క్వార్టర్స్‌లో అనిరుధ్, నగేశ్‌ | Anirudh, Nagesh enter quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో అనిరుధ్, నగేశ్‌

Jun 10 2018 9:58 AM | Updated on Jun 10 2018 9:58 AM

Anirudh, Nagesh enter quarters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాంటేజ్‌ స్పోర్ట్స్‌ అండర్‌–13 బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో నిజాంపేట్‌కు చెందిన అనిరుధ్, ఎస్‌ఈసీకి చెందిన నగేశ్‌ క్వార్టర్స్‌కు చేరారు. హయత్‌నగర్‌లోని వాంటేజ్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో శనివారం జరిగిన బాలుర సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అనిరుధ్‌ 10–15, 15–7, 15–9తో శుభ్‌ కుమార్‌ (అత్తాపూర్‌)పై గెలుపొందాడు.

ఇతర ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో నగేశ్‌ 15–2, 15–12తో రిషభ్‌ (గచ్చిబౌలి)పై, రిష్వంత్‌ సాయి (అత్తాపూర్‌) 15–5, 15–8తో అజయ్‌ నిహాల్‌ (అత్తాపూర్‌)పై, సాయి ప్రసాద్‌ (హైదరాబాద్‌) 15–7, 15–12తో సాయి కేదార్‌ (నిజాంపేట్‌)పై, పి. హిమ హర్ష (సరూర్‌నగర్‌) 15–10, 15–7తో అబ్దుల్‌ రజాక్‌ (సరూర్‌నగర్‌)పై, ఎన్‌. ప్రణవ్‌ రామ్‌ (పీజీబీఏ) 15–2, 15–5తో షేక్‌ అమన్‌ (హైదరాబాద్‌)పై, జై ఆదిత్య (అత్తాపూర్‌) 15–7, 15–5తో జ్ఞాన దత్‌ (నిజాంపేట్‌)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్‌ అనంత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.  

మూడో రౌండ్‌ ఫలితాలు

టి. సాయి ప్రసాద్‌ (పీజీబీఏ) 15–4, 15–3తో శ్రీ హర్షంత్‌పై, సాయి (పీజీబీఏ) 15–5, 15–5తో శ్రీ కార్తికేయ (బాలాపూర్‌)పై, కె. సాయి కేదార్‌ (నిజాంపేట్‌) 15–10, 15–12తో కౌషిక్‌ రెడ్డి (పీజీబీఏ)పై, అజయ్‌ నిహాల్‌ (అత్తాపూర్‌) 15–6, 14–15, 15–10తో ఎన్‌. నిశాంక్‌ (హైదరాబాద్‌)పై, అబ్దుల్‌ రజాక్‌ (ఎస్‌ఆర్‌ఎన్‌ఆర్‌) 15–9, 15–8తో వై. ప్రయూశ్‌ రెడ్డి (హైదరాబాద్‌)పై, రిషిత్‌ 15–6, 15–10తో పి. హార్దిక్‌పై, టి. జ్ఞానదత్‌ (నిజాంపేట్‌) 15–2, 15–1తో ఎ. ఛత్రపతి రాథోడ్‌ (ఏఎంపీటీ)పై, కె. జై ఆదిత్య 15–1, 15–3తో జి. అదిత్‌ (ఎస్‌ఆర్‌ఎన్‌ఆర్‌)పై, ఎన్‌. ప్రణవ్‌ రామ్‌ (పీజీబీఏ) 15–1, 15–2తో ఆయూశ్‌ సింగ్‌ (బాలాపూర్‌)ఫై, అమన్‌ షేక్‌ (నిజాంపేట్‌) 15–12, 15–6తో మెహతా (అత్తాపూర్‌)పై, అనిరుధ్‌ 15–1, 15–0తో సుశాంక్‌ రెడ్డి (హయత్‌నగర్‌)పై, హర్షిత్‌ 15–3, 15–2తో జి. అక్షయ్‌ రెడ్డి (సరూర్‌నగర్‌)పై, ధీమంత్‌ (పీజీబీఏ) 15–7, 15–4తో కౌశిక్‌ (హైదరాబాద్‌)పై, శుభ్‌కుమార్‌ (అత్తాపూర్‌) 14–15, 15–11, 15–13తో ధ్రువ్‌ సేత్‌ (సరూర్‌నగర్‌)పై నెగ్గారు.

Advertisement
 
Advertisement
Advertisement