సెమీస్‌లో వృషాలి, లక్ష్యసేన్‌ | Vrushali, Lakshya Sen enter in semis of Indian Badminton | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో వృషాలి, లక్ష్యసేన్‌

Dec 1 2018 10:05 AM | Updated on Dec 1 2018 10:05 AM

Vrushali, Lakshya Sen enter in semis of Indian Badminton - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాటా ఓపెన్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి గుమ్మడి వృషాలి సెమీఫైనల్‌కు చేరుకుంది. ప్రకాశ్‌ పడుకోన్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్‌ వృషాలి 21–18, 21–16తో ఆకర్షి కశ్యప్‌ (భారత్‌)పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో అష్మితా చలిహా (భారత్‌) 21–15, 21–19తో రేవతి దేవస్థలే (భారత్‌)పై, ముగ్ధా ఆగ్రే (భారత్‌) 23–21, 21–17తో రేష్మా కార్తీక్‌ (భారత్‌)పై నెగ్గి సెమీస్‌కు చేరుకున్నారు.

పురుషుల విభాగంలో భారత్‌ నుంచి లక్ష్యసేన్‌ సెమీస్‌లో అడుగు పెట్టాడు. క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ లక్ష్యసేన్‌ 21–17, 21–10తో గో గిప్‌ చిన్‌ (మలేసియా)ను ఓడించాడు. పురుషుల డబుల్స్‌ విభాగంలో అరుణ్‌ జార్జ్‌– సన్యం శుక్లా (భారత్‌) జంట ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మేఘన జక్కంపూడి– పూర్వీషా రామ్‌ (భారత్‌) జంట 21–16, 21–8తో షుయ్‌ యి– వు యి టింగ్‌ (హాంకాంగ్‌) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement