విజేత ప్రణవ్‌ | Pranav WIns Badminton Title | Sakshi
Sakshi News home page

విజేత ప్రణవ్‌

Aug 5 2019 10:12 AM | Updated on Aug 5 2019 10:12 AM

Pranav WIns Badminton Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ గంధం ప్రణవ్‌ రావు విజేతగా నిలిచాడు. గువాహటిలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో ప్రణవ్‌ రావు అండర్‌–17 బాలుర సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ప్రణవ్‌ 21–14, 21–19తో అయూశ్‌ రాజ్‌ గుప్తా (ఉత్తరప్రదేశ్‌)పై విజయం సాధించాడు.  

లోకేశ్‌ రెడ్డి డబుల్‌ ధమాకా....

అండర్‌–15 బాలుర విభాగంలో తెలంగాణకే చెందిన లోకేశ్‌ రెడ్డి డబుల్‌ ధమాకా సృష్టించాడు. అతను సింగిల్స్‌తోపాటు డబుల్స్‌ విభాగంలో టైటిల్స్‌ సాధించాడు. డబుల్స్‌ ఫైనల్లో లోకేశ్‌ రెడ్డి–అంకిత్‌ మండల్‌ (పశ్చిమ బెంగాల్‌) ద్వయం 21–12, 21–12తో టాప్‌ సీడ్‌ గగన్‌–మయాంక్‌ రాణా (హరియాణా) జోడీపై నెగ్గగా... సింగిల్స్‌ ఫైనల్లో లోకేశ్‌ 25–23, 18–21, 21–14తో రాఘవ్‌ (హరియాణా)పై గెలిచాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement