చ‌రిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్ జోడీ | Satwik-Chirag script history 1st-Indian Duo Win-Singapore Open | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్ జోడీ

May 31 2026 7:40 PM | Updated on May 31 2026 8:22 PM

Satwik-Chirag script history 1st-Indian Duo Win-Singapore Open

భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్‌ డ‌బుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి చ‌రిత్ర సృష్టించారు. సింగ‌పూర్ ఓపెన్‌లో ఈ జోడీ చాంపియ‌న్‌గా నిలిచింది. ఆదివారం జ‌రిగిన పురుషుల డ‌బుల్స్ ఫైన‌ల్లో సాత్విక్ జోడీ 18-21, 21-17, 21-16తో ఇండోనేషియాకు చెందిన ఫ‌జ‌ర్ అల్ఫియ‌న్‌-ముహమ్మ‌ద్ ఫిక్రీ జంట‌పై అద్భుత విజ‌యాన్ని అందుకుంది. 

ఈ నేప‌థ్యంలో సింగ‌పూర్ ఓపెన్ సాధించిన తొలి భార‌త డ‌బుల్స్ జోడీగా సాత్విక్‌-చిరాగ్ రికార్డులెక్కారు. మ్యాచ్‌ తొలి గేమను 18-21 తేడాతో కోల్పోయినప్ప‌టికీ, రెండో గేమ్‌లో ఫుంజుకొని సాత్విక్ - చిరాగ్ జోడీ అద్భుతంగా పుంజుకుంది. అనంతరం జరిగిన రెండో, మూడో గేమ్లలో వరుసగా 21-17, 21-16 స్కోర్లతో విజయం సాధించి టైటిల్‌ను  సొంతం చేసుకుంది. 

ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జోడీ రెండేళ్ల తర్వాత తమ తొలి అంతర్జాతీయ టైటిల్‌ను గెలుచుకుంది. కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని అద్భుతమైన ప్రదర్శన చేయగల తమ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. మ్యాచ్ మొత్తం భారత జోడీ పోరాట పటిమ, సమన్వయం, దూకుడు ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

తొలి గేమ్‌లో వెనుకబడినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తిరిగి పోటీలోకి రావడం వారి విజయానికి ప్రధాన కారణమైంది. విజయం అనంతరం సాత్విక్-చిరాగ్ జోడీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. స్టేడియంలోని అభిమానుల మద్దతు తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొంది.

‘గతంలో మేము కొన్ని కీలక మ్యాచ్లో ఓడిపోయాం. కానీ ఈ టోర్నమెంట్ మా కోసం ప్రత్యేకమైనదిగా నిలిచింది. ప్రేక్షకుల మద్దతు అద్భుతంగా ఉంది. ఎవరు ఆడుతున్నారన్నది పక్కనపెట్టి ప్రతి మ్యాచ్ను మీరు ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. మేము ఆడిన అత్యుత్తమ స్టేడియంలలో ఇది ఒకటి. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని వారు తెలిపారు.

చదవండి: స్వియాటెక్‌కు షాక్‌.. వరుసగా 16వ విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement