రన్నరప్‌ వైష్ణవి రెడ్డి | vishnavi reddy ends runner up at island badminton | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ వైష్ణవి రెడ్డి

Jan 29 2018 11:06 AM | Updated on Jan 29 2018 11:06 AM

సాక్షి, హైదరాబాద్‌: ఐస్‌లాండ్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి ఆకట్టుకుంది. ఐస్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో నాలుగో సీడ్‌ వైష్ణవి (భారత్‌) 20–22, 12–21తో ఐదో సీడ్‌ శైలి రాణే (భారత్‌) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో పోరాడిన వైష్ణవి, రెండో గేమ్‌లో చేతులెత్తేసింది.

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో  బోధిత్‌ జోషి (భారత్‌) 14–21, 17–21తో సామ్‌ పర్సన్స్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో మూడో సీడ్‌ రోహన్‌ కపూర్‌– కుహూ గార్గ్‌ (భారత్‌) ద్వయం 16–21, 21–19, 21–18తో టాప్‌సీడ్‌ క్రిస్టోఫర్‌ నుడ్సెన్‌– ఇసాబెల్లా నీల్సన్‌ (డెన్మార్క్‌) జంటపై సంచలన విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.   

Advertisement
 
Advertisement
Advertisement