Badminton Tourney
-
Arctic Open 2024: సింధు పునరాగమనం
వాంటా (ఫిన్లాండ్): పారిస్ ఒలింపిక్స్ వైఫల్యం మరిచి తదుపరి టోరీ్నలో టైటిల్స్ లక్ష్యంగా భారత షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ తమ రాకెట్లకు పదును పెడుతున్నారు. ఆర్కిటిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పారిస్ మెగా ఈవెంట్ తర్వాత వీళ్లిద్దరు బరిలోకి దిగుతున్న తొలి టోర్నీ ఇదే కాగా... మహిళల సింగిల్స్‌లో సింధుకు ఆరో సీడింగ్ కేటాయించగా, పురుషుల ఈవెంట్లో లక్ష్య సేన్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు కెనడాకు చెంది మిచెల్లి లీతో తలపడుతుంది. ఇందులో శుభారంభం చేస్తే తదుపరి రౌండ్లో భారత టాప్ స్టార్‌కు 2022 జూనియర్ ప్రపంచ చాంపియన్, జపాన్ టీనేజ్ సంచలనం తొమకొ మియజాకి ఎదురవనుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్... డెన్మార్క్‌కు చెందిన రస్ముస్ గెమ్కేతో తలపడతాడు. గతేడాది ఇండియా ఓపెన్‌లో రస్మస్తో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం లక్ష్య సేన్‌కు ఆరంభరౌండ్లోనే లభించింది. ఈ అడ్డంకిని అధిగమిస్తే భారత ఆటగాడు చైనీస్ తైపీకి చెందిన ఏడో సీడ్ చౌ తియెన్ చెన్‌తో పోటీపడే అవకాశముంటుంది. -
సెమీఫైనల్లో సింధు పరాజయం
వాంటా (ఫిన్లాండ్): ఈ ఏడాది తొలి టైటిల్ కోసం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరీక్షణ కొనసాగుతోంది. ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోరీ్నలో సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 63 నిమిషాల్లో 12–21, 21–11, 7–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా) చేతిలో ఓడిపోయింది. గతంలో వాంగ్ జి యితో ఆడిన రెండుసార్లూ గెలిచిన సింధు మూడోసారి మాత్రం పరాజయం చవిచూసింది. సెమీఫైనల్లో ఓడిన పీవీ సింధుకు 6,090 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాదిలో సింధు ఇప్పటి వరకు 18 టోర్నమెంట్లు ఆడగా... స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి, మరో మూడు టోరీ్నల్లో సెమీఫైనల్ చేరింది. చదవండి: World Cup 2023: ఫ్యాన్ బాయ్.. బాబర్ ఆజంకు గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లి! వీడియో వైరల్ -
మెయిన్ ‘డ్రా’కు ప్రణవ్ రావు అర్హత
థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు గంధం ప్రణవ్ రావు మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ప్రణవ్ రావు 15–21, 21–14, 21–17తో చాంగ్ షి చియె (చైనీస్ తైపీ)పై గెలుపొంది ముందంజ వేశాడు. భారత్‌కే చెందిన హేమంత్ గౌడ, రవి కూడా మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టారు. -
తొలి రౌండ్లోనే లక్ష్య సేన్ ఓటమి
హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం నుంచి భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. జర్మనీలో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ లక్ష్య సేన్ 12–21, 5–21తో ప్రపంచ 15వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ, సైనా నెహ్వాల్ తమ తొలి రౌండ్ మ్యాచ్‌లను నేడు ఆడనున్నారు. చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ -
Vietnam Open 2022: సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ జోడీ జోరు
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ జోరు కొనసాగుతోంది. గతవారం ఛత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో టైటిల్ నెగ్గిన సిక్కి–రోహన్ ద్వయం వియత్నాం ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి, ఢిల్లీ ప్లేయర్ రోహన్ కపూర్ 21–19, 21–17తో మూడో సీడ్ చాన్ పెంగ్ సూన్–చెయ యీ సీ (మలేసియా) జోడీపై సంచలన విజయం సాధించారు. 34 ఏళ్ల చాన్ పెంగ్ సూన్ 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకం సాధించడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ రెహన్ నౌఫల్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) జోడీతో సిక్కి రెడ్డి–రోహన్ తలపడతారు. Tel Aviv Tennis Tournament: టైటిల్‌కు గెలుపు దూరంలో... టెల్ అవీవ్: భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది మూడో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. టెల్ అవీవ్ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న (భారత్)– మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 4–6, 7–6 (7/3), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో డూంబియా–రెబూల్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. 42 ఏళ్ల బోపన్న ఈ ఏడాది పుణే ఓపెన్, అడిలైడ్ ఓపెన్లలో డబుల్స్ టైటిల్స్ సాధించాడు. -
బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన సింధు
-
కశ్యప్, మిథున్ ముందంజ.. మాళవికకు తొలి రౌండ్లోనే చుక్కెదురు
తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, మిథున్ మంజునాధ్ తొలి రౌండ్లో సునాయాస విజయాలు సాధించగా.. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌కు చుక్కెదురైంది. హైదరాబాద్ కుర్రాడు పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లో స్థానిక ఆటగాడు చి యు జెన్‌పై 24-22, 21-10 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా.. మిథున్ మంజునాథ్ 21-17, 21-15 తేడాతో కిమ్ బ్రున్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. వీరితో పాటు కిరణ్ జార్జ్, ప్రియాన్షు రజత్‌లు కూడా తొలి రౌండ్లో ప్రత్యర్ధులపై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 21-10, 15-21, 14-21 తేడాతో తైపీ షట్లర్ లియాంగ్ టింగ్ యు చేతిలో ఖంగుతినగా.. కిసోనా సెల్వదురై సమియా ఫరూఖీ చేతిలో ఓటమిపాలైంది. డబుల్స్, మిక్సడ్ డబుల్స్ విభాగాల్లో భారత షట్లర్ల ముందుంజ.. పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీలు అర్జున్-కపిల, ఇషాన్ బట్నాగర్-కృష్ణప్రసాద్‌లు తొలి రౌండ్లో ప్రత్యర్ధులపై విజయాలు నమోదు చేయగా.. రవికృష్ణ-ఉదయ్ కుమార్, గర్గా-పంజలా జోడీలు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాయి. మిక్సడ్ డబుల్స్‌లో భారత స్టార్ జోడీ ఇషాన్ బట్నాగర్-తానిషా క్రాస్టో .. స్వెత్లాన జిల్బర్మెన్-మిషా జిల్మర్మన్ జంటను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. చదవండి: కామన్ వెల్త్ గేమ్స్‌కు ముందు భారత్‌కు భారీ షాక్..! -
రీ ఎంట్రీలో రెచ్చిపోతున్న సైనా.. ఐదో సీడ్ ప్లేయర్‌కు ఝలక్
సింగపూర్ ఓపెన్ 2022లో భారత షట్లర్లు రెచ్చిపోతున్నారు. పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ఇదివరకే క్వార్టర్స్‌కు చేరగా.. తాజాగా వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా ఫైనల్ 8కు దూసుకెళ్లింది. రెండో రౌండ్లో సైనా.. చైనా షట్లర్ హి బింగ్ జియావోపై 21-19, 11-21, 21-17 తేడాతో విజయం సాధించి, దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత వరల్డ్ టూర్ 500 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అంతకుముందు సైనా తొలి రౌండ్లో భారత్‌కే చెందిన మాళవిక బాన్సోద్‌పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించింది. 2010లో చివరిసారి ఈ టైటిల్ సాధించిన సైనా.. మరోసారి ఆ ఫీట్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన మిథున్ మంజునాథ్.. రెండో రౌండ్లో వరల్డ్ నెం.42 ర్యాంకర్ నాట్ గుయెన్ చేతిలో 10-21, 18-21, 16-21 తేడాతో పోరాడి ఓడాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి అర్జున్, ధృవ్ కపిలా ద్వయం ప్రపంచ నెం.12 మలేషియా జోడి గో సీ ఫెయ్ - నుర్ ఇజుదుద్దీన్పై 18-21, 24-22, 21-18 తేడాతో సంచలన విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. చదవండి: కిదాంబి శ్రీకాంత్‌కు షాక్.. క్వార్టర్స్‌కు సింధు, ప్రణయ్ -
కిదాంబి శ్రీకాంత్‌కు షాక్.. క్వార్టర్స్‌కు సింధు, ప్రణయ్
సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ఇవాళ (జులై 14) మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్లో వరల్డ్ నెం.11 ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్‌కు భారత్‌కే చెందిన మరో షట్లర్ మిథున్ మంజునాథ్ షాకివ్వగా, హెచ్ఎస్ ప్రణయ్.. ప్రపంచ నెం.4 ఆటగాడు చో టెన్ చెన్పై సంచలన విజయం నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్ గండాన్ని అధిగమించి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించగా.. మరో మ్యాచ్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ భారత్‌కే చెందిన మాళవిక బాన్సోద్‌పై విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మిథున్ మంజునాథ్ చేతిలో కిదాంబి శ్రీకాంత్ పోరాడి (17-21, 21-15, 18-21) ఓడగా.. మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్, చైనీస్ తైపీకి చెందిన చో టెన్ చెన్పై 14-21, 22-20, 21-18తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విషయానికొస్తే.. స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్లో వియత్నాంకి చెందిన వరల్డ్ 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్‌పై 19-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించగా.. వెటరన్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో మాళవిక బాన్సోద్‌పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. మరో మ్యాచ్‌లో అశ్మిత చాలిహా వరల్డ్ నెం.19వ ర్యాంకర్ హ్యాన్ యూయ్ చేతిలో పరాజయం పాలైంది. చదవండి: World Cup 2022: అసలైన మ్యాచ్‌లలో చేతులెత్తేశారు! జపాన్‌తో పోరులో.. -
Malaysia Masters Badminton Tourney: భారత్‌కు నిరాశాజనక ఫలితాలు
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్‌కు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 14–21, 14–21తో పియర్లీ టాన్–తినా (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన అశ్విని–శిఖా; దండు పూజ–ఆరతి జోడీలు కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక 10–21, 17–21తో గో జిన్ వె (మలేసియా) చేతిలో ఓటమి పాలైంది. -
Malaysia Open: తొలి రౌండ్లోనే అవుట్.. పోరాడి ఓడిన సాయి ప్రణీత్
కౌలాలంపూర్: భారత అగ్రశ్రేణి షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 19వ ర్యాంకర్ సాయిప్రణీత్ 15–21, 21–19, 9–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ సీజన్లో సాయిప్రణీత్ ఏడు టోర్నీలలో పాల్గొనగా, ఆరింటిలో తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. మరోవైపు సమీర్ వర్మ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోగా, ప్రణయ్ శుభారంభం చేశాడు. 2018 ఆసియా క్రీడల చాంపియన్ క్రిస్టీ (ఇండోనేసియా) 21–14, 13–21, 21–7తో సమీర్ వర్మను ఓడించగా... ప్రణయ్ 21–14, 17–21, 21–18తో డారెన్ లూ (మలేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–18, 21–11 తో మాన్ వె చోంగ్–కయ్ వున్ టీ (మలేసియా) జోడీపై గెలి చింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని (భారత్) జంట 15– 21, 11–21తో మత్సుయామ–చిహారు (జపాన్) జోడీ చేతిలో ఓడింది. చదవండి: Wimbledon 2022: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు -
అన్నింటికంటే అదే గొప్ప విజయం.. ఇంకేం అవసరం లేదు!
దాదాపు ఐదేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద విజయం అందుకోలేకపోయిన భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తనకు ఎలాంటి విచారం లేదని వ్యాఖ్యానించాడు. ఒక దశలో లీ చోంగ్ వీ, లిన్ డాన్, చెన్ లాంగ్, అక్సెల్సన్‌లను ఓడించి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానానికి చేరాడు ప్రణయ్. కానీ.. ఈ కేరళ షట్లర్ ఇంతవరకు మాస్టర్స్ స్థాయి టోర్నీని గెలవలేకపోయాడు. అయితే తన కెరీర్లో థామస్ కప్ టైటిల్ గెలిచిన జట్టులో భాగం కావడమే గొప్ప క్షణమని, వ్యక్తిగత విజయాలు దక్కకపోయినా తాను బాధపడనని అతను అన్నాడు. కాగా 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్లో ఈ ఏడాది తొలిసారి భారత్ చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్‌లో, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్... తెలంగాణ ప్లేయర్ పంజాల విష్ణువర్ధన్ గౌడ్, కోచ్ సియాదతుల్లా ఈ చిరస్మరణీయ విజయంలో భాగమై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. గెలుపు వీరులు థామస్ కప్‌లో భారత్ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్), లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్), హెచ్ఎస్ ప్రణయ్ (కేరళ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్) పోటీపడ్డారు. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)... ఎం.ఆర్.అర్జున్ (కేరళ)–ధ్రువ్ కపిల (పంజాబ్) జోడీలు బరిలోకి దిగాయి. చదవండి: Rishabh Pant: టి20 కెప్టెన్‌గా రిషబ్ పంత్ అరుదైన రికార్డు -
క్వార్టర్ ఫైనల్లో సింధు .. శ్రీకాంత్ వాకోవర్
బ్యాంకాక్: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 500 టోర్నీ థాయిలాండ్ ఓపెన్‌లో భారత టాప్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21–16, 21–13 స్కోరుతో సిమ్ యు జిన్ (కొరియా)పై విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సింధు ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ మ్యాచ్ ఆడకుండానే ‘వాకోవర్’ ఇవ్వడంతో అతని ప్రత్యర్థి ఎన్‌హట్ గుహెన్ (ఐర్లాండ్) ముందంజ వేశాడు. శ్రీకాంత్ పొత్తి కండరాలు పట్టేయడంతో కోర్టులోకి దిగక ముందే తప్పుకున్నాడు. లెవెర్డెజ్తో జరిగిన తొలి రౌండ్లోనూ అతను ఇదే ఇబ్బందిని ఎదుర్కొన్నా...ఎలాగోలా మ్యాచ్‌ను ముగించగలిగాడు. ఇతర మ్యాచ్‌లలో భారత షట్లర్ల ఆట ముగిసింది. మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్, మహిళల డబుల్స్‌లో అశ్విని భట్–శిఖా గౌతమ్ జోడి, మిక్స్డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్, తనీషా క్రస్టో జంట ఓడారు. -
Uber Cup: టోర్నీకి సిక్కి రెడ్డి దూరం.. కారణమిదే
Uber Cup Tourney: Sikki Reddy- Ashwini Ponnappa: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సిక్కి రెడ్డి ప్రముఖ టీమ్ ఈవెంట్ ఉబెర్ కప్ నుంచి వైదొలిగింది. ఆమె పొత్తికడుపు కండరాల్లో గాయమైంది. కోలుకునేందుకు సిక్కి రెడ్డికి 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తేల్చారు. దాంతో వచ్చే నెల 8 నుంచి 15 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఉబెర్ కప్ నుంచి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట వైదొలిగింది. ఈ జోడీ స్థానంలో సిమ్రన్æ–రితిక జంటను ఉబెర్ కప్ కోసం ఎంపిక చేసినట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. చదవండి: రజతం నెగ్గిన రెజ్లర్లు అన్షు, రాధిక.. మనీషాకు కాంస్యం -
జర్మన్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ల దూకుడు
జర్మన్ ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో వీరిరువురు ప్రత్యర్ధులపై సునాయాస విజయాలు సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. థాయ్‌లాండ్ షట్లర్ బుసానన్ ఆగ్‌బమ్‌రుగ్ఫన్‌ను వరుస గేముల్లో ఓడించింది. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు 21-8, 21-7తో ప్రత్యర్ధిని చిత్తు చేసింది. 𝐀𝐚𝐫𝐚𝐦𝐛𝐡 🔥🏸⏰ 2:30 pm IST onwards (Tentative)#GermanOpen2022#Badminton pic.twitter.com/X1K1kP9owX— BAI Media (@BAI_Media) March 8, 2022 పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిదాంబి శ్రీకాంత్.. ఫ్రాన్స్ షట్లర్ బ్రిస్ లెవర్డెజ్‌ను 21-10, 13-21, 21-7 తేడాతో ఓడించాడు. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఇదే టోర్నీలో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. స్పెయిన్ అమ్మాయి క్లారా అజుర్మెండితో సైనా.. హాంగ్‌కాంగ్ షట్లర్ ఆంగుస్ కా లాంగ్‌తో ప్రణయ్ పోటీపడాల్సి ఉంది. చదవండి: PAK Vs AUS: వార్నర్ ఏమాత్రం తగ్గట్లేదుగా.. ఈసారి భల్లే భల్లే డ్యాన్స్‌తో..! -
పీవీ సింధుకు సదవకాశం.. రెండున్నరేళ్ల లోటు తీరేనా..!
లక్నో: రెండున్నరేళ్లుగా లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను తీర్చుకునేందుకు భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మరో ప్రయత్నం చేయనుంది. నేడు మొదలయ్యే సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీలో సింధు మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 2019 ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన తర్వాత సింధు మరో అంతర్జాతీయ టైటిల్‌ను గెలవలేకపోయింది. గతవారం ఇండియా ఓపెన్ టోర్నీలో సింధు సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. సయ్యద్ మోదీ ఓపెన్ లో టాప్ సీడ్‌గా పోటీపడుతున్న సింధు తొలి రౌండ్లో భారత్‌కే చెందిన తాన్యా హేమంత్‌తో తలపడనుంది. ఇండియా ఓపెన్ సెమీఫైనల్లో తనను ఓడించిన థాయ్‌లాండ్ క్రీడాకారిణి సుపనిదతో సింధు ఈసారి క్వార్టర్ ఫైనల్లో పోటీపడే అవకాశముంది. సుపనిదపై సింధు గెలిస్తే ఆమె దారిలో మరో కఠిన ప్రత్యర్థి లేరనే చెప్పాలి. భారత్‌కే చెందిన మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, మామిళ్లపల్లి తనిష్క్, సామియా ఫారూఖీ, చుక్కా సాయి ఉత్తేజిత రావు, రుత్విక శివాని కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతవారం ఇండియా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన లక్ష్య సేన్... పురుషుల డబుల్స్ టైటిల్ సాధించిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట సయ్యద్ మోదీ ఓపెన్‌కు దూరంగా ఉన్నారు. చదవండి: లీగ్ మధ్యలో చెక్కేసిన పాకిస్థాన్ క్రికెటర్లు -
India Open: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన లక్ష్య సేన్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ లక్ష్యసేన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన సెమీస్‌లో మలేషియాకు చెందిన ప్రపంచ 60వ ర్యాంకర్ యోంగ్‌ను 19-21, 21-16, 21-12 తేడాతో ఓడించి తుది పోరుకు అర్హత సాధించాడు. FIRST SUPER 5️⃣0️⃣0️⃣ FINAL! ✅✅🔥👏Kudos @lakshya_sen ! 👏🔝#YonexSunriseIndiaOpen2022#IndiaKaregaSmash#Badminton pic.twitter.com/FM5kWQlPbe— BAI Media (@BAI_Media) January 15, 2022 ఫైనల్స్‌లో సింగపూర్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ లో కియా యూతో సమరానికి సిద్ధమాయ్యాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్యసేన్.. క్వార్టర్ఫైనల్లో సహచర భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌పై 14-21, 21-9, 21-14 తేడాతో గెలిచి సెమీస్‌కు చేరాడు. కాగా, ఈ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భారత షట్లర్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన భారత షట్లర్.. సింధు, సైనాలకు సాధ్యం కాని ఘనత సొంతం -
India Open: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సహచర షట్లర్ అస్మిత చాలిహపై 21-7, 21-18 తేడాలో సునాయస విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 7వ ర్యాంకర్ సింధు.. ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సెమీస్ పోరులో సింధు.. ఆరవ సీడ్ థాయ్‌లాండ్ క్రీడాకారిణి సుపానిడా కేటేథోంగ్తో తలపడనుంది. కాగా, ఈ టోర్నీలో కరోనా మహమ్మారి కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భారత షట్లర్లు వైరస్ బారిన పడ్డారు. చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం..? -
Kidambi Srikanth: సెమీఫైనల్లో శ్రీకాంత్
Kidambi Srikanth: హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–11, 12–21, 21–19తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడతాడు. ఆకాశ్‌కు కాంస్యం బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. 54 కేజీల విభాగం సెమీఫైనల్లో 21 ఏళ్ల ఆకాశ్ 0–5తో మక్మూద్ సబీర్‌ఖాన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన ఆకాశ్‌కు 25 వేల డాలర్ల (రూ. 18 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హరియాణాలోని భివాని జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన ఏడో భారత బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధూరి (2017), మనీశ్ కౌశిక్ (2019) కాంస్యాలు నెగ్గగా... అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించాడు. -
Uber Cup 2021: వీళ్లు జపాన్ చేతిలో.. వాళ్లు చైనా చేతిలో చిత్తు
Uber Cup 2021: ఆర్హస్ (డెన్మార్క్): థామస్–ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్స్ భారత జట్లు గురువారం కంగు తిన్నాయి. అయితే థామస్ కప్‌లో ఇదివరకే క్వార్టర్స్ చేరిన పురుషుల జట్టు ఆఖరి లీగ్‌లో చైనా చేతిలో ఓడిపోయింది. కానీ ఉబెర్ కప్‌లో మహిళల జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో భారత అమ్మాయిల జట్టుకు 0–3తో జపాన్ చేతిలో చుక్కెదురైంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమితో ఫలితం రావడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు. తొలి సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 12–21, 17–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ యామగుచి చేతిలో కంగుతింది. డబుల్స్‌లో తనీషా–రుతుపర్ణ పండా జోడీ 8–21, 10–21తో యూకి ఫుకుషిమా–మయు మత్సుమొటొ జంట చేతిలో ఓడింది. రెండో సింగిల్స్‌లో అదితి భట్ 16–21, 7–21తో సయాక టకహషి చేతిలో పరాజయం చవిచూసింది. చైనా చేతిలో చిత్తు... భారత పురుషుల జట్టు చివరి గ్రూప్ మ్యాచ్‌ను పరాజయంతో ముగించింది. పటిష్ట చైనా 4–1 తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. డబుల్స్‌లో మాత్రమే మన జోడీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం 21–14, 21–14తో చైనాకు చెందిన హి జి టింగ్ – జూ హావో డోంగ్ జంటను ఓడించింది. మరో డబుల్స్ జంట ఎంపీ అర్జున్ – ధ్రువ్ కపిల 24–26, 19–21తో ల్యూ చెంగ్ – వాంగ్ యి ల్యూ చేతిలో పోరాడి ఓడారు. మూడు సింగిల్స్ మ్యాచ్‌లలో భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, కిరణ్ జార్జ్‌లకు పరాజయం తప్పలేదు. షి యు ఖి 21–12, 21–16తో శ్రీకాంత్‌పై, లూ గ్వాంగ్ జు 14–21, 21–9, 24–22తో సమీర్ వర్మపై, లి షి ఫెంగ్ 21–15, 21–17తో కిరణ్ జార్జ్‌పై గెలుపొందారు. టోర్నీలో భారత్‌కు ఇదే తొలి పరాజయం. నెదర్లాండ్స్, తహిటిలను 5–0 తేడాలతో ఓడించిన మన టీమ్, నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ సమరంలో ఆతిథ్య డెన్మార్క్‌తో తలపడుతుంది. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ -
బల్గేరియన్ ఓపెన్ విజేత సామియా
Samiya Samad: హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సామియా ఇమాద్ ఫారూఖీ ఆదివారం ముగిసిన బల్గేరియన్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సామియా 16–21, 21–20, 21–11తో రెండో సీడ్ ఒజ్గె బేరక్ (టర్కీ)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత్‌కే చెందిన మీరాబా లువాంగ్ మైస్నమ్ 21–19, 7–21, 21–14తో ఐదో సీడ్ డానియల్ నికోలవ్ (బల్గేరియా)పై నెగ్గి టైటిల్ దక్కించుకున్నాడు. చదవండి: CSK Vs DC: చెన్నై అడుగు టైటిల్ వైపు -
క్వార్టర్స్‌లో సింధు
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్ పోరులో సింధు 21–19, 21–15తో సుంగ్ జి హ్యూన్ (దక్షిణ కొరియా)పై వరుస గేముల్లో విజయం సాధించింది. తొలి గేమ్‌లో సింధుకు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. 19–19తో సమానంగా ఉన్న సమయంలో వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ గెలుచుకుంది. పురుషుల విభాగంలో భారత షట్లర్ లక్ష్యసేన్‌కు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అతడు 17–21, 18–21తో రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి (భారత్) ద్వయం 13–21, 14–21తో మిసాకి మత్సుటోమో–అయాక తకహాషి (జపాన్) చేతిలో ఓడింది. సైనా అవుట్ భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 11–21, 8–21తో మూడో సీడ్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. యామగుచి దూకుడు ముందు నిలువలేకపోయిన సైనా... మ్యాచ్‌ను 23 నిమిషాల్లోనే ప్రత్యర్థికి అప్పగించేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల విభాగంలో భారత షట్లర్లు భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌లకు కూడా నిరాశే ఎదురైంది. సాయిప్రణీత్ 12–21, 13–21తో జావో జున్‌పెంగ్ (చైనా) చేతిలో ఓడగా... రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ గాయంతో ఆరంభంలోనే వెనుదిరిగాడు. కేవలం నిమిషం పాటు సాగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ 0–3తో వెనుకబడిన సమయంలో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. -
సాయివిష్ణు జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు పుల్లెల సాయివిష్ణు సత్తా చాటాడు. చండీగఢ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి పీఎస్ రవికృష్ణ (కేరళ)తో కలిసి డబుల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. బుధవారం జరిగిన అండర్–19 బాలుర డబుల్స్ ఫైనల్లో సాయివిష్ణు (తెలంగాణ)–రవికృష్ణ (కేరళ) ద్వయం 18–21, 21–18, 21–16తో గిరీశ్ నాయుడు(ఎయిరిండియా)–శంకర్‌ప్రసాద్ ఉదయ్ కుమార్ (కేరళ) జోడీపై గెలుపొంది టైటిల్‌ను హస్తగతం చేసుకున్నారు. అంతకుముందు సెమీఫైనల్లో సాయివిష్ణు–రవికృష్ణ ద్వయం 21–17, 21–19తో ఆయుశ్ అగర్వాల్–తుషార్ (ఉత్తర్‌ప్రదేశ్)జంటపై, క్వార్టర్స్‌లో 19–21, 21–15, 21–13తో రెండోసీడ్ వెంకట హర్ష వర్ధన్ (ఆంధ్రప్రదేశ్)–అరవింద్ సురేశ్ (కేరళ) జోడీపై, రెండోరౌండ్లో 21–11, 21–16తో కౌశిక్ (తమిళనాడు)–శ్రీకర్ (తెలంగాణ) జంటపై, తొలిరౌండ్లో 21–19, 21–14తో ఆర్యన్ హుడా–పంకజ్ (హరియాణా) జంటపై గెలుపొందారు. బాలికల డబుల్స్ విభాగంలో రెండోసీడ్ అదితి భట్ (ఉత్తరాఖండ్)–తాన్య హేమంత్ (కర్ణాటక) జోడీ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఈ జంట 21–11, 21–9తో ఆరోసీడ్ శ్రుతి మిశ్రా–శైలజా శుక్లా (ఉత్తర్‌ప్రదేశ్) జోడీని ఓడించింది. ఈ కేటగిరీలో వైష్ణవి–కైవల్య లక్ష్మి (తెలంగాణ) జంట క్వార్టర్స్‌లో, కె. భార్గవి–సాయి శ్రీయ (తెలంగాణ) జోడీలు తొలిరౌండ్లో ఓటమి పాలయ్యాయి. మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌పోరులో టాప్ సీడ్ ఎడ్విన్ జాయ్ (కేరళ)–శ్రుతి మిశ్రా (ఉత్తర్‌ప్రదేశ్) జోడీ 21–18, 21–14తో నాలుగోసీడ్ అరవింద్ సురేశ్ (కేరళ)–శ్రీవిద్య గురజాడ (తెలంగాణ) జంటపై నెగ్గి విజేతగా నిలిచింది. బాలికల సింగిల్స్ విభాగంలో మూడోసీడ్ మాన్సిసింగ్ (ఉత్తర్‌ప్రదేశ్), బాలుర సింగిల్స్ కేటగిరీలో రెండోసీడ్ రవి (హరియాణా) చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకున్నారు. -
ప్రిక్వార్టర్స్‌లో సాయి విష్ణు, భార్గవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పి. సాయి విష్ణు (రంగారెడ్డి), కె. భార్గవి (రంగారెడ్డి) ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. బండ్లగూడ ఆసియన్ స్పోర్ట్స్ సెంటర్లో శుక్రవారం జరిగిన అండర్–17 బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో సాయివిష్ణు 21–11, 21–17తో అభినవ్ కృష్ణ (హైదరాబాద్)పై గెలుపొందగా... బాలికల విభాగంలో టాప్‌సీడ్ కె.భార్గవి 21–11, 21–18తో ఏవై స్ఫూర్తి (వరంగల్)ని ఓడించింది. బాలుర డబుల్స్ విభాగంలో వర్షిత్ రెడ్డి (హైదరాబాద్)–విఘ్నేశ్ (రంగారెడ్డి) జోడీ, మిక్స్డ్ డబుల్స్‌లో కె.సాత్విక్ రెడ్డి (మెదక్)–శ్రుతి (హైదరాబాద్) జంట క్వార్టర్స్‌కు చేరుకున్నారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర రెండోరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు బాలుర సింగిల్స్: తారక్ శ్రీనివాస్ (హైదరాబాద్) 21–19, 11–21, 21–12తో అభినయ్ (వరంగల్)పై, భార్గవ్ (ఖమ్మం) 21–9, 21–17తో జనీత్ వివేక్ (హైదరాబాద్)పై, హర్ష (రంగారెడ్డి) 21–16, 21–14తో ధన్ విన్ (హైదరాబాద్)పై, లోకేశ్ (మెదక్) 21–17, 21–10తో నారాయణపై, రోహన్ కుమార్ (రంగారెడ్డి) 21–18, 21–12తో ఉత్తేజ్ కుమార్‌పై, రవి ఉత్తేజ్ (రంగారెడ్డి) 21–18, 21–12తో సిద్ధార్థ్ (కరీంనగర్)పై, స్రవంత్ సూరి (హైదరాబాద్) 21–8, 21–4తో అభిషేక్ (రంగారెడ్డి)పై, వినీత్ (హైదరాబాద్) 22–20, 14–21, 21–17తో వైభవ్ (కరీంనగర్)పై, శశాంక్ సాయి (హైదరాబాద్) 21–14, 21–19తో రుషేంద్ర (మెదక్)పై, సమీర్ రెడ్డి (రంగారెడ్డి) 21–15, 21–11తో అనిరుధ్ (వరంగల్)పై, ఉనీత్ కృష్ణ 21–11, 21–17తో భవ్యంత్ సాయి (రంగారెడ్డి)పై, వర్షిత్ రెడ్డి (హైదరాబాద్) 21–14, 20–22, 21–15తో నిహిత్ (రంగారెడ్డి)పై గెలుపొందారు. బాలికల సింగిల్స్: శ్రుతి (హైదరాబాద్) 21–1, 21–2తో ప్రసన్నపై, సంజన (రంగారెడ్డి) 21–9, 21–12తో సాయి శ్రీయపై, దేవి 21–6, 21–1తో కిరణ్ (కరీంనగర్)పై, శ్రేష్టారెడ్డి (హైదరాబాద్) 21–11, 23–21తో నిఖిల (రంగారెడ్డి)పై, ఆశ్రిత 21–7, 21–1తో కీర్తన (జనగాం)పై, వెన్నెల (హైదరాబాద్) 21–7, 21–4తో నిఖిత రావు (వరంగల్)పై, శిఖా (రంగారెడ్డి) 21–11, 21–13తో హాసినిపై, కైవల్య లక్ష్మి 21–9, 21–7తో శ్రీవల్లి (రంగారెడ్డి)పై, వైష్ణవి (హైదరాబాద్) 21–8, 21–12తో అన్విత (ఖమ్మం)పై, మిహిక 21–19, 22–20తో పల్లవి జోషి (హైదరాబాద్), పూజిత (రంగారెడ్డి) 21–2, 21–4తో హేమపై, శ్రావ్య 21–8, 21–8తో తన్వీ (హైదరాబాద్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు. -
స్కాటిష్ ఓపెన్ విజేత లక్ష్యసేన్
గ్లాస్గో: స్కాటిష్ ఓపెన్ సూపర్–100 ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా భారత యువ షట్లర్ లక్ష్యసేన్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో లక్ష్యసేన్ 18–21, 21–18, 21–19తో యోర్ కోహెల్హో (బ్రెజిల్)పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్ ఓడినా... తర్వాతి రెండు గేమ్‌లను సొంతం చేసుకున్న లక్ష్యసేన్ టైటిల్ హస్తగతం చేసుకున్నాడు. -
బ్యాడ్మింటన్‌లో మెరిసిన మరో తెలంగాణ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: మరో తెలంగాణ అమ్మాయి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో పతకంతో దూసుకొచ్చింది. 16 ఏళ్ల రూహి రాజు డొమినికన్ రిపబ్లిక్ దేశంలో జరిగిన సాంటో డొమింగో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచింది. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రూహి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా బరిలోకి దిగింది. ఫైనల్‌దాకా అసాధారణ పోరాటపటిమతో ఆకట్టుకుంది. టాప్ సీడ్ ఫాబియానా సిల్వా (బ్రెజిల్)తో జరిగిన టైటిల్ పోరులో ఆమె పోరాడి ఓడింది. రూహి 18–21, 21–12, 13–21తో ఫాబియానా చేతిలో పరాజయం పాలైంది. ఈ టోరీ్నలో తెలంగాణ షట్లర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. సీడెడ్ క్రీడాకారిణులను వరుస గేముల్లో కంగుతినిపించింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె 21–18, 21–19తో రెండో సీడ్ అలెజాండ్ర సొటొమయోర్ (గ్వాటెమాలా)ను ఓడించింది. సెమీస్‌లో 21–18, 21–11తో మూడో సీడ్ జాక్వెలైన్ లిమా (బ్రెజిల్)ను కంగుతినిపించింది. -
సింధు శుభారంభం
పారిస్: ఈ ఏడాది తొలి వరల్డ్ టూర్ టైటిల్ కోసం వేచి చూస్తున్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ మిచెల్లి లీ (కెనడా) పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది.గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ యో జియా మిన్ (సింగపూర్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో శుభాంకర్ డే సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్లో ప్రపంచ 42వ ర్యాంకర్ శుభాంకర్ డే 15–21, 21–14, 21–17తో ప్రపంచ 17వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మరోవైపు మంగళవారం విడుదలైన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ కెరీర్ బెస్ట్ 11వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
విజేతలు సాయి ప్రసాద్, ప్రశంస
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టి. సాయి ప్రసాద్, బి. ప్రశంస టైటిళ్లను కైవసం చేసుకున్నారు. చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో టాప్ సీడ్ సాయి ప్రసాద్ (రంగారెడ్డి) 21–10, 21–16తో టి. జ్ఞాన దత్తు (రంగారెడ్డి)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. బాలికల టైటిల్ పోరులో రెండో సీడ్ ప్రశంస (ఖమ్మం) 21–18, 10–21, 21–15తో టాప్ సీడ్ ఎన్. దీప్షిక (రంగారెడ్డి)ను కంగుతినిపించింది. బాలుర డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ వర్షిత్ (ఖమ్మం)–రోహన్ కుమార్ (రంగారెడ్డి) ద్వయం 21–11, 21–10తో రెండో సీడ్ అభినవ్ గార్గ్ (హైదరాబాద్)–Ôౌర్య కిరణ్ (వరంగల్) జోడీపై నెగ్గింది. బాలికల డబుల్స్ తుది పోరులో మూడో సీడ్ షగుణ్ సింగ్–సృష్టి (రంగారెడ్డి) జంట 18–21, 21–19, 21–11తో టాప్ సీడ్ కె. వెన్నెల (హైదరాబాద్)–ప్రశంస (ఖమ్మం) జోడీకి షాకిచ్చింది. -
చాంపియన్ ప్రియాన్షు రజావత్
న్యూఢిల్లీ: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ మరోసారి భారత్ ఖాతాలో చేరింది. భారత యువ ఆటగాడు ప్రియాన్షు రజావత్ (గోపీచంద్ అకాడమీ) సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను అందుకున్నాడు. సోమవారం ఫైనల్లో 17 ఏళ్ల ప్రియాన్షు 16–21, 21–7, 21–12తో టాప్‌సీడ్ జాసన్ ఆంథోని (కెనడా)పై సంచలన విజయం సాధించాడు. గతంలో ఈ టైటిల్‌ను భారత్‌కు చెందిన సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, సాయిప్రణీత్, శుభాంకర్ డే, గురుసాయిదత్ సాధించారు. మహిళల ఫైనల్లో ఐరా శర్మ 14–21, 22–24తో శ్రీ ఫత్మావతి (ఇండోనేసియా) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జూహీ దేవాంగన్–వెంకట్ గౌరవ్ ప్రసాద్ (భారత్) జంట 21–18, 21–16తో పనావత్ –కన్యానత్ ç (థాయ్‌లాండ్) జంటపై గెలుపొందింది. పురుషుల డబుల్స్ టైటిల్‌పోరులో రెండో సీడ్ రోహన్ కపూర్–సౌరభ్ శర్మ (భారత్) జంట 21–9, 16–21, 22–24తో ప్రద్ –అపిచసిత్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడింది. -
సింధుకు మరో పరీక్ష
ఒడెన్స్: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఈ సీజన్లో మరో పరీక్షకు సిద్ధమైంది. నేటి నుంచి జరిగే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమెతో సహా భారత స్టార్ షట్లర్లంతా బరిలోకి దిగుతున్నారు. సింధు ప్రపంచ టైటిల్ నెగ్గినప్పటికీ ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. పైగా చైనా ఓపెన్, కొరియా ఓపెన్లలో అనూహ్యంగా ఆరంభ రౌండ్లలోనే ఓడి నిరాశపరిచింది. నేడు జరిగే తొలి రౌండ్లో గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)తో సింధు ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్... లిన్ డాన్ (చైనా)తో సాయిప్రణీత్.. జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రణయ్ ఆడతారు. -
మేఘనకు డబుల్స్ స్వర్ణం
హైదరాబాద్: ఆసియా పసిఫిక్ యూత్ గేమ్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి మారెడ్డి మేఘనా రెడ్డి సత్తా చాటింది. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో జరిగిన ఈ టోరీ్నలో అండర్–17 బాలికల డబుల్స్ విభాగంలో మేఘన తన భాగస్వామి తో కలిసి విజేతగా నిలిచింది. ప్రస్తుతం మేఘ న భారతీయ విద్యాభవన్స్ స్కూల్లో 11వ తరగతి చదువుతోంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు రష్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్, చైనీస్ తైపీ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈనెల 3 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరిగింది. -
సీబీఐటీ జట్టుకు టైటిల్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆతిథ్య చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ–గండిపేట) జట్టు విజేతగా నిలిచింది. శనివారం ఫైనల్ మ్యాచ్‌లో సీబీఐటీ 2–0తో భవన్స్ (సైనిక్‌పురి)పై విజయం సాధించింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో దహేశ్ (సీబీఐటీ) 21–12, 21–16తో నిఖిల్ కుమార్‌పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో మనీశ్ (సీబీఐటీ) 21–13, 21–13తో శశాంక్‌ను ఓడించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సీఎస్ఐ కాలేజి 2–1తో బద్రుకా కాలేజిని ఓడించింది. తొలి సింగిల్స్‌లో నీరజ్ (సీఎస్ఐ) 21–19, 18–21, 21–16తో భరత్ (బద్రుకా)పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో రాహుల్ (బద్రుకా) 21–18, 21–19తో అఖిల్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేశాడు. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో నీరజ్–అఖిల్ ద్వయం 22–20, 21–19తో రమనీత్ సింగ్–రాహుల్ జోడీపై గెలుపొంది మూడోస్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో భవన్స్ (సైనిక్‌పురి) 2–1తో బద్రుకా జట్టుపై, సీబీఐటీ 2–1తో సీఎస్ఐ జట్టుపై విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సీబీఐటీ కాలేజి ప్రిన్సిపాల్ పి. రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యూసీపీఈ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, ఓయూ ఐసీటీ కార్యదర్శి ప్రొఫెసర్ కె. దీప్లా తదితరులు పాల్గొన్నారు. -
సౌరభ్ వర్మదే టైటిల్
హో చి మిన్ సిటీ: వియాత్నం ఓపెన్ సూపర్ 100 టైటిల్‌ను భారత షట్లర్ సౌరభ్ వర్మ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో సౌరభ్ వర్మ 21-12, 17-21, 21-14 తేడాతో సన్ ఫి యింగ్(చైనా)పై గెలిచి విజేతగా నిలిచాడు. తొలి గేమ్‌ను సౌరభ్ వర్మ అవలీలగా గెలిస్తే.. రెండో గేమ్‌ను కోల్పోయాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో వర్మ వెనుకబడి దాన్ని కోల్పోయాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మళ్లీ టచ్‌లోకి వచ్చిన సౌరభ్ సుదీర్ఘ ర్యాలీలతో పాటు అద్భుతమైన స్మాష్‌లతో ఆకట్టుకున్నాడు. మూడో గేమ్ ఆరంభంలో ఇరువురు 6-6తో సమంగా నిలిచిన సమయంలో సౌరభ్ వర్మ విజృంభించి ఆడాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ సన్ ఫి యింగ్‌ను వెనక్కినెట్టాడు. ఈ క్రమంలోనే కడవరకూ తన ఆధిక్యాన్ని కాపాడుకున్న సౌరభ్ వర్మ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఫలితంగా వియాత్నం ఓపెన్‌ను చేజిక్కించుకున్నాడు. -
సాయివిష్ణు, శ్రీకృష్ణ సాయికుమార్ ముందంజ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుల్లెల సాయివిష్ణు, శ్రీకృష్ణ సాయికుమార్ ముందంజ వేశారు. శుక్రవారం ప్రారంభమైన ఈ టోర్నీల్లో లో వీరిద్దరూ పురుషుల సింగిల్స్ విభాగంలో మూడోరౌండ్లో విజయం సాధించారు. మూడోరౌండ్ తొలి మ్యాచ్‌లో సాయివిష్ణు 17–15, 15–11తో పి. సాకేత్‌రెడ్డి (రంగారెడ్డి)పై గెలుపొందగా... శ్రీకృష్ణ సాయికుమార్ 15–12, 6–15, 15–8తో ఉదయ్ తేజ (హైదరాబాద్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో వన్షిక కపిల, కె. మమత (రంగారెడ్డి), వెన్నెల, లయ (హైదరాబాద్) మూడోరౌండ్లో అడుగుపెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో వన్షిక 17–15, 17–15తో మృతిక షెనోయ్ (హైదరాబాద్)పై, మమత 15–10, 15–5తో స్ఫూర్తి (వరంగల్)పై, వెన్నెల 15–10, 15–10తో సౌమ్య వ్యాస్ (మెదక్)పై, లయ 15–9, 15–6తో సుప్రియ (రంగారెడ్డి)పై నెగ్గారు. బాలుర డబుల్స్ రెండో రౌండ్లో విష్ణువర్ధన్–శ్రీకృష్ణ సాయికుమార్ (రంగారెడ్డి) ద్వయం 15–9, 15–13తో నిఖిల్రాజ్–మనీశ్ కుమార్ (హైదరాబాద్) జోడీపై గెలుపొందగా... మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో నవనీత్–సాహితి (మెదక్) జంట 15–2, 15–3తో రాకేశ్–మీనా (రంగారెడ్డి) జోడీని ఓడించి మూడో రౌండ్లో అడుగుపెట్టింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు పురుషుల సింగిల్స్ మూడోరౌండ్: రోహిత్ రెడ్డి (హైదరాబాద్ 15–10 15–2తో శశాంక్ (వరంగల్)పై, విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) 16–14 15–12తో ఓంప్రకాశ్ రెడ్డి (రంగారెడ్డి)పై, విజేత (హైదరాబాద్) 15–9 15–5 తో గౌతమ్ (నల్లగొండ)పై, సతీశ్ (హైదరాబాద్) 15–5 15–9తో అనిల్ కుమార్ (వరంగల్)పై, గోపాల్ కృష్ణ (రంగారెడ్డి) 15–7 15–8తో ఆశ్రయ్ కుమార్ (రంగారెడ్డి)పై, తరుణ్ (ఖమ్మం) 15–6 15–2తో నిక్షిప్త్ నారాయణ (హైదరాబాద్)పై, అభీశ్ (హైదరాబాద్)15–4, 15–11తో మహేశ్ (ఖమ్మం)పై గెలుపొందారు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్: తరుణ్ (హైదరాబాద్)– శ్రీయ(మెదక్) జంట 15–9, 15–9తో ముహీబ్–లిఖిత (రంగారెడ్డి) జోడీపై, లోహిత్–వైష్ణవి (రంగారెడ్డి) 15–6, 15–7తో రోహిత్ రెడ్డి–మృతిక షెనోయ్ (హైదరాబాద్)పై, సందీప్ కుమార్–సుప్రియ (రంగారెడ్డి) 15–7, 15–8తో అరుణ్–నిఖిల్ (రంగారెడ్డి)పై, సాయిపృథ్వీ–అభిలాష (హైదరాబాద్) జంట 15–8, 15–5తో అజయ్ (నల్లగొండ)–శివారెడ్డి (హైదరాబాద్) జోడీపై నెగ్గి ముందంజ వేశాయి. -
సామియాకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: బల్గేరియా జూనియర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి సామియా ఇమాద్ ఫారూఖి స్వర్ణ పతకం సాధించింది. బల్గేరియాలో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో సామియా 9–21, 21–12, 22–20తో రెండో సీడ్ అనస్తాసియా షపోవలోవా (రష్యా)పై గెలిచింది. బాలుర డబుల్స్ విభాగంలో తెలంగాణ ఆటగాడు విష్ణువర్ధన్ గౌడ్–ఇషాన్ భట్నాగర్ (భారత్) జంటకు రజతం లభించింది. ఫైనల్లో విష్ణువర్ధన్–ఇషాన్ జోడీ 19–21, 18–21తో విలియమ్ జోన్స్–బ్రెండన్ జి హావో (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఎడ్విన్ జాయ్–శ్రుతి మిశ్రా (భారత్); బాలికల డబుల్స్‌లో తనీషా–అదితి భట్ (భారత్) జోడీలకు స్వర్ణ పతకాలు లభించాయి. -
విజేత ప్రణవ్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ గంధం ప్రణవ్ రావు విజేతగా నిలిచాడు. గువాహటిలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో ప్రణవ్ రావు అండర్–17 బాలుర సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ప్రణవ్ 21–14, 21–19తో అయూశ్ రాజ్ గుప్తా (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించాడు. లోకేశ్ రెడ్డి డబుల్ ధమాకా.... అండర్–15 బాలుర విభాగంలో తెలంగాణకే చెందిన లోకేశ్ రెడ్డి డబుల్ ధమాకా సృష్టించాడు. అతను సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలో టైటిల్స్ సాధించాడు. డబుల్స్ ఫైనల్లో లోకేశ్ రెడ్డి–అంకిత్ మండల్ (పశ్చిమ బెంగాల్) ద్వయం 21–12, 21–12తో టాప్ సీడ్ గగన్–మయాంక్ రాణా (హరియాణా) జోడీపై నెగ్గగా... సింగిల్స్ ఫైనల్లో లోకేశ్ 25–23, 18–21, 21–14తో రాఘవ్ (హరియాణా)పై గెలిచాడు. -
ఫైనల్లో సాత్విక్ జోడి
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగన పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో సాత్విక్ ద్వయం 22-20, 22-24, 21-9 తేడాతో కొ సంగ్ హ్యూన్ – షిన్ బేక్ చియోల్ (కొరియా) జోడిపై గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సాత్విక్-చిరాగ్‌ల జోడి.. రెండో గేమ్‌లో ఓటమి పాలైంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్-చిరాట్‌ల ద్వయం రెచ్చిపోయి ఆడింది. ఏ దశలోనూ కొ సంగ్ హ్యూన్ – షిన్ బేక్ చియోల్లకు అవకాశం ఇవ్వకుండా భారీ తేడాతో గేమ్‌ను గెలుచుకోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో సాత్విక్-చిరాగ్‌ల జోడి లి జున్ హు- యు చెన్(చైనా)తో తలపడనుంది. -
సాయిప్రణీత్ నిష్క్రమణ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత టైటిల్ ఆశలను మోస్తున్న భమిడిపాటి సాయిప్రణీత్ కూడా ఓటమి పాలయ్యాడు. క్రితం వారం జరిగిన జపాన్ ఓపెన్‌లో సెమీస్ మెట్టు వరకు చేరిన ప్రణీత్ ఈ సారి మాత్రం క్వార్టర్స్ నుంచే ఇంటి దారి పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రణీత్ 18–21, 12–21తో కంట సునెయామ (జపాన్) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యాడు. పోటాపోటీగా సాగిన మొదటి గేమ్ చివర్లో తడబడిన అతను 18–17 ఆధిక్యం నుంచి 18–21తో గేమ్‌ను కోల్పోయాడు. అనంతరం మరింత చేలరేగిన సునెయామ రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. డబుల్స్‌లో మిశ్రమ ఫలితాలు శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల విభాగంలో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టి జంట 21–17, 17–21, 21–19తో చోయ్ సోల్గ్యు – సియో సెంగ్ జే (కొరియా) ద్వయంపై పోరాడి గెలవగా... మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – అశ్విని పొన్నప్ప జోడి 13–21, 15–21తో యుట వటనాబె – అరిస హిగాషినో (జపాన్) జోడి చేతిలో ఓడింది. నేటి సెమీస్ మ్యాచ్‌లో కొ సంగ్ హ్యూన్ – షిన్ బేక్ చియోల్ (కొరియా) ద్వయంతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్‌శెట్టి ద్వయం తలపడనుంది. -
టైటిల్ పోరుకు సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో సిరిల్ వర్మ ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ సిరిల్ వర్మ 21–9, 21–18తో శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు)పై విజయం సాధించాడు. అంతకుముందు క్వార్టర్స్ మ్యాచ్‌లో సిరిల్ 21–19, 21–7తో రోహిత్ యాదవ్ (తెలంగాణ)ను ఓడించాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ప్రీతి పోరు క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో ప్రీతి 9–21, 12–21తో మూడో సీడ్ ఆకర్షి కశ్యప్ (ఏఏఐ) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆర్బీఐ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న హైదరాబాద్ అమ్మాయి మేఘన జక్కంపూడి తన భాగస్వామి ధ్రువ్ కపిలతో కలిసి ఫైనల్‌కు చేరుకుంది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ ధ్రువ్ కపిల (ఎయిరిండియా)–మేఘన ద్వయం 21–12, 21–12తో అరుణ్ జార్జ్ (కేరళ)–మహిమ (కర్ణాటక) జోడీపై గెలుపొందింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్‌సీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)–ధ్రువ్ (ఎయిరిండియా) ద్వయం 21–12, 14–21, 21–14తో సంజయ్ (పాండిచ్చేరి)–సిద్ధార్థ్ (తెలంగాణ) జంటపై గెలుపొందింది. -
క్వార్టర్స్‌లో సిరిల్ వర్మ, రోహిత్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు సిరిల్ వర్మ, చిట్టబోయిన రోహిత్ యాదవ్ నిలకడగా రాణిస్తున్నారు. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. నగరానికే చెందిన మరో ప్లేయర్ రాహుల్ యాదవ్ ప్రిక్వార్టర్లో ఓడిపోయాడు. రాహుల్ 18–21, 21–17, 10–21తో రోహన్ చేతిలో ఓడిపోయాడు. శుక్రవారం ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ సిరిల్ వర్మ (తెలంగాణ) 21–15, 19–21, 21–11తో క్వాలిఫయర్ ప్రియాన్షు రజావత్‌పై గెలుపొందాడు. అంతకుముందు రెండో రౌండ్లో సిరిల్ వర్మ 21–7, 21–13తో క్వాలిఫయర్ హిమాన్షు తివారీ (ఉత్తరాఖండ్)పై, తొలిరౌండ్లో 21–11, 21–17తో అమన్ ఫరోగ్ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. టాప్ సీడ్ రోహిత్ యాదవ్ ప్రిక్వార్టర్స్‌లో 24–22, 11–21, 21–17తో ఎం. రఘు (కర్ణాటక)పై, రెండో రౌండ్లో 21–19, 21–12తో అనంత్ శివమ్ జిందాల్ (హరియాణా)పై, తొలిరౌండ్లో 21–16, 21–16తో నవీన్ (క్వాలిఫయర్)పై నెగ్గి ముందంజ వేశాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ రాహుల్ యాదవ్ (తెలంగాణ) 18–21, 21–17, 10–21తో క్వాలిఫయర్ రోహన్ గుర్బానీ (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయాడు. మహిళల విభాగంలో ప్రీతి (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్స్‌కు చేరుకోగా... నిషితా వర్మ, జి. వృశాలి, (ఆంధ్రప్రదేశ్) ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రీతి 21–17, 7–21, 21–10తో త్రిషా హెగ్డే (కర్ణాటక)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో నిషితా వర్మ 16–21, 8–21తో ఉన్నతి బిష్త్ (ఉత్తరాఖండ్) చేతిలో, వృశాలి 21–15, 18–21, 11–21తో వైదేహి చౌదరీ (మహారాష్ట్ర) చేతిలో ఓటమి పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు శ్రీకృష్ణ సాయికుమార్ తన జోడీ కావ్య గాంధీతో కలిసి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణ–కావ్య (ఢిల్లీ) ద్వయం 16–21, 21–18, 21–19తో కబీర్ (రైల్వేస్)–సోనిక సాయి (ఆంధ్రప్రదేశ్) జంటపై గెలుపొందింది. మరో పోరులో ఐదో సీడ్ గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మయూరి (గుజరాత్) జంట 21–16, 23–21తో సాంగ్రమ్ చుటియా–మనాలి బోరా (అస్సాం) జోడీపై గెలుపొంది ముందంజ వేసింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)– ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జంట 21–7, 21–16తో ప్రతీక్ రనడే– అక్షయ్ రౌత్ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొంది క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో సంజయ్ శ్రీవత్స (పాండిచ్చేరి)–సిద్ధార్థ్ (తెలంగాణ) జంట 21–16, 13–21, 21–15తో ఆరోసీడ్ ప్రకాశ్ రాజ్–వైభవ్ (కర్ణాటక) జోడీకి షాకిచ్చింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో సాహితి (తెలంగాణ)–ధ్రితి(కర్ణాటక) ద్వయం 23–21, 21–12తో రమ్య(తమిళనాడు)–మయూరి యాదవ్ (గుజరాత్) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది. -
నిరీక్షణ ముగిసేనా!
ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్‌కు అంతగా కలిసి రాలేదు. సైనా నెహ్వాల్ టైటిల్ నెగ్గడం మినహా ఇప్పటివరకు పురుషుల సింగిల్స్‌లో ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులు టైటిల్ సాధించలేకపోయారు. విపరీతమైన పోటీ, కీలక సమయాల్లో తడబాటు, ఇంకా కుదురుకోని కొత్త కోచ్‌లు... ఇతరత్రా కారణాలతో భారత ఆటగాళ్లు ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. అయితే ఈనెల నాలుగు నుంచి జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనైనా పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు విజయం సాధించి టైటిల్ నిరీక్షణకు ముగింపు పలుకుతారో లేదో వేచి చూడాలి. సాక్షి, హైదరాబాద్: సుదర్మిన్ కప్‌లో నిరాశాజనక ఫలితాల తర్వాత భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు మరోఅంతర్జాతీయ టోర్నమెంట్‌కు సంసిద్ధమయ్యారు. ఈనెల నాలుగున సిడ్నీలో మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ సూపర్–300 టోర్నమెంట్లో పాల్గొనేందుకు భారత బృందం శుక్రవారం బయలుదేరింది. అందుబాటులో ఉన్న ‘డ్రా’ ప్రకారం పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ బరిలో ఉన్నారు. క్వాలిఫయింగ్‌లో రైజింగ్ స్టార్ లక్ష్య సేన్ పోటీపడుతున్నాడు. భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఈ టోర్నమెంట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ సీజన్లో ఏడో టోర్నమెంట్లో ఆడనున్న సాయిప్రణీత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది స్విస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన సాయిప్రణీత్ ఆ తర్వాత ఆశించినరీతిలో ఆడలేకపోయాడు. కశ్యప్, ప్రణయ్‌లకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో లిన్ డాన్‌తో ప్రణయ్; సుపన్యు అవింగ్సనోన్తో కశ్యప్ ఆడతారు. ఒకవేళ వీరిద్దరు గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. సాయిప్రణీత్ తొలి రౌండ్లో లీ డాంగ్ కెయున్ (కొరియా)తో పోటీపడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అతనికి ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) ఎదురయ్యే చాన్స్ ఉంది. మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పీవీ సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలి రౌండ్లో సింధు క్వాలిఫయర్‌తో ఆడనుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మను అత్రి–సుమీత్ రెడ్డి జోడీలు తొలి రౌండ్లోనే ముఖాముఖిగా తలపడనున్నాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి జంట బరిలోకి దిగనుంది. -
చాంపియన్ సామియా
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి సామియా ఇమాద్ ఫారూఖి సత్తా చాటింది. తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 బాలికల సింగిల్స్ విభాగంలో సామియా విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఐదో సీడ్ సామియా 21–17, 21–12తో పదహారో సీడ్ ఆషి రావత్ (ఢిల్లీ)పై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో సామియా 21–16, 21–13తో అక్షయ అర్ముగం (తమిళనాడు)పై విజయం సాధించింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ మైస్నమ్ మీరాబా (మణిపూర్) టైటిల్‌ను అందుకున్నాడు. ఫైనల్లో మైస్నమ్ 21–19, 12–7తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో మైస్నమ్ విజేతగా నిలిచాడు. బాలుర డబుల్స్ విభాగంలో పి. విష్ణువర్ధన్ (తెలంగాణ) జంట టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. తుదిపోరులో రెండో సీడ్ ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్)–పి. విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ) ద్వయం 21–18, 21–13తో టాప్ సీడ్ మంజిత్ సింగ్–డింకూ సింగ్ (మణిపూర్) జంటపై నెగ్గిం ది. సెమీఫైనల్లో విష్ణువర్ధన్ జోడీ 21–16, 21–23, 21–14తో ఐదో సీడ్ యశ్ రైక్వార్ (మధ్యప్రదేశ్)–ఇమాన్ సోనోవాల్ (అస్సాం) జంటపై నెగ్గింది. -
సెమీస్‌లో గాయత్రి ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి పోరాటం ముగిసింది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో గాయత్రి 15–21, 7–21తో ఆషి రావత్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో గాయత్రి 21–16, 21–11తో ఏడో సీడ్ స్మిత్ తోష్నివాల్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా... ఐదో సీడ్ సామియా ఇమాద్ ఫరూఖీ 21–14, 21–16తో పదో సీడ్ కవిప్రియ (పాండిచ్చేరి)ని ఓడించింది. బాలుర క్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ డి. శరత్ (ఆంధ్రప్రదేశ్) 21–10, 16–21, 12–21తో నాలుగోసీడ్ సతీశ్ కుమార్ (తమిళనాడు) చేతిలో ఓటమి పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాల్లో నవనీత్ జోడీకి చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ నవనీత్–సాహితి ద్వయం 23–25, 21–17, 13–21తో ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్)–తనీషా క్రాస్టో(గోవా) జంట చేతిలో ఓడిపోయింది. బాలుర డబుల్స్ క్వార్టర్స్‌లో మూడో సీడ్ నవనీత్ (తెలంగాణ)–ఎడ్విన్ జాయ్ (కేరళ) ద్వయం 14–21, 19–21తో ఐదోసీడ్ యశ్ రైక్వార్ (మధ్యప్రదేశ్)–ఇమాన్ సోనోవాల్ (అస్సాం) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్)–విష్ణువర్ధన్‌గౌడ్ (తెలంగాణ) ద్వయం 17–21, 21–8, 21–14తో హరిహరన్–రుబన్ కుమార్ (తమిళనాడు)పై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టగా... ఏడోసీడ్ అచ్యుతాదిత్య (తెలంగాణ)–వెంకట హర్షవర్ధన్ (ఆంధ్రప్రదేశ్) జంట 19–21, 12–21తో టాప్ సీడ్ మంజిత్ సింగ్– డింకూ సింగ్ (మణిపూర్) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. బాలికల డబుల్స్ క్వార్టర్స్‌లో ఏడో సీడ్ శ్రీవిద్య గురజాడ–సాయి శ్రీయ (తెలంగాణ) జంట 19–21, 12–21తో టాప్ సీడ్ త్రెసా జోలీ (కేరళ)–వర్షిణి (తమిళనాడు) జంట చేతిలో, సాహితి బండి (తెలంగాణ)–ద్రితి (కర్ణాటక) జోడీ 13–21, 16–21తో ఆరోసీడ్ సిమ్రన్–రితిక (మహారాష్ట్ర) జంట చేతిలో ఓడిపోయింది. -
గాయత్రి శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పుల్లెల గాయత్రి శుభారంభం చేసింది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్‌సీడ్ గాయత్రి 21–15, 21–15తో ఖుషీ ఠక్కర్ (ఢిల్లీ)పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో కేయూర మోపాటి (తెలంగాణ) 21–13, 21–10తో ధ్రితి (కర్ణాటక)పై, సామియా ఇమాద్ ఫరూఖీ (తెలంగాణ) 21–17, 21–12తో స్నేహా రజ్వర్ (ఉత్తరాఖండ్)పై, శ్రీవిద్య గురజాడ (తెలంగాణ) 21–9, 12–21, 21–18తో కృతి (కర్ణాటక)పై గెలుపొందారు. బాలుర సింగిల్స్ తొలిరౌండ్లో ప్రణవ్ రావు (తెలంగాణ) 17–21, 22–20, 21–12తో చాయనిత్ జోషి (ఉత్తరాఖండ్)పై, సాయిచరణ్ (ఆంధ్రప్రదేశ్) 21–13, 21–9తో అనీశ్ చంద్ర (తెలంగాణ)పై, శరత్ (ఆంధ్రప్రదేశ్) 21–19, 21–14తో జాకబ్ థామస్ (కేరళ)పై, తరుణ్ (తెలంగాణ) 26–24, 19–21, 22–20తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై గెలిచి ముందంజ వేశారు. -
పుల్లెల గాయత్రికి టాప్ సీడింగ్
చెన్నై: యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రికి టాప్ సీడింగ్ దక్కింది. నేటి నుంచి ఇక్కడ జరుగనున్న ఈ టోర్నమెంట్లో దేశంలోని నలుమూలల నుంచి మొత్తం 1000 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. అండర్–19 కేటగిరీ బాలికల సింగిల్స్‌లో తలపడనున్న 16 ఏళ్ల గాయత్రికి ఈ టోర్నీలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆకర్షి కశ్యప్ నుంచి పోటీ ఎదురవనుంది. త్వరలో చైనా వేదికగా జరిగే జూనియర్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు క్వాలిఫయింగ్ టోర్నీగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో సత్తా చాటేందుకు వీరిద్దరితో పాటు మాళవిక బన్సోద్, ఉన్నతి బిష్త్ సిద్ధమయ్యారు. బాలుర విభాగంలో మధ్యప్రదేశ్ క్రీడాకారుడు ప్రియాన్షు రజావత్ టాప్‌సీడ్‌గా బరిలో దిగనున్నాడు. మణిపూర్‌కు చెందిన మైస్నమ్ మీరాబా, చెన్నై క్రీడాకారుడు శంకర్ ముత్తుస్వామితో పాటు సాయిచరణ్ కోయ, కె. సతీశ్ కుమార్, ఆకాశ్ యాదవ్ ఈ టోర్నీలో వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బాలుర డబుల్స్ విభాగంలో మంజిత్ సింగ్–డింకూ సింగ్ జంట... బాలికల డబుల్స్‌లో త్రిషా జోలీ–వర్షిణి జోడీ... మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో తెలంగాణకు చెందిన నవనీత్ బొక్కా–సాహితి బండి జంటలు టాప్ సీడ్లుగా బరిలో దిగనున్నాయి. మెరుగైన ర్యాంకుల్లో ఉన్న 32 మంది సింగిల్స్ క్రీడాకారులు మెయిన్‌డ్రాకు నేరుగా అర్హత పొందారు. క్వాలిఫయింగ్ పోటీల్లో 500కు పైగా బాలురు, 220 మంది బాలికలు తలపడనున్నారు. -
ఫైనల్లో రాహుల్ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు చిట్టబోయిన రాహుల్ యాదవ్‌కు నిరాశ ఎదురైంది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టోర్నీలో రాహుల్ తుదిమెట్టుపై బోల్తాపడ్డాడు. ఫైనల్లో క్వాలిఫయర్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ రాహుల్ యాదవ్ 21–18, 9–21, 18–21తో కిరణ్ జార్జ్ (కేరళ) చేతిలో పరాజయం పాలయ్యాడు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కృష్ణప్రసాద్ తన భాగస్వామి ధ్రువ్ కపిల (ఎయిరిండియా)తో కలిసి టైటిల్‌ను అందుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల ద్వయం 21–17, 19–21, 21–15తో రూపేశ్‌కుమార్–దిజు (పెట్రోలియం) జంటపై గెలుపొందింది. మహిళల డబుల్స్ విభాగంలో కేయూర మోపాటి జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో కేయూర (తెలంగాణ)–రుతుపర్ణ (ఒడిశా) జంట 11–21, 17–21తో శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జోడీ చేతిలో ఓటమి పాలైంది. , , -
సిరిల్ వర్మకు సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు సిరిల్ వర్మ సత్తా చాటాడు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో సిరిల్ వర్మ విజేతగా నిలిచి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఫైనల్లో పదమూడో సీడ్ సిరిల్ వర్మ 21–17, 13–21, 21–8తో కిరణ్ జార్జ్ (కేరళ)పై విజయం సాధించాడు. మహిళల విభాగంలో మాల్విక బన్సోద్ (ఏఏఐ) చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు పొదిలే శ్రీకృష్ణ సాయికుమార్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన శ్రీకృష్ణ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఏపీ) ద్వయం 20–22, 5–14తో రెండో సీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ రోహన్ కపూర్ (ఎయిరిండియా)–రుతుపర్ణ పండా (ఒడిశా) జంట 21–19, 21–14తో శ్రీకృష్ణ సాయికుమార్–కనిక కన్వల్ (రైల్వేస్) జోడీపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మనీషా (ఆర్బీఐ)–రుతుపర్ణ (ఒడిశా) ద్వయం 21–18, 21–13తో టాప్ సీడ్ అపర్ణ బాలన్ (పెట్రోలియం)–ప్రజక్తా సావంత్ (ఎయిరిండియా) జోడీకి షాకిచ్చింది. -
డచ్, జర్మన్ టోర్నీలకు సామియా, గాయత్రి
న్యూఢిల్లీ: జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్న హైదరాబాదీ అమ్మాయిలు సామియా ఇమాద్ ఫారుఖీ, పుల్లెల గాయత్రిలు విదేశీ టోర్నీలకు ఎంపికయ్యారు. డచ్, జర్మన్ అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే జూనియర్ జట్లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) బుధవారం ఎంపిక చేసింది. మొత్తం 20 మందితో కూడిన బాలబాలికల జట్లను ప్రకటించింది. ఇందులో 10 మంది చొప్పున బాలురు, బాలికలు ఉన్నారు. అయితే ఈ 20 మందిలో ఆరుగురు షట్లర్లు తెలంగాణ వారే కావడం గమనార్హం. మరొకరు ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాయిచరణ్ కావడంతో తెలుగువారే ఏడుగురున్నారు. డచ్ టోర్నమెంట్ ఈ నెల 27 నుంచి మార్చి 3 వరకు... అనంతరం జర్మన్ ఈవెంట్ మార్చి 7 నుంచి 10 వరకు జరుగనున్నాయి. బాలికల సింగిల్స్‌లో భారత కోచ్ గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి, సామియాలతో పాటు స్మిత్ తొష్నివాల్ (మహారాష్ట్ర), అమోలిక సింగ్ (ఉత్తరప్రదేశ్) ఎంపికవగా, బాలుర సింగిల్స్‌లో సాయిచరణ్ (ఏపీ), మైస్నమ్ మిరబా (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్), సతీశ్ కుమార్ (తమిళనాడు)లు ఉన్నారు. తెలంగాణ కుర్రాడు బొక్కా నవనీత్ బాలుర డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనున్నాడు. వర్షిణి బాలికల డబుల్స్‌లో బండి సాహితి మిక్స్డ్ డబుల్స్ జట్టులో ఎంపికవగా... విష్ణువర్ధన్ గౌడ్‌కు బాలుర డబుల్స్ జట్టులో చోటు దక్కింది. విజయవాడ, బెంగళూరు, జైపూర్ నగరాల్లో గత నెలలో నిర్వహించిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా షట్లర్లను ఎంపిక చేసినట్లు ‘బాయ్’ వెల్లడించింది. విజేతగా నిలిచిన వారికి 500 పాయింట్లు, రన్నరప్‌కు 425 పాయింట్లు, సెమీఫైనలిస్ట్‌లకు 350 పాయింట్లు, క్వార్టర్, ప్రిక్వార్టర్ ఫైనలిస్ట్‌లకు వరుసగా 275, 192 పాయింట్లు కేటాయించారు. దీంతో హైదరాబాదీ సామియాకు 1125 పాయింట్లు దక్కాయి. -
నవనీత్–సాహితి జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్లు నవనీత్ బొక్కా, సాహితి బండి సత్తా చాటారు. విజయవాడలో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జంటగా టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన అండర్–19 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ నవనీత్–సాహితి (తెలంగాణ) ద్వయం 21–19, 21–11తో టాప్ సీడ్ ఎడ్విన్ జాయ్–నఫీసా సారా సిరాజ్ (కేరళ) జోడీపై కేవలం 24 నిమిషాల్లోనే విజయం సాధించింది. బాలుర విభాగంలో ఏపీ ప్లేయర్ సాయి చరణ్ కోయకు నిరాశ ఎదురైంది. బాలుర సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ సాయి చరణ్ 21–14, 22–24, 21–14తో టాప్ సీడ్ మైస్నమ్ మీరాబా (మణిపూర్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. బాలికల సింగిల్స్ విభాగంలో స్మిత్ తోష్నివాల్ (మహారాష్ట్ర), బాలుర డబుల్స్ విభాగంలో యశ్ రైక్వార్–ఇమాన్ సోనోవాల్ జంట, బాలికల డబుల్స్ కేటగిరీలో టాప్‌సీడ్ త్రెసా జోలీ–వర్షిణి (తమిళనాడు) జంట టైటిళ్లను గెలుచుకున్నారు. -
క్వార్టర్స్‌లో గాయత్రి, సామియా
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్లు పుల్లెల గాయత్రి, సామియా ఇమాద్ ఫరూఖీ, తరుణ్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. జైపూర్‌లో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ గాయత్రి 21–19, 21–12తో తనీషా సింగ్ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందగా... ఏడో సీడ్ సామియా ఇమాద్ ఫరూఖీ 21–16, 21–12తో ఆషి రావత్ (ఢిల్లీ)ని ఓడించింది. బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ తరుణ్ 21–19, 21–16తో రెండోసీడ్ మైస్నమ్ మేరాబ (మణిపూర్)కు షాకిచ్చి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ సాయిచరణ్ కోయ (ఆంధ్రప్రదేశ్) 17–21, 21–19, 21–19తో శంకర్ ముత్తుస్వామిపై గెలుపొందగా.... ప్రణవ్ రావు గంధం (తెలంగాణ) 21–17, 22–24, 10–21తో సతీశ్ కుమార్ (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ రెండోరౌండ్లో రెండోసీడ్ నవనీత్–సాహితి (తెలంగాణ) ద్వయం 27–25, 21–17తో రవికృష్ణ (కేరళ)– వర్షిణి (తమిళనాడు) జంటపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. బాలుర డబుల్స్ విభాగంలోనూ నవనీత్ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ నవనీత్– విష్ణువర్ధన్ (తెలంగాణ) జంట 21–10, 21–14తో మొహమ్మద్ అమన్– ఖవర్ జమాల్ ఖాన్ (రాజస్తాన్) జోడీపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో ఖదీర్ మొయినుద్దీన్ (తెలంగాణ)–అరవింద్ (కేరళ) జంట 21–19, 21–13తో సూరజ్–అన్షుమన్ గొగోయ్ (అస్సాం) జంటపై, నితిన్ (కర్ణాటక)– వరప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) జంట 21–11, 17–21, 21–14తో అరుణేశ్–గోకుల్ (తమిళనాడు) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. శరత్ (ఆంధ్రప్రదేశ్)–అచ్యుతాదిత్య రావు (తెలంగాణ) ద్వయం 14–21, 18–21తో ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్)–ఎడ్విన్ జాయ్ (కేరళ) జంట చేతిలో ఓడిపోయి రెండోరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బాలికల డబుల్స్ ప్రిక్వా ర్టర్స్‌లో సాహితి–నఫీసా జంటకు వాకోవర్ లభించింది. మరో మ్యాచ్‌లో శ్రీవిద్య గురజాడ–సాయి శ్రీయ (తెలంగాణ) ద్వయం 21–11, 21–13తో ఆర్య–లివియా ఫెర్నాండేజ్ (మహారాష్ట్ర) జంటపై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. -
తేజస్విని డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ‘లెట్స్ షటిల్’ కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఉదయ్, తేజస్విని విజేతలుగా నిలిచారు. పీబీఎల్ ఫ్రాంచైజీ హైదరాబాద్ హంటర్స్ ఈ టోర్నీని నిర్వహించింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఉదయ్ 21–6, 19–10తో భరత్‌పై గెలుపొందగా... మహిళల సింగిల్స్ ఫైనల్లో తేజస్విని 21–12, 23–21తో అలేఖ్యపై విజయం సాధించింది. తేజస్విని సింగిల్స్ టైటిల్‌తో పాటు మిక్స్డ్ డబుల్స్‌లోనూ విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో తేజస్విని–చైతన్య జంట 23–21, 21–7తో ఆకాశ్ సింగ్ గౌతమ్–మంజు జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అనురాగ్–ముహీబ్ ద్వయం 23–21, 21–13తో చైతన్య–ఉదయ్ జంటపై గెలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మంజుల–హారిక జోడీ 14–21, 21–19, 21–17తో ఆస్థ, తేజస్విని ద్వయంపై నెగ్గింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు విజేతలకు ట్రోఫీలు అందజేశారు. -
సెమీస్‌లో వృషాలి, లక్ష్యసేన్
సాక్షి, హైదరాబాద్: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృషాలి సెమీఫైనల్‌కు చేరుకుంది. ప్రకాశ్ పడుకోన్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ వృషాలి 21–18, 21–16తో ఆకర్షి కశ్యప్ (భారత్)పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో అష్మితా చలిహా (భారత్) 21–15, 21–19తో రేవతి దేవస్థలే (భారత్)పై, ముగ్ధా ఆగ్రే (భారత్) 23–21, 21–17తో రేష్మా కార్తీక్ (భారత్)పై నెగ్గి సెమీస్‌కు చేరుకున్నారు. పురుషుల విభాగంలో భారత్ నుంచి లక్ష్యసేన్ సెమీస్‌లో అడుగు పెట్టాడు. క్వార్టర్స్‌లో రెండో సీడ్ లక్ష్యసేన్ 21–17, 21–10తో గో గిప్ చిన్ (మలేసియా)ను ఓడించాడు. పురుషుల డబుల్స్ విభాగంలో అరుణ్ జార్జ్– సన్యం శుక్లా (భారత్) జంట ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మేఘన జక్కంపూడి– పూర్వీషా రామ్ (భారత్) జంట 21–16, 21–8తో షుయ్ యి– వు యి టింగ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది. -
రన్నరప్ తరుణ్ జంట
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక దుబాయ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో హైదరాబాద్ ఆటగాడు కోన తరుణ్ ఆకట్టుకున్నాడు. తన భాగస్వామి లిమ్ ఖిమ్ వా (మలేసియా)తో కలసి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీకి చెందిన కోన తరుణ్–లిమ్ ఖిమ్ వా జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో తరుణ్ (భారత్)–లిమ్ ఖిమ్ వా (మలేసియా) ద్వయం 16–21, 9–21తో కిమ్ సంగ్ సో–యో యోంగ్ సియోంగ్ (కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు సెమీస్‌లో 21–16, 21–13తో డెన్నిస్ గ్రాచెవ్–పావెల్ కోస్టారెంకో (రష్యా) జంటపై గెలుపొందింది. క్వార్టర్స్‌లో ఈ జంటకు వాకోవర్ లభించింది. ప్రిక్వార్టర్స్‌లో 14–21, 21–18, 21–18తో సి సుంగ్–జిన్ సో లిమ్ (కొరియా)పై విజయం సాధించింది. -
నందగోపాల్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్లు నందగోపాల్, మనీషా సత్తా చాటారు. కొచ్చిలో జరిగిన ఈ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జోడీగా బరిలోకి దిగిన వీరిద్దరూ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. టైటిల్ పోరులో ఆరోసీడ్ నందగోపాల్ (కాగ్)–మనీషా (ఆర్బీఐ) ద్వయం 21–14, 21–13తో సనావే థామస్ (కేరళ)–అపర్ణ బాలన్ (పెట్రోలియం) జంటపై 35 నిమిషాల్లోనే గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో నందగోపాల్–మనీషా జంట 21–6, 21–10తో టాప్‌సీడ్ వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (ఛత్తీస్‌గఢ్) జోడీపై అద్భుత విజయాన్ని సాధించింది. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ వృశాలి (ఆంధ్రప్రదేశ్), సామియా ఇమాద్ ఫారూఖీ (తెలంగాణ), మూడోసీడ్ సాయి ఉత్తేజితరావు (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వృశాలి 21–10, 15–21, 19–21తో టాప్‌సీడ్ ప్రియాన్షి పరదేశి (మధ్యప్రదేశ్) చేతిలో, సామియా 18–21, 12–21తో అష్మిత చలిహా (అస్సాం) చేతిలో, మూడోసీడ్ సాయి ఉత్తేజితరావు 12–21, 21–9, 20–22తో ఏడో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రిక్వార్టర్స్‌లో క్వాలిఫయర్ కేయూర మోపాటి (తెలంగాణ) 22–20, 12–21, 14–21తో ఐరా శర్మ చేతిలో, తనిష్క్ (ఏపీ) 15–21, 15–21తో అష్మిత (అస్సాం) చేతిలో ఓడిపోయారు. అక్షిత (ఏపీ), నిషిత వర్మ (ఆంధ్రప్రదేశ్), పూర్వీ సింగ్ (తెలంగాణ) తొలి రౌండ్లోనే తమ ప్రత్యర్థుల చేతుల్లో పరాజయం పొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన రోహిత్ యాదవ్ క్వార్టర్స్‌లో 19–21, 21–15, 19–21తో రెండోసీడ్ అన్షల్ (యూపీ), జశ్వంత్ (ఏపీ) 22–24, 19–21తో మునావర్(కేరళ) చేతిలో ఓడారు. -
మిక్స్డ్ డబుల్స్ విజేత మనీషా జోడీ
సాక్షి, హైదరాబాద్: హెల్లాస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి కె. మనీషా అదరగొట్టింది. గ్రీస్‌లోని చానియా నగరంలో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి అర్జున్ (భారత్)తో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అర్జున్–మనీషా (భారత్) జంట 21–15, 21–14తో పావెల్ పైత్రిజా–ఆగ్నెస్కా వోజ్కోస్కా (పోలాండ్) జోడీపై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జోడీ కేవలం 38 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. వరుస గేముల్లో పోలాండ్‌ను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో అర్జున్– మనీషా జంట 21–12, 21–14తో ఎమిల్ హైబెల్–లినె ఫ్లెచర్ (డెన్మార్క్) జోడీపై, క్వార్టర్స్‌లో 21–17, 21–12తో ఉత్కర్ష్ అరోరా–కరిష్మా వాడ్కర్ (భారత్) జంటపై, ప్రిక్వార్టర్స్‌లో 21– 11, 21–10తో గియాన్‌మార్కో బైలెట్టి–లీసా ఇవర్సెన్ (ఇటలీ) జోడీపై గెలుపొందింది. మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో మనీషా జంట సెమీస్‌లో పరాజయం పాలైంది. భారత్‌కు చెం దిన సంయోగిత గోర్పాడేతో జతకట్టిన మనీషా సెమీస్‌లో 21–19, 19–21, 17–21తో విమల హెరా యు– మర్గోట్ లంబోర్ట్ (ఫ్రాన్స్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో భారత జోడీ 21–13, 22–20 తో మోవా సుజు–టిల్డా సుజు (స్విట్జర్లాండ్) జం టపై గెలిచింది. ఈ విభాగంలో భారత్‌కే చెందిన రుతుపర్ణ పాండా– ఆరతి సారా సునీల్ జంట టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో రుతుపర్ణ– ఆరతి జంట 21–19, 21–12తో విమల హెరా యు– మర్గోట్ లంబోర్ట్ (ఫ్రాన్స్)పై నెగ్గింది. -
సాయికుమార్–సృష్టి జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత జూనియర్ ర్యాంకింగ్ అండర్–19 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్–జూపూడి సృష్టి జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. చండీగఢ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో సాయికుమార్–సృష్టి ద్వయం 21–18, 21–16తో సాయిప్రతీక్ కృష్ణప్రసాద్–అశ్విని భట్ (కర్ణాటక) జోడీపై విజయం సాధించింది. 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు పాయింట్ల కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడినా కీలకదశలో సాయికుమార్ జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. అండర్–19 పురుషుల డబుల్స్ టైటిల్‌ను కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) ద్వయం గెల్చుకుంది. ఫైనల్లో కృష్ణప్రసాద్–ధ్రువ్ జోడీ 21–14, 21–14తో మంజిత్ సింగ్–డింకూ సింగ్ (మణిపూర్) జంటను ఓడించింది. -
విజేత సామియా ఇమాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్–19 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖీ విజేతగా నిలిచింది. మంచిర్యాలలో జరిగిన ఈ టోర్నీలో సామియా బాలికల సింగిల్స్ టైటిల్‌ను అందుకుంది. శుక్రవారం జరిగిన అండర్–19 బాలికల ఫైనల్లో నాలుగోసీడ్ సామియా 21–15, 21–14తో రెండోసీడ్ ఎ. అభిలాష (హైదరాబాద్)కు షాకిచ్చింది. బాలుర ఫైనల్లో ఎం. తరుణ్ (ఖమ్మం) 21–11, 21–15తో ఆదిత్య గుప్తా (హైదరాబాద్)పై నెగ్గి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు బాలికల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో సృష్టి జూపూడి జంట విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. బాలికల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సృష్టి (హైదరాబాద్) – సాహితి (మెదక్) ద్వయం 21–10, 21–10తో శ్రీవిద్య–సాయి శ్రీయ (మెదక్) జోడీపై నెగ్గగా... మిక్స్డ్ డబుల్స్ తుదిపోరులో టాప్‌సీడ్ సృష్టి– కె. సాయి కుమార్ (రంగారెడ్డి) జంట 21–14, 21–19తో బి. నవనీత్–సాహితి (మెదక్) జోడీపై గెలుపొందింది. బాలుర డబుల్స్ ఫైనల్లో పీఎస్కే సాయి కుమార్ (రంగారెడ్డి)–పీవీ గౌడ్ (హైదరాబాద్) ద్వయం 21–11, 21–17తో ఆకాశ్ చంద్రన్– సాయి రోహిత్ (హైదరాబాద్) జోడీపై గెలిచింది. -
సిరిల్ వర్మకు సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు సిరిల్ వర్మ సత్తా చాటాడు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అతను పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో ఎ. సిరిల్ వర్మ (తెలంగాణ) 18–21, 21–16, 21–8తో సౌరభ్ వర్మపై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో వెనుకబడిన సిరిల్ తర్వాతి రెండు గేముల్లో పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో తెలుగు అమ్మాయి సాయి ఉత్తేజిత రావు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో పదహారో సీడ్ అష్మితా చలిహా (అస్సాం) 21–16, 14–21, 21–15తో మూడో సీడ్ ఉత్తేజిత (ఆంధ్రప్రదేశ్)కు షాకిచ్చింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)– ధ్రువ్ కపిల (ఎయిరిండియా) ద్వయం 24–22, 21–13తో అరుణ్ జార్జి (కేరళ)–సన్యం శుక్లా (ఎయిరిండియా) జోడీపై నెగ్గి టైటిల్‌ను గెలుచుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో కె. నందగోపాల్ (కాగ్)–సంజన (ఎయిరిండియా) జంట 21–16, 13–21, 21–17తో ధ్రువ్ కపిల–మేఘన జక్కంపూడి (ఆర్బీఐ) జోడీపై విజయం సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో అపర్ణ బాలన్ జంట చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మూడో సీడ్ అపర్ణ బాలన్– శ్రుతి జోడీ 19–21, 21–19, 21–18తో సంయోగిత (ఎయిరిండియా)–ప్రజక్తా సావంత్ జంటను ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహు మతి ప్రదాన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి అజయ్ సింఘానియా, ఒమర్ రషీద్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
సెమీస్‌లో గాయత్రి, సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు పుల్లెల గాయత్రి, ఎ. సిరిల్ వర్మ సెమీస్‌కు దూసుకెళ్లారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సిరిల్ వర్మ 21–18, 21–11తో ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్)పై, రాహుల్ యాదవ్ (తెలంగాణ) 22–20, 21–15తో శ్రీరామ్ (కర్ణాటక)పై గెలిచారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో గాయత్రి 23–21, 21–9తో శైలి రాణే (రైల్వేస్)పై నెగ్గగా, మూడోసీడ్ సాయి ఉత్తేజిత రావు (ఏపీ) 21–12, 21–11తో ఆషి రావత్ (ఢిల్లీ)ని ఓడించింది. డబుల్స్ విభాగాల్లో మేఘన జక్కంపూడికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల (ఎయిరిండియా)–మేఘన (ఆర్బీఐ) జంట 21–12, 21–11తో హేమనాగేంద్ర బాబు (రైల్వేస్)– నింగ్షి హజారికా (అస్సాం) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్విషా రామ్ (ఆర్బీఐ) జంట 5–21, 19–21తో అపర్ణ బాలన్–కె. శ్రుతి జోడీ చేతిలో ఓడింది. -
క్వార్టర్స్‌లో అనిరుధ్, నగేశ్
సాక్షి, హైదరాబాద్: వాంటేజ్ స్పోర్ట్స్ అండర్–13 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో నిజాంపేట్‌కు చెందిన అనిరుధ్, ఎస్ఈసీకి చెందిన నగేశ్ క్వార్టర్స్‌కు చేరారు. హయత్‌నగర్‌లోని వాంటేజ్ స్పోర్ట్స్ అకాడమీలో శనివారం జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అనిరుధ్ 10–15, 15–7, 15–9తో శుభ్ కుమార్ (అత్తాపూర్)పై గెలుపొందాడు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నగేశ్ 15–2, 15–12తో రిషభ్ (గచ్చిబౌలి)పై, రిష్వంత్ సాయి (అత్తాపూర్) 15–5, 15–8తో అజయ్ నిహాల్ (అత్తాపూర్)పై, సాయి ప్రసాద్ (హైదరాబాద్) 15–7, 15–12తో సాయి కేదార్ (నిజాంపేట్)పై, పి. హిమ హర్ష (సరూర్‌నగర్) 15–10, 15–7తో అబ్దుల్ రజాక్ (సరూర్‌నగర్)పై, ఎన్. ప్రణవ్ రామ్ (పీజీబీఏ) 15–2, 15–5తో షేక్ అమన్ (హైదరాబాద్)పై, జై ఆదిత్య (అత్తాపూర్) 15–7, 15–5తో జ్ఞాన దత్ (నిజాంపేట్)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ అనంత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మూడో రౌండ్ ఫలితాలు టి. సాయి ప్రసాద్ (పీజీబీఏ) 15–4, 15–3తో శ్రీ హర్షంత్పై, సాయి (పీజీబీఏ) 15–5, 15–5తో శ్రీ కార్తికేయ (బాలాపూర్)పై, కె. సాయి కేదార్ (నిజాంపేట్) 15–10, 15–12తో కౌషిక్ రెడ్డి (పీజీబీఏ)పై, అజయ్ నిహాల్ (అత్తాపూర్) 15–6, 14–15, 15–10తో ఎన్. నిశాంక్ (హైదరాబాద్)పై, అబ్దుల్ రజాక్ (ఎస్ఆర్ఎన్ఆర్) 15–9, 15–8తో వై. ప్రయూశ్ రెడ్డి (హైదరాబాద్)పై, రిషిత్ 15–6, 15–10తో పి. హార్దిక్‌పై, టి. జ్ఞానదత్ (నిజాంపేట్) 15–2, 15–1తో ఎ. ఛత్రపతి రాథోడ్ (ఏఎంపీటీ)పై, కె. జై ఆదిత్య 15–1, 15–3తో జి. అదిత్ (ఎస్ఆర్ఎన్ఆర్)పై, ఎన్. ప్రణవ్ రామ్ (పీజీబీఏ) 15–1, 15–2తో ఆయూశ్ సింగ్ (బాలాపూర్)ఫై, అమన్ షేక్ (నిజాంపేట్) 15–12, 15–6తో మెహతా (అత్తాపూర్)పై, అనిరుధ్ 15–1, 15–0తో సుశాంక్ రెడ్డి (హయత్‌నగర్)పై, హర్షిత్ 15–3, 15–2తో జి. అక్షయ్ రెడ్డి (సరూర్‌నగర్)పై, ధీమంత్ (పీజీబీఏ) 15–7, 15–4తో కౌశిక్ (హైదరాబాద్)పై, శుభ్‌కుమార్ (అత్తాపూర్) 14–15, 15–11, 15–13తో ధ్రువ్ సేత్ (సరూర్‌నగర్)పై నెగ్గారు. -
12 నుంచి జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: పీఎన్బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఈనెల 12 నుంచి జరుగనుంది. హైటెక్ సిటీలోని గేమ్ పాయింట్ ఇండోర్ స్టేడియంలో 15వ తేదీ వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో అండర్–9, 11, 13, 15 బాలబాలికల విభాగాల్లో సిం గిల్స్ కేటగిరీలో పోటీలు జరుగుతాయి. ఆసక్తి గల వారు ఈనెల 30వ తేదీలోగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 90828 42009, 90828 42029 నంబర్లలో సంప్రదించాలి. -
టాప్–30లో చోటే లక్ష్యం: కశ్యప్
న్యూఢిల్లీ: మూడేళ్ల అనంతరం అంతర్జాతీయ టైటిల్ సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రియా ఓపెన్ టోర్నీ చేజిక్కించుకున్న అతను మాట్లాడుతూ... ‘చాలా రోజుల తర్వాత ట్రోఫీ నెగ్గడం ఆనందంగా ఉంది. ఈ విజయం వెనుక కోచ్ గోపీచంద్, శిక్షణ సిబ్బంది కృషి ఎంతో ఉంది. ఈ విజయాలను ఇలాగే కొనసాగిస్తూ... టాప్–30లో చోటు సంపాదించడమే నా లక్ష్యం’ అని ఈ హైదరాబాద్ ప్లేయర్ తెలిపాడు. ప్రపంచ 44వ ర్యాంక్ లో ఉన్న కశ్యప్ ఏప్రిల్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించలేదు. దీనిపై అతను స్పందిస్తూ.. ‘గత ఏడాది కాలంగా శ్రీకాంత్, ప్రణయ్ అద్భుతంగా రాణిస్తున్నారు. వారు కామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హులు. వారు పతకాలతో తిరిగొస్తారని భావిస్తున్నాను’ అని తెలిపాడు. -
క్వార్టర్స్‌లో కశ్యప్
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం వియన్నాలో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21–15, 22–20తో జియా వె తాన్ (మలేసియా)పై గెలుపొందాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన చిట్టబోయిన రాహుల్ యాదవ్ 17–21, 9–21తో విక్టర్ స్వెండ్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి ఇరా శర్మ 16–21, 13–21తో జు వీ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరుగుతున్న స్విస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గురుసాయిదత్ 8–21, 15–21తో కాంతాపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. -
రన్నరప్ వైష్ణవి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఐస్లాండ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి ఆకట్టుకుంది. ఐస్లాండ్లో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో నాలుగో సీడ్ వైష్ణవి (భారత్) 20–22, 12–21తో ఐదో సీడ్ శైలి రాణే (భారత్) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో పోరాడిన వైష్ణవి, రెండో గేమ్‌లో చేతులెత్తేసింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో బోధిత్ జోషి (భారత్) 14–21, 17–21తో సామ్ పర్సన్స్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మూడో సీడ్ రోహన్ కపూర్– కుహూ గార్గ్ (భారత్) ద్వయం 16–21, 21–19, 21–18తో టాప్‌సీడ్ క్రిస్టోఫర్ నుడ్సెన్– ఇసాబెల్లా నీల్సన్ (డెన్మార్క్) జంటపై సంచలన విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
మెయిన్ ‘డ్రా’కు ఇషిత, రోహిత్
ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు కలిదిండి ఇషిత రాజు, చిట్టబోయిన రోహిత్ యాదవ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో రోహిత్ యాదవ్ 21–15, 21–18తో మనీశ్ గుప్తా (భారత్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ఇషిత రాజు 21–17, 24–22తో వైష్ణవి (భారత్)పై విజయం సాధించింది. గురువారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మెయిన్ ‘డ్రా’ మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయిలు గుమ్మడి వృశాలి, గద్దె రుత్విక శివాని, జక్కా వైష్ణవి రెడ్డి, చుక్కా సాయి ఉత్తేజిత రావు, కుదరవల్లి శ్రీకృష్ణప్రియ... పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు రాహుల్ యాదవ్, ఎన్వీఎస్ విజేత, అజయ్ కుమార్ పోటీపడనున్నారు. -
సింగిల్స్ చాంప్స్ దీప్షిక, జ్ఞాన దత్తు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్–10 బాలబాలికల విభాగాల్లో జ్ఞాన దత్తు, దీప్షిక విజేతలుగా నిలిచారు. అమీర్‌పేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–10 బాలుర ఫైనల్లో టి.టి. జ్ఞాన దత్తు (సుచిత్ర అకాడమీ) 21–12, 21–10తో ఎస్.వి. మహేశ్ (కేన్స్ అకాడమీ)పై... అండర్–10 బాలికల ఫైనల్లో ఎన్. దీప్షిక (ఏఎస్ రావు అకాడమీ) 21–8, 21–10తో బి. హాసిన రెడ్డి (పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ)పై విజయం సాధించారు. -
రన్నరప్ నందగోపాల్ జంట
సాక్షి, హైదరాబాద్: మలేసియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి నందగోపాల్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. కౌలాలంపూర్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో నందగోపాల్–మహిమా అగర్వాల్ (భారత్) జంట 19–21, 9–21తో టాప్ సీడ్ యాంతోని ఎడీ సపుత్ర–మార్షెలీ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. 25 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నందగోపాల్ జోడీ తొలి గేమ్‌లో గట్టిపోటీ నిచ్చినా రెండో గేమ్‌లో మాత్రం చేతులెత్తేసింది. -
బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
నెల్లూరు(బృందావనం): విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక మెక్లిన్స్క్లబ్లోని ఇందిరా ప్రియదర్శిని ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పోటీలను కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసికోల్లాసానికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) డైరెక్టర్ రవీంద్రబాబు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అంతర కళాశాలల క్రీడలను మూడు విడతలుగా జరుపుతున్నట్లు తెలిపారు. తొలుత నెల్లూరులో బ్యాడ్మింటన్ పోటీలు జరుపుతున్నామన్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 15, డబుల్స్ విభాగంలో 14, మహిళల సింగిల్స్ విభాగంలో 9, డబుల్స్ విభాగంలో 9 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. విజేతలను శివకాశిలోని మధురై కామరాజు వర్సిటీలో అక్టోబరు 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే సౌత్‌జోన్ ఇంటర్వర్సిటీ పోటీలకు పంపనున్నట్లు వివరించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీవీ రమణయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఎస్‌యూ స్పోర్ట్సు బోర్డు కార్యదర్శ ఎం చంద్రమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్, వీఆర్ కళాశాల అధ్యాపకుడు గరుడేశ్వర్రెడ్డి, టోర్నీ అబ్జర్వర్ సీవీ సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
వెనుదిరిగిన కశ్యప్
జపాన్ ఓపెన్‌లో నిరాశపర్చిన భారత క్రీడాకారులు టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారీగా ఆశలు పెట్టుకున్న పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ కశ్యప్ 14-21, 18-21తో ఆరోసీడ్ చో టియాన్ చెన్ (చైనీస్‌తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు సత్తా మేరకు రాణించలేకపోయాడు. తొలి గేమ్‌లో స్కోరు 10-9 ఉన్న దశలో చెన్ వరుసగా ఓసారి నాలుగు, మరోసారి ఐదు పాయింట్లు సాధించాడు. కశ్యప్ రెండు, మూడు పాయింట్లకే పరిమితం కావడంతో గేమ్ చేజారింది. రెండో గేమ్‌లో హైదరాబాదీ పుంజుకునే ప్రయత్నం చేసినా.. చెన్ ర్యాలీల ముందు నిలవలేకపోయాడు. స్కోరు 2-4తో వెనుకబడి ఉన్న దశలో తైపీ ప్లేయర్ వరుసగా ఆరు, నాలుగు పాయింట్లు గెలిచి 12-5 ఆధిక్యంలోకి వెళ్లాడు. తర్వాత కశ్యప్ కాసేపు పోరాడాడు. 14-20 స్కోరు వద్ద హైదరాబాదీ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 18-20 తగ్గించాడు. కానీ చెన్ ఒకే షాట్‌తో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు.