
న్యూఢిల్లీ: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ మరోసారి భారత్ ఖాతాలో చేరింది. భారత యువ ఆటగాడు ప్రియాన్షు రజావత్ (గోపీచంద్ అకాడమీ) సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను అందుకున్నాడు. సోమవారం ఫైనల్లో 17 ఏళ్ల ప్రియాన్షు 16–21, 21–7, 21–12తో టాప్‌సీడ్ జాసన్ ఆంథోని (కెనడా)పై సంచలన విజయం సాధించాడు.
గతంలో ఈ టైటిల్‌ను భారత్‌కు చెందిన సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, సాయిప్రణీత్, శుభాంకర్ డే, గురుసాయిదత్ సాధించారు. మహిళల ఫైనల్లో ఐరా శర్మ 14–21, 22–24తో శ్రీ ఫత్మావతి (ఇండోనేసియా) చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జూహీ దేవాంగన్–వెంకట్ గౌరవ్ ప్రసాద్ (భారత్) జంట 21–18, 21–16తో పనావత్ –కన్యానత్ ç (థాయ్‌లాండ్) జంటపై గెలుపొందింది. పురుషుల డబుల్స్ టైటిల్‌పోరులో రెండో సీడ్ రోహన్ కపూర్–సౌరభ్ శర్మ (భారత్) జంట 21–9, 16–21, 22–24తో ప్రద్ –అపిచసిత్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడింది.