జర్మన్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్ల దూకుడు | PV Sindhu, Kidambi Srikanth Enter Second Round Of German Open 2022 | Sakshi
Sakshi News home page

German Open 2022: జర్మన్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్ల దూకుడు

Mar 8 2022 9:39 PM | Updated on Mar 8 2022 9:40 PM

PV Sindhu, Kidambi Srikanth Enter Second Round Of German Open 2022 - Sakshi

జర్మన్‌ ఓపెన్‌ 2022లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో వీరిరువురు ప్రత్యర్ధులపై సునాయాస విజయాలు సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు.. థాయ్‌లాండ్‌ షట్లర్‌ బుసానన్‌ ఆగ్‌బమ్‌రుగ్ఫన్‌ను వరుస గేముల్లో ఓడించింది. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు 21-8, 21-7తో ప్రత్యర్ధిని చిత్తు చేసింది. 


పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కిదాంబి శ్రీకాంత్‌.. ఫ్రాన్స్‌ షట్లర్‌ బ్రిస్‌ లెవర్డెజ్‌ను 21-10, 13-21, 21-7 తేడాతో ఓడించాడు. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఇదే టోర్నీలో భారత షట్లర్లు సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. స్పెయిన్‌ అమ్మాయి క్లారా అజుర్మెండితో సైనా.. హాంగ్‌కాంగ్‌ షట్లర్‌ ఆంగుస్‌ కా లాంగ్‌తో ప్రణయ్‌ పోటీపడాల్సి ఉంది.
చదవండి: PAK Vs AUS: వార్నర్‌ ఏమాత్రం తగ్గట్లేదుగా.. ఈసారి భల్లే భల్లే డ్యాన్స్‌తో..!

Advertisement
 
Advertisement
Advertisement