Vietnam Open 2022: సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ జోడీ జోరు | Vietnam Open 2022 Mixed Doubles: Sikki Reddy Rohan Kapoor In Semis | Sakshi
Sakshi News home page

Vietnam Open 2022: సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ జోడీ జోరు

Oct 1 2022 8:28 AM | Updated on Oct 1 2022 8:39 AM

Vietnam Open 2022 Mixed Doubles: Sikki Reddy Rohan Kapoor In Semis - Sakshi

సిక్కిరెడ్డి(PC: BAI Media Twitter)

హో చి మిన్‌ సిటీ: వియత్నాం ఓపెన్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ జోరు కొనసాగుతోంది. గతవారం ఛత్తీస్‌గఢ్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టోర్నీలో టైటిల్‌ నెగ్గిన సిక్కి–రోహన్‌ ద్వయం వియత్నాం ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి, ఢిల్లీ ప్లేయర్‌ రోహన్‌ కపూర్‌ 21–19, 21–17తో మూడో సీడ్‌ చాన్‌ పెంగ్‌ సూన్‌–చెయ యీ సీ (మలేసియా) జోడీపై సంచలన విజయం సాధించారు.

34 ఏళ్ల చాన్‌ పెంగ్‌ సూన్‌ 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజత పతకం సాధించడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ రెహన్‌ నౌఫల్‌–లీసా కుసుమవతి (ఇండోనేసియా) జోడీతో సిక్కి రెడ్డి–రోహన్‌ తలపడతారు.   

Tel Aviv Tennis Tournament: టైటిల్‌కు గెలుపు దూరంలో... 
టెల్‌ అవీవ్‌: భారత టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న ఈ ఏడాది మూడో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. టెల్‌ అవీవ్‌ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న (భారత్‌)–  మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ బోపన్న–మిడిల్‌కూప్‌ ద్వయం 4–6, 7–6 (7/3), 10–8తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో డూంబియా–రెబూల్‌ (ఫ్రాన్స్‌) జోడీపై గెలిచింది. 42 ఏళ్ల బోపన్న ఈ ఏడాది పుణే ఓపెన్, అడిలైడ్‌ ఓపెన్‌లలో డబుల్స్‌ టైటిల్స్‌ సాధించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement