ప్రమాదంలో ఢిల్లీ.. కేంద్రం కీలక ఆదేశాలు | Delhi AIR Quality Danger Zone Centre invokes GRAP Stage curbs | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ఢిల్లీ.. కేంద్రం కీలక ఆదేశాలు

Nov 11 2025 1:43 PM | Updated on Nov 11 2025 3:05 PM

Delhi AIR Quality Danger Zone Centre invokes GRAP Stage curbs

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం గాలి నాణ్యత పూర్తిగా క్షీణించి (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)లో 425కి చూపించడంతో కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించి నిషేదాజ్ఞాలు విధించింది. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది.

పూర్తిగా క్షీణించిన గాలినాణ్యత
ఢిల్లీ అంటేనే గాలి కాలుష్యానికి మారుపేరులా మారింది. చలి కాలంలో ఆ తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో పాటు అధిక స్థాయిలో వాహనాలు వాడడం, పంట వ్యర్థాలను కాల్చివేయడం, తదితర కారణాలతో ఆ ప్రాంతంలో తరచుగా గాలి నాణ్యత క్షీణిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 362 గా ఉన్న గాలి నాణ్యత మంగళవారం ఉదయం మరింతగా క్షీణించి 425కు చేరి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో వెంటనే స్పందించిన కేంద్రం పలు నిషేదాజ్ఞాలు జారీ చేసింది. 

  • అత్యవసరమయితే తప్ప నిర్మాణాలు చేపట్టడం లేదా కూల్చివేయడం నిషేదమని తెలిపింది.

  • రాజధాని పరిసర ప్రాంతాలలోని అన్ని మైనింగ్ కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

  • బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డిజీల్ వాహనాలు రోడ్లపై తిరగడం నిషేదం.( దివ్యాంగులకు మినహాయింపు)

  • 5వ తరగతి వరకూ పాఠశాలలు హైబ్రీడ్ మోడల్ లో క్లాసులు నిర్వహించాలని తెలిపింది. వీలైతే విద్యార్థులు క్లాసులు ఆన్‍లైన్ మోడల్‍లో వినాలని సూచించింది.

  • ఎయిర్ క్యాలిటీ ఇండెక్స్ కొలతలు 

  • స్టేజ్-1 తక్కువ (200-300)

  • స్టేజ్-2 మరింత తక్కువ (301-400)

  • స్టేజ్-3 ప్రమాదకరస్థాయి (401-450)

  • స్టేజ్-4 తీవ్రప్రమాదకరం( 450 ప్లస్) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement