సామియాకు స్వర్ణం | Samia Wins Gold Medal | Sakshi
Sakshi News home page

సామియాకు స్వర్ణం

Aug 12 2019 10:05 AM | Updated on Aug 12 2019 10:05 AM

Samia Wins Gold Medal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బల్గేరియా జూనియర్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి సామియా ఇమాద్‌ ఫారూఖి స్వర్ణ పతకం సాధించింది. బల్గేరియాలో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్‌ ఫైనల్లో సామియా 9–21, 21–12, 22–20తో రెండో సీడ్‌ అనస్తాసియా షపోవలోవా (రష్యా)పై గెలిచింది. బాలుర డబుల్స్‌ విభాగంలో తెలంగాణ ఆటగాడు విష్ణువర్ధన్‌ గౌడ్‌–ఇషాన్‌ భట్నాగర్‌ (భారత్‌) జంటకు రజతం లభించింది. ఫైనల్లో విష్ణువర్ధన్‌–ఇషాన్‌ జోడీ 19–21, 18–21తో విలియమ్‌ జోన్స్‌–బ్రెండన్‌ జి హావో (బ్రిటన్‌) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎడ్విన్‌ జాయ్‌–శ్రుతి మిశ్రా (భారత్‌); బాలికల డబుల్స్‌లో తనీషా–అదితి భట్‌ (భారత్‌) జోడీలకు స్వర్ణ పతకాలు లభించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement