రీ ఎంట్రీలో రెచ్చిపోతున్న సైనా.. ఐదో సీడ్‌ ప్లేయర్‌కు ఝలక్‌ | Saina Nehwal Stuns Bing Jiao To Join PV Sindhu, HS Prannoy In Quarterfinals Of Singapore Open | Sakshi
Sakshi News home page

Singapore Open 2022: రీ ఎంట్రీలో రెచ్చిపోతున్న సైనా.. ఐదో సీడ్‌ ప్లేయర్‌కు ఝలక్‌

Jul 14 2022 6:42 PM | Updated on Jul 14 2022 6:42 PM

Saina Nehwal Stuns Bing Jiao To Join PV Sindhu, HS Prannoy In Quarterfinals Of Singapore Open - Sakshi

సింగపూర్ ఓపెన్ 2022లో భారత షట్లర్లు రెచ్చిపోతున్నారు. పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఇదివరకే క్వార్టర్స్‌కు చేరగా.. తాజాగా వెటరన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్ కూడా ఫైనల్‌ 8కు దూసుకెళ్లింది. రెండో రౌండ్‌లో సైనా.. చైనా షట్లర్‌ హి బింగ్ జియావోపై 21-19, 11-21, 21-17 తేడాతో విజయం సాధించి, దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత వరల్డ్ టూర్ 500 టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. అంతకుముందు సైనా తొలి రౌండ్‌లో భారత్‌కే చెందిన మాళవిక బాన్సోద్‌పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించింది. 

2010లో చివరిసారి ఈ టైటిల్‌ సాధించిన సైనా.. మరోసారి ఆ ఫీట్‌ను రిపీట్‌ చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే, పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో స్టార్ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన మిథున్ మంజునాథ్.. రెండో రౌండ్‌లో వరల్డ్ నెం.42 ర్యాంకర్‌ నాట్ గుయెన్‌ చేతిలో 10-21, 18-21, 16-21 తేడాతో పోరాడి ఓడాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి అర్జున్, ధృవ్ కపిలా ద్వయం ప్రపంచ నెం.12 మలేషియా జోడి గో సీ ఫెయ్ - నుర్ ఇజుదుద్దీన్‌పై 18-21, 24-22, 21-18 తేడాతో సంచలన విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లారు.
చదవండి: కిదాంబి శ్రీకాంత్‌కు షాక్‌.. క్వార్టర్స్‌కు సింధు, ప్రణయ్‌

Advertisement
 
Advertisement
Advertisement