
రన్నరప్ నందగోపాల్ జంట
మలేసియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి నందగోపాల్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు.
సాక్షి, హైదరాబాద్: మలేసియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి నందగోపాల్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. కౌలాలంపూర్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో నందగోపాల్–మహిమా అగర్వాల్ (భారత్) జంట 19–21, 9–21తో టాప్ సీడ్ యాంతోని ఎడీ సపుత్ర–మార్షెలీ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
25 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నందగోపాల్ జోడీ తొలి గేమ్‌లో గట్టిపోటీ నిచ్చినా రెండో గేమ్‌లో మాత్రం చేతులెత్తేసింది.