మెయిన్ ‘డ్రా’కు ప్రణవ్ రావు అర్హత

థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ కుర్రాడు గంధం ప్రణవ్ రావు మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు.
బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ప్రణవ్ రావు 15–21, 21–14, 21–17తో చాంగ్ షి చియె (చైనీస్ తైపీ)పై గెలుపొంది ముందంజ వేశాడు. భారత్‌కే చెందిన హేమంత్ గౌడ, రవి కూడా మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టారు.