది. 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేసింది. ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడంతో 9,280 మంది ఆపరేటర్లు వీధుల పాలయ్యారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకత కోసం తెచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి తమ సన్నిహితులు, బినావీులకు పనులు అప్పగిస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది. 2019–24 మధ్య సంక్షేమం, అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని వైఎస్ జగన్ ప్రగతిపథంలో నిలిపారు.నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. 2023–24లోనే ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు కూటమి సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేస్తోంది. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు చొప్పున అందిస్తామని నమ్మబలికారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని.. ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంత మందికీ అందచేస్తామని చెప్పారు. అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు.ఆడబిడ్డ నిధి కింద 19 – 59 ఏళ్ల లోపు మహిళలకు ఏడాదికి రూ.18 వేలు చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని.. వారు నెలకు రూ.50 వేలు సంపాదించేలా ఆదాయ మార్గాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈమేరకు బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నేతలు ప్రతి ఇంటికీ బాండ్లు పంపిణీ చేసి నమ్మించారు. సూపర్ సిక్స్‌తోపాటు మొత్తం 143 హామీలను టీడీపీ–జనసేన కూటమి ఇచ్చింది. వాటి అమలు బాధ్యత తనదేనంటూ పవన్ కళ్యాణ్ భరోసానిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ పూర్తి మోసాలుగా మిగిలాయి. జాబ్ క్యాలెండర్ హుష్‌కాకి..వైఎస్సార్సీపీ హయాంలో ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను యువతకు ఇచ్చారు. 2019–24 మధ్య శాశ్వత, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 6,38,621 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక ఎంఎస్ఎంఈ (సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ద్వారా 30.99 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా జాబ్ కేలండర్ ఊసే లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు.సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపేందుకు నిర్ణయించి గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం తలపెట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ దాదాపు 1,000 పోస్టుల భర్తీకి అనుమతించినా కూటమి సర్కారు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. డీఎస్సీ పేరుతో ఏడాదిగా డ్రామాలాడి విచిత్ర నిబంధనలతో అర్హులైన డీఈడీ, బీఈడీ జనరల్ అభ్యర్థులు 3 లక్షల మందిని పరీక్షకు దూరం చేశారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై విషం.. రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై చంద్రబాబు దారుణమైన అబద్ధాలను ప్రచారం చేశారు. భూములు లాక్కునేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని, భూములకు రక్షణ లేదని, రిజిస్ట్రేషన్ దస్తావేజులు ప్రభుత్వం వద్దే ఉంటాయని ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చే క్రమంలో దేశంలోనే మొదటిసారిగా భూముల రీ సర్వే నిర్వహించింది. భూములను జియో ట్యాగింగ్ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. డ్రోన్, విమానాలతో కోటి ఎకరాలను కొలిచారు. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో టైటిల్ గ్యారంటీ కల్పించేందుకు టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు తన రాజకీయ కుట్రలకు దీన్ని వేదికగా మార్చుకున్నారు.ఎడాపెడా అప్పులు.. రెడ్‌బుక్ టెర్రర్వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిందని.. రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేసిందంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలను వండివార్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లు అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని చెప్పించారు. గతేడాది నవంబర్ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు.కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దుష్ఫ్రచారం చేసూ్తనే వచ్చారు. నిజానికి గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు మొత్తం కలిపి 2024 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.7,21,918 కోట్లే. ఇందులో విభజన జరిగే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి రాష్ట్ర అప్పు రూ.1,47,717 కోట్లు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.3,90,247 కోట్లకు చేరుకుంది. అంటే 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు. ఆ ఐదేళ్లలో ఏటా 22.63 శాతం అప్పులు పెరిగాయి (సీఏజీఆర్).వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.7,21,918 కోట్లు. అంటే 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. ఆ ఐదేళ్లలో ఏటా సగటున 13.57 శాతం మాత్రమే అప్పులు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రూ.1,37,546 కోట్లు అప్పు చేసింది. అంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 41 శాతాన్ని చంద్రబాబు కూటమి సర్కార్ ఒక్క ఏడాదిలోనే చేసింది. డైవర్షన్ పాలిటిక్స్..సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల ఎగవేత.. పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. పచ్చమూకల నరమేథాన్ని దేశానికి చాటిచెప్పేందుకు గతేడాది జూలై 24న వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగితే దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లెలో అగ్ని ప్రమాదం పేరుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారు.విజయవాడలో వరదల నియంత్రణలో కూటమి సర్కారు వైఫల్యంతో 50 మందికిపైగా బలయ్యారు. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్సీపీ నేతలు పడవలతో ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టారంటూ దారుణమైన అబద్ధాలను చంద్రబాబు ప్రచారం చేశారు. తన వంద రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ సెప్టెంబరు 18న సీఎం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. మాఫియా రాజ్యం..వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తక్కువ ధరలకు ఇసుకను సరఫరా చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది వర్షాకాల అవసరాల కోసం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పచ్చ ముఠాలు మాయం చేశాయి. ఉచితం ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టిన ఇసుక మాఫియా పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి అధిక ధరలకు అమ్ముకుంటూ భారీ ఎత్తున దోచేస్తోంది.గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ పెద్దలు దుష్ప్రచారం చేస్తూ నాడు అధికారులుగా పని చేసిన వారిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. లిక్కర్, సిలికా, లేటరైట్, క్వార్ట్జ్ వరకూ వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. అత్యంత విలువైన భూములను సన్నిహితులు, బినావీులకు దోచిపెడుతున్నారు. ఊరూపేరూ లేని ఉర్సాకు 99 పైసలకే ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని విశాఖలో కట్టబెడుతున్నారు. లూలూ మాల్ పేరుతో విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండటం భూదోపిడీకి పరాకాష్ట.దుష్ప్రచార కుట్రలు బట్టబయలు..ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి 2.60 లక్షల మందిని నియమించారు. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే ఇంటివద్దే పెన్షన్ల నుంచి అన్ని రకాల పౌర సేవలను వలంటీర్ల ద్వారా ప్రభుత్వం అందించింది. కరోనా మహమ్మారి సమయంలో వలంటీర్ల సేవల పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో ఆ వ్యవస్థపై అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్మారు. వలంటీర్ల ద్వారా 33 వేల మంది మహిళలను మాయం చేసి అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిరాధార ఆరోపణలు చేశారు. అయితే 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు 34 మాత్రమే నమోదు అయ్యాయని.. 46 మంది బాధితులని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్ 16న అసెంబ్లీలో వెల్లడించడం గమనార్హం.చదవండి: దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ 'బూటు' దెబ్బప్రశ్నించే గొంతులు నొక్కుతూ..చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 390 మంది హత్యలకు గురయ్యారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు బనాయించి 500 మంది నాయకులు, కార్యకర్తలను జైళ్లకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలు 440 మందిపై అక్రమ కేసులు బనాయించి 79 మందిని జైలుకు పంపారు. 11 మంది జర్నలిస్టులపై దాడులు చేశారు. జర్నలిస్టులపై 63 అక్రమ కేసులు బనాయించి 8 మందిని జైలుకు పంపారు. ప్రజాసంఘాల నాయకులపై 73 అక్రమ కేసులు పెట్టి ఇద్దరిని జైలుపాలు చేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198 నమోదయ్యాయి.ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నాంగత ప్రభుత్వంతో పోల్చితే కూటమి సర్కారు పాలన ఏం బాలేదు. అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత లాంటి సంక్షేమ పథకాలేవీ అమలు కావడం లేదు. చేయడానికి పనులు దొరకడం లేదు. ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. అది ఆచరణలో ఎక్కడా అమలు జరగడం లేదు. మా కుటుంబానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా, డ్వాక్రా రుణమాఫీ వచి్చంది. 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు అవేవీ లేవు. ఇప్పటి వరకూ ఇవ్వని కూటమి ప్రభుత్వం ఇకపై వచ్చే నాలుగేళ్లలో ఇస్తుందనే నమ్మకం లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎన్నికలు వచ్చి ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నాం. – బయ్యే నాగవిజయబాబు, శెట్టిపేట, తూర్పు గోదావరి జిల్లాకూటమి సర్కారు ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుతో పాటు శెట్టిపేట, తాళ్లపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద, కృష్ణాపురం, కొమ్ముగూడెం తదితర చోట్ల వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు ఇలా..⇒ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు జ్యోతి కాలనీలో నివసించే దిద్దే ఆనంద్‌కుమార్ భవన నిర్మాణ కార్మికుడు. విధి వక్రీకరించి ఆర్నెల్ల క్రితం పక్షవాతం బారిన పడటంతో రెండు కాళ్లూ పనిచేయడం లేదు. వికలాంగ పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. ఏడాదిగా ఇలా ఎంతో మంది పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.⇒ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఉంటున్న సీలి విజయకు గత ప్రభుత్వంలో ఇంటి స్థలం వచ్చింది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా రుణం ఇవ్వడం లేదని, కనీసం డ్వాక్రా రుణాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదనగా చెబుతోంది. వలంటీర్‌గా పనిచేసే తన కోడలిని తొలగించారని, మనవళ్లకు అమ్మ ఒడి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏడాదిలో ఏమీ చేయని ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో చేస్తుందని నమ్మకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.⇒ పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద గ్రామంలో పొలానికి నీరు పెడుతున్న ఈ రైతు పేరు యాతం రామాంజనేయులు. పంట కోత దశకు వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక తడి అందక పంట ఎండిపోయింది. కౌలుకి తీసుకున్న మూడెకరాలకు ఎకరాకు రూ.35 వేలు చొప్పున కట్టాలి. గతంలో రైతు భరోసా వచ్చేదని, ఎకరాకు రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు పైసా కూడా ఇవ్వలేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.⇒ ‘గత ప్రభుత్వంలో నాకు చేయూత ఇచ్చేవారు. నా భర్తకు పింఛన్ వచ్చేది. నా కోడలికి అమ్మ ఒడి అందేది. నా మనవళ్లకు పుస్తకాలు, దుస్తులు ఉచితంగా ఇచ్చి మంచి భోజనం పెట్టేవారు. కరోనా సమయంలో వలంటీర్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలిచ్చింది. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు, ఒకటి ఇచ్చేశామంటున్నారు. కానీ నాకుగానీ, నా కోడలికిగానీ రాలేదు. మేమే కాదు మా ఊరిలో అందరం ఇలాగే బాధపడుతున్నాం. జగన్ ఉన్నప్పుడు రూ.10 వేలు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వడం లేదని ఆటోడ్రైవర్లు అంటున్నారు.’ – మణెమ్మ, తాళ్లపాలెం, తూర్పుగోదావరి జిల్లా. -
Dil Raju: పవన్ సినిమా ఆపాల్సిన అవసరం లేదు
-
పవన్ ప్రకటన.. బలమా? లేక భయమా?
‘‘ఒక్కసారి మంత్రి పదవి ఇచ్చి చూడు గణనాథ’’ అని ఓ పాట ఉంది. ఇప్పుడు ఈ పాటను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటారా?. ఆయన ఇప్పుడు తన పదవిని ప్రజాసేవకంటే తన అహంకార ప్రదర్శనకు, వ్యక్తులు, సినీ పరిశ్రమను బెదిరించేందుకే ఎక్కువగా వాడుతున్నట్లు స్పష్టమవుతోంది. కానీ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఆయన స్వయానా ముఖ్యమంత్రి కాదు. ఉప ముఖ్యమంత్రి మాత్రమే. రెండోది.. సినిమాటోగ్రఫీ ఆయన పరిధిలోకి రాదు. కాకపోతే ఆ శాఖ జనసేనకే చెందిన కందుల దుర్గేశ్‌ది. అంటే.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకుని తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులను హెచ్చరించారన్నమాట. ఈ అభ్యంతరకరమైన పని చేస్తున్నప్పుడు కూడా గత ప్రభుత్వం ఏదో సినీ పరిశ్రమను వేధించిందన్న అబద్ధాలను ప్రకటనలో జొప్పించారు. సినీ పరిశ్రమ వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవలేదన్నది ఆయన అభ్యంతరాల్లో ఒకటి. నిజానికి.. పరిశ్రమలో పలువురు ప్రముఖులతో (Cine Industry Biggies) చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. వారి సేవలను టీడీపీ బాగానే వాడుకుంటోంది. కానీ కొందరు కీలకమైన వ్యక్తులు పవన్‌ను మాత్రమే కలసివెళ్లారు. అయినా ఆయనలో ఏదో అసంతృప్తి! కృతజ్ఞత చూపడం లేదని ఇంకో మాట అన్నారు పవన్. ఇది అడిగి సన్మానం చేయించుకున్నట్లుగా ఉంది! తనకు తెలియకుండా ఎవరూ సినిమాలు తీయరాదన్నది పవన్ ఉద్దేశమా? లేక సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా తన చెప్పు చేతలలో ఉండాలని కోరుకుంటున్నారా? ఏది ఏమైనా... సినీ పరిశ్రమ మొత్తాన్ని బెదిరిస్తూ పవన్ బహిరంగ ప్రకటన జారీ చేయడం వారిని అవమానించడమే!. 👉వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా సినీ పరిశ్రమ తన వద్దకు వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సహా అందరినీ సాదరంగా ఆహ్వానించి, చర్చలు జరిపి, వారి కోర్కెలు తీర్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు పవన్ మాత్రం థియేటర్లలో సదుపాయాలు తనిఖీ చేస్తాం.. టిక్కెట్ రేట్ల పెంపుదల గురించి ఎవరూ తమ వద్దకు వ్యక్తులుగా రావద్దు.. ధరలు పెంచాక దానికి తగ్టట్లే ఆదాయం ప్రభుత్వానికి వస్తోందా? లేదా? అన్నది చూస్తాం.. అంటూ బెదిరిస్తున్నారు. ఏది కరెక్ట్? పైగా.. పవన్ ఏ అధికారంతో ఇలాంటి ప్రకటనలు చేశారు? ప్రభుత్వ విధానాన్ని ఆయన చెప్పి ఉంటే.. వచ్చే నెలలో విడుదల కానున్న ఆయన సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)కు సంబంధించి రేట్ల పెంపుదల వ్యక్తిగతంగా కోరకుండా ఉంటారా?. ఇకపై ఆయా సినిమా విభాగాలతోనే మాట్లాడతామని పవన్ చెప్పిన మాట తనకు, తన సినిమాలకు కూడా వర్తిస్తుందా? లేదా?. తన సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా చేస్తున్నారా?. థియేటర్ల వారు, డిస్ట్రిబ్యూటర్లు పర్సెంటేజ్ పద్దతి పెట్టాలని, అద్దె ప్రాతిపదికన అయితే తమకు నష్టం వస్తోందని అంటున్నారు. అందులో హేతుబద్దత ఎంత? సమస్యలుంటే పరిష్కరించాలి కాని ఎవరినో దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ ఎందుకు ఈ రకంగా ప్రకటనలు చేస్తున్నారు? సినిమా జయాపజయాలపై ఆందోళనతోనా?. 👉వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని ఇప్పటికే పవన్ కల్యాణ్ సినిమా ఫ్లాఫ్ అన్నారు. రాజకీయం, సినిమా కలిసినప్పుడు సహజంగానే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీని నోటికి వచ్చినట్లు దూషించి, పలు ఆరోపణలు గుప్పించినప్పుడు వారు చూస్తూ ఉండలేరు కదా!. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పుకోవాలి. మంత్రిగా ఉంటూ పూర్తిస్థాయిలో సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి ఒక్క పవన్ కల్యాణే!. కొన్నేళ్ల క్రితమే భారీ అడ్వాన్స్ లు తీసుకుని కొన్ని సినిమాలు చేయడానికి ఆయన ఒప్పుకున్నారట. కానీ పవన్ ధోరణితో ఆ నిర్మాతలు నిస్సహాయంగా మిగిలిపోయారని అంటారు. కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టిన నిర్మాతలు.. పవన్ రాజకీయాల కోసం ఏళ్ల తరబడి షూటింగ్‌లు చేయకుండా ఉండిపోవాల్సి రావడంతో వారు గగ్గోలు పెడుతూ ఉండొచ్చు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతం అవుతుండొచ్చు. వీటికి తోడు.. ఇటీవల సినిమా ఫంక్షన్లలో రాజకీయ ఉపన్యాసాలు జరుగుతుండడం.. దానిపై విమర్శలు, బాయ్‌కాట్ పిలుపులు వస్తుండడంతో నిర్మాతలూ నష్టపోయారు. ఆ మధ్య నటుడు పృథ్వీ వ్యాఖ్యలతో మరో నటుడి సినిమా ఆర్థికంగా నష్టపోయింది. తాజాగా భైరవం సినిమా డైరెక్టర్ వైఎస్సార్సీపీని పరోక్షంగా విమర్శిస్తూ.. పవన్‌ను పొగుడుతూ చేసిన వ్యాఖ్య కూడా ఆ సినిమాపై వ్యతిరేక ప్రభావం చూపించేలా ఉంది. నిజానికి పార్టీలకు, కులాలకు అతీతంగా ఉండవలసిన సినిమా రంగం వివాదాస్పద వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నారనిపిస్తోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపనతో.. సినిమాలు, రాజకీయం కలసిపోవడం ప్రారంభమైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పతాక స్థాయికి చేరిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశంతో కలిసిన తర్వాత అది మరింత చికాకుగా మారింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రాల్లో నటించారు. అవి అంతగా సక్సెస్ కాలేదు. కానీ ప్రతిపక్షంలో ఉండగా నటించిన మేజర్ చంద్రకాంత్ సూపర్ హిట్! అధికారాన్ని అనుభవిస్తున్న పవన్‌కూ ఈ భయం (Pawan Cinema Fear) కూడా పట్టుకుని ఉండాలి!!.ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ పనితీరు అంత సంతృప్తికరంగా లేదని చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన రేటింగ్ చెబుతోంది. ఇప్పుడు సినిమాలు బాగా నడిస్తే ఫర్వాలేదు. లేదంటే తన విలువ బాగా తగ్గే అవకాశం ఉంది. పవన్ ఎంత విధేయుడిగా ఉన్నా.. టీడీపీ వారు ఎక్కువమంది ఈయన వైఫల్యాన్నే కోరుకుంటూ ఉంటారు. అలాగైతేనే పవన్ తమకు అణగిమణగి ఉంటారన్నది వారి ఆలోచన. పవన్ దూషణల కారణంగా వైఎస్సార్సీపీ వాళ్లు ఆయన సినిమాను ఆదరించడం కష్టమే. బహుశా పవన్‌ను ఈ భయాలన్నీ వెంటాడుతున్నాయేమో!. ఈ దశలో సినిమా థియేటర్ల బంద్ చేస్తామని హెచ్చరించడం వెనుక ఏదో ఉందని భావించినట్లు ఉన్నారు. వెంటనే తన పార్టీకి చెందిన మంత్రి దుర్గేశ్‌తో ఒక ఆదేశం ఇప్పించారు. ఈ బంద్ పిలుపు వెనుక ఎవరు ఉన్నారో? కనిపెట్టాలని ఆయన హోంశాఖను కోరారట. బహుశా ఇలా బెదిరింపు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నాం. అక్కడితో ఆగకుండా పవన్ కల్యాణ్ తొందరపడి ఒక భారీ ప్రకటన జారీ చేశారు. ఎవరిమీద కోపం ఉందో నేరుగా చెప్పలేదు కానీ... పరోక్షంగా కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. 👉ప్రముఖ నిర్మాత ఆయన బంధువైన అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, దిల్ రాజు వంటి కొద్ది మంది చేతిలోనే అత్యధిక థియేటర్లు ఉన్నాయని చెబుతారు. అల్లు అరవింద్, ఆయన కుమారుడు అల్లు అర్జున్‌లతో పవన్‌కు అంత మంచి సంబంధాలు లేవన్న చర్చ కూడా ఉంది. అందువల్లే భయపడో? మరే కారణమో తెలియదు కాని అరవింద్ ఒక్కరే పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. తనకు ఇప్పుడు థియేటర్లు లేవని చెప్పు కోవచ్చు కాని, పవన్ సినిమా విడుదలకు ముందు బంద్ అంటూ దుస్సాహసం చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది మరో నటనగా కనిపిస్తుంది. సినీ రంగంపై ఆధిపత్యం కలిగిన ఈ ముగ్గురు, నలుగురు థియేటర్లను లీజ్ కు తీసుకుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ ఈ లీజు అంశాలను కూడా ప్రస్తావించి వారు పన్నులు కడుతున్నారా? లేదా? థియేటర్లలో సదుపాయాలు ఉన్నాయా? లేదా? తదితర అంశాలను తనిఖీ చేయాలని ఆదేశించారట. ఇంత బహిరంగంగా సినిమా వారిని అదే రంగానికి చెందిన మంత్రి బెదిరించడం ఇప్పుడే చూస్తున్నాం. అంటే పవన్ తన సినిమా విడుదల టైమ్‌లో ఈ వివాదం రాకపోతే.. థియేటర్లు పన్ను కట్టకపోయినా, సదుపాయాలు కల్పించకపోయినా, తినుబండారాలు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మినా ఫర్వాలేదన్న మాట!. 👉వైఎస్ జగన్(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో ‘‘సినిమా వాళ్ల గురించి మాట్లాడడానికి, రేట్లు నిర్ణయించడానికి, మా ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకోవడానికి అనుతించకపోవడానికి నువ్వు ఎవరికి?’’ అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్... ఇప్పుడు వాటన్నిటినపై తనకే అధికారం ఉన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు?. గతంలో బ్లాక్ టిక్కెట్ల విక్రయం లేకుండా చూడడాన్ని కూడా ఆక్షేపించించడం విడ్డూరమే అనిపిస్తోంది. ప్రస్తుతం కౌంటర్లలో టిక్కెట్లు ఎంతకు అమ్ముతున్నారో కూడా చూడాలని అధికారులకు ఈయన చెప్పారట. పవన్ మరో విచిత్రమైన వాదన చేస్తున్నారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా కోసం ఆయన ఆలోచన చేస్తున్నారట. దాన్ని కూడా పట్టించుకోకుండా సినిమా వారు తనకు బంద్ అంటూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారట. నిజానికి సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడం అంత తేలిక కాకపోవచ్చు. ఎందుకంటే ఇదేమీ రెగ్యులర్‌గా పనిచేసే రంగం కాదు. పర్మెనెంట్ స్టాఫ్ కూడా ఉండరు. వీరి రెమ్యునరేషన్లపై ఎవరి కంట్రోల్ ఉండదు. పరిశ్రమ హోదా ఇస్తే ప్రభుత్వం నుంచి తమకు కావల్సినవారికి నిధులు ఇచ్చుకోవచ్చని ఎవరైనా చెప్పారేమో తెలియదు. ఏపీలో షూటింగ్ చేస్తే రాయితీలు ఇస్తామని జగన్ చెబితే తప్పని ప్రచారం చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దికి ఏమీ చేయకపోగా.. వారి అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం ఏమిటో?. బంద్ ఆలోచన చేయడం లేదని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ ప్రకటించినా, పవన్‌లో ఏదో ఆందోళన ఉన్నట్లే కనిపిస్తోంది. అందుకే అధికార దుర్వినియోగం చేస్తున్నారా?. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాలకృష్ణతో పవన్ పోరు.. వార్ తప్పదు
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ (ఓజీ), బాలకృష్ణ (అఖండ 2) విడుదల కానున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద మొదటిసారి పవన్‌తో బాలయ్య పోటీ పడనున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య మరోసారి బాక్సాఫీస్ లెక్కలపై చర్చ జరగనుంది. దసరా విజేతగా ఎవరు నిలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'సాహో'(Saaho) సినిమా తర్వాత ఆరేళ్లకు దర్శకుడు సుజిత్ (Sujith) తెరకెక్కిస్తున్న చిత్రం 'ఓజీ'.. పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా ఈ చిత్రం రానుంది. దీంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ కూడా మంచి అంచనాలే పెట్టుకున్నారు. మరోవైపు అఖండకు సీక్వెల్‌గా బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో అఖండ2 రానుంది. ఇప్పుడు రెండు సినిమాలు ఒకేరోజున విడుదల కానున్నట్లు ప్రకటన రావడంతో కలెక్షన్స్ పరంగా ఇద్దరికీ నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త (Samyuktha) నటిస్తోంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ చరిత్రలో భారీ అంచనాల మధ్య ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి.'ఓజీ' సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పవన్ కల్యాణ్ కొంత కాలంగా ఎన్నికల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఆగిపోయింది. దీంతో మొదట అనుకున్న బడ్జెట్ కాస్త పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా ఓజీ నిర్మాణం కోసం రూ. 250 కోట్లు పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. మరోవైపు అఖండ2 కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ చిత్రం కూడా రూ. 200 కోట్లతో తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇలా అత్యంత బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాలు ఒకేరోజు విడుదలైతే తప్పకుండా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు రావచ్చు. -
ఆ నలుగురిలో నేను లేను
సాక్షి, హైదరాబాద్: ‘రెండ్రోజుల నుంచి ఆ నలుగురు.. ఆ నలుగురు అని వినిపిస్తోంది. ఆ నలుగురుకి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. పదిహేనేళ్ల క్రితం ఆ నలుగురు అని మొదలైంది. ఆ తర్వాత ఆ నలుగురు కాస్తా పదైంది. అది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ పది మంది దగ్గర థియేటర్లు ఉన్నాయి. ఆ నలుగురి వ్యాపారంలో నేను లేను. కోవిడ్ టైమ్ నుంచే నేను బయటకు వచ్చాను. తెలుగు రాష్ట్రాల్లో 1,500 థియేటర్లు ఉన్నాయి. కానీ.. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక్క థియేటర్. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్నింటినీ వదిలేసుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం 15లోపు థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. వీటి లీజులు అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయొద్దని నా సిబ్బందితో చెప్పాను. పాత అలవాటు ప్రకారం ఆ నలుగురిలో నా ఫొటోను వాడుకుంటున్నారు. నన్ను విమర్శిస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఆ నలుగురు న్యూస్‌లో నన్ను కలపకండి. నేను వాళ్లలో లేను. వారితో వ్యాపారంలో లేను’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం థియేటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సెక్టార్స్‌లో థియేటర్ల రెవెన్యూ షేరింగ్, థియేటర్స్‌లో అద్దె చెల్లింపులు వంటి అంశాల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ను మూసివేస్తారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించిన విధానం చాలా సమంజసంగా ఉందని నాకనిపించింది. ఇక ఈ థియేటర్స్ క్లోజ్ అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన సమావేశాలకు నేను కావాలని, ఇష్టం లేకనే వెళ్లలేదు. అలాగే నా గీతా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యక్తులు కానీ, నాతో అసోసియేట్ అయిన వ్యక్తులు కానీ ఈ మీటింగ్‌కు వెళ్లొద్దని చెప్పాను. థియేటర్స్‌కు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ కొందరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై నాకు చిరాకు కలిగి వెళ్లలేదు. థియేటర్లు మూసివేస్తున్నాం అనడం సరైంది కాదు. పవన్‌కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో థియేటర్లు మూసివేస్తామని చెప్పడం దుస్సాహసం. గతంలో అశ్వనీదత్ సినిమా విషయంలో పవన్‌ను కలిశాం. అప్పుడు ఆయన ఫిల్మ్ చాంబర్ తరపున వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలవండన్నట్టు హింట్ ఇచ్చారు. అయితే మన వాళ్లు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని విస్మరించారు. అధికారికంగా అందరం కలవాలి. కానీ కలవలేదు. ఎవరో ఇటీవల మనది ప్రభుత్వానికి సంబంధం లేని రంగం అని అంటుంటే విన్నాను. ప్రభుత్వానికి సంబంధం లేని పరిశ్రమ అయితే గత చీఫ్ మినిస్టర్‌ను సినీ పరిశ్రమలోని పెద్దపెద్ద వాళ్లంతా వెళ్లి ఎందుకు కలిశారు? ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వెళ్లి కలవకపోవడం సరికాదు. మనకు కష్టం వస్తే తప్ప మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్లమా? నిజంగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప.. ఇలా థియేటర్స్ మూసివేస్తున్నామని చెప్పడం సరికాదు’అని అరవింద్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యల్ని అరవింద్ ఖండించారంటున్న నెటిజన్లు ‘ప్రైవేట్ పెట్టుబడితో మేం సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటాదేంటి’అని గత ప్రభుత్వ హయాంలో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ వ్యాపారమైనా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఏంటి. మాది ప్రైవేట్ వ్యాపారం అనడం సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. ప్రభుత్వం కో–ఆపరేషన్ కావాలి’అంటు అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని అల్లు అరవింద్ పరోక్షంగా ఖండించినట్టు ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. తాజాగా అరవింద్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను జతచేసి సోషల్ మీడియా వేదికలపై వైరల్ చేస్తున్నారు. -
సెప్టెంబరులో ఓజీ
పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది.కాగా ‘ఓజీ’ని ఈ ఏడాది సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లుగా ఆదివారం మేకర్స్ వెల్లడించారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్. -
సినీ పరిశ్రమ వివాదంలోకి నన్ను లాగొద్దు: ద్వారంపూడి
సాక్షి, కాకినాడ జిల్లా: సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సినిమా థియేటర్ల బంద్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలొద్దు.. ఆధారాలు ఉంటే చూపించండి’’ అని తేల్చి చెప్పారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల కాకుండా తనతో పాటుగా కొంత మంది సిని నిర్మాతలు కుట్ర పన్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.‘‘నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏ మాత్రం ధ్రువీకరించు కోకుండా కొన్ని మీడియా సంస్థలు వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాజకీయాలలో ఉన్నాననే అక్కసుతో ఏదో వివాదంలోకి లాగడం ఎంత వరకు సమాంజసం?’’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. -
పవన్ నోట.. పూటకో మాట..
పవన్ కళ్యాణ్‌కు రాజకీయం అబ్బకపోయినా దాన్నుంచి లాభాన్ని ఎలా పిండుకోవాలో మాత్రం బాగానే తెలుసు. అంటే పూటను బట్టి మాటను.. రోజును బట్టి అభిప్రాయం మార్చుకోవడంలో చంద్రబాబుకన్నా నాలుగైదు ఆకులు ఎక్కువే చదివేసారు పవన్. తనకు కులం మతం లేదని చెప్పే పవన్ మర్నాడే తాను యేసును నమ్ముతానని, తన బిడ్డలకు బాప్టిజం ఇప్పించానని చెబుతారు.తనకు కులం లేదని చెప్పిన మరుక్షణమే తనకు కాపులంతా మద్దతుగా ఉండాలని డిమాండ్ చేస్తారు. గతంలో ఎన్నోసార్లు తన పరపతిని ఇమేజీని తెలుగుదేశానికి తాకట్టు పెడితే టీడీపీ నాయకులు.. కార్యకర్తలు తన తల్లిని తిట్టారని ఆవేదన చెందుతారు. ఆ తరువాతి ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ చంక ఎక్కుతారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చి ఆంధ్రులను చిన్నచూపు చూసే ఢిల్లీ బీజేపీకి తాను ఎన్నడూ మోకరిల్లేది లేదని హుంకరిస్తారు.. ఆ తరువాత మళ్ళీ ఢిల్లీ వెళ్లి పెద్దల ముందు సాగిలపడతారు. తనను తెలుగుదేశం పార్టీ వాడుకుని వదిలేస్తుంది ఎన్నోమార్లు వగచే పవన్ మళ్ళీ ఆ టీడీపీ మోచేతి నీళ్లు తాగుతున్నారు.. ఇప్పుడు కూడా తనలో స్ల్పిట్ పర్సనాలిటీ ఉన్నట్లు మరోమారు రుజువుచేసుకున్నారువైయస్ జగన్ హయాంలో పవన్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ.. పనిలోపనిగా సినిమా ఇండస్ట్రీకి సైతం గార్డుగా ఊహించుకునేవారు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీ వైపు చూస్తే ఊరుకునేది లేదని.. ఆ వ్యవస్థ ఇక స్వయంచాలితం అని.. దాని వ్యాపారం.. సినిమాలు.. అనుమతులు.. టిక్కెట్ రేట్ల పెంపు వంటి వాటి అంశాలమీద ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదని.. అసలు ఎవరైనా సినిమా వ్యాపారం జోలికి వస్తే ఊరుకోనని బీరాలు పలికారు. అంటే సినిమా టిక్కెట్ల ధరలు నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరు?. అంతా ఇండస్ట్రీ పెద్దల ఇష్టానుసారం జరగాలి తప్ప మధ్యలో ప్రభుత్వం ఎందుకు అనేది అయన ఉద్దేశ్యం.. పైగా నటులు ఎవరూ ప్రభుత్వ పెద్దలను నాటి సీఎం వైఎస్ జగన్‌ను కలవాల్సిన అవసరం లేదన్నది ఆయన ఉద్దేశ్యంగా ఉండేది.ప్రైవేట్ పెట్టుబడి తోటి నిర్మాతలు సినిమా చేస్తా ఉంటే, గవర్నమెంట్ ఎలా కంట్రోల్ చేస్తది??పరిశ్రమ పైన ఎందుకు నీకు అంత పగ?? ఎందుకు వాళ్లని బెదిరిస్తున్నావ్?? @PawanKalyan https://t.co/liTLIto3N3 pic.twitter.com/pvl62CyAwT— Monster🇮🇳 (@varmamaster7) May 24, 2025ఇపుడు అయన అధికారంలో ఉన్నారు.. చంద్రబాబు కేబినెట్లో నంబర్ టూ పాత్రలో.. డిప్యూటీ సీఎంగా పదవిలో ఉండేసరికి తనకు మళ్ళీ ఇండస్ట్రీనే గుర్తొచ్చింది. అసలు తాము ఎన్నికల్లో గెలిచాక తెలుగు సినిమా పెద్దలు.. నటులు.. నిర్మాతలు చంద్రబాబును కలవడానికి ఎందుకు రాలేదని పవన్ బాధపడిపోయారు. తన రాజకీయ యజమాని తరఫున వకాల్తా పుచ్చుకుని ఆయన ఇండస్ట్రీ పెద్దలను ప్రశ్నించారు.. అసలు మీకు కృతజ్ఞత ఉందా?. ఎన్నికల్లో గెలిచాక మీరు వచ్చి బాబును కలవాలని తెలియదా?. సినీ పరిశ్రమకు టీడీపీ ఎంతో చేసింది.. అలాంటిది మీరంతా వచ్చి చంద్రబాబును కలిసి మోకరిల్లాలని తెలియకపోతే ఎలా .. అంటూ ఏదేదో మాట్లాడారు. అంటే వైఎస్ జగన్ సీఎంగా ఉన్నపుడు మాత్రం సినీ పరిశ్రమ స్వతంత్రంగా ఉండాలి.. చంద్రబాబు గెలిస్తే మాత్రం వారంతా వచ్చి కలవాలి. మొత్తానికి రాజకీయం బాగా నేర్చి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడు పవన్.. పూటకోమాట అంటూ ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు -సిమ్మాదిరప్పన్న. -
జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..
-
పవన్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన నిర్మాత చిట్టి బాబు
-
అది ఒక ఫ్లాప్ సినిమా.. ఎందుకంత హంగామా? పవన్ కు YSRCP నేతలు కౌంటర్
-
ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan
-
మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM
-
రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్
-
సినీ ఇండస్ట్రీకి పవన్ కల్యాణ్ బెదిరింపులు!
సాక్షి, విజయవాడ: తెలుగు చలన చిత్ర పరిశ్రమ(TFI)పై నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వంపై పరిశ్రమకు కనీస మర్యాద, కృతజ్ఞతలు లేవంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థియేటర్లు, నిర్మాతలు, లీజుదార్లుపై విల్లు ఎక్కిపెట్టిన ఆయన.. వారిని టార్గెట్ చేస్తూ కీలకమైన ప్రకటన విడుదల చేశారు. తన చిత్రం హరిహర వీరమల్లు కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిన్న తన మంత్రి దుర్గేష్ చేత.. థియేటర్లపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇవాళ నేరుగా తన కార్యాలయం నుండి హెచ్చరికతో కూడిన ఒక ప్రకటన విడుదల చేయించారాయన. ‘‘గతంలో అల్లుఅరవింద్, అశ్వనీదత్, దిల్ రాజు, సుప్రియ, చినబాబు, నవీన్ ఎర్నేని కలిశారు. అందరినీ రమ్మంటే ఎవ్వరూ రాలేదు. తెలుగు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా వచ్చి మమ్మల్ని సినిమా సంఘాలు కలవలేదు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కూడా కలవలేదు. కేవలం సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కలుస్తున్నారు. ఇకమీద సినీ ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరపేది లేదు. వ్యక్తిగతంగా చర్చలుండబోవు... వ్యక్తిగతంగా వచ్చి టిక్కెట్ ధర పెంచమని కోరడం(Tickets Rate Hike) ఎందుకు..?. అందరినీ కలిసి రమ్మంటే ఎవ్వరూ రాలేదు..?. ఇది మాకు తెలుగు సినిమాలో కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఈ రిటర్న్ గిఫ్ట్‌కు తగ్గట్లే మేమూ పని చేస్తాం. సినిమా థియేటర్ల ఆదాయంపై ఆరా తీస్తున్నాం. థియేటర్లను యజమానులు నడపడం లేదు. లీజు దారులే థియేటర్లను నడుపుతున్నారు. లీజు దార్ల నుండి పన్ను వస్తుందా లేదా..? అని పరిశీలిస్తున్నాం. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ అధిక ధరలను కూడా తనిఖీ చేస్తాం. థియేటర్ల పైకి తనిఖీ బృందాలను పంపుతాం. మల్టీప్లెక్స్ లలో టిక్కెట్ల ధరలపై కూడా విచారణ జరుపుతాం. మల్టీప్లెక్స్ లలో ఆహారపదార్థాలపై కూడా తనిఖీలు చేస్తాం. ఇకమీదట కేవలం సినిమా సంఘాలతోనే చర్చిస్తాం’’ అని పవన్ పేరిట ప్రకటన వెలువడింది. -
ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani
-
సినిమా వాళ్లను బెదిరిస్తారా? పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని ఫైర్
తాడేపల్లి: చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కేవలం ఏపీ లోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 15 ఏళ్ల ఆవేశం స్టార్, రెడ్ బుక్ స్టార్.. అందరికీ బాస్ అని చెప్పుకునే మోదీ కూడా ఏపీకి చేసిన మేలు ఏమైనా ఉందా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్లాలా అని సిగ్గు పడుతున్నారు. కడపలో జరిగేది మహానాడా.. దగానాడా.. వాళ్ళే చెప్పాలి. ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ వేరు.. ఇప్పుడు టీడీపీ వేరని కార్యకర్తలు ఏడుస్తున్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ మూటలు కట్టుకుంటున్నారు. ఒక చిన్న మూట ఇంకొకరికి ఇస్తున్నారు. పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుంది. కస్టోడియల్ టార్చర్‌కి ఏపీ పోలీస్ స్టేషన్లు వేదికలుగా మారిపోతున్నాయి’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.‘‘లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. ఇప్పుడు లేని లిక్కర్ కేసును సృష్టించారు. లిక్కర్ కేసులో మొదట విజయసాయిరెడ్డిని లైన్లోకి తెచ్చారు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లటంతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తెచ్చారు. ఆ తర్వాత జగన్ పేరు తెస్తారు. ఇసుమంత కూడా బిడియపడకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రోజుకో కథ వండి వారుస్తున్నారు. లక్షల కోట్ల పేజీల మెమరీ డిలీట్ చేశారని ఎల్లో మీడియా రాయిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినందున జగన్‌ని కూడా అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులుపై కక్షసాధిస్తున్నారు. జైలులో కూడా ఆయన నిత్య పూజలు చేసుకునే వ్యక్తి అని జైలు అధికారులే చెప్పుకుంటున్నారు. అరెస్ట్ అప్పుడే అన్నీ వెతికారు కదా.. మళ్ళీ ఇప్పుడు సోదాలు ఎందుకు?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు...రాజ్యమే ప్రజలను హింసిస్తే ఆ ప్రజల ఆగ్రహంలో పాలకులు కొట్టుకుపోతారు. చంద్రబాబు ఇంటికి కాయగూరలు కావాలంటే విమానంలో వెళ్లి తెచ్చుకుంటున్నారు. జగన్ లాగా నేను అప్పులు చేసి పథకాలు ఇవ్వను.. నేను సంపద సృష్టించి ఇస్తానని చెప్పారు. సంవత్సరం తిరిగే లోపు లక్షన్నర కోట్ల అప్పులు చేసి ఆ సొమ్మంతా ఏం చేశారు?. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇంట్ కరెంట్ కోసం యూనిట్ 9 రూపాయలు వసూలు చేస్తున్నారు. జగన్ తన ప్రభుత్వంలో తక్కువ రేటుకే ప్రజలు సినిమాలు చూడాలి అని ఆకాంక్షించారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్‌ను ఉద్ధరిస్తారనుకుంటే థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారు...అప్పుడు ఏం మాట్లాడారు..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..?. సినిమా వాళ్లను జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. ఇవి దివాలకోరు రాజకీయాలు కావా..?. నీ చెప్పు చేతల్లో ఉన్న మంత్రితో బెదిరిస్తారా?. రాబోయే ఫ్లాప్ సినిమా కోసం ఇంతలా చేయాలా..?. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయి.. సినిమా వాళ్ళను బెదిరించటానికి మీరు ఎవరు..?. అసలు వాళ్ల సమస్య ఏంటో తెలుసా మీకు’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
పవన్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్
సాక్షి, విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కోసం మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక జారీ చేశారు. థియేటర్ల బంద్‌పై మంత్రి దుర్గేష్ ఏకంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..‘సినిమా థియేటర్ల మూసివేతపై విచారణకు ఆదేశించాం. హోంశాఖ కార్యదర్శి చేత విచారణ చేపట్టాం. ఎందుకు సినిమా హాళ్లు బంద్ చేస్తున్నారో విచారించమన్నాం. ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారో విచారించమని చెప్పాం. జూన్ 12న పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంలో ఎందుకు థియేటర్లు మూసేస్తున్నారు. ఎవరితో చర్చించి థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చారు. అందుకే మేం విచారణకు ఆదేశించాం’ అని చెప్పుకొచ్చారు. -
బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్
-
త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!
-
పవన్ కల్యాణ్‌తో రామ్ చరణ్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకుడు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ (2024) సినిమా విడుదలై ఏడాదిన్నర దాటినప్పటికీ, ఆయన తదుపరి చిత్రంపై స్పష్టత లేకపోవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మొదట్లో అల్లు అర్జున్‌తో పాన్-ఇండియా చిత్రం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, అది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు 2026 వరకు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో, త్రివిక్రమ్ సినిమా తాత్కాలికంగా వాయిదా పడినట్లు మొన్నటిదాక ప్రచారం జరిగింది. ఇప్పుడు మొత్తానికి ఈ చిత్రం ఉండకపోవచ్చని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. బన్నీ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టి రామ్ చరణ్‌తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. వెంకీ చిత్రం తర్వాత...బన్నీ సినిమా వాయిదా పడడంతో త్రివిక్రమ్ ఈ గ్యాప్‌లో విక్టరీ వెంకటేశ్‌తో ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడట. ఈ చిత్రం కథా చర్చలు పూర్తయి, మరికొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇది పూర్తయిన తర్వాత బన్నీతో సినిమా చేస్తాడని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ అది కూడా జరిగేలా లేదు. త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టుని పూర్తిగా పక్కకు పెట్టేసి.. రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.పవన్ కోసం..పవన్ కల్యాణ్ చొరవతో రామ్ చరణ్ కోసం త్రివిక్రమ్ ఓ క్రేజీ కథను రెడీ చేశాడట. ఇటీవల ఈ కథను చరణ్‌కు చెప్పి ఒప్పించారట. ఈ చిత్రానికి త్రివిక్రమ్ సన్నిహితుడైన పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. పెద్ది చిత్రం పూర్తయిన వెంటనే చరణ్ త్రివిక్రమ్ సినిమాని సెట్స్‌పైకి వెళ్తుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. సుక్కు మూవీకి బ్రేక్!వాస్తవానికి పెద్ది తర్వాత చరణ్ .. సుకుమార్‌తో సినిమా చేయాల్సింది. ఇటీవల సుకుమార్ కూడా తన తదుపరి సినిమా చరణ్‌తోనే అని ప్రకటించాడు. కానీ పవన్ కల్యాణ్ కారణంగా చరణ్.. సుక్కు ప్రాజెక్టుని పక్కకు పెట్టి..త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రం తర్వాత సుకుమార్‌తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. మరి సుక్కు అంతకాలం వెయిట్ చేస్తాడా లేదా మధ్యలో మరో హీరోని చూస్కొని సినిమా చేస్తాడా అనేది తెలియాల్సింది. -
పవన్ సీజ్ ద షిప్ పై జగన్ మాస్ ర్యాగింగ్..
-
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి భవానీ థియేటర్లో గురువారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా నిర్వహించిన మన ఊరి కోసం మాటామంతీ కార్యక్రమం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఆయనేనని తెలుస్తోంది. ఎవరిని థియేటర్లోకి అనుమతించాలి? ఏం మాట్లాడాలో ముందే శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఈ కార్యక్రమానికి రావివలస గ్రామాన్ని ఎంపిక చేశారు. వర్చువల్ పద్ధతి ద్వారా ఉప ముఖ్యమంత్రి గ్రామస్తుల సమస్యలు తెలుసుకోవాలి. అయితే ఆ గ్రామస్తులనే లోపలకు వెళ్లనివ్వకుండా రెవెన్యూ అధికారుల ఆదేశాలతో పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులనూ అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా టీడీపీ, జనసేనకు చెందిన మండల స్థాయి నాయకులనూ థియేటర్లోకి అనుమతించకపోవడం గందరగోళానికి దారి తీసింది. కొందరు పాస్‌లు ఉన్న వారినీ పోలీసులు అత్యుత్సాహంతో ఆపేశారు. ప్రతి జిల్లాలో బయో డైవర్సిటీ పార్క్ విజయవాడ: అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో బయో డైవర్సిటీ పార్క్, ప్రతి గ్రామంలో పల్లె వనం ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..
-
నాకు పోరాటాలు కొత్త కాదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గత ఏడాది కాలంగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, చంద్రబాబు పాలన అంతా అవినీతి, స్కాములు, దోపిడీ మయంగా మారిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాజా రాజకీయ పరిస్థితులపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద నాణేనికి రెండో వైపులా.. కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబుతోనే కాదు.. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా!.బాబు 12 నెలల పాలనలో..ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ, కాగ్ నివేదికను పరిశీలిస్తే.. అభివృద్ధి కనిపించలేదు. సంక్షేమం ఊసే లేదు. ఈ సంవత్సర కాలం అంతా మోసాలతో గడిపారు. ఏడాది పాలనలో పెట్టుబడులు తగ్గాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఆదాయం అనేది రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. రాష్ట్ర ఆదాయమంతా బాబు గజదొంగల జేబుల్లోకి వెళ్తోంది. అదే మా హయాంలో.. కోవిడ్ విజృంభించిన సమయంలోనూ రాష్ట్రాన్ని గోప్పగా నడిపాం. అభివృద్ధి, సంక్షేమం.. ప్రజలకు మంచి పరిపాలన అందించాం.అప్పుల సామ్రాట్ బాబుఈ 12 నెలల కాలంలోనే.. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతం మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్. మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేశారు. మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈనాడు.. ఓ మీడియానా?ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ఓ మాఫియా రాజ్యం. సెకీకి సన్మానం అంటూ ఈనాడు నా ఫొటోలో ఓ కథనం ఇచ్చింది. 2021 డిసెంబర్లో ఏపీతో సెకీ ఒప్పందం అయితే, ఆపై రెండేళ్లకు సెకీ చైర్మన్ నియామకం జరిగింది. కానీ, సెకీకి సన్మానం అంటూ ఈనాడు తప్పుడు కథనాలు ఇచ్చింది. ఈనాడు.. టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కి తక్కువ. దున్నపోతును ఈనితే.. దూడను కట్టేసినట్లు ఉంది ఈనాడు తీరు. సిగ్గు పడాలి మీడియా అని చెప్పుకునేందుకు. పరాకాష్టకు స్కాంలురాష్ట్రంలో లిక్కర్, ఇసుక, క్వార్ట్జ్, మైనింగ్, సిలికా.. ఇలా అన్ని మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్ నుంచి రాష్ట్రానికి రూపాయి రావడం లేదు. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటల పీక్ అవర్ కోసమంటూ 24 గంటలకు యూనిట్‌కు రూ.4.60 చొప్పున ఒప్పందం చేసుకున్నారు. మా హయంలో రూ.2.49కే విద్యుత్ కొన్నాం. విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ఖర్చు తగ్గించాం. బాబు పాలనలో విద్యుత్ కొనుగోలులోనూ పెద్ద స్కామ్ జరిగింది. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఖజానాకు గండి కొట్టారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదోగానీ.. ఉర్సా అనే సంస్థకు భూములు ఇచ్చారు. బిడ్ లేకుండా రూ.2 వేల కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇచ్చారు. స్కాంలకు పరాకాష్ట్ర అమరావతి పేరుతో దోపిడీనే.. జూన్ 4న వెన్నుపోటు డేకిందటి ఏడాది జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు ఎలాంటి హామీ నెరవేర్చలేదు. అందుకే చంద్రబాబు మోసాలకు గుర్తుగా ఆ రోజున వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటాం. కలెక్టర్లకు హామీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. బాబు ఎందుకు అరెస్ట్ కాకూడదు?రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. తనపై కేసులను చంద్రబాబు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్‌పై ఉంటూ అధికార దుర్వినయోగానికి పాల్పడుతున్నారు. బెయిల్ కండిషన్లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు అరెస్ట్ కాకూడదు?లిక్కర్ స్కాం పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందా? అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా.. ‘‘నాకు పోరాటాలు కొత్త కాదు. గతంలో రెండు పార్టీలు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా న్యాయమే గెలుస్తుంది. గతంలో ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా వైఎస్సార్సీపీ పుట్టింది.. పెరిగింది.. ఎదిగింది. న్యాయం, ధర్మం వైపే దేవుడు ఉంటాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా
-
'హరి హర వీరమల్లు' అసుర హననం సాంగ్ విడుదల
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara VeeraMallu) సినిమా నుంచి 'అసుర హననం' పాటను తాజాగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన నుంచి విడుదలవుతున్న తొలి సినిమా కాబట్టి ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. జూన్ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు కొద్దిరోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను భారీ బడ్జెట్‌తో ఏఎమ్ రత్నం నిర్మించారు. సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందించారు.ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు. తొలి భాగం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకులు క్రిష్ కొంతభాగం తెరకెక్కింగా.. ఆ తర్వాత నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. సుమారు 5 ఏళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ పనులు కొనసాగాయి. -
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
ఏదైనా వస్తువు కొన్నాక కొన్నాళ్ళు వాడిన తరువాత దానిమీద.. దాని పనితీరు మీద అసంతృప్తి మొదలవుతుంది. అయ్యో బోలెడు డబ్బు పోసి కొన్నాను ఇది సరిగా పనిచేయడం లేదు. బాగుంది తీసుకెళ్లండి అంటూ షాపువాడు నన్ను మోసం చేసాడు అని తిట్టుకోవడం సహజం. కానీ చంద్రబాబు అనే నాసిరకం సరుకును తెచ్చుకున్న జనం దాన్ని ప్యాకింగ్ విప్పిన క్షణం నుంచీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయ్యో బయట మాటలు.. కలరింగ్.. మార్కెటింగ్ వాడి మాయ కబుర్లు నమ్మేసి ఈ దారిద్య్రాన్ని ఇంటికి తెచ్చుకున్నామే అన్నట్లుగా ప్రతి ఇంట్లోనూ తిట్టడం మొదలైంది. దుకాణంలో కౌంటర్లో చూపించేది ఒక రకం సరుకు.. మనకు పార్సిల్ చేసి ఇచ్చేది ఇంకో రకం సరుకు అన్నట్లుగా ఎన్నికల సభల్లో చంద్రబాబు.. లోకేష్.. పవన్ చెప్పింది ఒకటి. గెలిచాక చేస్తున్నది ఇంకోటి అని ఏడాది లోపే తేలిపోయింది. దీంతో పవన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి అనుకుని ఉన్న కాకినాడ ఎంపీ సెగ్మెంట్లోని తుని, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఇటీవల జరిపిన సర్వేలో చేదు నిజాలు వెలుగుచూశాయి. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ జనంలో వ్యతిరేకత ఎక్కువే ఉంది.ఎన్నికల సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు.. అత్యుత్సాహంతో విరిసిన డైలాగులు.. ఊపిన చేతులు.. హావభావాలని గుర్తు చేసుకుంటున్న జనం ఏదీ ఆ జోరు ఇప్పుడు కనిపించదేమి అని ప్రశ్నిస్తున్నారు. పైగా తెలుగుదేశం నాయకుల రౌడీయిజం.. రుబాబు.. దోపిడీ వంటి వాటిని పవన్ ఏమాత్రం ప్రశ్నించకపోవడంతో జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైనట్లు భావిస్తున్నారు. దీంతో ఇది కూడా నాసిరకం సరుకు.. ప్యాకింగ్ చూసి కోనేసాం.. లోపలంతా తాలు సరుకు అని తిట్టిపోస్తున్నారు. పైగా పవన్ కూడా పార్టీని గాలికి వదిలేసి తన అన్న నాగబాబుకు పదవి ఇప్పించుకోవడంతో సంతృప్తి చెంది ఇతర నాయకుల పొలిటికల్ కెరీర్ గురించి పూర్తిగా ఇగ్నోర్ చేయడంతో వారిలో అసంతృప్తి మొదలైంది.పైగా గ్రామాల్లో జనసేన కార్యకర్తల రౌడీయిజం వంటివి జనాల్లో చర్చకు వస్తున్నాయి. ఈ విషయాన్నే వైఎస్ జగన్ కూడా తాజాగా పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు. ఏడాదిలోపే ప్రభుత్వం మీద వ్యతిరేకత కమ్ముకొచ్చిందని.. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతు కూడగట్టాలని కేడర్‌కు సూచించారు. ఆయన చెప్పడం అని కాదు కానీ గ్రామాల్లో ఇప్పటికే చంద్రబాబు పాలనమీద పెదవి విరుపు మొదలైంది. ఇసుక ధరలు పెంపు.. పల్లెల్లో చిల్లర రాజకీయాలు.. రౌడీయిజం వంటివి జనంలో వ్యతిరేకతని పోగుచేస్తున్నాయి. -సిమ్మాదిరప్పన్న. -
రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
మోదీ అందుకే చాక్లెట్ ఇచ్చారు పవన్ పై శ్యామల సెటైర్లు
-
పిఠాపురం రూరల్‌లో మరోసారి ఉద్రిక్తత
కాకినాడ జిల్లా: పిఠాపురం రూరల్‌లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫక్రుద్దీన్ పాలెం( ఎఫ్.కే.పాలెం) పాపిడి దొడ్డి చెరువులో మట్టి తవ్వేందుకు యత్నించగా.. జేసీబీని రైతులు అడ్డుకున్నారు. చెరువును పరిశీలించిన సీపీఎం నేతలు.. చెరువులో మట్టి తవ్వుకునేందుకు ఎమ్మార్వో అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.3.5 ఎకరాల కోసం 360 ఎకరాలను బీడుగా మారుస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొలం మెరక పేరుతో చెరువులో మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తారని ఆరోపించారు. పంచాయితీ తీర్మానం, రైతులు అభిప్రాయం తీసుకోకుండా ఎమ్మార్వో మట్టి తవ్వకాలకు ఏలా అనుమతి ఇస్తారంటూ సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన ఉంటారో లేక వ్యాపారుల పక్షాన ఉంటారో తేల్చుకోవాలంటూ సీపీఎం నేతలు హెచ్చరించారు. -
‘సకల శాఖలకు మంత్రి లోకేష్.. అందుకే పవన్‌కు మోదీ చాక్లెట్’
సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. రాష్ట్రంలో సకల శాఖల మంత్రిగా నారా లోకేష్ కొనసాగుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్షాలు.. అబద్ధపు స్టేట్మెంట్స్తో ఈ అరెస్ట్ జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉంది. సోలార్ ప్రాజెక్టులను ఏపీలో విస్తారంగా తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. వైఎస్సార్సీపీ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ పాలనలో 22వేల కోట్ల రూపాయల విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగానే రెన్యూ సంస్థ ఏపీలో పెట్టుబడులు. ఏపీలో నారా లోకేష్ సకల శాఖ మంత్రి.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను మంత్రి లోకేష్ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ఎందుకు ఆపేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు?. ప్రభుత్వ వసతి గృహంలో అమ్మాయిలను ఎలుకలు కొరికినా స్పందించలేదు. రెండు రోజుల అనంత పర్యటనలో నారా లోకేష్ సాధించింది శూన్యం.రాష్ట్రంలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. డిప్యూటీ సీఎం పదవి వచ్చాక అదృశ్యమైన మహిళల వ్యవహారంపై పవన్ ఎందుకు మాట్లాడరు. పవన్ కళ్యాణ్.. పిఠాపురం పీఠాధిపతి. అందుకే ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు. -
పవన్ పై పిఠాపురం రైతులు ఫైర్
-
‘హరిహర వీరమల్లు’ వచ్చేస్తున్నాడు
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కల్యాణ్ రాజకీయాలతో బీజీ కావడం వల్ల షూటింగ్ అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. దీంతో విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు మేకర్స్. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకోవడంతో రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. జూన్ 12నీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో ఆయన ఆ బాధ్యల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఎ.ఎం. జ్యోతి కృష్ణ రంగంలోకి దిగి మిగిలిన భాగాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో' గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. GET READY FOR THE BATTLE OF A LIFETIME! ⚔️🏹Mark your calendars for #HariHaraVeeraMallu on June 12, 2025! 💥 💥The battle for Dharma begins... 🔥⚔️ #HHVMonJune12th #VeeraMallu #DharmaBattle #HHVMPowerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi… pic.twitter.com/3KKNcspFIr— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 16, 2025 -
గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
సాక్షి, కాకినాడ జిల్లా: పవన్ కల్యాణ్‌పై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మల్లాం భాధితులకు న్యాయం చేయాలని పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.‘‘కంప్యూటర్ యుగంలో దళితుల సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు. పిఠాపురంలో మనువాదం అమలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాంలో సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణం. ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం’’ అంటూ దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు.దళితుడన్న కారణంగా కరెంటు షాక్‌తో చనిపోయిన జనసేన కార్యకర్త పల్లపు సురేష్ కుటుంబాన్ని కూడా పరామర్శిచలేదు. పవన్‌కు మనసు నిండా కుల వివక్ష ఉంది. కులం, మతం రంగు పూసుకుని బతుకుతున్నాడు. మల్లాం దళితుల సాంఘిక బహిష్కరణపై సుప్రీం కోర్టును ఆశ్రయించాం. చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, కాకినాడ కలెక్టర్, ఆర్డీవో, పోలీసు అధికారులపై కేసు పెట్టాం...మల్లాం ఘటనపై నేటికి పవన్ కళ్యాణ్ స్పందిక పోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశాం’’ అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశోక్ బాబు తెలిపారు. -
వేసవొచ్చింది... సెలవులు తెచ్చింది
వేసవి వచ్చిందంటే చాలు... స్కూల్స్, కాలేజీలు క్లోజ్ అవుతాయి. స్టూడెంట్స్‌కు సెలవులొచ్చేస్తాయి. అలాగే ప్రతి ఏడాది సినిమా స్కూల్స్‌కు కూడా వేసవి సెలవులు వస్తుంటాయి. ఈ సెలవుల్లో మెజారిటీ స్టార్ హీరోలు షూటింగ్ నుంచి బ్రేక్స్ తీసుకుంటుంటారు. అలా ఈ ఏడాది షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్ వేయండి.లండన్‌లో ల్యాండ్ నిన్న మొన్నటివరకు ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవలే లండన్‌లో ల్యాండ్ అయ్యారు. ఆయన తనయుడు, హీరో– నిర్మాత రామ్‌చరణ్ మైనపు విగ్రహం లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం కోసం చిరంజీవి ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు చిరంజీవి. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిసింది.ఈ మూవీలో నయనతార, కేథరీన్ హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. సాహు గార పాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘విశ్వంభర’ సినిమాకు చిన్న పాటి ΄్యాచ్ వర్క్, ఓ స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయట. వీలు చూసుకుని, ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టే ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, విక్రమ్, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషా, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తారు. ఇక ‘విశ్వంభర’ సినిమా కొత్త విడుదల తేదీపై అతి త్వరలోనే ఓ స్పష్టత రానుంది.ఓవర్ టు ఓజీ కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉంటూ, సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇది. దీంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ కల్యాణ్ వంతు షూటింగ్ పూర్తయింది. జాగర్లమూడి రాధాకృష్ణ, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ నిర్మించారు. అయితే ఈ సినిమాను తొలుత మే 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ...పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాని నేపథ్యంలో రిలీజ్‌ను వాయిదా వేశారని, అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుందని తెలిసింది. రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల కానుంది.తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ విడుదలవుతుంది. ఇలా ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ పూర్తి కావడంతో, ఇక పవన్ ఫోకస్ అంతా ‘ఓజీ’ సినిమాపైనే. అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన పవన్ కల్యాణ్ షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు. అతి త్వరలోనే ఆయన ‘ఓజీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు.ఫారిన్ వెకేషన్ ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్తుంటారు హీరో మహేశ్‌బాబు. అయితే ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు సినిమాప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబుకు ఈ ఏడాది ఫారిన్ హాలిడే బ్రేక్ దొరక్కపోవచ్చని కొందరు అనుకున్నారు. కానీ మహేశ్‌బాబుకు ఆ అవకాశం లభించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా లాంగ్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత ఫారిన్ ఫ్లైట్ ఎక్కారు మహేశ్‌బాబు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి యూఎస్‌లో ఉన్నారని సమాచారం.ఇంకా రెండు వారాలు మహేశ్‌బాబు అక్కడే ఉంటారట. వచ్చిన తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్‌ను మళ్లీ షురూ చేస్తారు. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 వేసవిలో ఈ చిత్రం విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది.ఇటలీలో... ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో కొన్ని రోజులు క్రితం బిజీ బిజీగా గడి పారు ప్రభాస్. దాంతో ఈ సినిమా చిత్రీకరణలకు బ్రేక్ ఇచ్చి, ఇటీవల ఫారిన్ వెళ్లారు ప్రభాస్. దాదాపు ఇరవై రోజుల నుంచి ప్రభాస్ ఇటలీలోనే ఉంటున్నారని తెలిసింది. అతి త్వరలోనే ప్రభాస్ ఇండియాకు తిరిగి రానున్నారు. వచ్చిన తర్వాత ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలనుప్రారంభిస్తారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరో నటి రిద్దీ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘ఫౌజి’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026లో ‘ఫౌజి’ సినిమా విడుదల కానుంది.లండన్‌లో... లండన్ వెళ్లారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రకరణ కర్ణాటకలో జరిగింది. ఎన్టీఆర్ పాల్గొనగా, యాక్షన్ సీక్వెన్స్‌లు, కొంత టాకీ పార్టును చిత్రీకరించారు ప్రశాంత్ నీల్. కాగా ఈ కర్ణాటక షూటింగ్ షెడ్యూల్ తర్వాత ఎన్టీఆర్ లండన్ వెళ్లారని తెలిసింది. లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్క్రీనింగ్ జరగనుందని తెలిసింది. అలాగే ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కాన్సెర్ట్ కూడా ఉంది.ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ లండన్ వెళ్తున్నారని తెలిసింది. ఈ వేడుకలో ‘ఆర్ఆర్ఆర్’లో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఈ చిత్రదర్శకుడు రాజమౌళిలతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌లోని మరికొందరు పాల్గొంటారట. తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు ఎన్టీఆర్. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డ్రాగన్’ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.విదేశాల్లో వెరీ బిజీ ‘పెద్ది’ సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి, లండన్ వెళ్లారు రామ్‌చరణ్. లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ, ‘ఆర్ఆర్ఆర్’ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్‌చరణ్ ఆల్రెడీ లండన్‌లోనే ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలతో ప్రస్తుతం రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో ఆరంభిస్తారు రామ్‌చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు, శివ రాజ్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు హీరోలు ఈ వేసవికి షూటింగ్ బ్రేక్స్ ఇచ్చారు.– ముసిమి శివాంజనేయులువేసవి తర్వాతే... ఈ వేసవికి కొందరు హీరోలు షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వగా, ఈ వేసవి తర్వాతనే కొత్త సినిమా షూటింగ్లనుప్రారంభించాలని మరి కొందరు హీరోలు ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నెక్ట్స్ సినిమాపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. వెంకటేశ్ కూడా చాలా కథలు వింటున్నారు. కాగా వెంకటేశ్ నెక్ట్స్ మూవీ దర్శకుడు త్రివిక్రమ్‌తో ఉంటుందని, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారని, వేసవి తర్వాత అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. ఇక మరో సీనియర్ హీరో నాగార్జున సోలో హీరోగా కొత్త సినిమాపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. అయితే తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ చెప్పిన ఓ కథ నాగార్జునకు నచ్చిందని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. వేసవి తర్వాతనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలని నాగార్జున భావిస్తున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి తర్వాతే ఈ సినిమా చిత్రీకరణనుప్రారంభించాలని అట్లీ అండ్ టీమ్ ప్లాన్ చేసిందట. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇలా మరికొంతమంది తెలుగు హీరోలు ఈ వేసవి సెలవుల తర్వాత తమ కొత్త సినిమాల సెట్స్‌లోకి అడుగుపెట్ట నున్నారని తెలిసింది. -
నేను పీకే తాలుకా.. తలచుకుంటే లేపేస్తా...!
డాబాగార్డెన్స్(విశాఖపట్నం): నేను పవన్ కల్యాణ్ తాలూకా? నీవెవ్వడివిరా? నేను తలచుకుంటే లేపేస్తా.’ అంటూ ఓ వైద్యుడిపై పీకే అభిమాని విరుచుకుపడ్డాడు. ఆ వైద్యుడు కన్నీటితో తన ఆవేదనను సాక్షి వద్ద వెలిబుచ్చాడు. ఏం జరిగిందో ఆయన మాటల్లోనే..పాతనగరం ఫిషింగ్ హార్బర్ వద్ద హోమియో క్లినిక్ నడుపుతున్నా. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో క్లినిక్ మూసి, ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ అభాగ్యురాలు తన చంటి పిల్లలతో మండుటెండలో ఆకలితో అలమటిస్తుంటే.. బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ ఇచ్చాను. ఆనందంగా స్వీకరించిన పిల్లలు సమీపంలోని మరిడిమాంబ ఆలయం షెల్టర్ వద్దకు తినుకుంటూ వెళ్లడంతో ఓ ద్విచక్రవాహనదారుడు స్పీడ్‌గా వచ్చి సడన్ బ్రేక్ వేశాడు. ‘ఎందుకు అంత స్పీడ్? ఇది వీధి కదా.. కొంచెం నెమ్మదిగా వెళ్లొచ్చు కదా.. అని ప్రశ్నించా..అంతే ఆ యువకుడు రెచ్చిపోయి.. ‘నేను పవన్ కల్యాణ్ తాలూకా.. నీవెవ్వడివిరా నన్ను ప్రశ్నస్తున్నావ్? నేను తలచుకుంటే లేపేస్తా’ అంటూ దౌర్జన్యం చేశాడని డాక్టర్ రియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్పీడ్ బ్రేకర్లు వేసుంటే సమస్యే ఉండేది కాదు.. ఈ ప్రాంతంలో ఓ వైపు మరిడిమాంబ ఆలయం.. కొంత దూరంలో యాసీన్ బాబా దర్గా ఉన్నాయి. ఇటు మరిడిమాంబ ఆలయానికి వెళ్లే భక్తులు, యాసీన్ బాబా దర్గాకు వచ్చే ముస్లింలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇటు గుండానే వెళ్తుంటారు. ద్విచక్ర వాహన చోదకులు స్పీడ్‌గా వెళ్తున్న నేపథ్యంలో స్పీడ్ బ్రేకర్లు వేయాలని జీవీఎంసీ జోనల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాక్టర్ రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. -
నీ నటన సూపర్ బాబు,పవన్ ను ఏకిపారేసిన కేఏ పాల్