కశ్యప్‌, మిథున్‌ ముందంజ.. మాళవికకు తొలి రౌండ్‌లోనే చుక్కెదురు | Taipei Open 2022: Parupalli Kashyap, Mithun Manjunath Make Winning Start, Malvika Bansod Crashes Out | Sakshi
Sakshi News home page

Taipei Open 2022: కశ్యప్‌, మిథున్‌ ముందంజ.. మాళవికకు తొలి రౌండ్‌లోనే చుక్కెదురు

Jul 20 2022 6:43 PM | Updated on Jul 20 2022 6:43 PM

Taipei Open 2022: Parupalli Kashyap, Mithun Manjunath Make Winning Start, Malvika Bansod Crashes Out - Sakshi

తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, మిథున్ మంజునాధ్‌ తొలి రౌండ్‌లో సునాయాస విజయాలు సాధించగా.. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌కు చుక్కెదురైంది. హైదరాబాద్‌ కుర్రాడు పారుపల్లి కశ్యప్‌ తొలి రౌండ్‌లో స్థానిక ఆటగాడు చి యు జెన్‌పై 24-22, 21-10 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా.. మిథున్‌ మంజునాథ్‌ 21-17, 21-15 తేడాతో కిమ్‌ బ్రున్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందాడు.

వీరితో పాటు కిరణ్‌ జార్జ్‌, ప్రియాన్షు రజత్‌లు కూడా తొలి రౌండ్‌లో ప్రత్యర్ధులపై గెలుపొంది రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 21-10, 15-21, 14-21 తేడాతో తైపీ షట్లర్‌ లియాంగ్ టింగ్ యు చేతిలో ఖంగుతినగా.. కిసోనా సెల్వదురై సమియా ఫరూఖీ చేతిలో ఓటమిపాలైంది.  

డబుల్స్‌, మిక్సడ్‌ డబుల్స్‌ విభాగాల్లో భారత షట్లర్ల ముందుంజ..
పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత జోడీలు అర్జున్-కపిల, ఇషాన్ బట్నాగర్-కృష్ణప్రసాద్‌లు తొలి రౌండ్‌లో ప్రత్యర్ధులపై విజయాలు నమోదు చేయగా.. రవికృష్ణ-ఉదయ్ కుమార్, గర్గా-పంజలా జోడీలు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాయి. మిక్సడ్‌ డబుల్స్‌లో భారత స్టార్‌ జోడీ ఇషాన్ బట్నాగర్-తానిషా క్రాస్టో .. స్వెత్లాన జిల్బర్మెన్-మిషా జిల్మర్మన్ జంటను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది.  
చదవండి: కామన్‌ వెల్త్ గేమ్స్‌కు ముందు భారత్‌కు భారీ షాక్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement