గాయత్రి శుభారంభం | Gayatri Gopichand begins with easy win in Junior Badminton meet | Sakshi
Sakshi News home page

గాయత్రి శుభారంభం

May 24 2019 10:13 AM | Updated on May 24 2019 10:13 AM

Gayatri Gopichand begins with easy win in Junior Badminton meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ పుల్లెల గాయత్రి శుభారంభం చేసింది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌సీడ్‌ గాయత్రి 21–15, 21–15తో ఖుషీ ఠక్కర్‌ (ఢిల్లీ)పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో కేయూర మోపాటి (తెలంగాణ) 21–13, 21–10తో ధ్రితి (కర్ణాటక)పై, సామియా ఇమాద్‌ ఫరూఖీ (తెలంగాణ) 21–17, 21–12తో స్నేహా రజ్వర్‌ (ఉత్తరాఖండ్‌)పై, శ్రీవిద్య గురజాడ (తెలంగాణ) 21–9, 12–21, 21–18తో కృతి (కర్ణాటక)పై గెలుపొందారు.

బాలుర సింగిల్స్‌ తొలిరౌండ్‌లో ప్రణవ్‌ రావు (తెలంగాణ) 17–21, 22–20, 21–12తో చాయనిత్‌ జోషి (ఉత్తరాఖండ్‌)పై, సాయిచరణ్‌ (ఆంధ్రప్రదేశ్‌) 21–13, 21–9తో అనీశ్‌ చంద్ర (తెలంగాణ)పై, శరత్‌ (ఆంధ్రప్రదేశ్‌) 21–19, 21–14తో జాకబ్‌ థామస్‌ (కేరళ)పై, తరుణ్‌ (తెలంగాణ) 26–24, 19–21, 22–20తో అభినవ్‌ ఠాకూర్‌ (పంజాబ్‌)పై గెలిచి ముందంజ వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement